ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా, అధికారిక నామం కామన్వెల్త్ అఫ్ ఆస్ట్రేలియా |
భూగోళం యొక్క దక్షిణ భాగంలో, పసిఫిక్ మహాసముద్రానికి, హిందూ మహాసముద్రానికి మధ్య ఉన్న ఒక దేశం. ఇది ప్రపంచం లోని ఆరవ అతి పెద్ద దేశం. మరియు సాంప్రదాయిక 7 ఖండాలలో ఒకటి, విస్తీర్ణంలో అతి చిన్న ఖండం. |
ఆస్ట్రేలియాకి మొట్ట మొదట మనుషులు 50,000
సంవత్సరాల ముందు ఇక్కడికి వచ్చినట్టు ఆధారాలున్నాయి. వీళ్ళనే అబొరిజైన్స్ అంటారు |
1788లో ఇంగ్లీష్ వారు వచ్చే వరకు, వీళ్ళు వేటాడుతు బ్రతికే వాళ్ళు. అక్కడ పుష్కలంగా ఉన్న కంగారూలను వాళ్ళు ఎక్కువగా వేటాడే వాళ్ళు. కంగారూలు అడవుల్లో, పెద్ద పెద్ద చెట్లున్న చోట జీవంచడానికి ఇష్టపడవు. అందువల్ల ప్రతి ఐదారు సంవత్సరాలకోసారి ఉన్న గడ్డి, చిన్న చెట్లను కాల్చేసే వారు. |
1700ల ప్రాంతంలో, ఇంగ్లాండులో న్యాయ సంభందిత సమస్యలు చాలా ఉండేవి. ఒక బ్రెడ్డు ముక్క దొంగతనం చేస్తే, మరణ దండన విధించేవారు. |
ఆప్పడు అమెరికా ఇంగ్లాండు ఆధీనంలో ఉండేది. ఇంగ్లాండులో స్థలం లేక, చాలా మందిని ఖైదీలను అమెరికాకు పంపేవారు. కాని 1776లో అమెరికాకు స్వాతంత్రం వచ్చింది. |
1780 ప్రాంతంలో ఇంగ్లాండులోని చరసాలలు నిండిపోయాయి. అందువల్ల, చాలా మంది ఖైదీలను పాత, పనికిరాని ఓడలలో బంధించేవారు. |
1788లో ఇంగ్లాండు పతాకం ఎగురవేసి, న్యూ సౌత్ వేల్స్‌కి, ఇంగ్లాండు రాజు, మూడవ జార్జి ని రాజుగా ప్రకటించారు. ఆ చిన్న ఊరుకి సిడ్నీ అని పేరు పెటారు. |
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో 1901లో ఆస్ట్రేలియా చేరింది.
అక్కడ సహజ వనరులకు కొరత లేదు. వాటిని బ్రిటన్ బాగా ఉపయోగించుకుంది. వ్యవసాయ,
పారిశ్రామిక రంగాలు బాగా అభివద్ధి చెందాయి. రెండు ప్రపంచ యుద్ధాల కాలంలో
బ్రిటన్‌కు ఆస్ట్రేలియా ఎంతగానో ఉపయోగపడింది. కాలుష్యం, ఓజోన్ పొర పలచబారి పోవడం లాంటి దీర్ఘకాల భయాలు ఆస్ట్రేలియాను వెంటాడుతున్నాయి. విచిత్రం ఏమిటంటే ఇప్పటికీ బ్రిటన్ రాజు లేదా రాణి మాత్రమే ఆస్ట్రేలియా దేశాధినేతలుగా వ్యవహరిస్తారు. ఈ కామన్వెల్త్ దేశం ఇంకా బ్రిటన్ ఆధిపత్యాన్నే మోస్తుండడం విశేషం. |
అయితే 1999లో బ్రిటన్ వలసాధిపత్యానికి చరమగీతం పాడాలన్న బలమైన
ఆకాంక్ష ఆ దేశంలో పెల్లుబికింది. సొంత రిపబ్లిక్‌గా అవతరించాలని గణనీయ సంఖ్యా
బలంతో ప్రజానీకం ఒత్తిడి పెరిగింది. దానికి అనుగుణంగా అప్పట్లో ప్రజాభిప్రాయ
సేకరణ చేశారు. అయితే ప్రజాభిప్రాయం బ్రిటన్ ఆధిపత్యాన్నే కోరుకుంది. దాంతో ఇంకా
ఆ దేశం సాంకేతికంగా బ్రిటన్ మహారాణి ఏలుబడిలోనే కొనసాగుతోంది. |
ఈ దేశం భౌగోళికంగా ఇండోనేషియా, న్యూజీలాండ్, పపువా న్యు గినియా దేశాలకు దగ్గరగా ఉంది. |
జాతీయగీతం : Advance Australia Fair |
రాజధాని: కాన్‌బెర్రా (జనాభా/3,47,000) |
ఇతర ముఖ్య నగరాలు: ఆడిలైడ్, అలైస్ స్ప్రింగ్స్, బ్రిస్బేన్ (జనాభా/160000), డార్విన్, హొబర్ట్, మెల్బోర్న్(జనాభా/35,00,000), సిడ్నీ(జనాభా/42,00,000), పెర్త్ (జనాభా/13,00,000) |
రాజ్యాంగం: 9జూలై, 1900 |
స్వాతంత్ర్యం : 1జనవరి 1901 |
ప్రాంతం: హిందూ మహా సముద్రం, దక్షిణ పసిఫిక్ మహా సముద్రాల మధ్యనున్న ఖండం. |
విస్తీర్ణం: 77 లక్షల చదరపు కిలోమీటర్లు. (30లక్షల చదరపు మైళ్లు). |
వాతావరణం: సాపేక్షికంగా పొడిబారి ఉంటుంది. ఉత్తర ప్రాంతం ఉష్ణమండలం. |
జాతీయత: ఆస్ట్రేలియన్స్ |
జనాభా: రెండు కోట్ల 29లక్షలు (2012) |
తలసరి ఆదాయం: 31,020 డాలర్లు(వార్షికంగా) |
జాతులు: యూరోపియన్లు 92 శాతం, ఆసియన్లు ఆరు శాతం, రెండు శాతం అబోరిజినల్. |
మతాలు: ఆంగ్లికన్లు 20 శాతం, రోమన్ కాథలిక్కులు 26 శాతం, ఇతర క్రిస్టియన్లు 21 శాతం, క్ట్రిస్టియనేతరులు 5శాతం, మతాతీతులు 15 శాతంగా ఉన్నారు. |
భాషలు: ఇంగ్లీష్ (అధికార భాష), ఇటాలియన్, గ్రీక్, కాంటోనీస్. ఆస్ట్రేలియా పురాతన సంప్రదాయ భాషను ఇప్పుడు కేవలం 51వేల మంది మాత్రమే మాట్లాడగలరు. అది కూడా ఇంట్లోనే మాట్లాడతారు. |
అక్షరాస్యత: 85శాతం |
సహజ వనరులు |
బాక్సైట్, బొగ్గు, ఇనుము, రాగి, టిన్, బంగారం, వెండి, యురేనియం, నికెల్, టంగ్‌స్టన్, ఖనిజ ఇసుక, సీసం, జింక్, వజ్రాలు, సహజ వాయువు, పెట్రోలియం. |
వ్యవసాయోత్పత్తులు: గోధుమ, బార్లీ, చెరకు, పండ్లు, పశు సంపద, గొర్రెలు, కోళ్ల పరిశ్రమ. |
పరిశ్రమలు: గనులు, పారిశ్రామిక-రవాణా వస్తూత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్, రసాయనాలు, ఉక్కు. |
ఎగుమతి భాగస్వాములు: అమెరికా 6.7 శాతం, చైనా 6.4 శాతం, న్యూజీలాండ్ 5.7 శాతం, దక్షిణ కొరియా 5.7 శాతం, ఇంగ్లండ్ 5.2 శాతం, తైవాన్ 2.6 శాతం. |
దిగుమతి భాగస్వాములు: అమెరికా 15.8 శాతం, జపాన్ 12.5 శాతం, చైనా 11శాతం, జర్మనీ 6.1శాతం, ఇంగ్లండ్ 4.2 శాతం. |
కరెన్సీ: ఆస్ట్రేలియన్ డాలర్ (AUD) |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment