సెప్టెంబరు - 2014 గ్రంథాలు - రచయితలు


సెప్టెంబరు - 8
¤  కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి రామచంద్రన్ సంపాదకత్వంలో వెలువడిన 'ఇండియాస్ అర్బన్ కన్ఫ్యూజన్ ఛాలెంజస్, స్ట్రేటజీస్' అనే పుస్తకాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు న్యూఢిల్లీలో ఆవిష్కరించారు.
సెప్టెంబరు - 9
¤  భారత మూలాలున్న బ్రిటిష్ రచయిత నీల్ ముఖర్జీ తాజా నవల 'ద లైవ్స్ ఆఫ్ అదర్స్' ప్రతిష్ఠాత్మక మ్యాన్ బుకర్ బహుమతి - 2014కు సంబంధించిన తుది జాబితాకు ఎంపికైంది.   »    ఇబ్బందుల్లో ఉన్న ఒక బెంగాల్ కుటుంబ కథను ఇతివృత్తంగా తీసుకుని ఆయన ఈ నవలను రాశారు. ఇందులో 1960ల నాటి పరిస్థితులను కళ్లకుకట్టారు.    »    బుకర్ ప్రైజ్‌ను అందుకునే అవకాశాన్ని తొలిసారిగా జాతీయతను పరిగణించకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆంగ్లంలో రచనలు చేసినవారికి కల్పిస్తున్నారు.   »    తుది జాబితాకి ఆరు రచనలను ఎంపిక చేశారని ఎంపిక కమిటీ ఛైర్‌పర్సన్ ఎ.సి.గ్రేలింగ్ తెలిపారు.   »    తుది జాబితాలో చోటు దక్కించుకున్నవారు...
   »    ముఖర్జీ కలకత్తాలో జన్మించారు. 'ద లైవ్స్ ఆఫ్ అదర్స్' ఆయన రెండో రచన. తొలి రచన 'ఎ లైఫ్ అపార్ట్'. ఈ పుస్తకం భారత్‌లో వొడాఫోన్ - క్రాస్‌వర్డ్ అవార్డుకు ఎంపికైంది.
   »    ప్రస్తుతం బ్రిటిష్ పౌరుడిగా ఉన్న ముఖర్జీ ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. టైమ్స్, సండే టెలిగ్రాఫ్‌లో కాల్పనిక సాహిత్యాన్ని సమీక్షిస్తుంటారు.
సెప్టెంబరు - 10
¤  'ఎంఎస్ స్వామినాథన్ ఇన్ కన్జర్వేషన్' విత్ నిత్యారావ్ అనే పుస్తకాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు న్యూఢిల్లీలో ఆవిష్కరించారు.   »    ఈ పుస్తకాన్ని స్వామినాథన్ కుమార్తె నిత్యారావు రచించారు.