ఎక్కువ గాలి కొడితే సైకిల్‌ ట్యూబ్‌ ఎందుకు పగులుతుంది?


సైకిల్ ట్యూబ్‌లో మనం నింపిన గాలి..... ఉష్ణోగ్రతకు అనుగుణంగా వ్యాకోచించడం లేదా
 సంకోచించడం వంటి ధర్మాలను కనబరుస్తుంది. పరిసరాల్లోని లేదా వాతావరణంలోని 
ఉష్ణోగ్రత కారణంగా ట్యూబులోని గాలి బాగా వ్యాకోచించినప్పుడు దానికి సరిపడేంత 
ప్రదేశం ఆ ట్యూబులో లభ్యం కాదు. 

అలాంటి సందర్భాలలో ట్యూబులోని గాలి కలిగించే ఒత్తిడికి ట్యూబు పగిలిపోతుంది. 
అంటే... అలా ట్యూబుని పగలగొట్టడం ద్వారా లోపల ఉన్న గాలి బయటకు వచ్చేస్తుందన్న 
మాట. అందుకే ట్యూబులో గాలిని నింపేటప్పుడు మరీ నిండుగా నింపకూడదు. 

ముఖ్యంగా ఎండాకాలంలో ఈ నియమాన్ని మరింత కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
వాతావరణం కాస్త చల్లగా ఉంటే పొద్దున్నపూట గానీ, సాయంత్రం పూటగానీ గాలి సాంద్రత 
ఎక్కువగా ఉంటుంది. అంటే సాపేక్షికంగా, తక్కువ ప్రదేశంలో ఎక్కువగాలి పరిమాణం 
మీ ట్యూబులోకి చేరుతుంది. 



వాతావరణం మరీ చల్లగా ఉన్నప్పుడు గాలి కొడితే మరింత ఎక్కువ మోతాదులో మీ 
ట్యూబులోకి గాలి చేరుతుంది. అదేవిధంగా బాగా ఎండగా ఉన్నప్పుడు గాలి కొడితే, 
అప్పుడు గాలి సాంద్రత తక్కువగా ఉండే కారణంగా, ట్యూబు నిండిపోయినప్పటికీ అందులో 
చేరే గాలి మాత్రం ఉదయం పూట కొట్టే గాలి కన్నా చాలా తక్కువగా ఉంటుంది. 

అలాంటి సందర్భాలలో ఒకోసారి సాయంత్రమయ్యే సరికి టైరులో సగం గాలి 
దిగిపోయి నట్లన్పించినా ఆశ్యర్యం లేదు.

అందుకే మనం ఏ సమయంలో గాలి కొడుతున్నాం? అప్పుడు వాతావరణం ఎలా ఉంది? 
వంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని సైకిల్ ట్యూబుల్లోకి తగిన మోతాదులో
 నింపాలి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కాస్త తక్కువ గాలిని, వేడిగా ఉన్నప్పుడు 
కాస్త ఎక్కువ గాలిని కొట్టుకోవచ్చు. ఏదేమైనా, గాలి ఎప్పుడు కొట్టినప్పటికీ ట్యూబులు 
మరీ బిగుతుగా అయిపోకుండా చూసుకోవడం తప్పనిసరి.




ఏనుగు పిల్ల "తల్లి కడుపు" లో ఎన్ని నెలలు ఉంటుంది ?
లారీ ముందు వైపు ఒక్క టైరు ఉంటే వెనుక వైపు నాలుగు టైర్లు ఉంటాయి. ఎందుకు ?
నీటిలో మేకు మునుగుతుంది ఓడ తేలుతుంది ఎందుకు?
పిల్లి చీకట్లో ఎలా చూడగలదు?
మనిషి ముఖాన్ని చూసి అతని మనస్తత్వాన్ని అంచనా వేయవచ్చా ?
మనిషి ఎప్పుడు చనిపోయాడో లెక్కించే 'సూక్ష్మ' గడియారం!
నాట్యమాడే ఉపగ్రహాలు మీకు తెలుసా?
కంప్యూటర్‌ వైరస్‌ అంటే ఏమిటి?