1. మహ్మద్‌బిన్ తుగ్లక్ ఢిల్లీ సింహాసనం అధిరోహించిన సంవత్సరం ఏది ?
- 1325
2. పద్మనాయక యుగంలో 'ప్రేమాభిరామం' రచించినది ఎవరు?
- త్రిపురాంతకుడు.
3. మల్హర్ చరిత్ర రచించినది?
- ఎడపాటి ఎర్రయ్య కవి.
4. నవనాథ చరిత్ర రచించినది ఎవరు?
- శ్రీగిరి కవి
5. మనుసూరి రాజ్యస్థాపకుడు ఎవరు?
- ప్రోలయ నాయకుడు
6. 1325 నాటికి ప్రోలయ నాయకుడు రాజధాని ఏది ?
- రేకపల్లి భద్రాచలం తాలూకా
7. ప్రోలయ వేమారెడ్డి కూడా ప్రోలయ నాయకునికి సహాయం చేసినట్లు తెలిపే శాసనం ఏది ?
- అడవితల్లి కలువ చెర్వు శాసనం.
8. ముసునూరి రాజ్యస్థాపకుడు ?
- ప్రోలయ నాయకుడు
9. ప్రోలయ నాయకుని మరణాంనంతరం విముక్తి పోరాటానికి నాయకత్వం వహించినది ఎవరు?
- కాపయ నాయకుడు.
10. ప్రోలయ నాయకుని ఘనకార్యాలను తెలియజేసే శాసనం ఏది ?
- విలస శాసనం
11. 'ఆంధ్ర భూ మండలాధ్యక్ష సింహాసన ప్రతిష్టాపనాచార్య' బిరుదు ఎవరిది?
- అన్నయ్య మంత్రి
12. రాయలసీమలో విముక్తి పోరాటానికి నాయకత్వం వహించినది?
- అరవీటి సోమదేవరాజు
13. అరవీటి సోమదేవరాజు విజయాలను వర్ణించిన రచనలేవి?
- అందుగుల వెంకన్న- రామరాజీయం, దోనేరు నాథుడు బాల భాగవతం.
14. అరవీటి సోమదేవరాజు గెలుపొందిన యుద్ధాలు ఏవి ?
- ఆకులపాడు, ముద్గల్, అనెగొంది యుద్ధాలు.
15. మహ్మద్‌బిన్ తుగ్లక్ సర్దారులలో ఒకడైన బహాదుద్దీన్ గర్షాప్స్‌కు ఆశ్రయమిచ్చిన అనెగొంది పాలకుడు ఎవరు?
- కంపిలి రాయుడు.
16. అనెగొందిలో తుగ్లక్ రాజ ప్రతినిది ఎవరు ?
- మాలిక్ నాయబ్
17. రేచర్ల పద్మ నాయకులలో చివరి వాడు ఎవరు?
- సర్వజ్ఞ సింగభూపాలుడు
18. శ్రీనాథ, బమ్మెర పోతనామాత్యులను ఆదరించినది ఎవరు ?
- సర్వజ్ఞ సింగభూపాలుడు.
19. సర్వజ్ఞ సింగ భూపాలుని బిరుదులు ఏవి?
- 'పాండ్య భూపాల శుండాల ఖండనోద్దండ కేసరి' 'ఖడ్గ నారాయణ' 'ప్రాచ్య కాకతి రాజ్య ప్రతిస్థాపన దేశిక' 'గాయగోవాళ'
20. సింగభూపాలుడు రచించినట్లు చెప్పుకునే కువలయావళికి మరోపేరు ఏమిటి ?
- రత్నపాంచాలిక
21. అమరకోశానికి వ్యాఖ్య రాసినది ఎవరు ?
- బొమ్మకంటి అప్పయామాత్యుడు
22. కాకతీయ రాజ్య పతనానంతరం 13 సంవత్సరాలు ఓరుగల్లును నవాబులు ఏ పేరుతో పిలిచేవారు?
- సుల్తానుపురం.
23. కాపనాయకుని బిరుదులు ఏవి?
- ఆంధ్రదేశాధీశ్వర, ఆంధ్ర సురత్రాణ
24. కాపయ నాయకుని ముస్లిం చరిత్ర కారులు ఏమని పేర్కొన్నారు?
- కృష్ణ నాయక్, కాన్యా నాయక్, కాబా నాయుండు.
- విశ్వేశ్వర కవి.
26. సంగీతా సుధాకరం సింగభూపాలుడు రాయలేదని ఆయన ఆస్థానంలో విశ్వేశ్వర కవి రాసి ఉంటాడని పేర్కొన్న చరిత్రకారుడు?
- డా|| వి. రాఘవన్.
27. రేచర్ల పద్మ నాయకులు పరిపాలనతో ఏ రాజు వైష్ణవాన్ని ఆదరించారు?
- సింగభూపాలుడు.
28. 1323లో జరిగిన ఓరుగల్లు కోట యుద్ధంలో సజీవంగా మిగిలిన రుద్రుని సేనానులు?
- అన్నయ్యమంత్రి, కొలను రుద్రమదేవుడు, రేచర్ల సంగమ నాయకుడు.
29. ముస్లింలను ఎదరించి స్వధర్మ రక్షణకు నడుం కట్టాలని 1325లో సమావేశం జరిపింది?
- ప్రోలయ నాయకుడు, కొప్పుల ప్రోలయనాయకుడు, అద్దంకి వేమారెడ్డి, రేచర్ల సింగమనాయకుడు, మంచికొండ గజపతి నాయకుడు ముఖ్యులు.
30. 1325-26ల మధ్య స్వాతంత్య్ర సమరం జరిగినట్లు తెలియజేసే శాసనాలు?
- ప్రోలయ వేమారెడ్డి మల్లవరం శాసనం, కొలని రుద్రదేవుని సంతమాగులూరు శాసనం.
31. తెలుగు సాహిత్యంలో పద్య కావ్యంగా వెలసిన మొట్టమొదటి రామ కథ ఏది?
- భాస్కర రామాయణం.
32. శ్రీనాథుని క్రీడాభిరామంలో పేర్కొన్న రామాయణం ఏది?
- విద్ధి కూచి రామాయణం
33. 'విక్రమ సేనం' కావ్యకర్త ఎవరు?
- చిమ్మపూడి అమరేశ్వరుడు
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment