ఏపీ టెట్ క‌మ్ టీఆర్‌టీ కొత్త ప‌రీక్షా విధానం


ఏపీ టెట్ క‌మ్ టీఆర్‌టీ కొత్త ప‌రీక్షా విధానం
 
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో 9061 ఉపాధ్యాయ పోస్టుల భ‌ర్తీకి పాఠ‌శాల విద్యాశాఖ‌ న‌వంబ‌రు 21న నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. తాజా ప్రకటన ద్వారా 1849 స్కూల్ అసిస్టెంట్స్, 812 లాంగ్వేజ్‌ పండిట్స్, 156 వ్యాయామ విద్య ఉపాధ్యాయులు (పీఈటీ), 6244 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామక రాత పరీక్షలను 2015 మే 9, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు. టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ క‌మ్ టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టెట్ కమ్ టీఆర్‌టీ) పేరుతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటివరకు ఉపాధ్యాయ నియామక పరీక్షను డీఎస్సీగా వ్యవహరించేవారు. ఇకపై ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రత్యేకంగా ఉండదని, టెట్ కమ్ టీఆర్‌టీలోనే అంతర్భాగంగా ఉంటుందని మంత్రి చెప్పారు. అభ్యర్థుల అవగాహన కోసం మారిన పరీక్షా విధానాన్ని అందిస్తున్నాం. దీనికి అనుగుణంగా తమ సన్నద్ధతను మెరుగుపరచుకోవచ్చు.
AP TET cum TRT-2014 Notification
» సెకండ‌రీ గ్రేడ్ టీచ‌ర్ (ఎస్‌జీటీ)
» లాంగ్వేజ్ పండిట్స్ (తెలుగు/ ఉర్దూ/ హిందీ/ త‌మిళం/ ఒరియా/ కన్నడ)
» ఫిజికల్ ఎడ్యుకేష‌న్ టీచ‌ర్ (పీఈటీ)
» స్కూల్ అసిస్టెంట్స్ - మ్యాథ‌మెటిక్స్‌
» స్కూల్ అసిస్టెంట్స్ - ఫిజిక‌ల్ సైన్స్
» స్కూల్ అసిస్టెంట్స్ - బ‌యోలాజిక‌ల్ సైన్స్‌
» స్కూల్ అసిస్టెంట్స్ - సోష‌ల్ స్టడీస్‌
» స్కూల్ అసిస్టెంట్స్ (లాంగ్వేజెస్‌)
» స్కూల్ అసిస్టెంట్స్ - ఇంగ్లిష్‌
» స్కూల్ అసిస్టెంట్స్ - ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్‌