సింగపూరు
|
--> సింగపూరు అనే పేరుకు సంస్కృత పదమైన సింహపుర్ నుంచి వచ్చింది అని చెప్పవచ్చు |
--> దక్షిణ ఆసియా ఖండంలో అతి చిన్న దేశము సింగపూర్. |
--> 14 వ శతాబ్ధములో సుమత్ర మలయ్ రాజకుమారుడు సంగ్ నిల ఉతమ తుఫానులో చిక్కుకొని ఈ దీవిలో అడుగు పెట్టినపుడు అతనికి ఒక మృగము కనిపించింది. దానిని అతని మంత్రి సింహముగా గుర్తించాడు. ఆ కారణంగా దీనికి సింగపూర్ అన్న పేరు స్థిర పడింది. |
--> 1819వ సంవత్సరము జనవరి 29 వ తేదీన ఈ ద్వీపంలో కాలిడిన థోమస్ స్టాన్ ఫోర్డ్స్ రాఫిల్స్ భౌగోళికంగా సింగపూరు వ్యాపారానికి అత్యంత అనుకూలమైన ప్రదేశంగా గుర్తించి ఈస్టిండియా కంపెనీ తరఫున బ్రిటిష్ వ్యాపారకేంద్రముగా అభివృద్ధి పరచే ఉద్దేశముతో ఒక ఒప్పందము చేసుకున్నాడు.ఈ ఒప్పందము దేశములో ఆధునిక యుగానికి నాంది పలికింది. |
--> 1858 వ సంవత్సరము నుండి జరిగిన ఈస్టిండియా పరిపాలన 1867 వ సంవత్సరమున బ్రిటిష్ సామ్రాజ్యపు ఛత్రము కిందకు చేరింది. |
--> రెండవ ప్రపంచ యుద్ధకాలములో ఈ ద్వీపము ఆంగ్లేయ సైనికుల అసమర్ధత కారణంగా 1942 వ సంవత్సరము ఫిబ్రవరి 15వ తేదీన 6 రోజుల యుద్ధము తరువాత జపాను సైన్యంచే ముట్టడించబడి జపాను వశమైంది |
--> సింగపూర్ 9 ఆగష్టు 1965న స్వతంత్ర గణతంత్ర దేశం గా అవతరించింది |
--> స్వాతంత్ర్యం నాటినుండి, సింగపూర్ యొక్క ఆర్థికవ్యవస్థ సగటున ప్రతి సంవత్సరం తొమ్మిది శాతం పెరిగింది. |
--> సింగపూరుకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి పీపుల్స్ ఏక్షన్ పార్టీ (PAP)ఆధిపత్యంలోనే ఉంది. ఈ కారణంగా అంతర్జాతీయ రాజకీయ విమర్శకులు, సింగపూరు ప్రతిపక్ష పార్టీలైన వర్కర్స్ పార్టీ ఆఫ్ సింగపూరు, సింగపూరు డెమాక్రటిక్ పార్టీ(SDP) మరియు సింగపూరు డెమాక్రటిక్ అలయన్స్(SDA) సింగపూరును ఏకపక్ష పార్టీగా విమర్శిస్తూ ఉంటారు. |
--> అల్పసంఖ్యాకులను రెచ్చగొట్టే విధంగా బ్లాగులలో వ్యాఖ్యానాలను ప్రచురించిన ముగ్గురు బ్లాగర్ల పై చర్య తీసుకోవడం ఇందుకు నిదర్శనం. అధిక జరిమానా, కొరడాదెబ్బలు లాంటి శిక్షలు అమలులో ఉన్నాయి. క్రూరమైనహత్యలూ, హానికరమైన మత్తు పదార్థాలకు సంబంధించిన నేరాలకు ఉరిశిక్ష విధించడం మామూలు విషయమే. ప్రపంచంలో అధికశాతం ఉరిశిక్షలు అమలవుతున్న దేశాలలో సింగపూరుది అగ్రస్థానం. |
--> ఇంత చక్కటి విలువలు కలిగి ఉన్నా, సగటున లక్ష జనాభాకు 13.57 మరణశిక్షలు నమోదు అవుతున్నాయి, |
--> విదేశీ పెట్టుబడులు ప్రభుత్వ యాంత్రీకరణము వలన ఎలక్ట్రానిక్సు మరియు కర్మాగారం ఆధారంగా ఒక ఆధునిక ఆర్ధికరంగం ఉద్భవించింది. స్థూల జాతీయ ఉత్పత్తి ఆధారంగా ప్రపంచంలో 18వ ధనవంతమైన దేశము. భూభాగము ప్రకారము ఎంతో చిన్నదయినా, సి.$212 బిలియన్ల మారకద్రవ్య (అ.$139 బిలియన్లు) నిల్వలు కలది. |
--> 63 ద్వీపాల సమూహంతో కూడిన దేశం సింగపూరు. జురాన్గ్ దీవి,సెంటోసా దీవి,పులవ్ టెక్నాగ్ దీవి,పులవ్ యుబిన్ దీవి కొంచెం విస్తీర్ణంలో పెద్దవి. మిగిలినవి ఆకారములో చిన్నవి |
--> సింగపూరు సంవత్సరమంతా మారని పగటి కాలం,రాత్రి కాలం కలిగిన ప్రత్యేక దేశం. దాదాపు ఒకే రకమైన శీతోష్ణ స్థితి,విస్తారమైన వర్షాలు కలిగిన దేశం |
--> వర్షాలు ఏసమయంలోనైనా రావడం సహజం కనుక ఇక్కడి ప్రజలు ప్రతి రోజు గొడుగులను వెంట ఉంచుకుంటారు.వీరు వాడే గొడుగులు ప్రత్యేకతను కలిగి ఉంటాయి |
--> భూమధ్య రేఖకు సమీపంలో ఉండే కారణంగా ఇక్కడి రాత్రులు,పగలు సంవత్సరమంతా సమాన కాలాన్ని కలిగి ఉంటాయి. |
--> జనాభాలో 51 శాతము ప్రజలు బౌద్ధమత, థాయిజమ్ అవలంబీకులు. చైనా, ఇండియా, యురేసియాలను పూర్వీకంగా గుర్తించిన 15 శాతము ప్రజలుక్రిస్టియన్లు, 14 శాతం ముస్లిములు వీరిలో అధిక శాతం ఇండియా ముస్లిములు. స్వల్ప సంఖ్యలో సిక్కుమత, హిందూమత, బహాయి విశ్వాము కలిగిన ప్రజలు ఉన్నారు. |
--> సింగపూరు జాతీయ భాష మలయ్. వారి జాతీయ గీతం మజులా సింగపుర . అధికార భాషలు మలాయ్, మాండరిన్, ఇంగ్లీష్, తమిళం. దేశ స్వాతంత్ర్యానంతరము ఇంగ్లీష్ అధికారిక హోదాను పొందింది. |
--> సింగపూర్ లో ఇటీవల కాసినోవా అనబడే పాశ్చాత్యుల జూదగృహము నిర్మించడముతో ధనవంతులైన వ్యాపారవేత్తలను ఇది చక్కగా ఆకర్షిస్తూఉంది. |
--> జాతీయగీతం : మజూలా సింగపురా |
--> రాజధాని : సింగపూరు నగరం |
--> అధికార భాషలు : ఆంగ్లము , మలయ్ , చైనీస్ మాండరిన్ , తమిళం |
-->ప్రభుత్వం :
పార్లమెంటరీ తరహా రిపబ్లిక్కు ప్రభుత్వం |
-->రాష్ట్రపతి :
టోనీ టాన్ |
--> ఫ్రధానమంత్రి : లీ సియెన్ లూంగ్ |
--> ఇంగ్లాండు పరిపాలనలో : June 3 1959 |
--> ఏక పక్షంగా స్వతంత్రం ప్రకటన : ఆగస్టు 31 1963 |
--> మలేసియాతో విలీనం : సెప్టెంబరు 16 1963 |
--> మలేసియా నుండి వేరుపడడం : ఆగస్టు 9 1965 |
--> విస్తీర్ణం - మొత్తం : 270 చ.మై లేక 704.0 కి.మీ² |
--> జనాభా 2007 అంచనా : 4,483,900 |
--> కరెన్సీ :
సింగపూరు డాలరు (SGD) |
Home /
World Countries /
సింగపూరు ( SINGAPORE ) - ప్రపంచ దేశాల సమాచారం - ప్రతి రోజు ఒక దేశం గురించిన సమాచారం
సింగపూరు ( SINGAPORE ) - ప్రపంచ దేశాల సమాచారం - ప్రతి రోజు ఒక దేశం గురించిన సమాచారం
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment