ఐజక్ న్యూటన్


 ఐజక్ న్యూటన్

           

      సర్ ఐజక్ న్యూటన్ 1642 డిసెంబరు 25న ఇంగ్లండ్
 లింకన్ షైర్‌లోని ఊల్స్‌థాపేలో జన్మించారు. 
గ్రాంథమ్‌లోని కింగ్స్ పాఠశాలలో చదువుకున్నారు. 
1661 జూన్‌లో కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజీలో చేరి.. 
1665 ఆగస్టులో పట్టభద్రుడిగా బయటకు వచ్చారు. 
1669 లో గణిత శాస్త్ర ఆచార్యుడిగా కేంబ్రిడ్జి 
విశ్వవిద్యాలయంలో నియమితులయ్యారు. 
జీవితం..
 

¤ యాంత్రిక శాస్త్రం, కలన గణితాన్ని న్యూటన్ అభివృద్ధి చేశారు. 
1670 - 72 మధ్యకాలంలో కాంతి వక్రీభవన మీద పరిశోధనలు చేశారు.
 ¤ గాజుపట్టకం తెల్లటి కాంతి కిరణాన్ని ఏడు రంగుల కాంతి

 కిరణాలుగా విడగొడుతుందని చూపారు.
 ¤ వస్తుకటకం బదులుగా దర్పణం ఉపయోగించి న్యూటోనియన్ 

టెలిస్కోపు తయారుచేశారు.
 ¤ కాంతి కణ సిద్ధాంతం ప్రతిపాదించి, కాంతి లక్షణాలు వివరించారు.

 జులై 5, 1687లో ఆయన రాసిన ''ప్రిన్సిపియా" అనే పుస్తకాన్ని 
ముద్రించారు. ఆ పుస్తకంలోనే మూడు గతి నియమాలు వివరించారు.
 ¤ విశ్వగురుత్వ సిద్ధాంతం ప్రతిపాదించి, గ్రహాలు సూర్యుడి చుట్టూ 

తిరగడానికి కారణం వాటి మధ్య ఉన్న గురుత్వాకర్షణే అని తెలిపారు.
 ¤ 
1689 - 1690లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 

1696లో ప్రభుత్వ టంకశాలకు అధిపతిగా నియమితులయ్యారు. 
1705లో ఇంగ్లండ్ మహారాణి నుంచి 'నైట్ హుడ్' బిరుదు పొందారు. 
వెస్ట్ మినిస్టర్ అభేలో న్యూటన్ స్మారక చిహ్నాన్ని చూడవచ్చు. 
1978 నుంచి 1988 వరకూ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ న్యూటన్ చిత్రంతో
 ఉన్న కరెన్సీ నోట్లు విడుదలజేసింది. 1727 మార్చి 31న ఇంగ్లండ్‌లోని 
కెన్సింగ్‌టన్‌లో కన్నుమూశారు.