»మార్కెట్ శక్తులైన డిమాండ్, సప్లై, ఇతర వస్తువులు డాలర్‌తో రూపాయి మారకం విలువను లెక్కకట్టడంలో కీలకంగా ఉంటాయి. డాలర్‌కు డిమాండ్ పెరిగినట్లయితే రూపాయి విలువ తగ్గిపోతుంది.
»ఇది రూపాయి కొనుగోలు శక్తిని తక్కువ స్థాయికి చేర్చేందుకు దోహదపడుతుంది. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ సుమారు 63 రూపాయలుగా ఉంది. దీన్ని బట్టి దేశీయ కరెన్సీపై డాలర్ ప్రభావం ఏ మేర చూపిస్తోందో తెలుస్తోంది.
»దీంతో వర్థమాన దేశాల నుంచి డాలర్ ప్రవాహం పెరిగిందని చెప్పవచ్చు. ఇతర మార్కెట్ల ఒత్తిళ్లు కూడా దేశీయ కరెన్సీపై ప్రభావం చూపిస్తున్నాయి.
»అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు: ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో వస్తున్న నష్టాలు పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారులు భద్రత ఉన్న దేశాల్లో అంటే అమెరికా లాంటి దేశాల్లో తమ పెట్టుబడులను పెట్టేందుకు ఆసక్తి చూపడంతో డాలర్ విలువ పెరుగుదల నమోదు చేస్తోంది. దీంతో దేశీయంగా భారీ పెట్టుబడులు రాకపోవడం, డాలర్ విలువ పెరగడం..రూపాయి క్షీణితకు కారణంగా చెప్పుకోవచ్చు.
»స్పెక్యూలేషన్: దేశీయ మార్కెట్లలో పెట్టుబడుల ప్రవాహం కూడా రూపాయి మారకం విలువపై ప్రభావం చూపిస్తోంది. వడ్డీ రేటు విధానం: ప్రభుత్వ ఆర్థిక విధానాలు మార్కెట్లలో పెట్టుబడులను పెంచే విధంగా, విదేశీ మారకాన్ని స్వాగితించేలా ఉంటే విదేశీ మారకం దేశంలోకి ప్రవాహించడం ద్వారా రూపాయి విలువలో పెరుగుదుల ఏర్పడే అవకాశం ఉంటుంది.
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment