ఇండియన్‌ ఎకానమీ ప్రాక్టిస్ బిట్స్ - 27/08/2014

ఇండియన్‌ ఎకానమీ ప్రాక్టిస్ బిట్స్ - 27/08/2014

prabhanews -   Tue, 27 Aug 2014, IST



నిరుద్యోగ సమస్య

1. నిరుద్యోగం ఎప్పుడు సంభవిస్తుంది?
1) కొత్త ఉద్యోగాల కల్పనారేటు శ్రామికశక్తి వృద్ధిరేటు కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు
2) శ్రామిక శక్తి వృద్ధిరేటు కొత్త ఉద్యోగాల కల్పనారేటు కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు
3) కొత్త ఉద్యోగాల కల్పనారేటు, శ్రామికశక్తి వృద్ధి రేటు సమానంగా ఉన్నప్పుడు
4) అమల్లో ఉన్న వేతనరేట్ల వద్ద పని చేసేందుకు వ్యక్తులు నిరాకరించినపుడు

2. 2001 నాటికి దేశ జనాభాలో కర్షకుల సంఖ్య
1) 172.13 మిలియన్లు 2) 127.31 మిలియన్లు
3) 271.13మిలియన్లు 4) 721.13 మిలియన్లు

3. భారతదేశంలో నిరుద్యోగ సమస్యకు కారణం
1) జనాభా విస్పోటనం
2) దిశ లోపించిన విద్యా వ్యవస్థ
3) మానవ వనరుల వినియోగం సరిగ్గా లేకపోవడం
4) పైవన్నీ

4. ఒక దేశం యొక్క కార్మిక శక్తి అనగా
1) ఆ దేశం యొక్క జనాభా
2) ఆ దేశం యొక్క వయోజన జనాభా
3) ఉద్యోగాలలో నియమించబడిన మొత్తం సభ్యులు
4) ఉపాధి కోసం అందుబాటులో ఉన్న జనాభా శాతం

5. భారతదేశంలో నిరుద్యోగితను ఈ కింది విధంగా అభివర్ణించవచ్చు?
1) చక్రీయమైనది, తాత్కాలికమైనది
2) రుతు సంబంధితమైనది, స్థానికమైనది
3) దీర్ఘకాలికమైనది
4) ప్రచ్ఛన్నమైనది

6. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ మన దేశ పరిస్థితులను అనుగుణంగా నిరుద్యోగితను ఈ కింది విధంగా వర్గీకరించింది?
1) సాధారణ స్థితి నిరుద్యోగిత
2) వారంవారీ స్థితి నిరుద్యోగిత
3) రోజువారీ స్థితి నిరుద్యోగిత
4) పైవన్నీ

7. నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ ప్రకారం సాధారణ స్థితి నిరుద్యోగిత స్వభావం?
1) రుతు సంబంధితమైంది 2) ప్రచ్ఛన్నమైనది
3) దీర్ఘకాలికమైనది 4) ఒరిపిడి

8. అనిచ్ఛాపూర్వక నిరుద్యోగం అంటే?
1) సంపన్నులైనందువల్ల ఉద్యోగం చేయడానికి ఇష్టపడని స్థితి
2) పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని లభించని స్థితి
3) ఆశించిన వేతనం లభించే ఉద్యోగం దొరకక ఖాళీగా వుండే స్థితి 4) తన సాంకేతిక నైపుణ్యానికి తగిన ఉద్యోగం లభించని స్థితి

9. ఒక దేశంలోని ఉత్పత్తికారులన్నింటిని పూర్తిగా వినియోగించినపుడు మొత్తం ఉత్పత్తిని పెంచేందుకున్న ఏకైక మార్గం
1) ప్రభుత్వం పన్నులను పెంచడం
2) కర్మాగార కార్మికుల సంఖ్యను పెంచడం
3) ధరలను పెరిగేలా చేయడం
4) వనరులను మరింత స్థిరంగా వినియోగించడం

10. ప్రత్యక్ష నిరుద్యోగం అంటే?
1) ప్రజలు పనిచేయడానికి ఇష్టపడని స్థితి
2) ప్రజలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పనిదొరకని స్థితి
3) మెరుగైన ఉద్యోగాల కోసం ప్రజలు చేస్తన్న ఉద్యోగాలను
వదిలేసే స్థితి
4) పనిచేసే ప్రజలు అవినీతి కారణంగా ఉద్వాసనకు గురైన స్థితి

11. ప్రత్యక్ష నిరుద్యోగం ఏ స్థితిని సూచిస్తుంది?
1) సాధారణ 2) వారంవారీ
3) రోజువారీ 4) పైవన్నీ

12. ప్రచ్ఛన్న నిరుద్యోగం దేనిని తెలుపుతుంది?
1) ఉద్యోగాలు లేకపోవడం
2) కొద్ది మంది చేయగలిగే పనికి ఎక్కువ మందిని నియమించడం
3) మహిళల నిరుద్యోగం
4) 60 ఏళ్ల పైబడిన వారిలో నిరుద్యోగం

13. ప్రచ్ఛన్న నిరుద్యోగం అనేది ఏ ఆర్థిక వ్యవస్థలో ప్రబలంగా ఉంటుంది?
1) పెట్టుబడిదారీ దేశాలు 2) కమ్యూనిస్టు దేశాలు
3) వర్తమాన దేశాలు 4) వెనుకబడిన దేశాలు

14. ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఏ రంగంలో అధికం?
1) ప్రాథమిక 2) ద్వితీయ
3) తృతీయ 4) పైవన్నీ

15. సాంకేతికంగా ప్రచ్ఛన్న నిరుద్యోగాన్ని కింది విధంగా నిర్వహించవచ్చు?
1) మూలధనం కన్నా శ్రామికశక్తి ప్రధాన కారణంగా ఉండే స్థితి
2) వ్యయం రూపేణా కార్మికశక్తి తోడ్పాటు తక్కువగా ఉండడం
3) శ్రామికశక్తి ఉపాంత ఉత్పాదకత శూన్యంగా ఉండే స్థితి
4) మూలధన ఉపాంత ఉత్పాదక శూన్యంగా ఉండే స్థితి

16. ప్రచ్ఛన్న నిరుద్యోగిత భావనను ప్రచారం చేసింది?
1) జె.ఎస్‌.భగవతి, పద్మ
2) టి.ఎన్‌.శ్రీనివాసన్‌, పి.కె.బర్దన్‌
3) జె.ఎన్‌.భగవతి, పద్మాదేశాయ్‌
4) టి.ఎ.శ్రీనివాసన్‌, ఎన్‌.ఎస్‌.ఎస్‌.నారాయణన్‌

17. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రచ్ఛన్న నిరుద్యోగితను అభివృద్ధికి సాధానంగా ఉపయోగించుకోవచ్చునని ఏ ఆర్థికవేత్త పేర్కొన్నారు?
1) రాగ్నార్‌ నర్క్స్‌
2) లెవిస్‌
3) కెన్నెత్‌ కె.కురిహార్‌
4) గున్నార్‌ మిర్దాల్‌

18. వ్యవస్థాపరమైన నిరుద్యోగం?
1) తాత్కాలికమైనది 2) దీర్ఘకాలికమైనది
3) రుతుసంబంధితమైనది 4) చక్రీయమైనది

19. కార్మికులు ఒక ఉద్యోగం నుండి మరొక ఉద్యోగానికి మారడం వల్ల ఏర్పడిన నిరుద్యోగితకు మరో పేరు?
1) రుతు సంబంధిత నిరుద్యోగిత
2) ఒరిపిడి నిరుద్యోగిత
3) చక్రీయ నిరుద్యోగిత
4) సాంకేతిక నిరుద్యోగిత

20. వ్యవస్థాపరమైన నిరుద్యోగం దేనివల్ల తలెత్తుతుంది?
1) డిఫ్లేషనరీ పరిస్థితుల వల్ల
2) భారీ పరిశ్రమల వైపు మొగ్గు వల్ల
3) ముడి పదార్థాల కొరత
4) చాలినంత ఉత్పాదక సామర్థ్యం లేకపోవడం

21. భారతదేశంలో సాధారణంగా కనిపించని నిరుద్యోగం ఏది?
1) వ్యవస్థాపర నిరుద్యోగం 2) ప్రచ్ఛన్న నిరుద్యోగం
3) ప్రత్యక్ష నిరుద్యోగం 4) ఒరిపిడి నిరుద్యోగం

22. ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రకారం అల్ప ఉపాధి కలవారు అంటే?
1) వారానికి 24 గంటల కంటే తక్కువ పనిచేసేవారు
2) వారానికి 20 గంటల కంటే తక్కువ పనిచేసేవారు
3) వారానికి 30 గంటల కంటే తక్కువ పనిచేసేవారు
4) వారానికి 14 గంటల కంటే తక్కువ పనిచేసేవారు

23. దీర్ఘకాలిక నిరుద్యోగితను దేనినుపయోగించి కొలుస్తారు?
1) యుస్‌ డాటా 2) సిడబ్ల్యుఎస్‌ డాటా
3) పై రెండు కాదు 4) 1 మరియు 2

24. మానవ మూలధన కల్పన అనగానేమి?
1) ప్రజల సంఖ్య పెరుగుతుండటం
2) మూలధనం భౌతిక పరిమాణం పెరగటం
3) దేశ ప్రజల యొక్క విజ్ఞానం, శక్తి సామర్థ్యాలు పెరుగుతుండటం
4) ప్రజలకు అనేకమైన సేవలను కల్పించడం

25. ప్రభుత్వం అవసరానికి మించి ప్రభుత్వోద్యోగులకు ఉపాధి కల్పించడం దేనిని సూచిస్తుంది?
1) అసమర్థత
2) ఆర్థికరంగంలో నిర్మాణాత్మక బలహీనత
3) కనిపించని నిరుద్యోగం
4) లంచగొండి పాలనా వ్యవస్థ

26. భారతీయ వేతన వాధానం ఇంచుమించుగా దేనిపై ఆధారపడి రూపుదిద్దుకున్నదని చెప్పవచ్చు?
1) ఉత్పాదకత 2) కనీసావసరాలు
3) జీవన ప్రమాణం 4) జీవన వ్యయం

27. కింద వాటిలో సరియైనవి
ఎ)భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగం సమస్య అధికం
బి) వ్యవసాయ రంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగం శాశ్వత సమస్య
సి) పారిశ్రామీకరణ వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు
1) ఎ మరియు బి 2) ఎ, బి మరియు సి
3) ఎ మాత్రమే 4) బి మరియు సి

28. 1993-94 తర్వాత నుంచి నిరుద్యోగుల శాతం ప్రతి వెయ్యి మందికి ఎన్‌ఎస్‌ఎస్‌ అంచనాల ప్రకారం?
1) తగ్గుతోంది 2) పెరుగుతోంది
3) నిలకడగా ఉంది 4) ఏదీకాదు

29. ఏ ప్రణాళికా కాలం నుంచి ప్రభుత్వం నిరుద్యోగ నిర్మూలన మీద దృష్టి సారించింది?
1) మొదటి 2) రెండవ
3) మూడవ 4) నాల్గవ

30. గ్రామీణ ప్రాంతాలలోని పేదవారికి సహాయం చేయడం ద్వారా స్వయం ఉపాధిని కల్పించడానికి కింది కార్యక్రమాలలో దేనిని
ప్రారంభించారు?
1) ట్రైసమ్‌ 2) ఐ.ఆర్‌.డి.పి
3) ఆర్‌.ఎల్‌.ఇ.జి.పి 4) డి.పి.ఎ..పి

31. ట్రైసమ్‌ పథకం దేనికి సంబంధించినది?
1) ఉపాధి కోసం యువ శాస్త్రవేత్తలకు శిక్షణ ఇచ్చే పథకం
2) స్వయం ఉపాధి కోసం గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చే పథకం
3) ఉపాధి కోసం యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం
4) పైవేవీకావు

32. 1989-90 సంవత్సరంలో రెండు పథకాలను సంలీనం చేసి ఒక గ్రామీణ ఉపాధి కార్యక్రమాన్ని జవహార్‌ రోజ్‌గార్‌ యోజనగా
రూపొందించారు. ఆ రెండింటిలో ఒకటి ఆర్‌.ఎల్‌.ఇ.జి.పి మరి రెండో ఏది?
1) ఐ.ఆర్‌.డి.పి 2) ట్రైసమ్‌
3) ఎన్‌.ఆర్‌.ఇ.పి 4) డి.పి.ఇ.పి

33. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు పథకాన్ని అమలు చేసే రాష్ట్రం
1) ఉత్తరప్రదేశ్‌ 2) మహారాష్ట్ర
3) పశ్చిమబెంగాల్‌ 4) పంజాబ్‌

34. పదవ ప్రణాళిక కాలంలో ఎన్ని కోట్ల ఉద్యోగాలను కల్పించాలని లక్షంగా పెట్టుకున్నారు?
1) 3 2) 5
3) 4 4) 10

35. స్వాతంత్య్ర పూర్వపు భారతదేశపు పేదరికం మరియు ఆర్థిక స్థితిపై దాదాబాయ్‌ నౌరోజీ ఏ పుస్తకాన్ని రాశారు.
1) నట్స్‌ ఆన్‌ పావర్టీ ఇన్‌ బ్రిటిష్‌ రూల్‌డే ఇండియా
2) ఇండియన్‌ ఎకానమీ ఇన్‌ బ్రిటిష్‌ ఇండియా
3) పావర్టీ అండ్‌ ఆన్‌ బ్రిటిష్‌ రూల్‌ ఇన్‌ ఇండియా
4) పావర్టీ ఇన్‌ బ్రిటిష్‌ ఇండియా

36. కింది వాటిలో భారతదేశంలో పేదరికానికి కారణం కానిది ఏది?
1) విస్తృత జనాభా
2) విస్తృత స్థాయిలో ఉన్న సహజ వనరులు
3) ఆదాయం పంపిణీలో ఉన్న అసమానతలు
4) వ్యవసాయరంగంలో ఉన్న మిగులు కార్మిక శక్తి
సమాధానాలు
1. 2 2. 2 3. 3 4. 4 5. 3 6. 2 7. 4 8. 2 9. 1 10. 2 11. 2 12. 4 13. 1 14. 3 
15. 1 16. 1 17. 2 18. 2 19. 4 20. 4 21. 4 22. 4 23. 3 24. 3 25. 2 26. 1 
27. 2 28. 3 29. 1 30. 2 31. 3 32. 3 33. 3 34. 3 35. 3 36. 2





0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment