అక్టోబరు - 12
|
¤ సిమర్ మల్హోత్రా అనే 17 ఏళ్ల భారతీయ విద్యార్థిని 'దేర్ ఈజ్ ఎ టైడ్' పేరిట పుస్తకాన్ని రచించింది. » సిమర్ ఇంటర్ ఫస్టియర్ చదివేటప్పుడు 'బకాలరేట్ అంతర్జాతీయ విద్యార్థి పథకం' కింద అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయంలో అయిదు వారాలపాటు డిప్లొమా కోర్సు చదివేందుకు ఎంపికైంది. అక్కడికి వెళ్లి 'షేక్స్‌పియర్' రచనలపై ప్రత్యేక అధ్యయనం చేసింది. ఈ అనుభవం, చిన్నప్పటినుంచి తనకున్న దినచర్య (డైరీ) రచన అలవాటుతో పుస్తకాన్ని రచించింది. » అమ్మా నాన్న, ఇద్దరు అన్నయ్యల తన ప్రపంచాన్ని నిలువెల్లా కూల్చేసే కుట్ర ఎలా జరిగింది? దాన్ని తనెలా అధిగమించిందో ఈ పుస్తకంలో వివరించింది. » ఇందులోని ఇతివృత్తం, దాన్ని చెప్పిన తీరు చూసి ప్రసిద్ధ ప్రచురణ సంస్థ 'రూపా పబ్లికేషన్స్' దీన్ని ప్రచురించింది. » ఈ పుస్తకాన్ని ప్రముఖ కవి జావేద్ అక్తర్ స్వయంగా ఆవిష్కరించారు. |
అక్టోబరు - 26
|
¤ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన 'నరేంద్ర మోదీ - ఒక పరిచయం' పుస్తకాన్ని అమెరికాలోని హూస్టన్‌లో జరుగుతున్న తొమ్మిదో ఉత్తర అమెరికా తెలుగు సాహితీ సదస్సులో ఆవిష్కరించారు.
¤ టాటాల కుటుంబం, వ్యాపారం గురించి తెలియజేస్తూ 'ది గ్రేటెస్ట్ కంపెనీ ఇన్ ది వరల్డ్! ది స్టోరీ ఆఫ్ టాటా' పేరిట పీటర్ క్యాసే పుస్తకాన్ని రచించారు. » రచయిత పీటర్ క్యాసే 'క్లాడాగ్ రిసోర్సెస్' వ్యవస్థాపక ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ సంస్థ క్లయింట్లలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కూడా ఒకటి. |
|
|