జులై - 1
|
| ¤ హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (నాక్) డైరెక్టర్ జనరల్‌గా కె.భిక్షపతి నియమితులయ్యారు.¤ త్రివిధ దళాల సమీకృత సిబ్బంది విభాగం అధిపతిగా ఎయిర్ మార్షల్ పి.పి.రెడ్డి నియమితులయ్యారు. » వాయుసేన ట్రైనింగ్ కమాండ్ అధిపతిగా ఎయిర్ మార్షల్ రమేష్ రాయ్ బాధ్యతలు చేపట్టారు. » డైరెక్టర్ జనరల్ (ఇన్‌స్పెక్షన్, సేఫ్టీ)గా ఎయిర్ మార్షల్ ఎస్.నీలకంఠన్ బాధ్యతలు తీసుకున్నారు. |
జులై - 3
|
| ¤ తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. » అకాడమీకి సీనియర్ పాత్రికేయులు అల్లం నారాయణను ఛైర్మన్‌గా నియమించారు. ఆయనకు కేబినెట్ హోదా కల్పించారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. » ప్రెస్ అకాడమీ సభ్యులుగా ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకులు కె.శ్రీనివాస్, నమస్తే తెలంగాణ ఎడిటర్ కె.శేఖర్ రెడ్డి, సాక్షి పత్రిక ఎడిటర్ వర్దెల్లి మురళి, పాత్రికేయులు మల్లేపల్లి లక్ష్మయ్య, టంకశాల అశోక్, దక్కన్ క్రానికల్ పొలిటికల్ ఎడిటర్ సి.ఆర్.గౌరీశంకర్, హిందూ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ కె.శ్రీనివాస్ రెడ్డి, సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్, హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్, వీక్షణం పత్రిక సంపాదకులు ఎన్.వేణు గోపాల్, టీ న్యూస్ సీఈవో ఎం.నారాయణ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు కొమురవెల్లి అంజయ్యను నియమించారు.¤ కృష్ణా, గోదావరి నదీ బోర్డులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు తమ సభ్యులను నామినేట్ చేస్తూ కేంద్ర జలసంఘం ఛైర్మన్ పాండ్యాకు సమాచారం పంపాయి. » ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. » తెలంగాణ ప్రభుత్వం నుంచి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ రెడ్డి, ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌ను ఆ ప్రభుత్వం నామినేట్ చేసింది. » రెండు బోర్డులకు వీరే సభ్యులుగా ఉంటారు.¤ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్)గా పరకాల ప్రభాకర్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. » వివిధ అంశాలపై ప్రభుత్వ విధానాలను వివరించే బాధ్యతను ఆయనకు అప్పగించారు. ప్రభాకర్ నేతృత్వంలో ఒక బృందం ఈ పని నిర్వర్తిస్తుంది. » సలహాదారుగా ఆయనకు కేబినెట్ మంత్రి హోదా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. » దివంగత మాజీ మంత్రి పరకాల శేషావతారం కుమారుడైన ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. » కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభాకర్ సతీమణి. |
జులై - 6
|
| ¤ భారత ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)లో సమాచార అధికారిగా శరత్ చందర్ నియమితులయ్యారు. ఆయన భారత సమాచార సర్వీస్ (ఐఐఎస్) 1999 బ్యాచ్ అధికారి. |
జులై - 11
|
| ¤ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా జస్టిస్ ఎల్.నరసింహారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. » 1953 ఆగస్టు 1న వరంగల్ జిల్లాలో నరసింహారెడ్డి జన్మించారు. » 2001 సెప్టెంబరు 10న హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు.¤ ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రైబ్యునల్ (ఏపీఏటీ) ఛైర్మన్‌గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోవిందరాజులును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. » ఈ పదవిలో ఆయన 5 ఏళ్లపాటు కొనసాగుతారు. » 2009 అక్టోబరు 14న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై 2013 ఆగస్టు 5న పదవీ విరమణ చేశారు. |
జులై - 13
|
| ¤ ఆర్థిక నేరాలను నియంత్రించే సంస్థలను సమన్వయపరిచే అత్యున్నతమైన కేంద్ర ఆర్థిక నిఘా సంస్థ (సి.ఇ.ఐ.బి.) డైరెక్టర్ జనరల్‌గా ఐ.ఆర్.ఎస్. అధికారిణి అర్చనా రంజన్ నియమితులయ్యారు.¤ టెలికాం కార్యదర్శిగా రాకేష్ గార్గ్ నియమితులయ్యారు. ఆయన 1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. » ఎరువుల శాఖ కార్యదర్శిగా జుగల్ కిషోర్ మహాపాత్ర నియమితులయ్యారు. ఆయన 1979 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. » భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా రాజన్ ఎస్.కటోచ్ నియమితులయ్యారు. » జౌళి శాఖ కార్యదర్శిగా ఎస్.కె.పాండా నియమితులయ్యారు. » మంత్రివర్గ నియామకాల కమిటీ (ఏసీసీ) వీరి నియామకాలకు ఆమోద ముద్ర వేసింది. |
జులై - 14
|
| ¤ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఛైర్మన్‌గా బి.అశోక్‌ను నియమించారు. » ఐఓసీ ఛైర్మన్‌గా ఉన్న ఆర్.ఎస్.బుటోలా మే 31న పదవీ విరమణ చేశాక సంస్థలోని సీనియర్ డైరెక్టర్ ఆర్.కె.మల్హోత్రా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన జూన్‌లో పదవీ విరమణ చేయడంతో, మరో డైరెక్టర్ ఎ.ఎం.కే సిన్హా కు ఈ బాధ్యతలు అప్పగించారు. సిన్హా కూడా ఈ నెలాఖరులో పదవీ విరమణ చేస్తారు. » ఐఓసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న అశోక్‌ను ఛైర్మన్ పదవికి పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పీఈఎస్‌బీ) యూపీఏ హయాంలోనే ఎంపిక చేసినా, అప్పట్లో ఉత్తర్వులు ఇవ్వలేదు. |
జులై - 17
|
| ¤ ఉమ్మడి హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ)గా బొమ్మినేని నారాయణ రెడ్డి నియమితులయ్యారు. » పదవీకాలం మూడు సంవత్సరాలు. » పి.విష్ణువర్ధన్‌రెడ్డి స్థానంలో ఈ నియామకం జరిగింది. |
జులై - 18
|
| ¤ తెలంగాణా ట్రాన్స్‌కో ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా ఎస్.ఎ.ఎం.రిజ్వీ నియమితులయ్యారు.¤ హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు తొలి మహిళా అధికారిగా అశ్విని సత్తారు నియమితలయ్యారు. |
జులై - 20
|
¤ ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత కార్యదర్శిగా సంజీవ్ కుమార్ సింగ్లా
నియమితులయ్యారు.ఈ మేరకు నియామకాల కేబినెట్ కమిటీ సింగ్లా నియామకాన్ని
ఆదేశించింది. » ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న విక్రమ్ మిస్రీ స్పెయిన్ రాయబారిగా వెళ్లనున్నారు. » 1997 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన సింగ్లా ఇజ్రాయెల్‌లో భారత రాయబారి
కార్యాలయంలో పనిచేశారు. |
జులై - 23
|
| ¤ కేంద్ర ప్రభుత్వానికి, దక్షిణాది రాష్ట్రాలకు మధ్య సమన్వయం చేయడంలో కీలకపాత్ర పోషించే దక్షిణ ప్రాంతీయ మండలి (సదరన్ జోనల్ కౌన్సిల్) వైస్ ఛైర్మన్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. » ఏడాదిపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. » దక్షిణ ప్రాంతీయ మండలిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరి సభ్యులుగా ఉంటాయి. » దక్షిణ ప్రాంతీయ మండలికి ఛైర్మన్‌గా కేంద్ర హోంమంత్రి వ్యవహరిస్తారు. |
జులై - 30
|
| ¤ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రాయోజిత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు అయిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ)కు నూతన ఛైర్మన్‌గా వి.నర్సిరెడ్డి నియమితులయ్యారు. » వరంగల్ కేంద్రంగా ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు కార్యకలాపాలు సాగిస్తోంది. » తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఇదే అతిపెద్దది. » కె.లక్ష్మణరావు స్థానంలో ఈ నియామకం జరిగింది.¤ ఛీప్స్ ఆఫ్ స్టాఫ్స్ కమిటీ (సి.ఒ.ఎస్.సి.) ఛైర్మన్‌గా భారత వాయుసేన అధిపతి అరూప్ రాహా బాధ్యతలు స్వీకరించారు. » ఇప్పటివరకు ఈ హోదాలో ఉన్న జనరల్ విక్రమ్‌సింగ్ ఉద్యోగ విరమణ నేపథ్యంలో అరూప్ రాహా ఈ పదవిలో నియమితులయ్యారు. రాహా 29 నెలలపాటు ఈ బాధ్యతలను నిర్వర్తిస్తారు.¤ లోక్‌సభ నూతన సెక్రటరీ జనరల్‌గా పి.కె.గ్రోవర్ నియమితులయ్యారు. |
జులై - 31
|
| ¤ దేశంలోని ప్రతి ఇంటికీ రెండు బ్యాంకు అకౌంట్లు తెరవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమానికి ఆగస్టు 15 నుంచి శ్రీకారం చుట్టనున్నారు. » ఆర్థిక వ్యవహారాల్లో అందరికీ సమగ్ర భాగస్వామ్యం కల్పించాలన్న లక్ష్యంతో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక మిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనికి డైరెక్టర్‌గా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్‌ను నియమించారు. |
|
|