చరిత్ర గతిని మార్చిన 10 ఆవిష్కరణలు

సెల్ ఫోన్



మార్టిన్ కూపర్ సెల్ ఫోన్ మొబైల్‌ఫోన్ వాడకం ప్రారంభమై 2015 ఏప్రిల్ 3తోనే 42 ఏళ్లు పూర్తయ్యాయి. తొలిసారి మొబైల్ ఫోన్‌ను అమెరికాలోని న్యూయార్క్‌లో మోటరోలా ఇంజనీర్ మార్టిన్ కూపర్ 1973 ఏప్రిల్ 3న చేసిన కాల్‌తో మొబైల్ ఫోన్ వాడకం మొదలైంది. అతనే మొబైల్ ఫోన్ కు ఆది గురువుగా చెప్పుకుంటారు.

మైక్రోవేవ్



ఫెర్రీ స్పెన్సర్....( మైక్రోవేవ్ ) ఇప్పుడు వంటింట్లో మనం వాడుతున్న మైక్రోవేవ్ ని కనిపెట్టింది స్పెన్సర్.1945 లో దీనికి సంబంధించి పేటెంట్ తీసుకున్నారు.1947లో మార్కెట్లోకి వచ్చింది. అప్పుడు దీని ధర 2000 నుంచి 3000 డాలర్ల వరకు ఉన్నది. 6 అడుగుల పొడవుతో పాటు 750 ఎల్ బిఎస్ ఉండేది.


ఎలక్ట్రో ఫోటోగ్రఫీ
చెస్టర్ కార్లసన్...( ఎలక్ట్రో ఫోటోగ్రఫీ ) కటిక దరిద్రం నుంచి ఎదిగిన అసామాన్యుడు. తినడానికి తిండి లేదు. చేయడానికి జాబు లేదు. కాని ప్రపంచానికి తనేంటో చూపించాలనుకున్నాడు. తన ఆవిష్కరణతో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాడు.


ఎయిర్ కండీషనింగ్


విల్స్ హ్యవిలాండ్ క్యారియర్ (ఎయిర్ కండీషనింగ్ ) 1902లో విల్స్ హ్యవిలాండ్ ఓ సంచలనానికి వారధిగా నిలిచాడు. తాను కనిపెట్టిన ప్రయోగం ప్రపంచ గతినే మార్చివేస్తుందని ఆయన ఆనాడు ఊహించి ఉండకపోవచ్చు.

ఎలక్ట్రిక్ గిటార్
అడాల్ప్ రికెన్ బ్యాకర్.. (ఎలక్ట్రిక్ గిటార్ ) 75 సంవత్సరాల క్రితం కనుగొన్న తన పరిశోధన ఇప్పుడు ఇలా మలుపులు తిరుగుతుందని ఆ పరిశోధకుడు ఆనాడు ఊహించి ఉంటాడో లేదో తెలియదు కాని. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని అనేక ఆవిష్కరణలు జరిగాయి.

ఏటీఎమ్


జాన్ షెపర్ట్ బరూన్..( ఏటీఎమ్ ) 1967లో జాన్ షెపర్డ్ ఫస్ట్ ఏటీఎమ్ కి దారులు తెరిచారు. లండన్ లోని బార్ క్లే బ్యాంకుకు తొలిసారిగా ఈ ఏటిఎమ్ ఏర్పాటు చేశారు. నేడు అది విశ్వవ్యాప్తమై జనజీవన స్రవంతిలో భాగమైంది. మొదట్లో ఆరు అంకెల డిజిట్ నెంబర్ పిన్ కోడ్ గా ఉండేది,అయితే రాను రాను అది 4 అంకెలకు మారింది


బాల్ పాయింట్ పెన్

లాజ్లో బిరో..( బాల్ పాయింట్ పెన్ ) అర్జంటైనాకు చెందిన బిరో ఈ బాల్ పాయింట్ పెన్ ను కనుగొన్నారు. 1943లో ఈ బాల్ పాయింట్ ని కనిపెట్టిన ఈ ఆవిష్కర్త 1945లో దానికి బిక్ కంపెనీ నుంచి పేటెంట్ పొందాడు. అర్జంటైనాలో ఆయన జన్మదినం 29 సెప్టెంబర్ న ఆవిష్కర్త దినంగా కూడా జరుపుకుంటారు. ఇప్పుడు అది లేనిదే ఏ పని జరగనిస్థాయికి చేరింది. కంప్యూటర్లు వచ్చినా దాని స్థానం చెక్కు చెదరలేదు.


ఆటోమొబైల్

కార్ల్ బెంజ్..( ఆటోమొబైల్ ) 1844లో జర్మనీలో పుట్టిన ఈ ఆవిష్కర్త స్వతహాగా మెకానికల్ ఇంజనీర్. 3 చక్రాలతో కారును తయారు చేసి 1885లో రోడ్డుమీదకి తెచ్చారు.ఈయన కంపెనీనే తొలిసారిగా 1893లో నాలుగు చక్రాల కార్లకు శ్రీకారం చుట్టారు. అయితే ఫస్ట్ సీరీస్ రేసింగ్ కార్లు వచ్చింది మాత్రం 1899లో అని చెప్పాలి. ఆ తరువాత ఆ కంపెనీని వదిలేసి 1906లో తన కుమారులతో కలిసి స్వంతంగా కార్ల కంపెనీ స్థాపించారు.


వెల్ క్రొ


జార్జీ డీ మెస్ట్రాల్...( వెల్ క్రొ ) 1955 లో దీన్ని జార్జీ డీ మెస్ట్రాల్ ఆవిష్కరించారు.నేడు అది మల్టి మిలియన్ల డాలర్ల ఇండస్ట్రీగా మారిపోయింది . స్థాపించి అనతి కాలంలోనే సంవత్సరానికి వెల్ క్రో లు దాదాపు 60 మిలియన్ల మేర అమ్మకాలు జరిగాయి.


టెలివిజన్

ఫిలో టీ ఫాన్స్ వర్త్ ...(టెలివిజన్) పియోనీర్ టెక్నాలజీకి ఆధ్యుడు. 1938లో టెలివిజన్ ట్రాన్స్ మిషన్ కు బీజం వేశారు. అప్పట్లో ఇది మిలియన్ డాలర్ల బిజినెస్ చేసింది. ఆయన స్థాపించిన కంపెనీలో ఇప్పుడు రాడార్ .టెలిస్కోప్ అలాగే న్యూక్లియర్లాంటి మిషన్లు తయారవుతున్నాయి. 1971లో ఈ లోకాన్ని శాశ్వతంగా వీడి వెళ్లారు.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment