ఆగస్టు - 2014 అవార్డులు


ఆగస్టు - 1
¤  ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో తెలుగు భాష పరిరక్షణకు కృషి చేస్తున్న వారికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏటా అందజేసే 'మండలి వెంకట కృష్ణారావు సంస్కృతీ పురస్కారాల'ను ప్రకటించింది. 2013 సంవత్సరానికి గాను మయన్మార్‌కు చెందిన బర్మా తెలుగు సంఘానికి, 2014కు సంబంధించి చెన్నైలోని ప్రపంచ తెలుగు సమాఖ్యకు వీటిని ప్రదానం చేయనున్నారు. విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన సమావేశమైన నిపుణుల సంఘం ఈ మేరకు నిర్ణయించింది.   »    పురస్కారాల కింద ఒక్కో సంస్థకు రూ.25 వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసపత్రాన్ని అందజేస్తారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ తండ్రి స్మారకార్థం అవార్డుల‌ను ఏర్పాటుచేశారు.¤  22వ రాజీవ్‌గాంధీ జాతీయ సద్భావనా పురస్కారానికి అత్యంత ప్రజాదరణ పొందిన హిందీ చిత్రం 'ఉమ్రావ్‌ జాన్‌'కు దర్శకత్వం వహించిన ముజఫర్‌ అలీ ఎంపికయ్యారు.    »    మతసామరస్యం, శాంతి, సౌహార్దాన్ని పెంపొందించడానికి చేసిన కృషికి గాను ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.   »    అవార్డు కింద ప్రశంసాపత్రం, రూ.5 లక్షల నగదు ఇస్తారు.¤  కేర్‌ ఆసుపత్రుల ఛైర్మన్‌ డాక్టర్‌ బి.సోమరాజు 'ఇండియాస్‌ మోస్ట్ అడ్మైర్‌ కార్డియాలజిస్టు అవార్డు' అందుకున్నారు. ముంబయిలో జ‌రిగిన‌ 'ఇండియా అఫైర్స్‌ ఆఫ్‌ బిజినెస్‌ లీడర్‌షిప్‌ అవార్డు - 2014' నిర్వహ‌ణ కార్యక్రమంలో సోమరాజుకు ఈ జాతీయ అవార్డును అందజేశారు.
ఆగస్టు - 6
¤  భారతీయ యువ రచయిత నిఖిల్ చంద్వానీ (20 సంవత్సరాలు)కి ప్రతిష్ఠాత్మక అమెరికన్ లిటరరీ ఫోరం సొసైటీ పురస్కారం లభించింది.   »    నిఖిల్ చంద్వానీ రచించిన 'కోడెడ్ కాన్‌స్పిరసీ' అనే నవలకు ఈ పురస్కారం దక్కింది.   »    భారత్‌కు చెందిన ఈ యువ ప్రతిభావంతుడు హాలీవుడ్ సినిమాల్లోనూ ప్రతిభను చాటుకుంటున్నాడు.
ఆగస్టు - 12
¤  2010, 2011, 2012 సంవత్సరాలకు ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారాలను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ న్యూఢిల్లీలో ప్రదానం చేశారు.పురస్కార గ్రహీతలు2010 - అరుణ్‌జైట్లీ2011 - కరణ్‌సింగ్2012 - శరద్‌యాదవ్   »    ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోడీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, ఎంపీలు పాల్గొన్నారు.¤  గొల్లపూడి శ్రీనివాస్ స్మారక ఫౌండేషన్ జాతీయ అవార్డును గుజరాతీ చిత్రం 'ద గుడ్ రోడ్' దర్శకుడు గ్యాన్ కొరియాకు చెన్నైలో ప్రదానం చేశారు.   »    బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఈ అవార్డును గ్యాన్ కొరియాకు ప్రదానం చేశారు.   »    గొల్లపూడి శ్రీనివాస్ పేరిట అతడి తండ్రి గొల్లపూడి మారుతీరావు ఏర్పాటు చేసిన ఈ అవార్డు కింద రూ.లక్షన్నర ప్రదానం చేస్తారు.
ఆగస్టు - 13
¤  భారత సంతతికి చెందిన ఇద్దరు విద్యావేత్తలు గణిత విభాగంలో ప్రతిష్ఠాత్మక బహుమతులు గెలుచుకున్నారు.   »    వీరిలో ఒకరికి 'గణిత నోబెల్‌'గా పిలుచుకునే 'ఫీల్డ్స్ మెడల్' లభించింది. మంజుల్ భార్గవ్ 'ఫీల్డ్స్ మెడల్‌'ను గెలుచుకోగా, సుభాష్ కోట్ 'రోల్ఫ్ నేవాన్లిన్నా' బహుమతిని గెలుపొందారు.   »    సియోల్‌లో జరిగిన 'అంతర్జాతీయ గణిత కాంగ్రెస్ - 2014'లో వీరికి ఈ బహుమతులను అంతర్జాతీయ గణిత సంఘం (ఐఎంయూ) అందజేసింది.   »    నాలుగేళ్లకు ఒకసారి అందించే 'ఫీల్డ్స్ మెడల్‌'ను ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్న భార్గవ్ మరో నలుగురితో పాటు అందుకున్నారు.   »    న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్న సుభాష్ కోట్ ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీని పొందారు.   »    ముంజుల్ భార్గవ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొంతకాలం గణితశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేశారు. భార్గవ్ జామెట్రీలో నూతన విధానాలను అభివృద్ధి చేశారు. 78 ఏళ్ల అంతర్జాతీయ గణిత సదస్సు చరిత్రలో భారతీయ మూలాలున్న శాస్త్రవేత్తకు ఈ పురస్కారం లభించడం ఇదే ప్రథమం.   »    సుభాష్ కోట్‌కు అల్‌గారిథమ్ డిజైన్స్‌లో నూతన ఆవిష్కరణలకు గాను 'రోల్ఫ్ నేవాన్లిన్నా' పురస్కారాన్ని ప్రదానం చేశారు.¤  2013 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి శ్రమ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.   »    అవార్డుకు ఎంపికైన 40 మందిలో విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌కు చెందిన వి.గోపీనాథ్ నాయర్; డి.శేఖర్, పి.రాజేంద్ర ప్రసాద్, జి.మల్కాగౌడ్; హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్‌కు చెందిన జి.శ్రీనివాస్ (వీరందరికీ సంయుక్తంగా ఇచ్చారు), హైదరాబాద్‌లోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్‌కు చెందిన పెండ్యాల శంకరాచారి ఉన్నారు.   »    వేములపల్లి శ్రీరాములు, విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌కు చెందిన యేలేటి సృజన్ సుధాకర్ పాల్ 'శ్రమశ్రీ' అవార్డుకు ఎంపికయ్యారు.¤  కపిల్‌దేవ్ నేతృత్వంలోని 12 మంది సభ్యుల జాతీయ క్రీడా సెలక్షన్ కమిటీ న్యూఢిల్లీలో సమావేశమై 15 మంది క్రీడాకారులను అర్జున అవార్డులకు సిఫారసు చేసింది.   »    ప్రతిష్ఠాత్మక ఖేల్‌రత్న అవార్డుకు మాత్రం ఎవరి పేరునూ ప్రతిపాదించలేదు. దేశ అత్యున్నత క్రీడా పురస్కారానికి ఎవరినీ ఎంపిక చేయకపోవడం ఇది మూడోసారి మాత్రమే. 1991 నుంచి రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న పురస్కారాన్ని ప్రకటిస్తున్నారు.   »    అర్జున అవార్డు - 2014కు కమిటీ ప్రతిపాదించిన క్రీడాకారులు: రవిచంద్రన్ అశ్విన్ (క్రికెట్), సజిథామస్ (రోయింగ్), అఖిలేష్ వర్మ (ఆర్చరీ), టింటు లుకా (అథ్లెటిక్స్), గిరీష (పారాలింపిక్స్), డిజు (బ్యాడ్మింటన్), గీతు ఆన్ జోస్ (బాస్కెట్‌బాల్), జై భగవాన్ (బాక్సింగ్), అనిర్బన్ లాహిరి (గోల్ఫ్), మమత పూజారి (కబడ్డీ), హీనా సిద్ధు (షూటింగ్), అనక అలకమోని (స్క్వాష్), టామ్ జోసెఫ్ (వాలీబాల్), రేణు బాల చాను (వెయిట్‌లిఫ్టింగ్), సునీల్ రాణా (రెజ్లింగ్).   »    అర్జున అవార్డులకు సెలక్షన్ కమిటీ సూచించిన 15 మంది పేర్లను క్రీడా మంత్రిత్వశాఖ పరిశీలిస్తుంది. ఈ జాబితాలో మార్పులు, చేర్పులు చేసే హక్కు దానికి ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వం జాబితాను యధాతథంగా ఆమోదిస్తుంటుంది. 
ఆగస్టు - 14
¤  స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సాయుధ, పారా మిలటరీ దళాలకు చెందిన మొత్తం 55 మందికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'శౌర్య' పతకాలను ప్రకటించింది. ఒకరికి అశోకచక్ర, 12 మందికి శౌర్యచక్ర, 39 మందికి సేన, ఒకరికి నవ్‌సేన, ఇద్దరికి వాయుసేన పతకాలను ప్రకటించారు.   »    జమ్మూకాశ్మీర్‌లో అత్యంత సాహసోపేతంగా ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్‌కు ఆయన మరణాంతరం 'అశోకచక్ర' దక్కింది. నలుగురు అమరులు సహా మొత్తం 12 మందికి శౌర్యచక్ర పురస్కారాలను ప్రకటించారు.
ఆగస్టు - 15
¤  విధి నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన పలు సాయుధ బలగాల సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సాహస పతకాలు అందజేశారు.   »    మహారాష్ట్రకు చెందిన నౌకాదళాధికారి కమాండర్ కౌస్తుభ్ గోసవికి 'నవ్‌సేన' పతకం అందజేశారు. ఈ పతకం అందుకున్న ఏకైక అధికారి కౌస్తుభ్. 2013 సెప్టెంబరులో ముంబయి తీరానికి 35 నాటికల్ మైళ్ల దూరంలో చిక్కుకున్న ఇద్దరు సిబ్బందికి అత్యవసరంగా వైద్యం అందించే సమయంలో ఆయన ప్రదర్శించిన సాహసానికి ఈ పతకం దక్కింది. 
ఆగస్టు - 17
¤   డెన్మార్క్ దేశ అత్యున్నత సాహిత్య పురస్కారం 'ద హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ లిటరేచర్‌'ను  డెన్మార్క్లోని ఓడెన్స్ నగరంలో  డెన్మార్క్ యువరాణి మేరీ, బ్రిటన్‌కు చెందిన భారత సంతతి రచయిత సల్మాన్ రష్దీకి ప్రదానం చేశారు.
ఆగస్టు - 20

¤  రాజీవ్‌గాంధీ జాతీయ సద్భావనా పురస్కారం - 2014 ను న్యూఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రముఖ సినీ దర్శకుడు ముజఫర్ అలీకి ప్రదానం చేశారు.
¤  హైదరాబాద్‌లోని నల్సార్ న్యాయవిశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫాకు సార్క్ ఉత్తమ న్యాయ అధ్యాపక అవార్డును ప్రకటించారు. ఈ పురస్కారాన్ని సెప్టెంబరు 6న ప్రదానం చేయనున్నారు.
   »    ముస్తఫా గతంలో అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి డీన్, రిజిస్ట్రార్‌గా వ్యవహరించారు. న్యాయ సంబంధమైన అంశాలపై పలు పుస్తకాలు రచించారు. మానవహక్కులు, పర్యాటక న్యాయ ఒప్పందాలు, మైనార్టీ హక్కులతోపాటు ఇతర అంశాలపై విశేష పరిశోధనలు చేశారు.
¤  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 16 మంది ఉపాధ్యాయులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 10 మంది, తెలంగాణ నుంచి 6 మంది ఉన్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ వీరిని ఎంపిక చేసింది.
ఆగస్టు - 22 
¤  సాహిత్య అకాడమీ యువ, బాల సాహిత్య పురస్కారాలను ప్రకటించింది. 2014 సంవత్సరానికి గాను ఇద్దరు తెలుగువారికి ఈ పురస్కారాలు దక్కాయి. ఇందులో ఒకటి యువ పురస్కారం కాగా మరొకటి బాల సాహిత్య పురస్కారం.   »    తెలుగు రచయిత అప్పిరెడ్డి హరిహర్‌రెడ్డి రచించిన వ్యాస సంకలనానికి యువ పురస్కారం లభించగా తెలుగు రచయిత దాసరి వెంకట్రామన్ వెలువరించిన బాలల కథా సంకలనానికి బాల సాహిత్య పురస్కారం లభించింది.   »    ఈసారి 21 భాషల్లో వెలువడిన పద్య రచనలు, నవలలు, కథలు, వ్యాసాలకు అకాడమీ యువ పురస్కారాలను ప్రకటించింది. డోగ్రీ, కాశ్మీరీ, సింధీ భాషల్లో ఈసారి పురస్కారాలను ప్రకటించలేదు. ఈ ఏడాది యువ పురస్కారాల్లో అత్యధికం పద్య రచనలకే లభించడం గమనార్హం. ఇందులో 13 పద్య రచనలు, మూడు నవలలు, నాలుగు కథా సంపుటాలు, ఒక వ్యాస సంకలనం ఉన్నాయి.   »    యువ పురస్కారం కింద జ్ఞాపిక, యాభైవేల రూపాయల చెక్కు అందజేస్తారు.¤  రాజా బహద్దూర్ వెంకట రామిరెడ్డి స్మారక పురస్కారాన్ని హైదరాబాద్‌లో ఐపీఎస్ అధికారి, కంట్రోలర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ అదనపు డీజీ ఎస్.గోపాలరెడ్డికి ప్రదానం చేశారు.   »    కొత్వాల్ రాజా బహద్దూర్ వెంకట రామిరెడ్డి జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన రాజా బహద్దూర్ వెంకట రామిరెడ్డి స్మారకోపన్యాసంలో ఈ పురస్కారాన్ని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రదానం చేశారు. 
ఆగస్టు - 23
¤  రాయలసీమ ప్రాంత సమస్యలు, పరిస్థితులపై రచనలు చేస్తున్న అప్పిరెడ్డి హరినాథరెడ్డికి 2014 ఏడాదికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. ఆయన రాసిన 'సీమ సాహితీ స్వరం - శ్రీ సాధన పత్రిక' అనే విమర్శనా సంకలనానికి ఈ అవార్డు దక్కింది. ఈ పురస్కారాన్ని 35 ఏళ్లలోపు యువ రచయితలకు ఇస్తారు.
   »    1920 దశకంలో పప్పూరి రామాచార్యులు వెలువరించిన శ్రీ సాధన పత్రిక వ్యాసాలను హరినాథరెడ్డి సంకలనం చేశారు. ఈ వ్యాసాల్లో నాటి సామాజిక పరిస్థితులపై పరిశీలన ఉంది
.
   »    హరినాథరెడ్డి అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం తాళ్లకాల్వకు చెందినవారు
.
   »    రాయలసీమ సాహిత్యం, సాంస్కృతిక, సమకాలీన అంశాలపై 90 వ్యాసాలు, 20 కవితలు, జాతీయ సాహిత్య సదస్సుల్లో పది పత్రాలను సమర్పించారు.
ఆగస్టు - 26
¤  గుజరాత్ ఇంధన పరిశోధన, నిర్వహణ సంస్థ సంచాలకుడిగా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి తిరుమలశెట్టి హరినారాయణకు సంప్రదాయేతర ఇంధనరంగంలో ప్రతిభా పురస్కారం 'ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఫౌండేషన్ గ్లోబల్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ - 2014' లభించింది.   »    ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఫౌండేషన్ ఢిల్లీలో నిర్వహించిన 5వ ప్రపంచ సంప్రదాయేతర ఇంధన సాంకేతిక సమారోహణంలో ఈ అవార్డును ప్రదానం చేశారు.   »    భూతాపం, సౌర విద్యుత్ రంగాల్లో 35 ఏళ్లుగా హరినారాయణ అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.
ఆగస్టు - 27
¤  కేంద్ర ప్రభుత్వం 'గంగాశరణ్ - 2010' పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విజయనగరం జిల్లాకు చెందిన సాగి అప్పల సూర్యనారాయణ వర్మకు ఢిల్లీలో ప్రదానం చేశారు.   »    ఈ పురస్కారం కింద రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రం అందజేస్తారు.   »    ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్న వర్మ హిందీలో చేసిన పరిశోధనకు గాను ఈ అవార్డు లభించింది.   »    వర్మతో పాటు మరో 27 మందికి హిందీ భాషా వ్యాప్తికి కృషి చేస్తున్నందుకు రాష్ట్రపతి ప్రణబ్ వివిధ అవార్డులను ప్రదానం చేశారు.   »    2010, 2011 సంవత్సరాలకు సంబంధించి ఈ పురస్కారాలను ప్రదానం చేశారు.   »    శాస్త్ర, సాంకేతిక విషయాలను హిందీలో రాస్తున్నందుకు ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త కాళి శంకర్‌కు 'ఆత్మారాం' అవార్డును ప్రదానం చేశారు.   »    హిందీ పాత్రికేయంలో కృషి చేసినందుకు రవీష్ కుమార్, దిలీప్ కుమార్, గోవింద్ సింగ్‌లకు 'గణేష్ శంకర్ విద్యార్థి' అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేశారు.   »    యాత్ర విశేషాలను హిందీలో వర్ణించడం, హిందీపై పరిశోధన చేసినందుకుగాను వేదరహి, అస్రార్ వాజహత్‌లకు 'మహాపండిట్ రాహుల్ సంస్కిర్తయాన్' అవార్డును అందజేశారు.
ఆగస్టు - 29
¤  జాతీయ క్రీడా అవార్డులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, క్రీడామంత్రి శర్వానంద్ సోనోవాల్ హాజరయ్యారు.అర్జున అవార్డు గ్రహీతలు: అభిషేక్ వర్మ (ఆర్చరీ), టింటు లూకా (అథ్లెటిక్స్), గిరీశ్ (పారాలింపిక్స్), దిజు (బ్యాడ్మింటన్), గీతు ఆన్ జోస్ (బాస్కెట్‌బాల్), జైభగవాన్ (బాక్సింగ్), అశ్విన్ (క్రికెట్), అనిర్బన్ లాహిరి (గోల్ఫ్), మమత పూజారి (కబడ్డీ), సాజి థామస్ (రోయింగ్), హీనా సిద్ధు (షూటింగ్), అనక అలంకామని (స్క్వాష్), జోసెఫ్ (వాలీబాల్), చాను (వెయిట్‌లిఫ్టింగ్), సునీల్ రాణా (రెజ్లింగ్).   »    ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న క్రికెటర్ అశ్విన్ అర్జున అవార్డును అందుకోలేకపోయాడు.ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు: మహావీర్ ప్రసాద్ (రెజ్లింగ్), లింగప్ప (అథ్లెటిక్స్ - లైఫ్‌టైమ్), మనోహరన్ (బాక్సింగ్ - లైఫ్‌టైమ్), గురుచరణ్ జోగి (జూడో - లైఫ్‌టైమ్), జోస్ జాకబ్ (రోయింగ్ - లైఫ్‌టైమ్).ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీతలు: గుర్మేల్ సింగ్ (హాకీ), కేపీ ఠక్కర్ (స్విమ్మింగ్ - డైవింగ్), జీషన్ అలీ (టెన్నిస్).   »    గతేడాది కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ కూలిన దుర్ఘటనలో సైనికుల మృతదేహాలను వెలికి తీసిన ఐటీబీపీ హవల్దార్ పసాంగ్ టెన్సింగ్ షెర్పాకు టెన్సింగ్ నార్గే అవార్డును అందజేశారు.