రాజ్యాంగం - రాష్ట్రపతి - అధికారాలు


 

పాలిటి ప్రాక్టిస్ బిట్స్ (14/09/2014)

1. లోక్‌సభను రద్దు చేసేది ఎవరు?
 ఎ) ప్రధానమంత్రి  బి) స్పీకర్‌  సి) హోంమంత్రి  డి) ప్రధాని సిఫార్సు మేరకు రాష్ట్రపతి

2. పదవి రీత్యా రాజ్యసభ అధ్యక్షుడు ఎవరు?
ఎ) భారత రాష్ట్రపతి  బి) భారత ఉపరాష్ట్రపతి   సి) స్పీకర్‌(సభాపతి)       
డి) రాజ్యసభ ఎన్నుకొన్న అధ్యక్షుడు

3. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఏర్పాటుచేసే ఎన్నికల గణంలోని సభ్యులు ఎవరు?
ఎ) పార్లమెంటు ఉభయసభల సభ్యులు, రాష్ట్ర విధాన సభల సభ్యులు     
బి) పార్లమెంటు ఉభయ సభల సభ్యులు  సి) నామినేట్‌ చేసిన సభ్యులు సహా పార్లమెంటు
 ఉభయ సభల సభ్యులు  
డి) పార్లమెంటు సభ్యులు, రాష్ట్రశాసన సభల సభ్యులు

4. భారత ఉపరాష్ట్రపతి నియామక విధానం ఏమిటి?
ఎ) రాష్ట్రపతి నామినేట్‌ చేస్తాడు      బి) ఎలక్టోరల్‌ కాలేజీ ఎంపిక చేస్తుంది     
 సి) ప్రధానమంత్రి నియమిస్తాడు      డి) పైవాటిలో ఏదీకాదు

5. రాష్ట్రపతి అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటే ఎంతమంది సభ్యులు ఆమోదించాలి?
ఎ) ఉభయ సభల సభ్యుల్లో 1/4వ వంతుకు తక్కువ కాకుండా    
  బి) ఏదైనా ఒక సభ మొత్తం సభ్యుల్లో 1/4వ వంతుకు తక్కువ కాకుండా
సి) ఉభయ సభల మొత్తం సభ్యుల్లో 2/3వ వంతుకు తగ్గకుండా      
 డి) ఏదేని సభ సభ్యుల్లో 10శాతానికి తగ్గకుండా

6. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానం వీగిపోతే ఏమి జరుగుతుంది?
ఎ) ప్రభుత్వం రాజీనామా చేయాలి  బి) ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం లేదు 
 సి) లోక్‌సభ రద్దవుతుంది      డి) పైవేవీకావు

7. కిందివానిలో ఏది ప్రధానమంత్రి నియామకానికి సంబంధించి సరికాదు?
ఎ) పార్లమెంటులో సభ్యత్వం లేని వ్యక్తి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేడు     
 బి) పార్లమెంటు విశ్వాసం పొందగలడనే నమ్మకం ఉన్నవ్యక్తిని రాష్ట్రపతి ఆహ్వానిస్తాడు  
సి) స్పష్టమైన మెజారిటీ ఉన్న పార్టీ నాయకుని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు    డి) పైవేవీ కావు

8. కిందివారిలో ఎవరిని రాష్ట్రపతి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానిస్తారు?
ఎ) లోక్‌సభలో స్పష్టమైన మెజారిటి ఉన్నవారిని  బి) రాజ్యసభ విశ్వాసం పొందినవారిని    
  సి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సామర్థ్యం ఉన్నవారిని   
  డి) కేంద్ర, రాష్ట్ర శాసనసభల విశ్వాసాన్ని పొందినవారిని

9. ప్రధానమంత్రితో ఏ మంత్రి అయినా విభేదిస్తే అతనిపై ప్రధానమంత్రి ఏ చర్య తీసుకొంటాడు?
ఎ) సంబంధిత మంత్రిని మంత్రి మండలి నుంచి తొలగించాల్సిందిగా ప్రధానమంత్రి
 రాష్ట్రపతికి సిఫార్సు చేయవచ్చు.     బి) మంత్రివర్గ సమావేశాలకు హాజరు కాకుండా చేయవచ్చు  
    సి) పై రెండు      డి) ఏదీకాదు

10. కిందివారిలో ఎవరిని భారత ప్రధానమంత్రిగా పరిగణిస్తారు?
ఎ) రాజ్యసభ చైర్మన్‌  బి) లోక్‌సభ మెజారిటీ పార్టీ నాయకుడు  సి) అధికార పార్టీ ఉపాధ్యక్షుడు
  డి) అధికార పార్టీ అధ్యక్షుడు

11. క్యాబినెట్‌ ప్రభుత్వ వ్యవస్థ గల దేశాల్లో ప్రధానమంత్రిని ప్రైమస్‌ ఇంటర్‌పోలెస్‌గా అభివర్ణిస్తారు
. దీని అర్థం ఏమిటి?
ఎ) ముఖ్యుడు      బి) సామాన్యుడు  సి) సమానుల్లో ప్రథముడు  డి) సమానుల్లో చివరివాడు

12. ఏ సభలోనూ సభ్యుడు కాని పక్షంలో ఎంత కాలంలో మంత్రి తన పదవిని కోల్పోతాడు?
ఎ) నెలరోజులు         బి) రెండు నెలలు      సి) మూడు నెలలు      డి) ఆరునెలలు

13. కిందివానిలో ఏది ద్రవ్య బిల్లు ప్రధాన లక్షణం కాదు?
ఎ) ద్రవ్య బిల్లును దిగువ సభలో మాత్రమే ప్రవేశ పెట్టాలి  బి) ద్రవ్యబిల్లును ఎగువ సభ సవరించడంకానీ, 
వ్యతిరేకించడం గానీ చేయరాదు      సి) రాష్ట్రపతి సిఫార్సుతో ప్రవేశపెట్టాలి      డి) ఏదీకాదు

14. భారత రాజ్యాంగాన్ని అనుసరించి కేంద్ర మంత్రిమండలిలో---
ఎ) మంత్రులందరూ సమానులే  బి) మిగిలినవారికంటే క్యాబినెట్‌ మంత్రులు ఉన్నతులు  
సి) డిప్యూటీ మంత్రులు స్టేట్‌ మంత్రులకన్నా ఉన్నతులు కానీ, క్యాబినెట్‌ మంత్రుల కన్నా హోదాలో 
చిన్నవారు     డి) ఏ పోర్ట్‌ఫోలియో లేని మంత్రి హోదాలో అందరికన్నా కింది స్థానంలో ఉంటాడు.

15. యుద్ధం ప్రకటించి, సంధి కుదుర్చుకొనే అధికారం  భారతదేశంలో ఎవరికి ఉంటుంది?
ఎ) రాష్ట్రపతి      బి) ప్రధానమంత్రి      సి) రక్షణ మంత్రి      డి) హోంమంత్రి

16. రాష్ట్రపతిచే ఎవరు పదవి ప్రమాణ స్వీకారం చేయిస్తారు?
ఎ) ప్రధానమంత్రి          బి) ఉపరాష్ట్రపతి      సి) అటార్నీ జనరల్‌  డి) సుప్రీంకోర్టు ప్రధానమంత్రి  

17. భారత రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
ఎ) అమెరికా  బి) 
కెనడా  సి) ఐర్లాండ్‌  డి) గ్రీన్‌లాండ్

18. ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి పదవికి ఎన్నికైనవారిలో కె.ఆర్‌.నారాయణన్‌ ఎన్నో వ్యక్తి?
ఎ) 3     బి) 6     సి) 1     డి) 4

19. రెండు సార్లు ఉపరాష్ట్రపతిగా పనిచేసినవారు ఎవరు?
ఎ) సర్వేపల్లి రాధాకృష్ణ  బి) బాబారాజేంద్రప్రసాద్‌  సి) అబ్దుల్‌ కలాం  డి) కె.ఆర్‌.నారాయణన్‌

20. ఎవరి ఎన్నికలో నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిని ఉపయోగిస్తారు?
ఎ) రాష్ట్రపతి     బి) ఉపరాష్ట్రపతి      సి) రాజ్యసభ      డి) పైవన్నీ

21. భారత రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్‌ అధికారిగా ఎవరు వ్యవహరిస్తారు?
ఎ) ముఖ్య ఎన్నికల అధికారి      బి) లోక్‌సభ సెక్రటరీ జనరల్‌      సి) రాజ్యసభ సెక్రటరీ జనరల్‌    
  డి) ఒకసారి లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ అయితే మరోసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్‌

22. భారత రాష్ట్రపతి అత్యవసర అధికారాలను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
ఎ) ఇటలీ  బి) జర్మనీ  సి) అమెరికా  డి) కెనడా

23. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి  పదవులు ఏకకాలంలో ఖాళీ అయినపుడు ఎవరు తాత్కాలిక
 రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు?
ఎ) భారత అటార్నీ జనరల్‌      బి) కంట్రోల్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌      సి) లోక్‌సభ స్పీకర్‌ 
 డి) భారత ప్రధాన న్యాయమూర్తి

24. భారత రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వహణ అధికారాలు ఎవరు నిర్వహిస్తారు?
ఎ) రాష్ట్రపతి      బి) ప్రధానమంత్రి      సి) పార్లమెంటు      డి) పైవన్నీ

25. రాష్ట్రపతి పాలనలో ఉన్నపుడు రాష్ట్ర బడ్జెట్‌ను ఎవరు ఆమోదిస్తారు?
ఎ) రాష్ట్రపతి      బి) గవర్నరు      సి) పార్లమెంటు      డి) అసెంబ్లీ

26. రాష్ట్రపతి అనే భావనను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
ఎ) 
కెనడా  బి) బ్రిటన్‌  సి) ఫ్రాన్స్‌  డి) అమెరికా

27. కేంద్ర మంత్రిమండలి లిఖిత పూర్వక సలహా లేకుండా అత్యవసర పరిస్థితి విధించరాదని 
తెలిపే ప్రకరణ ఏది?
ఎ) 352  బి) 352(1)  సి) 352(2)  డి) 352(3)

28. కిందివానిలో ఏ పద్ధతులతో ఉపరాష్ట్రపతిని తొలగిస్తారు?
ఎ) మహాభియోగ తీర్మానాన్ని ముందుగా లోక్‌సభలో ప్రవేశపెట్టాలి     
 బి) మహాభియోగ తీర్మానాన్ని ముండుగా రాజ్యసభలో ప్రవేశ పెట్టాలి     
 సి) మహాభియోగతీర్మానాన్ని ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రవేశ పెట్టాలి.   
  డి) పైవన్నీ

29. ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి సరికాని వ్యాఖ్యను గుర్తించండి
ఎ) రాజ్యాంగ రీత్యా ఉపరాష్ట్రపతికి జీతం ఉండదు    బి) ఉపరాష్ట్రపతి కొన్ని కేంద్ర విద్యాలయాలకు
 ఛాన్సలర్‌గా వ్యవహరిస్తారు
సి) రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రెండు కంటే ఎక్కువ సార్లు ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడకూడదు 
డి) రెండు సార్లు ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టింది ఎస్‌.రాధాకృష్ణన్‌ మాత్రమే

30. ఏ ప్రకరణ ప్రకారం ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి లోక్‌సభకు  నామినేట్‌ చేస్తారు?
ఎ) 330  బి) 331  సి) 332  డి) 333

31. ప్రధానమంత్రి ఎగువ సభకు చెందినట్లయితే
ఎ) అవిశ్వాస తీర్మానంపై తనకు అనుకూలంగా ఓటు వేసుకొనే వీలు లేదు 
 బి) దిగువ సభలో బడ్జెట్‌పై మాట్లాడే అవకాశం లేదు  సి) దిగువ సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది  
  డి) పైవన్నీ

32. లోక్‌సభ రద్దయినపుడు అత్యవసర పరిస్థితిని ఎవరు ఆమోదించాలి?
ఎ) రాష్ట్రపతి           బి) ప్రధానమంత్రి      సి) అన్ని రాషా్ట్రల విధాన సభలు  డి) రాజ్యసభ

33. 1997 రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సవరణ చట్టాన్ని అనుసరించి ఎన్నికల్లో పోటీ చేయుటకు 
డిపాజిట్‌ మొత్తాన్ని ఎంతకు పెంచారు?
ఎ) రూ.5,000 నుంచి రూ.10000 వరకు      బి) రూ.10,000 నుంచి రూ.15,000 వరకు     
 సి) రూ.2,500 నుంచి రూ.5,000 వరకు      డి) రూ.2,500 నుంచి రూ.15,000వరకు

34. రాష్ట్రపతి జీతంపై ఆదాయ పన్ను విధించవచ్చా?
ఎ) విధించవచ్చు  బి) విధించరాదు      సి) తక్కువస్థాయి పన్ను విధిస్తారు   డి) ఏదీకాదు

35. మొరార్జీ దేశాయ్‌ రాజీనామా చేసిన తరవాత ప్రధానిగా ఎన్నికైనవారు ఎవరు?
ఎ) చరణ్‌సింగ్‌          బి) ఇందిరాగాంధీ      సి) లాల్‌బహదూర్‌శాసి్త్ర    డి) గుల్జారిలాల్‌ నందా

36. కింది వానిలో వేటిని రాష్ట్రపతి పార్లమెంటులో సమర్పించాల్సి ఉంటుంది?
ఎ) కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదిక      బి) యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నివేదిక  
సి) షెడ్యూల్డ్‌ కులాల, తెగల కమిషన్‌ నివేదిక      డి) పైవన్నీ

37. 1977కు ముందు ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఏమని పిలిచేవారు?
ఎ) ప్రధానమంత్రి సచివాలయం      బి) ప్రధానమంత్రి చాంబర్‌       సి) పై రెండూ      డి) ఏదీకాదు

38. పార్లమెంటరీ కార్యదర్శులను ఎవరు నియమిస్తారు?
ఎ) రాష్ట్రపతి          బి) ప్రధానమంత్రి      సి) పార్లమెంటరీ వ్యవహారాలశాఖ  డి) ఉపరాష్ట్రపతి

39. మంత్రులను ఏ సభ నుంచి ఎంపిక చేస్తారు?
ఎ) లోక్‌సభ            బి) రాజ్యసభ      సి) పార్లమెంటు ఉభయ సభలు   డి) ఏదీకాదు

40. కేంద్ర మంత్రిమండలి సమావేశాలకు ఎజెండా నిర్ణయించేది ఎవరు?
ఎ) రాష్ట్రపతి          బి) ప్రధానమంత్రి      సి) ఉపరాష్ట్రపతి          డి) రాష్ట్రపతి

41. జోనల్‌ కౌన్సిళ్లకు ఉమ్మడి అధ్యక్షుడు ఎవరు?
ఎ) కేంద్ర హోంమంత్రి       బి) ప్రధానమంత్రి      సి) ఉపరాష్ట్రపతి          డి) రాష్ట్రపతి

42. భారతదేశ ప్రథమ ఉపప్రధాని ఎవరు?
ఎ) వల్లభాయ్‌ పటేల్‌  బి) లాల్‌బహదూర్‌శాసి్త్ర  సి) అంబేద్కర్‌          డి) గాంధీ

43. ఏ ప్రకరణం ప్రకారం ఉపరాష్ట్రపతిని ఎన్నుకొంటారు?
ఎ) 60  బి) 61  సి) 62  డి) 63

44. కిందివానిలో అసంబద్దమైన వ్యాఖ్య ఏది?
ఎ) లోక్‌సభకు పోటీ చేయడానికి 25 ఏళ్లు ఉండాలి    
బి) రాజ్యసభకు పోటీచేయడానికి 30 ఏళ్లు ఉండాలి   
 సి) ఉపరాష్ట్రపతి పదవికి పోటీచేయడానికి 30 ఏళ్లు ఉండాలి   
 డి) రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి 35ఏళ్లు ఉండాలి

45. గోపాలస్వామి అయ్యంగార్‌ కమిటి దేనికి సంబంధించింది?
ఎ) రాష్ట్రపతి సంస్కరణలకు  బి) ఉపరాష్ట్రపతి సంస్కరణలకు  సి) ప్రధానమంత్రి సంస్కరణలకు   
   డి) కేంద్రమంత్రి మండలి సంస్కరణలకు

46. కిచెన్‌ క్యాబినెట్‌ అంటే ఏమిటి?
ఎ) విశ్వాసమే ప్రాముఖ్యంగా ప్రధానికి దగ్గరగా     ఉండే మంత్రివర్గం  బి) ప్రతిపక్షం లేని మంత్రివర్గం     
 సి) ప్రధానికి దూరంగా ఉండే మంత్రివర్గం      డి) మాజీ మంత్రివర్గం

47. ఏ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తాడు?
ఎ) 75  బి) 75(1)  సి) 75(1)(2)  డి) 75(2)

48. 75(3) ప్రకరణ ఏ విషయాన్ని తెలియజేస్తుంది?
ఎ) ప్రధానమంత్రి          బి) రాష్ట్రపతి      సి) మంత్రుల సంయుక్తంగా లోక్‌సభ బాధ్యత వహించడం 
  డి) రాష్ట్రపతి పార్లమెంటుకు బాధ్యత వహించడం

49. సంపూర్ణ మెజారిటీ లేకున్నా ప్రధానమంత్రిగా ఎన్నికైనవారెవరు?
ఎ) చంద్రశేఖర్‌          బి) పి.వి.నరసింహారావు      సి) దేవెగౌడ          డి) పై అందరూ

50. రాజ్యసభ సభ్యులుగా ఉండి ప్రధానులైనవారెవరు?
ఎ) ఇందిరాగాంధీ-1966, దేవగౌడ-1996    బి) ఐకె.గుజ్రాల్‌-1997, మన్మోహన్‌సింగ్‌-2004    
సి) పై అందరూ            డి) పై వారెవరూకాదు

51. ఏ ప్రకరణ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని విషయాలను రాష్ట్రపతికి తెలియజేయాలి?
ఎ) 75  బి) 76  సి) 77  డి) 78

52. కిందివానిలో దేనికి ప్రధాని అధ్యక్షత వహించరు?
ఎ) ప్రణాళిక సంఘం     బి) జోనల్‌ కౌన్సిల్‌      సి) అంతరాష్ట్రమండలి      
డి) జాతీయ సమగ్రతామండలి

53. ఏ రాజ్యాంగ సవరణ రాష్ట్రపతి, మంత్రిమండలి సలహా మేరకే తన విధులను 
నిర్వర్తించాలని పేర్కొంది?
ఎ)32     బి) 42      సి) 62       డి) 82

సమాధానాలు...

1) డి  2) బి  3) సి  4) బి  5) బి  6) ఎ  7) ఎ  8)ఎ  9) ఎ  10) బి  11) సి  12) డి  13) డి  14)ఎ  15) ఎ 

 16) డి  17) ఎ  18) బి  19) ఎ  20) డి  21) డి  22) బి  23) డి  24) ఎ  25) సి  26) డి  27) డి  28) బి 

 29) సి  30) బి  31) ఎ  32) డి  33) బి  34) ఎ  35) ఎ  36) డి  37) ఎ  38) ఎ  39) సి  40) బి  41) ఎ 

 42) ఎ  43) డి  44) సి  45) డి  46) ఎ  47) బి  48) సి  49) డి  50) సి  51) డి  52) బి  53) బి