జులై - 2
|
| ¤ ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్‌ను ఫ్రాన్స్ ప్రభుత్వం సత్కరించింది. » ఆ దేశంలో ఉత్తమ పురస్కారమైన 'నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్' అవార్డును షారుఖ్‌కు ప్రదానం చేసింది. » భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి లారెంట్ ఫాబియస్ ముంబయిలో షారుఖ్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు. » గతంలో అమితాబ్ బచ్చన్, దర్శకుడు సత్యజిత్ రే, సితార విద్వాంసుడు పండిట్ రవిశంకర్‌కు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. » భారతీయ సినిమాకు సేవలు చేసినవారికి ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం చేస్తోంది. |
జులై - 5
|
| ¤ ఉత్తర అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 13వ ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) మహాసభల సందర్భంగా జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణ రెడ్డికి జీవితకాల సాఫల్య పురస్కారం అందజేశారు. ఈ అవార్డు కింద రూ.లక్ష చెక్కు, జ్ఞాపికను సినారె కు ప్రదానం చేశారు.¤ విశాఖ స్టీల్ ప్లాంటుకు 2012-13 ఏడాదికి ప్రతిష్ఠాత్మక నిర్వహణా సమర్థత అవార్డు లభించింది. » ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీర్స్ ఆధ్వర్యంలో ఏటా ప్రతిభ కనబరిచే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఈ అవార్డును అందజేస్తారు. |
జులై - 11
|
| ¤ భారతీయ యువ గణిత శాస్త్రవేత్త నిఖిల్ శ్రీవాస్తవ ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక 'జార్జ్ పోల్యా ప్రైజ్'ను మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా గెలుచుకున్నారు. » 5 దశాబ్దాలుగా శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ఓ గణిత సమస్యకు పరిష్కారం కనుక్కున్నందుకుగాను వీరికి ఈ పురస్కారం లభించింది. » క్వాంటమ్ మెకానిక్స్‌లో గణితపరంగా కీలకమైన 'కడిసన్ - సింగర్ కంజెక్చర్'ను యేల్ యూనివర్సిటీకి చెందిన ఆడమ్ డబ్ల్యూ మార్కస్, డేనియల్ ఎ.స్పీల్‌మ్యాన్ అనే మరో ఇద్దరు శాస్త్రవేత్తలతో కలిసి నిఖిల్ నిరూపించారు. » హంగేరియన్ గణిత శాస్త్రవేత్త జార్జ్ పోల్యా పేరుమీద 1969 నుంచి రెండేళ్లకోసారి ఈ బహుమతిని అందిస్తున్నారు. |
జులై - 15
|
| ¤ 2013 అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతిని ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు చండీ ప్రసాద్ భట్‌కు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. |
జులై - 23
|
| ¤ కరీంనగర్ సాహితీ గౌతమి రాష్ట్రస్థాయిలో గత 25 ఏళ్లుగా అందిస్తున్న సినారె కవితా పురస్కారాన్ని ఈ ఏడాది 'ఎర్రమట్టి బండి' గ్రంథానికి ప్రకటించారు. » ఈ గ్రంథాన్ని మెదక్ జిల్లాకు చెందిన తైదల అంజయ్య రచించారు. |
జులై - 28
|
| ¤ రాజీవ్‌గాంధీ హత్యకేసులో జైలుశిక్షను అనుభవిస్తున్న మురుగన్‌కు ఇందిరాగాంధీ ఫౌండేషన్ అవార్డు లభించింది. » తమిళనాడులోని వేలూరు కేంద్ర కారాగారంలో ఉన్న మురుగన్ ఖాళీ సమయంలో చిత్రాలు వేసేవాడు. అలా సరదాగా వేసిన చిత్రానికి ఇందిరాగాంధీ ఫౌండేషన్ రూ.50 వేల బహుమతి ప్రకటించింది. » మురుగన్ తన భార్య నళిని, కూతురితో ఆనందంగా ఉన్నట్లు ఒక చిత్రాన్ని గీశాడు. ఈ చిత్రాన్ని ఇటీవలే న్యూఢిల్లీలో జరిగిన ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. » 1999 డిసెంబరు 10న తొలిసారిగా మురుగన్ ఈ చిత్రాన్ని గీశాడు. అప్పటి నుంచి ఈ చిత్రం ఏకంగా మూడుసార్లు జాతీయ అవార్డు గెలుచుకుంది. |
|
|