రాజ్యాంగం - కేంద్రం - రాష్ట్రం - సంబంధాలు


 

1. భారతదేశంలో కేంద్రం-రాష్ట్రాల మధ్య అధికారాల విభజనకు బీజం వేసిన చట్టం ఏది?
    ఎ) 1909 మింటో మార్లే సంస్కరణ    బి) 1919 మాంటేగ్‌ చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణ    సి) 1935 భారత ప్రభుత్వ చట్టం    డి) 1773 రెగ్యులేటింగ్‌ చట్టం

2. రాష్ట్రాలకు గ్రాంట్లను ఎవరి సూచనల ప్రకారం అందజేస్తారు?
    ఎ) రాష్ట్రపతి             బి) ప్రణాళిక సంఘం    సి) అంతర్‌ రాష్ట్ర మండలి    డి) ఆర్థిక సంఘం

3. కేంద్ర-రాష్ట్రాల మధ్య ఘర్షణను నివారించి సహకారాన్ని పెంపొందించే ఉద్దేశంతో కొన్ని ప్రకరణలు ఏర్పాటు చేశారు. ఈ అధికార సంబంధాలను భారత రాజ్యాంగంలోని 11, 12 భాగాల్లో ఏ ఆర్టికల్స్‌ వివరిస్తాయి?
    ఎ) ఆర్టికల్‌ 245 నుంచి 255 వరకు     బి) ఆర్టికల్‌ 245 నుంచి 300(ఎ) వరకు    సి) ఆర్టికల్‌ 263 నుంచి 300 వరకు    సి) ఆర్టికల్‌ 256 నుంచి 263 వరకు

4. కేంద్ర జాబితాలో ప్రస్తుతం ఎన్ని అంశాలున్నాయి?
    ఎ) 96      బి) 98      సి) 97      డి) 99

5. రాష్ట్రజాబితాలో గల అంశాలు ఎన్ని?
    ఎ) 61      బి) 67      సి) 66      డి) 52

6. ఉమ్మడి జాబితాలో ప్రస్తుతం ఎన్ని అంశాలున్నాయి?
    ఎ) 50      బి) 51      సి) 52      డి) 53

7. రాష్ట్ర జాబితాకు సంబంధించి కింది వాటిలో ఏది నిజం?
    ఎ) రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఈ జాబితా వర్తించదు    బి) రాష్ట్ర భౌగోళిక పరిధిలో నివసించే ప్రజలందరికీ ఈ జాబితా వర్తిస్తుంది
    సి) ‘ఎ’ తప్పు, ‘బి’ నిజం   డి) ‘ఎ, బి’ రెండూ నిజం

8. జనాభా లెక్కలు ఏ జాబితాలోనివి?
    ఎ) రాష్ట్ర జాబితా             బి) కేంద్ర జాబితా    సి) ఉమ్మడి జాబితా             డి) అవశిష్టాధికారాలు

9. రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలపై పన్నులు విధించే అధికారం ఎవరికి ఉంది?
    ఎ) కేంద్రానికి             బి) రాష్ట్రాలకు    సి) రాష్ట్రాలు & కేంద్రానికి     డి) సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం

10. విద్యుత్తు, వార్తాపత్రికలు, పుస్తక ముద్రణ ఏ జాబితాలోని అంశాలు?    
    ఎ) రాష్ట్ర జాబితా              బి) ఉమ్మడి జాబితా    సి) కేంద్ర జాబితా         డి) అవశిష్ట అధికారాలు

11. కేంద్రం-రాష్ట్రాల మధ్యగల శాసన సంబంధాలను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్‌ తెలియజేస్తాయి?
    ఎ) 245 నుంచి 255 వరకు గల ఆర్టికల్స్‌    బి) 256 నుంచి 263 వరకు గల ఆర్టికల్స్‌    సి) 263 నుంచి 300(ఎ) వరకు గల ఆర్టికల్స్‌      డి) ఇవేవీ కాదు

12. కేంద్ర-రాష్ట్రాల మధ్యగల పరిపాలన సంబంధాలను భారత రాజ్యాంగంలోని ఏ అధికరణలు తెలియజేస్తాయి?
    ఎ) 245 నుంచి 255 వరకు గల ఆర్టికల్స్‌    బి) 263 నుంచి 300(ఎ) వరకు గల ఆర్టికల్స్‌    సి) 256 నుంచి 263 వరకు గల ఆర్టికల్స్‌    డి) ఇవేవీ కాదు

13. భారత రాజ్యాంగంలోని 263 నుంచి 300(ఎ) వరకు గల ఆర్టికల్స్‌ వేటిని తెలియజేస్తాయి?
    ఎ) కేంద్ర రాష్ట్రాల మధ్యగల శాసన సంబంధాలు      బి) కేంద్ర అవశిష్ట అధికారాలు    సి) విదేశాలతో కుదుర్చుకునే ఒప్పందం అమలు విషయాలు    డి) కేంద్ర-రాష్ట్రాల మధ్యగల ఆర్థిక సంబంధాలు

14. సాధారణ పరిస్థితుల్లో ఉమ్మడి జాబితాలో పేర్కొన్న అంశాల నిర్వహణపై వచ్చే ఆదాయం ఎవరికి చెందుతుంది?
     ఎ) రాష్ట్రాలకు    బి) కేంద్ర-రాష్ట్రాలకు ఉమ్మడిగా     సి) కేవలం కేంద్రానికి మాత్రమే      డి) ఇవేవీ కాదు

15. కింది వాటిలో భిన్నమైనది ఏది?
     ఎ) ఎం.సి సెతల్వాడ్‌ కమిటి     బి) రాజమన్నార్‌ కమిటి     సి) సర్కారియా కమిషన్‌      డి) మదన్‌ మోహన్‌ పూంచి కమిషన్‌

16. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 280 ఆర్థిక సంఘం నిర్మాణం, నిర్వహణ, అధికారాలు, విధుల గురించి వివరిస్తుంది. ఆర్థిక సంఘం గురించి కింది వాటిలో ఏది సరైనది?
     ఎ) ఆర్టికల్‌ 280 ప్రకారం భారత రాష్ట్రపతి ప్రతి 5 సంవత్సరాలు లేదా అంతకు ముందే ఆర్థిక సంఘాన్ని నియమిస్తాడు    బి) ఆర్థిక సంఘంలో చైర్మన్‌, నలుగురు సభ్యులుంటారు
     సి) ఆర్థిక సంఘం చైర్మన్‌, సభ్యుల నియామకం, అర్హతలు, వారిని ఎంపిక చేసే ప్రక్రియల గురించి పార్లమెంటుకు తీర్మానం చేసే అధికారం ఉంది   డి) ఇవన్నీ నిజమైనవి

17. భారతదేశంలో మొదటి ఆర్థిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
    ఎ) 1951    బి) 1955    సి) 1956   డి) 1950

18. భారతదేశ ఆర్థిక సంఘం మొదటి చైర్మన్‌ ఎవరు?
    ఎ) జి.వి మౌలంకర్‌        బి) కె.సి నియోగి     సి) కె.ఎస్‌ సంతానం    డి) ఎ.కె చాందా

19. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని, ఆర్టికల్‌ 360 ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అమలుపరచలేదు?
    ఎ) అరుణాచల్‌ ప్రదేశ్‌    బి) సిక్కిం    సి) జమ్మూ కాశ్మీర్‌        డి) ఢిల్లీ

20. అవశిష్ట అధికారాలు, ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర ప్రభుత్వ అధికారం ఏ రాష్ట్రంలో చెల్లదు?
    ఎ) జమ్ము కశ్మీర్‌           బి) నాగాలాండ్‌    సి) సిక్కిం           డి) అరుణాచల్‌ ప్రదేశ్‌

21.  జమ్ము కశ్మీర్‌ రాష్ట్ర శాసనసభకు సంబంధించిన వాటిలో ఏది నిజం?
    ఎ) జమ్మూ కాశ్మీర్‌ శాసనసభ సభ్యుల సంఖ్య 100, శాసనమండలి సభ్యుల సంఖ్య 36    బి) జమ్మూ కాశ్మీర్‌ శాసనసభలో పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ నుంచి 24 శాసనసభ స్థానాలున్నాయి
    సి) పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ భూభాగం విలీనమయ్యే  వరకు ఆ ప్రాంతంలోని 24 శాసనసభ స్థానాలు జమ్మూ కాశ్మీర్‌ శాసనసభలో ఖాళీగానే ఉంటాయి    డి) ఇవన్నీ నిజం

22. రాష్ట్ర జాబితాలోని అడవులు, ఉన్నత విద్యను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలో చేర్చారు?
    ఎ) 44      బి) 42      సి) 46      డి) 48

23. అంతర్‌ రాష్ట్ర మండలికి సంబంధించి కింది వాటిలో ఏది నిజం?
    ఎ) 1990 ఏప్రిల్‌లో ఆర్టికల్‌ 263 ప్రకారం ప్రధాని అధ్యక్షతన ఆరుగురు కేంద్ర క్యాబినెట్‌ మంత్రులు సభ్యులుగా, అన్ని రాషా్ట్రల ముఖ్యమంత్రులతో కలిపి అంతర్‌ రాష్ట్రమండలిని ఏర్పాటు చేశారు
    బి) హోం మంత్రి అధ్యక్షతన ఒక స్థాయి సంఘం ఏర్పడింది       సి) అంతర్‌రాష్ట్ర మండలి, ఒక సర్వసాధారణ సభను ఒక స్థాయీ సంఘాన్ని కలిగి ఉంటుంది    డి) ఇవన్నీ నిజం

24. కస్టమ్స్‌, కంపెనీల మూలధనంపై పన్ను, ఆదాయం పన్నుపై సర్‌ఛార్జీకి సంబంధించి కింది వాటిలో ఏది నిజం?
    ఎ) రాష్ట్రప్రభుత్వానికే హక్కులు ఉన్న పన్నులు   బి) కేంద్రం విధించే పన్నులు రాషా్ట్రలు వసూలు చేయడం   సి) కేంద్రం విధించే కేంద్రానికే చెందే పన్నులు  డి) కేంద్రం-రాష్ట్రాల మధ్య విభజనయ్యే పన్నులు

25. రాష్ట్రాలు వసూలు చేసుకునే, కేంద్రం విధించే పన్ను ఏది?
    ఎ) స్టాంప్‌ సుంకాలు    బి) వార్తా పత్రికల్లో  ప్రకటనలపై పన్ను    సి) ఎస్టేట్‌ డ్యూటీ        డి) వినోద పన్ను

26. నీటిపారుదలకు సంబంధించి ‘జాతీయ గ్రిడ్‌’ను ఎవరు ప్రతిపాదించారు?
    ఎ) వాజపేయి             బి) విద్యాసాగర్‌ రావు    సి) కెప్టెన్‌ దస్తూరి             డి) కె.ఎల్‌ రావు

27. అంతర్‌ రాష్ట్ర జల వివాద చట్టాన్ని పార్లమెంటు ఎప్పుడు చేసింది?
    ఎ) 1954    బి) 1956    సి) 1968    డి) 1969

28. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించిన ‘స్వచ్ఛ భారత్‌ అభియాన్‌’ పారిశుద్ధ్య కార్యక్రమం కింది వాటిలో ఏ జాబితాకు సంబంధించినది?
    ఎ) కేంద్ర జాబితా             బి) రాష్ట్ర జాబితా    సి) ఉమ్మడి జాబితా             డి) అవశిష్టాధికారాలు

29. అంతర్‌ రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కారానికి సంబంధించి కింది వాటిలో ఏది నిజం?
    ఎ) ఆర్టికల్‌ 262(1) ప్రకారం అంతర్‌ రాష్ట్ర నదీ జలాల పరిష్కారానికి అనువైన యంత్రాంగాన్ని  చట్టం ద్వారా పార్లమెంట్‌ ఏర్పాటు చేస్తుంది  
    బి) ఆర్టికల్‌ 262(2) ప్రకారం అంతర్‌ రాష్ట్ర నదీ జలాల విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు లేదా మరే కోర్టు కూడా పార్లమెంటుకు గల అధికారాన్ని ప్రశ్నించలేవు  
    సి) ఎ, బి  రెండూ నిజం   డి) ‘ఎ’ నిజం ‘బి’ తప్పు

30. భారతదేశంలోని ప్రాంతీయ మండళ్లు ఎన్ని?
    ఎ) 5        బి) 6        సి) 4        డి) 8

31. కేంద్రం-రాష్ట్రాల సంబంధాలపై వేసిన కమిటీలు  మొదటి నుంచి ఇప్పటివరకు వరుసగా కింది వాటిలో ఏవి?
    ఎ) రాజమన్నార్‌ కమిషన్‌, సెతల్వాడ్‌ కమిటి, సర్కారియా కమిటి, మదన్‌మోహన్‌ పూంచి కమిటి    బి) సర్కారియా, రాజమన్నార్‌, సెతల్వాడ్‌, మదన్‌మోహన్‌ పూంచి
    సి) సెతల్వాడ్‌, రాజమన్నార్‌, సర్కారియా, మదన్‌మోహన్‌ పూంచి     డి) మదన్‌మోహన్‌ పూంచి, రాజమన్నార్‌, సెతల్వాడ్‌, సర్కారియా

32. సర్కారియా కమిషన్‌ను ఏ ప్రధాన మంత్రి కాలంలో ఏర్పాటు చేశారు?
    ఎ) మురార్జీ దేశాయి    బి) రాజీవ్‌గాంధీ    సి) వి.పి సింగ్‌        డి) ఇందిరాగాంధీ

33. జమ్మూ కాశ్మీర్‌ రాజ్యాంగ పరిషత్‌, భారతదేశంలో ఎప్పుడు విలీనం అయ్యింది?
    ఎ) 1954    బి) 1952    సి) 1950    డి) 1948

34. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌1(1) భారతదేశాన్ని ‘యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ అని ప్రకటించింది. ‘యూనియన్‌’ అనే పదాన్ని ఎక్కడ నుంచి గ్రహించారు?
    ఎ) దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి    బి) ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి    సి) అమెరికా రాజ్యాంగం నుంచి     డి) నార్త్‌ బ్రిటీష్‌ అమెరికన్‌ చట్టం 1867 నుంచి

35. ప్రణాళిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
    ఎ) 1948      బి) 1954      సి) 1950       డి) 1952

36. శాశ్వత అంతర్‌ రాష్ట్ర మండలిని సిఫార్సు చేసిన కమిటి ఏది?
    ఎ) సెతల్వాడ్‌        బి) రాజమన్నార్‌    సి) మదన్‌మోహన్‌పూంచి    డి ) సర్కారియా


37. ఈశాన్య రాష్ట్రాల కోసం ఈశాన్య మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
    ఎ) 1971    బి) 1972    సి) 1973    డి) 1974

38. రాజ్యాంగం ప్రకారం కేంద్రం ఎన్ని అంశాలపై పన్నులను విధించగలదు?
    ఎ) 19      బి) 5      సి) 12      డి) 17

39. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు ఎన్ని రకాల ఆదాయ మార్గాలున్నాయి?
    ఎ) 12      బి) 19      సి) 17      డి) 5

40. కేంద్రం నుంచి రాష్ట్రాలకు ప్రణాళిక సహాయం గాడ్గిల్‌ ప్రణాళిక ఆధారంగా బదిలీ అవుతుంది. దీనిని 1971లో మొదటిసారిగా ఆమోదించారు. తరవాత దీన్ని మళ్లీ ఎప్పుడు ఆమోదించారు?
    ఎ) 1981, 1991        బి) 1991, 2001    సి) 2001, 2011        డి) 1981, 1989

41. అంతర్‌ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని కోరిన తొలి రాష్ట్రం ఏది?
    ఎ) కర్ణాటక        బి) ఆంధ్రప్రదేశ్‌    సి) తెలంగాణ        డి) కేరళ

42. 1969లో ఏ రెండు నదీ జాలలకు సంబంధించి ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేశారు?
    ఎ) కృష్ణా-గోదావరి       బి) కృష్ణా-కావేరి    సి) కావేరీ-గోదావరి       డి) ఇవేవీ కాదు

43. కేంద్ర అధికారాల్లో గల ‘అవశిష్ట అధికారాలు’ అనే భావనను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
    ఎ) వైమూర్‌        బి) దక్షిణాఫ్రికా    సి) అమెరికా        డి) కెనడా

44. దక్షిణ భారత ప్రాంతీయ మండలి కార్యాలయం ఎక్కడ ఉంది?
    ఎ) హైదరాబాద్‌        బి) చెన్నై    సి) బెంగళూరు        డి) పాండిచ్చేరి

45. కేంద్రం-రాష్ట్రాల మధ్య పరిపాలన సంస్కరణల కోసం (ఎఆర్‌సి) కేంద్ర ప్రభుత్వం 1966లో ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల బృందానికి నేతృత్వం వహించిందెవరు?
    ఎ) లాల్‌బహుదూర్‌ శాస్త్రి   బి) బ్రహ్మానందరెడ్డి    సి) సత్యనారాయణ రావు    డి) మురార్జీదేశాయి

46. సర్కారియా కమిషన్‌ తన నివేదికను ఏ ప్రధాన మంత్రి కాలంలో సమర్పించింది?
    ఎ) ఇందిరా గాంధీ          బి) మురార్జీదేశాయి
    సి) రాజీవ్‌ గాంధీ          డి) పి.వి నరసింహారావు

47. మొదట స్వయం ప్రతిపత్తి గల రాషా్ట్రలుగా ఉండి, తరవాత పూర్తిస్థాయి రాషా్ట్రలుగా మారినవి ఏవి?
    ఎ) అస్సాం-బీహార్‌           బి) నాగాలాండ్‌-అస్సాం    సి) మేఘాలయ - సిక్కిం       డి) సిక్కిం - జమ్ము కశ్మీర్‌