సైన్స్ & టెక్ ప్రాక్టిస్ బిట్స్ - 29-10-14


1. మోనోజైట్‌ నుంచి ఏది లభిస్తుంది?
 - థోరియం

2. గార్నెట్‌ ఇసుక ఏ రాష్ట్రంలో లభిస్తుంది?
- తమిళనాడు

3. ఏషియాటిక్‌ సొసైటీ ఫౌండర్‌ ఎవరు?
- విలియం జోన్స్‌

4. కోల్‌కత్తాలో ‘ఇండియన్‌ మ్యూజియం’ ఎప్పుడు ప్రారంభమైంది?
 - 1814 ఫిబ్రవరి 2న

5. ELISAను విస్తరించండి
- ఎంజైమ్‌ లింక్‌డ్‌ ఇమ్యూనో సార్బెంట్‌ ఎస్సే

6. RT-PCRను విస్తరించండి
 - రివర్స్‌ టాన్స్‌క్రిప్టేజ్‌ పాలిమెరేస్‌ ఛైన్‌ రియాక్షన్‌

7. పశువులు, ఆవులు, గేదెల రూమినెంట్‌లో ఎన్ని కంపార్ట్‌మెంట్‌లు ఉంటాయి?
- 3

8. రూమినెంట్‌లో మైక్రోబ్‌లు పులియబెట్టే ప్రక్రియను ఎక్కడ జరుపుతాయి?
- రెటిక్యులా- రూమెన్‌

9. రూమినెంట్స్‌ - కాంప్లెక్స్‌లో గ్లాండ్యులార్‌ భాగం ఏది?
 - ఎబోమాసం

10. పోలియోమైలిటెస్‌ దేనిని వ్యాప్తి చెందిస్తుంది?
 - పోలియో వ్యాధిని

11. SARS దేని వల్ల వస్తుంది
 - కొరోనావైరస్‌

12. ఇన్‌ఫ్లుయెంజాలోని ఉప వైరస్‌లు ఏవి?
- H1N1, H1N2, H2,N1, H3N1, H3N2, H2N3

13. స్వైన్‌ఫ్లూ దేని వల్ల వ్యాప్తి చెందుతుంది?
 - పందులు

14. పోలియో వైరస్‌ ఎటువంటి వైరస్‌
 - RNA వైరస్‌

15. పోలియో వాక్సిన్‌ను మొదటగా హిల్లరీ కోప్రొస్కీ తయారు చేశాడు.  1952లో సాల్క్‌ వాక్సిన్‌ను ఎవరు తయారు చేశారు?
 - జోనాస్‌ సాల్క్‌

16. ఓరల్‌ పోలియో వాక్సిన్‌ను ఎవరు తయారు చేశారు?
 - సాబిన్‌ ఎట్‌ఎల్‌

17. 1909లో ట్రావెన్‌కోర్‌(కేరళ)లో ఎవరు మోనోజైట్‌ డిపాజిట్స్‌ను కనుగొన్నారు?
 - షోంబెర్గ్‌(జర్మనీ)

18. కాంపౌండ్‌ మైక్రోస్కోప్‌ను ఎవరు తయారుచేశారు?
- హాన్స్‌ జాన్‌సెన్‌, జకారియాస్‌ జాన్‌సెన్‌

19. ఎలకా్ట్రన్‌ మైక్రోస్కోప్‌(1932)ను కనుగొన్నది ఎవరు?
 - ఎమ్‌.కోల్‌, ఇ. రుస్కా(ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌ల్లో రెండు రకాలున్నాయి. అవి ట్రాన్స్‌మిషన్‌ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌, స్కానింగ్‌ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్స్‌)

20. మైక్రోస్కోపియా పదాన్ని ఎవరు ప్రవేశపెట్టారు?
 - గెలీలియోగెలీలీ(1605-1614)

21. కారియోలజీ దేనిని అధ్యయనం చేస్తుంది?
- జీవకణ కేంద్రకాన్ని

22. గాల్జి కాంప్లెక్స్‌ను కనుగొన్నదెవరు?
 - కామిల్లో గాల్జి(1898)

23. ఎండోప్లాస్మిక్‌ రెటిక్యులాన్ని ఎవరు కనుగొన్నారు?
 - కె.ఆర్‌. పొర్టర్‌(1948)

24. క్లొరోప్లాస్ట్‌ పేరు పెట్టింది ఎవరు?
 - షింపర్‌(1883)

25. గ్రామ్‌ నెగెటివ్‌ బాక్టీరియాకి ఉదాహరణ ఏమిటి?
 - ఇ.కోలి, సాల్మొనెల్లా, వైబ్రియోకొలెరా

26. గ్రామ్‌ పాజిటివ్‌ బాక్టీరియాకి ఉదాహరణ ఏమిటి?
- సె్ట్రప్టోమైసెస్‌, యాక్టినోమైసెస్‌

27. ఆక్సిజన్‌వల్ల చనిపోయే ఆర్కి బాక్టీరియా ఏది?
- మెథనోజెన్స్‌. ఇది తన జీవ ప్రక్రియలతో మీథేన్‌ వాయువును ఉత్పత్తి చేస్తుంది. నీరు నిల్వ ఉండే చోట, పాడుబడిన బావుల్లో ఇది జీవిస్తుంది.

28. థర్మోఎసిడోఫైల్స్‌ అనే ఆర్కీ బాక్టీరియా ఎక్కడ పెరుగుతుంది?
 - ఉష్ణ గుండాలలో. ఇది ఏ2ఖి ని ఉపయోగించుకొని శక్తి పొందుతుంది.

29. గ్రేట్‌ సాల్ట్‌ లేక్‌(సరస్సు), డెడ్‌సీ(సముద్రం)లో పెరిగే ఆర్కీ బాక్టీరియా ఏది?
 - హాలోఫైల్స్‌

30. క్రోమోజోమ్‌లకు రంగు రావడానికి దేనిని ఉపయోగిస్తారు?
 - ఎసిటో కార్మైన్‌

31. జీవకణాల సైజును దేనిలో తెలియజేస్తారు?
- మైక్రోమీటర్లలో(మైక్రాన్స్‌).
1 మీటర్‌= 1000 మిల్లీ మీటర్లు
1 మిల్లీమీటర్‌= 1000 మైక్రోమీటర్లు
1 మైక్రోమీటర్‌= 1000 నానోమీటర్లు
1 నానోమీటర్‌= 1000 పికోమీటర్లు

32. కణకేంద్రకం లేనివి ఏవి?
 - మానవుల్లోని ఎర్ర రక్త కణాలు, సేవ్‌ ట్యూబ్‌సెల్స్‌(జీవకణాలు)

33. వైరాయిడ్స్‌ని కనుగొన్నది ఎవరు?
- డైనర్‌(వీటివల్ల పొటాటొ స్పిండిల్‌ ట్యూబర్‌ డిసీజ్‌ వస్తుంది)

34. మానవుల కడుపులో జీవకణాలు ఎన్ని రోజులు బ్రతుకుతాయి?
- 2

35. మానవుల చర్మ జీవకణాలు ఎన్ని రోజులు జీవించి ఉంటాయి?
 - 20 నుంచి 35 రోజులు

36. మానవుల ఎర్ర రక్తకణాలు ఎన్ని రోజులు జీవించి ఉంటాయి?
 - 120 రోజులు

37. Omnis Cellula e cellula అంటే ఏమిటి?
 -ముందుగా ఉన్న జీవకణాలనుంచి కొత్త జీవకణాలు పుట్టడం

38. లూయీ పాశ్చర్‌ (1822-1895) ఏ దేశస్థుడు?
- ఫ్రెంచ్‌

39. రుడాల్ఫ్‌ విర్‌భౌ(1821-1902) ఏ దేశస్థుడు?
- జర్మనీ

40. ఓజోన్‌ పొర తగ్గిపోవడం వలన వచ్చే నష్టాలేమిటి?
- వర్షాలు పడకపోవడం, రేడియోషన్‌ పెరగడం, కేన్సర్‌ రావడం, నీళ్లలో పెరిగే జీవులు అంతరించడం, గ్రీన్‌ హౌస్‌ ఎఫెక్ట్‌ పెరగడం, చేపలు తగ్గిపోవడం

41. హెపటైటిస్‌ని కలిగించే వైరస్‌లు ఏవి?
 - HAV, HBV, HCV(NANB), HDV, HEV

42. డెంగీ ఫీవర్‌ దేనివల్ల వస్తుంది?
 - ఆర్బో వైరస్‌(ఈడిస్‌ ఈజిప్టి దొమ కాటువల్ల వ్యాపిస్తుంది)

43. గవద బిళ్లలు దేనివల్ల వస్తాయి?
- పారామైక్సోవైరస్‌ లేదా మైక్సో వైరస్‌ పారోటిడిస్‌

44. MMR వేక్సిన్‌’లో MMRని విస్తరించండి
- మీజిల్స్‌, మంప్స్‌, రూబెల్లా(జర్మన్‌ మీజిల్స్‌)

45. చికెన్‌పాక్స్‌ దేనివల్ల వస్తుంది?
 - వెరిసెల్లా జోస్టర్‌ వైరస్‌

46. స్మాల్‌పాక్స్‌ దేనివల్ల వస్తుంది?
 - వేరియోలా వైరస్‌

47. మైటోఖాండ్రియా పేరు పెట్టింది ఎవరు?
 - సి.బెండా(1897) (దీనిని ఫ్లెమింగ్‌ ్క్ష ఆల్ట్‌మాన్‌ కనుగొన్నాడు)

48. లైసోసోంను కనుగొన్నది ఎవరు?
 - సి.డువే(1955)

49. పెరాక్సీసోంలను కనుగొన్నది ఎవరు?
 - టోల్‌బర్ట్‌(1969)

50. కాలం ఓజోన్‌ స్థాయిని ఏ యూనిట్‌లో కొలుస్తారు?
 - డాబ్సన్‌ యూనిట్‌(డియు)

51. క్లోరోప్లూరో కార్బన్‌లు వేటిలో ఉంటాయి?
- 1. ప్రొపెల్లెంట్స్‌ ఉండే ఎరోసల్‌ కాన్లలో
2. ఎయిర్‌ కండిషనర్‌ కూలెంట్‌ల్లో
3. రిఫ్రిజిరేటర్‌ కూలెంట్‌ల్లో(ఫ్రియాన్‌)
4. స్టైరోఫోం ఇన్‌స్యులేషన్‌/పాకేజింగ్‌ల్లో
5. మెడికల్‌ స్టెరిలైజర్లలో

52. ఓజోన్‌పొరకి హాని కల్గించేవి ఏవి?
 - క్లోరోఫ్లోరో కార్బన్‌లు, హాలన్స్‌, మిథైల్‌ బ్రోమైడ్‌, మిథైల్‌ క్లోరోఫారం, కార్బన్‌ టెట్రా క్లోరైడ్‌

53. జీర్ణ ప్రక్రియకు సంబంధించి ఏ అంశంలో, గేదెలు/ బర్రెలకు ఇతర పశువుల కన్నా ఎక్కువ సామర్థ్యం ఉంటుంది?
- మొక్కల పీచు పదార్థాన్ని జీర్ణం చేసుకోవడంలో

54. రెటిక్యులో- రూమెన్‌లో బాక్టీరియా, ప్రోటోజోవాతోపాటు ఏమి ఉంటాయి?
 - ఫంగి, ఆర్కీ, బాక్టీరియో ఫేజెస్‌

55. రూమెన్‌ మైక్రోబియల్‌ కన్సార్షియం వేటిని సింథసైజ్‌ చేస్తుంది?
 - అమినోయాసిడ్లు, బి విటమిన్లు

56. రూమెన్‌ వీడ్‌ అని దేనిని అంటారు?
 - సె్ట్రప్టోకాకస్‌ బోవిస్‌

57. మేకలు ఆహారం తినడం ఎటువంటిది? 
- బ్రౌజింగ్‌

58. రూమినెంట్‌  కడుపు నుంచి విడుదలయ్యే గ్రీన్‌హౌస్‌ వాయువులేవి?
- కార్బన్‌డయాక్సైడ్‌, మీథేన్‌

59. రూమినెంట్స్‌ వేటిని నైట్రోజన్‌ సోర్స్‌గా ఉపయోగించుకొంటాయి?
- యూరియా

60. రూమెన్‌లోని కార్బోహైడ్రేట్‌లు పులియబెట్టే ప్రక్రియతరవాత ఎలా మారతాయి? 
- వాలటైల్‌ ఫ్యాటియాసిడ్స్‌

61. పశువుల్లో సాధారణ బ్లడ్‌ సుగర్‌ స్థాయి ఎంత?
 - 40 నుంచి 60 ఎంజి  శాతం

62. రూమినెంట్స్‌, గ్లూకోజ్‌ను కొవ్వుగా మార్చుకోలేవు. ఎందుకు?
 -  ATP సిట్రేట్‌ లైయేజ్‌ & NADP మాలేట్‌ డి హైడ్రోజినేజ్‌ ఎంజైమ్‌లు లేకపోవడంచేత

63. రూమెన్‌లో డైటరీ ఫ్యాట్స్‌ ఏమవుతాయి?
 - బయో డిహైడ్రోజినేషన్‌

64. పశువుల్లో ఏది అసాధారణం?
- మలబద్దకం

65. ఆవుపాలల్లో సహజంగా లభించే యాంటి-కార్సినో జెనిక్‌ ఫ్యాటి ఆమ్లం ఏది?
 - కంజుగేటెడ్‌ లినోలిక్‌ ఆమ్లం

66. కాల్వింగ్‌ తరవాత ఆవుల్లో సహజంగా వచ్చే వ్యాధి ఏది?
- మిల్క్‌ ఫీవర్‌

67. పశువుల మూత్రంలో ఉండే ప్రధాన ప్యూరిన్‌ డెరివేటివ్‌ ఏది?
 - అలాన్‌టోయిన్‌

68. దూడల్లో భాస్వరం లోపిస్తే ఏ లక్షణం కనిపిస్తుంది?
- దూడలు మట్టి తింటాయి

69. ఆవు పేడలో ఉండే బి విటమిన్‌ ఏది?
 - సయానో కోబాలమైన్‌

70. మిల్కీ టెటానీ అంటే ఏమిటి?
 - పాలు తాగే దూడల్లో కనిపించే లక్షణం

71. తక్కువ సమయంలో ఎక్కువ గింజలు తినే రూమినెంట్‌ల్లో ఏమి వస్తుంది?
- ఎసిడోసిస్‌

72. లెగూమ్‌ ఆకులు ఎక్కువగా తినే పశువుల్లో ఏమి వస్తుంది?
 - బ్లోట్‌

73. దుర్గ అనే టెస్ట్‌ట్యూబ్‌ బేబీని కోల్‌కత్తాలో సృష్టించిన శాస్త్రవేత్త ఎవరు?
- సుభాష్‌ ముఖోపాధ్యాయ్‌

74. 1974, 1998 న్యూక్లియర్‌ టెస్ట్‌ల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఎవరు?
- శ్రీ కుమార్‌ బెనర్జీ

75. పెప్టయిడ్‌ నిర్మాణాన్ని పరిశీలించేందుకు  రామచంద్రన్‌ ప్లాట్‌ను సృష్టించింది ఎవరు?
- గోపాలసముద్రం నారాయణ అయ్యర్‌

76. భారత గ్రీన్‌ రివల్యూషన్‌ పితామహుడు, వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ గ్రహీత ఎవరు?
- ఎమ్‌ఎస్‌ స్వామినాథన్‌

77. క్రిష్ణస్వామి కస్తూరి రంగన్‌ ఎక్కడ పనిచేశారు?
- ఇస్రో చైర్మన్‌

78. కోల్‌కత్తాలో ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించింది ఎవరు?
- పి.సి. మహాలనోబిస్‌

79. రసాయనిక, భౌతిక పరిస్థితులను  నక్షత్రాల్లో విశదీకరించింది ఎవరు?
- మేఘ్‌నాధ్‌ సాహా

80. CSIR వ్యవస్థాపక డైరెక్టర్‌ ఎవరు?
- ఎస్‌.ఎస్‌ భాట్‌ నగర్‌

81. ఆధునిక భారతదేశంలో రసాయనిక శాస్త్ర పితామహుడు ఎవరు?
- ప్రఫుల్ల చంద్ర రే

82. భారతదేశ అంతరిక్ష కార్యక్రమాల పితామహుడు ఎవరు?
- విక్రం అంబాలాల్‌ సారాభాయ్‌

83. బ్రహ్మ సమాజానికి ఒరిజినల్‌ థింకర్‌ ఎవరు?
- బ్రజేంద్ర నాధ్‌సీల్‌

84. పేలియో బొటానికల్‌ రీసెర్చ్‌ పితామహుడు ఎవరు?
 - పి. మహేశ్వరి

85. భారత బయాలజీ పితామహుడు ఎవరు?
- ఎస్‌.ఆర్‌ కాశ్యప్‌

86. ఇ - మెయిల్ను సృష్టించిన భారతీయుడు ఎవరు?
 - శివ అయ్యదురై

87. యునెస్కో కళింగ ప్రైజును అందుకొన్నది ఎవరు?
 - జగ్‌జిత్‌ సింగ్‌

88. రేడియో, మైక్రోఆప్టిక్స్‌ సృష్టికర్త ఎవరు?
  - జెసి.బోస్‌

89. ఘరియల్స్‌(మొసళ్లు) ఏ నదిలో ఉంటాయి?
 - చంబల్‌

90. మొగ్లిలాండ్‌ అని దేనిని అంటారు?
 - పెంచ్‌ నేషనల్‌ పార్క్‌(మధ్యప్రదేశ్‌)

91. కజిరంగ నేషనల్‌ పార్క్‌ ఎక్కడ ఉంది?
 - అస్సాం

92. సాంగై(లేళ్లు) ఏ సరస్సు దగ్గర ఉంటాయి?
 - లోక్‌తక్‌ సరస్సు

93. సైలెంట్‌ లోయలో ఏమి ఉంటాయి?
- సింహం తోక ఉన్న మకాక్‌ కోతులు

94. హూలాక్‌ గిబ్బన్‌లు ఎక్కడ ఉంటాయి?
- బ్రహ్మపుత్రలోయ దక్షిణభాగంలో ్క్ష ది బాంగ్‌ నది తూర్పు భాగంలో

95. రెడ్‌ పాండా ఎక్కడ ఉంటుంది?
 - తూర్పు హిమాలయాల్లో

96. సిరాయ్‌లిల్లీ ఏ రాష్ట్ర పుష్పం?
- మణిపూర్‌

97. ఈక్వస్‌ హెమియోనస్‌ఖుర్‌(అడవి గాడిదలు)ఏ రాష్ట్రంలో ఉంటాయి?
 - లిటిల్‌ రాన్‌ ఆఫ్‌ కచ్‌, గుజరాత్‌

98. షోలాస్‌ ఎక్కడ ఉంటాయి?
  - దక్షిణ భారతదేశంలో

99. వేలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ ఎక్కడ ఉంది?
 - ఉత్తరాఖండ్‌

100. నీలగిరి తాహర్‌ ఎక్కడ ఉంది?
 - తమిళనాడు
101. కునో వైల్డ్‌ లైఫ్‌ శాంక్చురి/పాల్‌పూర్‌ -కునో వైల్డ్‌ లైఫ్‌ శాంక్చురి ఎక్కడ ఉంది?
- మధ్యప్రదేశ్‌

102. గుజరాత్‌లోని గిర్‌ అడవుల్లో ఉండే సింహాలను ఏమంటారు?
 -  ఆసియా సింహాలు(పాంథెరాలియోపెర్సికా)

103. చిలక సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది?
 - ఒడిశా

104. కేవల్‌ దేవ్‌ ఘనా నేషనల్‌ పార్క్‌ ఎక్కడ ఉంది?
 - భరత్‌పూర్‌, రాజస్థాన్‌

105. కంగారూలు ఎంత వేగంతో పరిగెత్తగలవు?
- గంటకు 88కి.మీ

106. కంగారూలకు ఏది ముఖ్యం?
- తోక

107. కంగారూల జీవితకాలం ఎంత?
- సగటున 6నుంచి 8 ఏళ్లు

108. కంగారూలు ఎంతదూరం జంప్‌ చేస్తాయి?
 - 12.8 మీటర్లు

109. మెగ్లెవ్‌ను విశదీకరించండి
-మాగ్నటిక్‌ లెవిటేషన్‌(రైళ్ల ప్రయాణంలో ఉపయోగిస్తారు)

110. షింకాన్‌సెన్‌ రైళ్లు ఎటువంటివి?
 - బుల్లెట్‌ ట్రైన్‌లు(వీటివేగం 320 కిమీ/గం)

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment