ఆర్‌ఆర్‌సి (గ్రూప్‌-డి) (16/11/2014) ప్రశ్నా పత్రం & కీ



1. ఇండియాలోని వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు?
ఎ) ప్రధానమంత్రి             బి) రాష్ట్రపతి         
సి) భారత ప్రధాన న్యాయమూర్తి              డి) కేంద్ర న్యాయశాఖమంత్రి



2. పైపుల తయారీలో ఉపయోగించే ప్లాస్టిక్‌ ఏది?
ఎ) నైలాన్‌ 66       బి) పాలీ ఎథిలీన్‌     
సి) పాలీ వినైల్‌ క్లోరైడ్‌               డి) పాలియెస్టర్‌



3. బట్టల నుంచి మురికిని తొలగించడంలో సబ్బు లు, డిటర్జంట్లలో ఏ గుణాలు సహకరిస్తాయి?
ఎ) కేశిక చర్య              బి) ఇంటర్‌ ఫేసియల్‌ బార్సియన్‌              
సి) ఆస్మాసిస్‌                 డి) పైన పేర్కొన్న వాటిలో ఏదీకాదు



4. రక్తంలో మొత్తం ఉప్పు మోతాదు సుమారు?
ఎ) 1.85% నుంచి 1.9% వరకు             బి) 11.85% నుంచి 11.9% వరకు         
 సి) 2.85% నుంచి 2.9% వరకు       డి) 0.85% నుంచి 0.9% వరకు



5. రెండో అయనీకరణ శక్తి లేని మూలకం?
ఎ) నియాన్‌           బి)హీలియం            
సి) హైడ్రోజన్‌                  డి) లిథియం



6. కంపనంలో ఉన్న ఒక వస్తువు పౌనఃపున్యమును ఎలా పేర్కొంటారు?
ఎ) Hz        బి)సెకనుకు సైకిళ్లలో        
 సి)s-1         డి)పేర్కొన్నవన్నీ



7. ఇండియా ప్రభుత్వ చట్టం 1919ని ఏమని పేర్కొన్నారు?
ఎ) మార్లే - మింటో సంస్కరణలు           బి) వావెల్‌ సంస్కరణలు           
సి) మాంట్‌-ఫర్డ్‌ సంస్కరణలు            డి) మౌంట్‌ బాటెన్‌ సంస్కరణలు



8. పార్లమెంటులో సాధారణ బడ్జెట్‌ ఏ నెలలో ప్రవేశపెడతారు?
ఎ) జనవరి             బి) ఫిబ్రవరి              
 సి) మార్చి             డి) డిసెంబరు



9. కింది తరంగాలలో ఏవి ధ్రువణము చెందజాలవు?
ఎ) ఎక్స్‌-కిరణాలు                బి) రేడియో తరంగాలు        
 సి) దృగ్గోచర కాంతి            డి) శబ్ద తరంగాలు



10. 156x9x4 :-  3 =
ఎ) 1772     బి) 1872            
 సి) 1972           డి) 1672



11. 2, 10, 40, ..................... 240, 240
ఎ) 140          బి) 130        
సి) 100              డి) 120



12. [8 1/8 x 3 1/5) + 4 3/5 :-  9 1/5) - 3 3/6 :- 3 1/2) =
ఎ) 14 1/2     బి) 26 1/2         
 సి) 12 1/2            డి) 25 1/2



13. కింది పేర్కొన్న ఏ కొండ ప్రాంతాల్లో తేయాకు పండిస్తారు?
ఎ) మైకాలా కొండలు            బి) నల్లమలై కొండలు           
 సి) నీలగిరి కొండలు         డి) శివాలిక్‌ కొండలు



14. కాన్సర్‌ కణాల్లో ఏరకం కణ విభజన జరుగును?
ఎ) మిటోసిస్‌             బి) క్షయకరణ విభజన          
 సి) ఎ, బి రెండూ           డి) కణ విభజన జరగదు



15. ఇండియాలో అతి పురాతనమైన ట్రేడ్‌ యూనియన్‌ సంస్థ ఏది?
ఎ) ఐఎన్‌టియుసి            బి) సిఐటియుసి          
 సి) ఎఐటియుసి            డి) బిఎంఎస్‌



16. కంప్యూటర్‌ టెక్నాలజీలో ఎంబి దేనిని సూచిస్తుంది?
       ఎ) మ్యాక్రోబైట్స్‌                 బి) మెలాబైట్స్‌          
       సి) మెగాబైట్స్‌            డి) మైక్రో బైట్స్‌



17. తాజా నీటిలో నివాసంపై అధ్యయనాన్ని ఏమంటారు?
     ఎ) మెరైన్‌ ఎకాలజీ          బి) లిమ్నాలజీ         
     సి) హైడ్రాలజీ                   డి) ఫిలాలజీ



18. కింది ఖనిజాల్లో ‘కోలారు’ దేనితో సంబంధం కలిగి ఉంది?
ఎ) బంగారం          బి) ఇనుము            
సి) బొగ్గు                డి) మైకా



19. డైమండల్‌ స్ఫటికం ఎందుకు మెరుస్తుంది?
ఎ) హెచ్చు సాంద్రత కారణంగా          బి) సంపూర్ణ అంతర్‌ పరావర్తనం        
సి) స్ఫటిక జాలకం                          డి) పైన పేర్కొన్న వాటిలో ఏదీ కాదు



20. ఒక ప్రాంతాన్ని మున్సిపాలిటీగా లేదా మున్సిపల్‌ కార్పొరేషన్‌గా లేదా పంచాయతీగా
 రూపొందించే అధికారం కింది వారిలో ఎవరికి ఉంది?
ఎ) కేంద్రప్రభుత్వం            బి) డివిజనల్‌ కమిషనర్‌           
 సి) జిల్లా కలెక్టర్‌              డి) రాష్ట్రప్రభుత్వం



21. బాడ్మింటన్‌ ఏ దేశపు జాతీయ ఆట?
ఎ) మలేషియా           బి) చైనా          

 సి) స్కాట్లండ్‌            డి) ఇంగ్లాండ్‌



22. ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు ‘గ్రాంట్లు’ దేని నుంచి లభిస్తాయి?
ఎ) ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌           
బి) ఏషియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌          
సి) స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా           
డి) ఒలింపిక్‌ ఆటలు నిర్వహించే దేశాల నుంచి



23. ఒక వ్యక్తి తన పడవను 3 గంటల్లో ఎగువ ప్రవాహంలో 9 కి.మీ., దిగువ ప్రవాహంలో 
18 కి.మీ. నడపగలడు. నిలకడ నీటిలో పడవ వేగం ఎంత?
ఎ) గంటకు 4.5 కి.మీ.           బి) గంటకు 5.5కి.మీ.            
సి) గంటకు 6.5 కి.మీ.             డి) గంటకు 3.5 కి.మీ.



24. వక్రీభవన గుణకం దేనిలో అతి హెచ్చుగా ఉండును?
ఎ) ప్లాస్టిక్‌             బి) గ్లాసు             
 సి) నీరు               డి) డైమండ్‌



25. ఎంట్రోపీ అనేది దేనికి కొలమానం?
ఎ) అంతర్గత శక్తి               బి) పూర్తి శక్తి          
 సి) అలజడి                 డి) ఎంథాల్పీ



26. అన్ని గ్రహాలు ఒకటి అంతకంటే హెచ్చు ఉపగ్రహాలను కలిగి ఉన్నాయి. 
అయితే కింది వాటిలో దేనికి ఉపగ్రహం లేదు?
ఎ) బుధుడు, శుకుడ్రు             బి) నెఫ్ట్యూన్‌, శని                          
 సి) ఫ్లూటో, జూపిటర్‌                 డి) కుజుడు, యురేనస్‌



27. 20 లీటర్ల మిశ్రమంలో పాలు, నీరు 5:3 నిష్పత్తిలో ఉన్నాయి. ఈ మిశ్రమం నుంచి 
4 లీటర్లు వెలుపలకు తీసుకొని, 4 లీటర్ల పాలు కలిపితే కొత్త మిశ్రమంలో పాలు, నీరు నిష్పత్తి ఎంత?
ఎ) 2:3             బి) 4:3              
సి) 5:3             డి) 7:3



28. 4 2/4 + 4 4/8 + 4 6/12 - 4 1/2=
ఎ) 4 1/2               బి) 8          
 సి) 8 1/2             డి) 9



29. ఎక్స్‌-రే, రేడియో యాక్టివిటీ అధ్యయనాన్ని ఏమంటారు?
ఎ) రేడియాలజీ             బి) రేడియో బయాలజీ              
 సి) రియాలజీ               డి) పైన పేర్కొన్న వాటిలో ఏదీ కాదు



30. రైలు పట్టాల్లో, పట్టాల మధ్య కొద్దిగా ఖాళీ స్థలం ఉంచుతారు, ఎందుకు?
ఎ) ఉష్ణం వల్ల వ్యాకోచం చెందడానికి            
బి) లోహం ఖర్చును పొదుపు చేయడానికి                   
 సి) లోహం సంకోచానికి వీలు కల్పించడానికి          
డి) పైవాటిలో ఏ ఒక్కటీ కాదు



31. హార్స్‌ పవర్‌ (Horse power) అనే పదాన్ని ఎవరు రూపొందించారు?
ఎ) అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌               బి) ఎస్‌.సి.బోస్‌             
సి) జేమ్స్‌ వాట్‌                            డి) ఐజాక్‌ న్యూటన్‌



32.PDS పూర్తి రూపం?
ఎ) పబ్లిక్‌ డిస్ర్టిబ్యూషన్‌ సిస్టమ్‌ (Public Distribution System)                    
బి) పవర్‌ డిస్ర్టిబ్యూషన్‌ సిస్టమ్‌ (Power Distribution System)
సి) ప్రొడక్షన్‌ డిస్ర్టిబ్యూషన్‌ సిస్టమ్‌ (Production Distribution System)         
డి) పైన పేర్కొన్న వాటిలో ఏదీ కాదు

33. దేని నిర్మూలనలో డిడిటి క్రియారహితమైంది?
ఎ) దోమలు                                     బి) ఎలుకలు          
సి) కుమ్మరి పురుగులు                 డి) నిష్పత్రకణం కలిగించే కొన్నిరకాల కీటకాలు



34. గ్యాల్వనోమీటరు దేనిని గుర్తిస్తుంది?
ఎ) రెసిస్టెన్స్‌             బి) ఎనర్జీ             
సి) కరెంట్‌                డి) హీట్‌



35. 55.005+0.0155+5055.05555+50.150- 59.91319- 5100.31286=
ఎ) 5110.31286               బి) 5100.31286                
సి) 5100.3128                డి) పైవాటిలో ఏదీకాదు



36. డాక్టర్‌ బి.సి.రాయ్‌ ట్రోఫీ దేనికి సంబంధించింది?
ఎ) హాకీ                     బి) క్రికెట్‌                
సి) ఫుట్‌బాల్‌            డి) పోలో



37. LCD పూర్తి రూపము?
ఎ) లైట్‌ క్రిస్టల్‌ డిస్‌ప్లే (Light Crystal Display)        
 బి) లిక్విడ్‌ క్రిస్టల్‌ డిస్‌ప్లే (Liquid Crystal Display)            
సి) లిమిటెడ్‌ క్రిస్టల్‌ డిస్‌ప్లే (Limited Crystal Display)                   
డి) పైన పేర్కొన్న వాటిలో ఏదీకాదు



38. సుంద్రగుంట ఏ సముద్రంలో ఉంది?
ఎ) హిందూ మహాసముద్రము            బి) అట్లాంటిక్‌ మహాసముద్రము           
సి) పసిఫిక్‌ మహాసముద్రము             డి) ఆర్కిటిక్‌ మహాసముద్రము



39. రాము, సోము నుంచి రూ.35,000 అప్పుగా తీసుకొనెను. ఈ మొత్తంలో కొంతభాగం ఏటా 10ు సాధారణ వడ్డీతో 4 సంవత్సరాలకు తీసుకొన్నది. మిగతా మొత్తం 4 1/2 సంవత్సరాలకు 11ు సాధారణ వడ్డీతో తీసుకొన్నది. సోముకు లభించిన మొత్తం వడ్డీ రూ.15,900 కాగా రాము వేర్వేరు వడ్డీ రేట్లతో తీసుకున్న అసలును కనుగొనండి?
ఎ) రూ.15,000, రూ.20,000             
బి) రూ.20,000, రూ.15,000         
సి) రూ.10,000, రూ.15,000                 
 డి) రూ.15,000, రూ.10,000



40. దేశానికి ‘జైహింద్‌’ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు?
ఎ) సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌           బి) సుభాష్‌ చంద్రబోస్‌             
సి) డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌                 డి) మోతీలాల్‌ నెహ్రూ



41. అజంతా చిత్రకళ దేనికి సంబంధించింది?
ఎ) జైనమతం                              బి) బౌద్ధమతం            
సి) వైష్ణవ సంప్రదాయం               డి) శైవ సంప్రదాయం



42. కేంద్రకములోగా కింది వాటిలో ఏవిధమైన రేడియేషన్‌ ఉత్పత్తి కాదు?
ఎ) ఆల్ఫా                 బి) బీటా                 
సి) గామా                డి) ఎక్స్‌-కిరణాలు



43. కింది వారిలో సినిమా ప్రొజెక్టరును ఎవరు కనుగొన్నారు?
ఎ) అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌              బి) బెంజామిన్‌ ఫ్రాంక్లిన్‌           
 సి) జె.ఎల్‌.బర్డ్‌                                డి) థామస్‌ ఎడిసన్‌



44. 1921లో బెంగాల్‌, మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీ బ్యాంకులను జాతీయం చేయగా 
కొత్తగా ఏర్పడిన బ్యాంకు ఏది?
ఎ) పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌                 బి) సిండికేట్‌ బ్యాంక్‌             
సి) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా             డి) పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌



45. ‘ఎ’ 900 మీటర్ల రోడ్డును 3 గంటల్లో శుభ్రపర్చగలడు. ‘బి’ 100 నిమిషాల్లో 
2/3 వంతుల రోడ్డును శుభ్రపర్చగలడు. ఎవరు హెచ్చు వేగంగా శుభ్రపర్చగలరు?
ఎ) ‘ఎ’ వేగంగా శుభ్రపర్చగలడు        
 బి) ‘బి’ వేగంగా శుభ్రపర్చగలడు            
 సి) ఎ - బి ఒకే వ్యవధిలో శుభ్రపర్చగలరు             
డి) వీటిలో ఏదీ సరికాదు



46. గంటకు 36 కి.మీ., 45 కి.మీ. వేగంతో వ్యతిరేక దిశలో నడుస్తున్న రెండు రైళ్లు
ఒకటినొకటి 20 సెకన్లలో దాటగలవు. వాటిలో ఒక రైలు పొడవు 200 మీ. మరో రైలు 
 పొడవు కనుగొనండి?
ఎ) 144 మీ.                            బి) 200 మీ.                  
సి) 240 మీ.                           డి) 250మీ.



47. అప్పుడే జన్మించిన పాపలో శ్వాసక్రియ నిమిషానికి ఎన్నిమార్లు జరుగుతుంది?
ఎ) 18 మార్లు                  బి) 32 మార్లు                      
సి) 26 మార్లు                  డి) 16 మార్లు


48. కింది వాటిలో ఏది పర్యావరణ స్నేహ ఇంధనం?
ఎ) కిరోసిన్‌ ఆయిల్‌                  బి) పెట్రోల్‌               
సి) డీజిల్‌ ఆయిల్‌                    డి) సిఎన్‌జి



49. అల్యూమినియం పరమాణు సంఖ్య ఎంత?
ఎ) 11                         బి) 12              
సి) 13                         డి) 4



50. ఏ సంవత్సరంలో ఆర్‌బిఐ నుంచి ఐడిబిఐ వేరుపడి స్వయంప్రతిపత్తి సహకారం పొందింది?
ఎ) 1967                     బి) 1970                
సి) 1973                    డి) 1976



51. ఓజోన్‌ పొర రంగు?
ఎ) పలచని నీలం                           బి) పలచని ఆకుపచ్చ              
సి) పలచని పసుపుపచ్చ              డి) పలచని ఆరెంజ్‌



52. ఏ మొక్క నుంచి ‘టర్పెంటైన్‌ ఆయిల్‌’ తీస్తారు?
ఎ) ఫైనస్‌                               బి) ఫెర్న్‌              
సి) సూర్యకాంతి                    డి) మాస్‌



53. (12831 :- 21) - 5076 :- 12) - (1467 :- 9)=
ఎ) 25                   బి) 15            
 సి) 35                  డి) 45



54. తొలి ఆధునిక ఒలింపిక్‌ ఆటలు ఏ దేశంలో నిర్వహించారు?
ఎ) యుకె                  బి) గ్రీస్‌            
 సి) ఫ్రాన్స్‌                 డి) యుఎస్‌ఎ



55. (4.94 / 2.6) x (2.56 /  1.6)=
ఎ) 3.03               బి) 3.04           
 సి) 3.05              డి) 3.06



56. వాయవ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) హుబ్లి                      బి) ముంబై                 
 సి) జైపూర్‌                   డి) ఢిల్లీ



57. ఒక తరగతిలోని 10 మంది విద్యార్థుల సగటు ఎత్తు 105 సెం.మీ., 120 సెం.మీ. 
సగటు ఎత్తు గల మరో 20 మంది విద్యార్థులు ఆ తరగతిలో చేరితే, వారందరి సగటు ఎత్తు ఎంత?
ఎ) 105 సెం.మీ.                బి) 110 సెం.మీ.              
సి) 112 సెం.మీ.               డి) 115 సెం.మీ.



58. ట్రాన్స్‌మిటింగ్‌ ఆంటెనా దేనిని ప్రసారం చేస్తుంది?
ఎ) శబ్ద తరంగాలు                                   బి) వెలుగు తరంగాలు           
సి) మాడ్యులేటెడ్‌ తరంగాలు                  డి) శబ్ద, వెలుగు తరంగాలు రెండూ కూడా



59. ఒక భాగస్వామ్య వ్యాపారంలో ‘ఎ’ రూ.10,000 పెట్టుబడి చేశాడు. ‘బి’ రూ.15,000 పెట్టుబడి 
చేశాడు. 3 నెలల తరవాత ‘బి’ వ్యాపారం నుం చి వైదొలిగాడు.ఆ వ్యాపారంలో ‘సి’
 రూ.12,000 పెట్టుబడితో చేరాడు. సంవత్సరాంతమున రూ. 91,000 మొత్తం లాభం వచ్చిది.
 ఆ లాభంలో ఎ, బి, సి ల వాటాను కనుగొనండి?
ఎ) రూ.36,000, రూ.15,000, రూ.40,000                                                  
 బి) రూ.15,000, రూ.40,000, రూ.36,000
సి) రూ.40,000, రూ.15,000, రూ.36,000                                                  
 డి) పైవాటిలో ఏదీకాదు



60. కింది రాష్ట్రాల్లో దేనిలో కక్రాపర్‌ న్యూక్లియర్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటైంది?
ఎ) కర్నాటక               బి) తమిళనాడు               
 బి) మహారాష్ట్ర              డి) గుజరాత్‌



61. నాన్‌-స్టిక్‌ కిచెన్‌వేర్‌పై ఏ పూత పూసి ఉంటుంది?
ఎ) పివిసి                       బి) గ్రాఫైట్‌                      
సి) టెఫ్లాన్‌                     డి) సిలికాన్‌



62. యునైటెడ్‌ నేషన్స్‌లో ఇండియా ఏ సంవత్సరంలో సభ్యత్వం పొందింది?
ఎ) 1945                  బి) 1946                 
సి) 1947                  డి) 1948



63. కోలా వంటి పానీయంలో ఏది చేరి ఉంటుంది?
ఎ) కెఫైన్‌                      బి) నికోటిన్‌                
సి) టానిన్‌                    డి) రెనిన్‌



64. ఒక పట్టకము గుండా వెలుగును ప్రసరింపజేసినప్పుడు అతి తక్కువగా విచలనం పొందే రంగు ఏది?
ఎ) ఎరుపు                                    బి) ఆకుపచ్చ                  
 సి) నీలలోహితం                          డి) నీలం



65. రాజా చెల్లయ్య పేరు దేనితో ముడిపడి ఉంది?
ఎ) పన్నుల సంస్కరణలు                       
బి) కార్మిక విధానం సంస్కరణలు                             
సి) విదేశీ వాణిజ్య విధానం సంస్కరణలు                       
డి) ఉదారీకరణ విధానం సంస్కరణలు



66. రసాయనిక మూలకం ‘టిన్‌’ చిహ్నం ఏమిటి?
ఎ) T                       బి) Ti             
సి) S                       డి)Sn



67. ఏ కమిటీ సిఫార్సుతో NABARD ఏర్పాటు చేశారు?
ఎ) పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ                   బి) శివరామన్‌ కమిటీ             
సి) నరసింహన్‌ కమిటీ                         డి) పైన పేర్కొన్న వాటిలో ఏదీకాదు



68. సెమీ కండక్టర్‌ పరికరాలు దేనిపై ఆధారపడి ఉన్నాయి?
ఎ) కరెంట్‌                          బి) ఓల్టేజి                  
సి) ఉష్ణోగ్రత                       డి) పైన పేర్కొన్నవన్నీ



69. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు ఏ రంగానికి చెందినది?
ఎ) సైన్స్‌                      బి) క్రీడలు              
సి) సాహిత్యం              డి) చలన చిత్రాలు



70. ప్రధాన నదిలో కలిసే చిన్న నదులను ఏమంటారు?
ఎ) ఫీడర్లు                       బి) కాలువలు              
సి) ఉప నదులు             డి) నదీ పాయలు



71. ఒక క్షిపణిని గాలిలో ప్రవేశపెట్టినప్పుడు అది ఏ మార్గంలో వెళుతుంది?
ఎ) దీర్ఘవృత్త మార్గం                     బి) సరళరేఖ మార్గం             
సి) పరావలయ మార్గం                డి) అతిపరావలయ మార్గం



72. సోషలిస్ట్‌ ఆర్థికవ్యవస్థ అనుభవంలోని దేశం?
ఎ) యుఎస్‌ఎ                      బి) యుకె              
 సి) ఇండియా                      డి) చైనా



73. జల అణువు బంధకోణం?
ఎ) 1040               బి) 900                   
 సి) 1200              డి) 1800



74. మానవ దేహంలోని ఏ గ్రంథిని మాస్టర్‌ గ్లాండ్‌ అని పేర్కొంటారు?
ఎ) క్లోమం                          బి) థైరాయిడ్‌                  
సి) పిట్యూటరీ                    డి) ప్లీహం



75. మలబార్‌ తీరప్రాంతంలో ప్రధాన ఓడరేవు?
ఎ) చెన్నై                             బి) కొచ్చిన్‌               
 సి) కోల్‌కతా                       డి) టూటికోరిన్‌



76. కింది నగరాల్లో దేనిలో గ్లోబల్‌ ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటైంది?
ఎ) చైన్నై                       బి) హైదరాబాద్‌                      
 సి) పుణె                       డి) గుర్‌గావ్‌


77. IIIT పూర్తి రూపం?
ఎ) ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (Indian Institute of Information Technology) 
బి)ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (International Institute of InformationTechnology)
సి)ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ర్ఫాస్ట్రక్చర్‌ టెక్నాలజీ (Indian Institute of Infrastructure Technology)
డి) పైన పేర్కొన్న వాటిలో ఏదీ కాదు



78. కింది వారిలో ఎవరు అంతర్జాతీయ ద్రవ్యనిధిలో చీఫ్‌ ఎకానమిస్ట్‌గా పనిచేశారు?
ఎ) అశోక్‌ లాహిరి                         బి) సుమంత్రా ఘోశాల్‌             
సి) సౌమిత్రా చౌదరి                     డి) రఘురాం రాజన్‌



79. కింది వాటిలో ఏది హెచ్చు తీపి గల చక్కెర?
ఎ) సుక్రోజ్‌                    బి) గ్లూకోజ్‌                 
 సి) ఫ్రుక్టోజ్‌                  డి) మాల్టోజ్‌



80. గురుత్వాకర్ష సూత్రాన్ని ఎవరు నిర్వచించారు?
ఎ) న్యూటన్‌                 బి) ఆర్కిమెడిస్‌               
సి) గెలిలియో                 డి) ఫారడే



81. 5.5X0.5X50.0X4=
ఎ) 550.0               బి) 1000.100                
సి) 1000.25           డి) పైవాటిలో ఏదీకాదు



82. కింది వాటిలో దేని పేరుకు క్రికెట్‌తో సంబంధం లేదు?
ఎ) ఓల్డ్‌ ట్రాపర్డ్‌                            బి) ఈడెన్‌ గార్డెన్స్‌                    
సి) మెర్డెకా స్టేడియం                   డి) మెల్‌బోర్న్‌



83. మరణానంతరం భారతరత్న అవార్డును పొందిన తొలి వ్యక్తి ఎవరు?
ఎ) లాల్‌ బహదూర్‌శాసి్త్ర                 బి) మోతీలాల్‌ నెహ్రూ               
సి) జవహర్‌లాల్‌ నెహ్రూ                    డి) బాబా సాహెబ్‌ అంబేద్కర్‌



84. ఇందిరా నూయి కింది వాటిలో ఏ పారిశ్రామిక యూనిట్‌కు సంబంధించిన వ్యక్తి?
ఎ) పెప్సీ                                బి) ఏయిర్‌టెల్‌                 
సి) రిలయన్స్‌                        డి) హీరోహోండా



85. బాయల్స్‌ సూత్రం ఏ సందర్భంలో పనిచేస్తుంది?
ఎ) స్థిర పరిమాణం                               బి) స్థిర ఉష్ణోగ్రత               
సి) స్థిర ఉష్ణోగ్రత, పరిమాణం                డి) స్థిర పీడనం, పరిమాణం



86. సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ టెక్నాలజీ ఎక్కడ ఉంది?
ఎ) విశాఖపట్నం                     బి) ముంబై               
 సి) కొచ్చిన్‌                             డి) కోల్‌కతా



87. ‘సాల్‌’ వృక్షాలు ఏ రాష్ట్రంలో కేంద్రీకృతమైనవి?
ఎ) గుజరాత్‌                    బి) అస్సాం            
సి) బీహార్‌                        డి) మధ్యప్రదేశ్‌



88. ఇండియా తూర్పుతీరంలోని చిల్కా, పులికాట్‌ సరస్సులు దేనికి ఉదాహరణలు?
ఎ) తాజా నీటి సరస్సులు                                   బి) ఉప్పు నీటి మడుగులు                 
సి) అంతస్థలీయ ఉప్పునీటి సరస్సులు                డి) మునిగిన సరస్సులు



89. ఒక వ్యోమగామికి వెలుపలి ప్రాంతం ఎలా కనిపిస్తుంది?
ఎ) తెలుపు                            బి) నలుపు                    
 సి) దట్టమైన నీలం                 డి) రక్తవర్ణం



90. ఒక వస్తువు 16ు లాభానికి విక్రయించారు. దానిని మరో రూ.10 హెచ్చుగా విక్రయించి ఉంటే 20ు లభించి ఉండేది. ఆ వస్తువు అసలు ధరను కనుగొనండి?
ఎ) రూ.245                       బి) రూ.250                 
 సి) రూ.330                      డి) రూ.260



91. ఉభయజీవి?
ఎ) బల్లి                 బి) దోమ                 
సి) కప్ప               డి) బొద్దింక



92. మెగస్తనీస్‌ రచించిన పుస్తకం పేరు?
ఎ) అర్థశాస్త్ర                            బి) పంచతంత్ర                 
 సి) ఇండియానా                  డి) ఇండికా



93. అతి కఠినమైన, అతి మెత్తనైన మూలకం ఏది?
ఎ) టిన్‌                                 బి) సల్ఫర్‌                            
సి) ఫాస్పరస్‌                        డి) కార్బన్‌



94. 4009900+3991199+5010101- 1099877-6199879=
ఎ) 12011323                బి) 5711444                    
 సి) 5911444                 డి) 5744411



95. ఒక వ్యక్తి రూ.5కు 3 ఆరంజ్‌ పళ్లను కొని వాటిని రూ.4కు 2వంతున విక్రయించగా అతని లాభం?
ఎ) 10%                  బి) 15%                         
సి) 20%                  డి) 25%



96. 8 1/3 x 20/5 x 2  3/4 x 3/11
ఎ) 23                బి) 24                    
సి) 25                డి) 26



97. మేఘాలయ రాష్ట్ర అధికార భాష?
ఎ) హిందీ                   బి) ఉర్దూ                     
సి) ఇంగ్లీషు                డి) కొంకణి



98. సుమన్‌, సోమూల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 2:1 గా ఉన్నది. 8 సంవత్సరాల క్రితం సుమన్‌ సోమూ కంటే 15 సంవత్సరాలు పెద్ద కాగా సోమూ ప్రస్తుత వయస్సు ఎంత?
ఎ) 15 సంవత్సరాలు                    బి) 30 సంవత్సరాలు                      
సి) 22 సంవత్సరాలు                     డి) పైవాటిలో ఏదీకాదు



99. ‘సంకల్ప్‌’ పథకం దేనితో ముడిపడి ఉన్నది?
ఎ) పోలియో                    బి) ఎయిడ్స్‌, హెచ్‌ఐవి                    
సి) ఎ, బి                       డి) పైన పేర్కొన్నవాటిలో ఏదీకాదు



100.సూక్ష్మ పోషక పదార్థాలు?
ఎ) ఇనుము, కొవ్వు                       బి) మోలిబ్డెనం, ప్రోటీన్లు                         
 సి) కొవ్వులు, విటమిన్లు                డి) ఇనుము, ఫ్లోరిన్‌