పచ్చబొట్లు(Tattoos) వేసే యంత్రాన్ని ఎవరు కనుగొన్నారు ? మీకు తెలుసా ?





»పచ్చబొట్టు(Tattoos) పొడిపించుకోవడం ఈ మధ్య ఫ్యాషన్ గా మారింది. పచ్చబొట్టు ఎప్పటికి చెరిగిపోదు. కాని పూర్వం ఈ పచ్చబొట్టు చాలా రకాలుగా ఉపయోగించేవారో మీకు తెలుసా ! 
పచ్చబొట్టు కోసం చిత్ర ఫలితం
»పచ్చబొట్లు(Tattoos) పొడిపించుకోవడం అత్యంత పురాతనమైన కళ . బ్రిటన్‌ కు చెందిన ఐదవ జార్జి చక్రవర్తి, డెన్మార్క్ రాజు ఫ్రెడెరిక్, బ్రిటిష్ సైనిక దళానికి చెందిన ఫీల్డ్ మార్షల్ మాంట్‌గోమరీ తమ శరీరాలపై పచ్చబొట్లు పొడిపించుకున్నారు. జపాన్‌లో పచ్చబొట్లను ఎప్పుడూ అత్యంత గౌరవభావంతో చూసేవారు.

పచ్చబొట్టు కోసం చిత్ర ఫలితం
» పచ్చబొట్టు(Tattoos) వివిధ సంస్కృతులలో వివిధ అర్థాన్నిచ్చేదిగా ఉంటుంది. ఇది వివిధ ప్రాంతాలలో సంతానోత్పత్తి చిహ్నంగా వాడబడింది

»మహిళలు, మరియు పోలీసులతో ఎలా వ్యవహరించాలో తెలియజేయుటకు సూచికగా వాడేవారు. 

»రొమానీ ప్రజలను గుర్తించేందుకు చిహ్నంగా కూడా ఈ పచ్చబొట్టును వాడుతారు.పచ్చబొట్లు కొంతమంది ప్రేమించిన వారి గుర్తుగా వేయించుకుంటారు. కొంతమంది దేవుళ్ళ బొమ్మలను భక్తి కొలదీ వేయించుకుంటారు. ఆధునిక యుగంలో పచ్చబొట్లను ఎక్కువగా అమెరికా, ఐరోపా యువతరం పిచ్చిగా వేయించుకుంటున్నారు. శాశ్వతమైన మేకప్ లాగా కొంతమంది పచ్చబొట్లు వాడుతున్నారు.


పచ్చబొట్టు కోసం చిత్ర ఫలితం
»ప్రపంచంలో ఒంటరిగా ఉండేవారికి గుర్తుగా వాడుతారు లేదా కారాగారం లో ఉండే ఖైదీలకు గుర్తుగా దీన్ని వాడుతారు.  కారాగారం లో ఉండే ఖైదీలకు చేతియొక్క వెలుపలి తలంపై బొటనవ్రేలు మరియు చూపుడువ్రేలు మధ్య వేస్తారు.  దీనిని పంచ బిందు పచ్చబొట్టు  అని పిలుస్తారు. పంచ బిందు పచ్చబొట్టు అనేది ఐదు బిందువులు కలిగిన జ్యామితీయ అమరిక కలిగిన పచ్చబొట్టు. 

»ఈ రంగు ద్రవ్యాలు చాలా మట్టుకు క్యాన్సర్ కారక ద్రవ్యాలు. కాబట్టి అక్కడ చర్మ క్యాన్సరు వచ్చే దురవకాశాలు లేకపోలేదు.

»మానవులు ఇన్ని రకాలుగా ఉపయోగించే ఈ పచ్చ బొట్టు  పొడిచే మిషను ఎవరు కనుగొన్నారో తెలుసా ప్రసిద్ధ శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్. ఆయన తన మోచేతిపై కూడా ఈ పచ్చబొట్టును వేసుకున్నాడు. 




0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment