నవంబరు - 4
|
¤ '2014 ద ఎలక్షన్ దట్ ఛేంజ్డ్ ఇండియా' పుస్తకాన్ని సీనియర్ జర్నలిస్ట్, ప్రఖ్యాత న్యూస్ యాంకర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ రచించారు. » పలువురు జాతీయ స్థాయి రాజకీయ నేతలకు సంబంధించిన ఆసక్తికర అంశాలను ఈ పుస్తకంలో రాజ్‌దీప్ వెల్లడించారు.
|
నవంబరు - 5
|
¤ సచిన్ తెండుల్కర్ ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే'ను ముంబయిలో ఆవిష్కరించారు. » ఈ పుస్తక తొలి ప్రతిని సచిన్ తన తల్లి రజనీకి అందజేశారు. » పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి రాహుల్ ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్, సునీల్ గవాస్కర్, వెంగ్ సర్కార్, రవిశాస్త్రి, సచిన్ గురువు రమాకాంత్ అచ్రేకర్ తదితరులు హజరయ్యారు.
|
నవంబరు - 12
|
¤ 'ది లాస్ట్ గాస్పెల్' పుస్తకాన్ని ప్రొఫెసర్ బ్యారీ ఎ.విల్సన్, సింషా జాకో బోవిషీ రచించారు. » ఏసుక్రీస్తు వివాహితుడని, అతడికి సంతానం కూడా కలిగిందంటూ ఈ పుస్తకంలో వెల్లడించారు. ఏసుక్రీస్తు మానవ మాత్రుడేనని, మేరీ మాగ్దరీన్‌ను ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, వారిద్దరికీ పిల్లలు కూడా ఉన్నారని పుస్తకంలో తెలిపారు. ఓసారి ఆయనను హత్య చేసేందుకు విఫలయత్నం కూడా జరిగినట్లు రచయితలు తమ పుస్తకానికి రాసిన ముందు మాటలో పేర్కొన్నారు. » 1847 ప్రాంతంలో ఈజిప్టులోని ఒక క్రైస్తవ ప్రార్థనా మందిరం నుంచి లండన్‌లోని బ్రిటిషన్ గ్రంథాలయానికి చేరిన పురాతన రాత ప్రతి 'జోసెఫ్ అండ్ అనెసెత్' ఏసుక్రీస్తుకు వివాహమైన విషయాన్ని స్పష్టం చేస్తోందని రచయితలు వెల్లడించారు. » ఏసుక్రీస్తును సంసార బంధాలకు అతీతమైన పవిత్రుడిగా ప్రచారం చేయడంలో కృతకృత్యులైన మత గురువులు, వారి పండిత సాహిత్యం కూడా ఆయన భార్య మాగ్దలీన్‌ను ఒక వేశ్యగా చిత్రీకరించినట్లు రచయితలు తమ పుస్తకంలో తెలిపారు.
|
|
|