|
^^ మడగాస్కర్ లేదా రిపబ్లిక్ ఆఫ్ మడగాస్కర్ లేదా
మలగాసీ రిపబ్లిక్ హిందూ మహాసముద్రంలో గల ఒక ద్వీప దేశం. |
|
^^ ప్రపంచంలో
గల జంతుజాలాలలో 5% జంతుజాలాలు ఈ దేశంలోనే గలవు. |
ఈ దీవిలో పూర్వం ఆసియా దేశస్థులే వలసవెళ్లి ఉండడం వల్ల ఇప్పటికీ
అక్కడ మొత్తం 18 రకాల తెగలఆసియా ప్రజలు
ఉన్నారు. తెగలు వేరున్నా అందరూ మాట్లాడేది మలగాసీ భాషనే. |
|
^^ క్రీ.శ. 1500లో పోర్చుగీసువారు ఈ దీవిని మొదట కనుగొన్నారు. 18వ
శతాబ్దం ఆరంభం నుండి ఫ్రెంచి రాజులు దీనిని పరిపాలించారు. |
|
^^ ప్రపంచంలోని బీదదేశాల జాబితాలో మడగాస్కర్ పేరు ముందు వరుసలోనే
ఉంటుంది. |
|
^^ 1960లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మలగాసీ ప్రభుత్వం ఏర్పడింది. |
|
^^ మడగాస్కర్ దీవి పరిపాలన సౌలభ్యం కోసం ఆరు ప్రాంతాలు, 22 రీజియన్‌లు
, 119 జిల్లాలు గా విబజించబడింది.
^^ ఇక్కడే ప్రపంచంలోనే అతి చిన్న ఊసరవెల్లి కనబడుతుంది. ఈ ఊసరవెల్లి
కేవలం ఒక సెంటీమీటరు ఉంది. రాక్షస గబ్బిలాలు కూడా ఇక్కడ ఉంటాయి
|
^^ మడగాస్కర్ దీవిలో చాలా విచిత్రమైన ప్రకృతి కనబడుతుంది. ఎన్నో
అగ్నిపర్వతాలు, రహస్యంగా ప్రవహించే జలపాతాలు ఉన్నాయి. ఒకప్పుడు మొత్తం దీవి అంతా
అడవే. బావోబాబ్ చెట్లు ఈ ఒక్కదేశంలోనే కనిపిస్తాయి |
|
|
^^ భారతీయులు కూడా మడగాస్కర్‌లో ఉన్నారు. వీరు హిందీ, గుజరాతీ భాషలు
మాట్లాడతారు. గ్రామాలలో గుడిసెలలాంటి ఇళ్లు నిర్మించుకుంటారు. స్త్రీలు,
పురుషులు దాదాపు సమాన భావనతో జీవిస్తారు.
|
|
|
మడగాస్కర్ పూర్తి పేరు :
రిపబ్లిక్ ఆఫ్ మడగాస్కర్ |
|
మడగాస్కర్ నినాదం : Tanindrazana, Fahafahana, Fandrosoana (Malagasy) |
|
మడగాస్కర్ జాతీయగీతం :
en:Ry Tanindrazanay malala ô! (Oh, Our Beloved Fatherland) |
|
మడగాస్కర్ ప్రధాన మంత్రి : Eugène Mangalaza |
|
మడగాస్కర్ వైశాల్యం : 5,87,041 చదరపు కిలోమీటర్లు |
|
మడగాస్కర్ జనాభా :
2,37,52,887 (అంచనా) |
|
మడగాస్కర్ రాజధాని :
అంటనానారివో - Antananarivo |
|
మడగాస్కర్ ప్రభుత్వం :
యూనిటరీ సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ |
|
మడగాస్కర్ భాషలు : అధికార
భాష-మలగాసీ, ఫ్రెంచ్ భాషలు |
|
మడగాస్కర్ మతం :
క్రైస్తవులు-40 శాతం, ముస్లిములు 7 శాతం, షెడ్యూల్డ్ తెగలు 50 శాతం. |
|
మడగాస్కర్ వాతావరణం :
సాధారణంగా చల్లగా ఉంటుంది. జులైలో 9 నుండి 20 డిగ్రీలు , డిసెంబర్‌లో 16 నుండి
27 డిగ్రీలు ఉంటుంది. |
|
మడగాస్కర్ పంటలు : వరి,
కస్సావా, మామిడి, బంగాళదుంపలు, అరటి, చెరకు, మొక్క జొన్న, కాఫీ, మిరియాలు. |
|
మడగాస్కర్ పరిశ్రమలు :
వస్త్ర, సముద్ర ఉత్పత్తులు, పొగాకు, చక్కెర, ప్లాస్టిక్, ఫార్మా, తోలు వస్తువుల
పరిశ్రమలు మొదలైనవి. |
|
మడగాస్కర్ సరిహద్దులు :
నలువైపులా హిందూమహాసముద్రం ఉంది. ఆఫ్రికా ఖండానికి సమీపంలో ఉంది. |
|
మడగాస్కర్ స్వాతంత్య్రం :
26 జనవరి, 1960 ( ఫ్రాన్స్ నుండి ) |
|
మడగాస్కర్ కరెన్సీ :
మలగాసీ అరియారీ Malagasy ariary (MGA)
|
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment