శ్రీలంక
<-> శ్రీలంకకు వివిధ పేర్లు వ్యవహారంలో ఉండేవి. శ్రీలంక ను 1972కు పూర్వం సిలోను అనేవారు.శ్రీలంకకు శిలయో అని 1505 లో ఈ ద్వీపానికి వచ్చిన పోర్చుగీసు వారు నామకరణం చేశారు. అదే ఆంగ్లం లో 'సిలొన్' గా అనువదింపబడింది. 1972 లో శ్రీలంక ఆధికారిక నామం 'ఫ్రీ, సోవరిన్ అండ్ ఇండిపెండెంట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక' అయింది. 1978 లో, శ్రీలంక ను ఆధికారికంగా 'డెమాక్రెటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక' గా ప్రకటించారు. |
<-> శ్రీలంక ను 1972కు పూర్వం సిలోను అనేవారు. భారతదేశ దక్షిణ తీరప్రాంతానికి 31 కి.మీ. దూరంలో ఉన్న ఈ దేశం దక్షిణ ఆసియా లో ఒక చిన్న ద్వీపం. హిందూ మహాసముద్రం లో ఆణిముత్యంగా ప్రసిద్ది చెందింది. జనాభా సుమారుగా 2 కోట్లు. |
<-> ప్రస్తుత పేరు లోని 'లంక' సంస్కృతం నుండి వచ్చింది. లంక అంటే 'తేజస్సుగల భూమి' లేదా 'ద్వీపం' అని అర్థం. ఇదే పేరు రామాయణం , మహాభారతంలలో కూడా కనిపిస్తుంది. సంస్కృతం లో 'శ్రీ' అంటే భవ్యమైనది అని అర్ధం |
<-> పాలి భాషలో వ్రాయబడిన చరిత్రసంబధిత మహావంశ గ్రంధం ఆధారంగా శ్రీలంక పురతన కాలం క్రీ.పూ 543 లో ప్రారంభం అయిందని విశ్వసిస్తున్నారు. పురాణంలో వర్ణించబడిన రాజైన విజయ 8 నావలలో 700 మంది అనుచరులతో 860 నాటికల్ మైళ్ళు సముద్రయానం చేసి ఈ భూమి మీద అడుగుపెట్టాడని భావిస్తున్నారు . క్రీ.పూ 380 లో శ్రీలంక రాజ్యం అనూరాధాపురానికి తరలించబడింది. తరువాత దాదాపు 1400 సంవత్సరాల కాలం శ్రీలంకకు అనూరాధాపురం రాజధానిగా ఉంది. |
<-> క్రీ.పూ 245 లో భిక్షుకి ప్రియదర్శిని " జయశ్రీ మహాభోది వృక్షంతో " శ్రీలంకలో ప్రవేశించింది. ఇది గౌతమబుద్ధునికి ఙానం ప్రసాదించిన భోదివృక్షం యక్క సంతానమైని విశ్వసిస్తున్నారు. ప్రపంచ చరిత్రలో మానవుడు నాటిన మొదటి వృక్షం ఇదే నని భావిస్తున్నారు. |
<-> అనురాధపురా పతనం తరువాత శ్రీలంకలో మద్యయుగం ప్రారంభం అయింది. శ్రీలంక నీటిపారుదల విధానం పరాక్రమబాహు (క్రీ.శ 1153-1186) (పరాక్రమబాహు ది గ్రేట్) కాలంలో దేశమంతటా విస్తరించబడింది. శ్రీలంక భూభాగంలో గుర్తించతగిన రెండు యుద్ధాలు జరిగాయి. ఒకటి దక్షిణ భారతదేశం నుండి పాడ్యరాజుల దండయాత్ర కాగ రెండవది రామన్నా (మాయాన్మార్) రాజుల దండయాత్ర. |
<-> తరువాతి కాలంలో శ్రీలంక రాజ్యాంగశక్తి క్షీణదశకు చేరుకుంది. 1996లో బ్రిటిష్ ప్రభుత్వం ద్వీపం తీరప్రాంతాలను ఆక్రమించుకున్నది. 1883లో కోల్‌బ్రోక్ - కేమియోన్ సంస్కరణలు ఆరంభం అయ్యాయి. 1847లో కఫీ ధరలు పతనం కావడం ఆర్ధిక వత్తిడికి దారితీసింది. ఫలితంగా గవర్నర్ తుపాకులు, కుక్కలు, షాపులు, బోట్లు మొదలైన వాటిమీద సరికొత్తగా పన్నులు విధించాడు. అలాగే ఆరురోజుల ఉచిత శ్రమదానం లేక శ్రమకు తగిన వేతనం ఇచ్చే రాజకార్య విధానం తిరిగి ప్రవేశపెట్టాడు. ఈ కఠినవధానాలు ప్రజలలో కలవరం రేకిత్తించిన కారణంగా 1848లో మరొక తిరుగుబాటు ఆరంభం అయింది. |
<-> 1948 ఫిబ్రవరి 4 న సౌల్‌బ్యూరీ నియోజకవర్గానికి స్వాతంత్ర్యం ప్రకటించబడింది. డి.ఎస్ సేనానాయకే మొదటి పధానమంత్రిగా నియమించబడ్డాడు. 1959లో ఒక బౌద్ధఉద్యమకారూడు బండారనాయకేను కాల్చివేసాడు. 1960 లో ఎస్.డబ్ల్యూ. ఆర్.డి బండారనాయకే భార్య సిరిమావో బండారనాయకే ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతను చేపట్టారు. 2004లో ఆసియన్ " టిసునామీ " ప్రభావానికి 35,000 శ్రీలంక ప్రజలు మరణించారు. |
<-> 2006లో శ్రీలంక ప్రభుత్వం మరియు తమిళ తిరుగుబాటుదారులు కూడదీసుకుని తిరిగి యుద్ధం కొనసాగించారు. 2008 నాటికి ప్రభుత్వం అధికాతికంగా యుద్ధవిరమణ ప్రకటించింది. 2009 అధ్యక్షుడు మహీంద్రా రాజభక్షే ఆధ్వర్యంలో శ్రీలంక సైన్యాలు తమిళ ఈళ పులుల మీద విజయం సాధించాయి. తరువాత శ్రీలంకన్ ప్రభుత్వం దేశమంతటినీ తన స్వాధీనానికి తీసుకుంది. 26 సంవత్సరాల సంఘర్షణలో దాదాపు 60,000-1,00,000 మంది ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. |
<-> శ్రీలంక ద్వీపం హిందూ మహాసముద్రం లో, హిందూమహాసముద్రానికి ఈశాన్య దిక్కులో ఉంది. భంగాళాఖాతానికి అగేయదిశలో ఉంది. భారత ఉపఖండాన్ని, 5° మరియు 10°, అక్షాంశ మరియు రేఖాంశాలలో ఉంది. |
<-> హిందూ పురాణాల ప్రకారం రాముని కాలంలో, భారత ఉపఖండాన్ని, శ్రీలంకను కలుపుతూ ఒక రాళ్ళ వంతెన కట్టబడిందని ప్రతీతి. అది ప్రస్థుతం సున్నపురాతి రాశిగా కనిపిస్తుంది. |
<-> రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ పై దాడిచేసేందుకు సంకీర్ణ దళాలకు శ్రీలంక ప్రధాన స్థానంగా ఉపయోగపడింది. |
<-> జనాభాలో సింహళీయులే అధికంకాగా ఉత్తర మరియు తూర్పు ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న తమిళులుమైనారిటీలో అధిక ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కొన్ని ముస్లిం తెగల వారు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. |
<-> 2010 శ్రీలంక దేశీయ ఉత్పత్తి 590 కోట్ల అమెరికన్ డాలర్లు. శ్రీలంక జి.డి.పి 1,160 కోట్ల అమెరికన్ డాలర్లు. ఇది ప్రజల కొనుగోలు శక్తిని అధికం చేస్తుంది. 2011 శ్రీలంక జి.డి.పి 8.3% పెరిగింది. |
<-> శ్రీలంక కూడా పలు మతాలకు నిలయం. దేశంలో 70% బౌద్ధులు ఉన్నారు. శ్రీలంకలో హిందూమతం రెండవ స్థానంలో ప్రాబల్యం వహిస్తున్నది. అంతేకాక హిందూమతం బుద్ధమతాని కంటే పురాతనమైంది |
శ్రీలంక పూర్తి పేరు : ప్రజాస్వామ్య సామ్యవాద గణతంత్ర శ్రీలంక |
శ్రీలంక స్వాతంత్ర్యము : మే 22 1972 |
శ్రీలంక జాతీయగీతం : "శ్రీలంక మాత" |
శ్రీలంక రాజధాని : శ్రీ జయవర్ధనపుర-కొట్టె |
శ్రీలంక అధికార భాషలు : సింహళ, తమిళం |
శ్రీలంక
ప్రభుత్వం : ప్రజాస్వామ్య సామ్యవాద గణతంత్ర రాజ్యము |
శ్రీలంక
అధ్యక్షుడు : మైత్రిపాల సిరిసేన |
శ్రీలంక ప్రధానమంత్రి : రానిల్ విక్రం సింఘే |
శ్రీలంక విస్తీర్ణం : 65,610 కి.మీ² లేక 25,332 చ.మై |
శ్రీలంక జనాభా : 18,732,255 |
శ్రీలంక జీడీపీ (PPP) : $86.72 బిలియన్ |
శ్రీలంక
కరెన్సీ : శ్రీలంక రూపాయి (LKR) |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment