ఆగస్టు - 1
|
| ¤ ఇన్ఫోసిస్ నూతన ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా విశాల్ సిక్కా బాధ్యతలు స్వీకరించారు. » ఇన్ఫోసిస్ ఏర్పాటైన 3 దశాబ్దాల పాటు వ్యవస్థాపకులే సీఈఓగా వ్యవహరించగా, తొలిసారి బయటి వ్యక్తి అయిన విశాల్ సీఈవోగా ఎంపికయ్యారు. ¤ కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) నూతన ఛైర్మన్‌గా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్)కు చెందిన సీనియర్ అధికారి కె.వి.చౌదరి బాధ్యతలు స్వీకరించారు. » ప్రధాని మోడీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల సంఘం (ఏసీసీ) చౌదరి ఎంపికకు ఆమోదముద్ర వేసింది. » 1978 బ్యాచ్‌కు చెందిన చౌదరి కృష్ణాజిల్లాలోని కురుమద్దాలి గ్రామంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు కొసరాజు వీరయ్య చౌదరి. |
ఆగస్టు - 8
|
¤ క్యాపిటేషన్ రుసుములకు సంబంధించిన అంశాలపై కోర్టుకు సహాయకారిగా (అమికస్ క్యూరీ) మాజీ న్యాయమంత్రి సల్మాన్ ఖుర్షీద్‌ను సుప్రీంకోర్టు నియమించింది. దీనిపై లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఖుర్షీద్‌ను ఆదేశించింది. విద్యారంగంలో క్యాపిటేషన్ సమస్యను అంతం చేయడానికి యంత్రాంగాన్ని సూచించాలని పేర్కొంది. » విద్యా సంస్థలు క్యాపిటేషన్ రుసుమును వసూలు చేయడం అక్రమమని చాలాసార్లు ఆదేశించినప్పటికీ దేశంలో అలాంటి సంస్కృతి ఇంకా కొనసాగుతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. » సల్మాన్ ఖుర్షీద్‌కు అవసరమైన సమాచారాన్ని అందించాలంటూ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
|
ఆగస్టు - 20
|
¤ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ఛైర్మన్‌గా ఇండియన్ బ్యాంక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) టి.ఎం.భాసిన్ ఎన్నికయ్యారు. » ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఎండీ కె.ఆర్.కామత్ స్థానంలో 2014 - 15 సంవత్సరానికి భాసిన్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. » ఐబీఏ డిప్యూటీ ఛైర్‌పర్సన్లుగా యూకో బ్యాంక్ సీఎండీ అరుణ్ కాల్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అధిపతి ఎస్.ఎల్.బన్సల్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచ్చర్ ఎన్నికయ్యారు. » స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఐబీఏ గౌరవ కార్యదర్శిగా వ్యవహరిస్తారు.¤ పార్లమెంట్ ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) కొత్త ఛైర్మన్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత కె.వి.థామస్ నియమితులయ్యారు. » కాగ్ నివేదికలను పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత వాటిని ఈ కమిటీయే పరిశీలిస్తుంది. » సాధారణంగా ఈ పదవి పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షానికి దక్కుతుంది. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా విషయమై ప్రభుత్వానికీ, కాంగ్రెస్‌కు మధ్య అభిప్రాయభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో పీఏసీ పదవి కాంగ్రెస్‌కు దక్కడం గమనార్హం. » పీఏసీలో గరిష్ఠంగా 22 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 15 మంది లోక్‌సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉంటారు.
|
ఆగస్టు - 21
|
| ¤ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) బోర్డు ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి పి.కృష్ణయ్య నియమితులయ్యారు.¤ ఉమ్మడి హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పోసాని వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. » ఉమ్మడి హైకోర్టులో ప్రాసిక్యూషన్‌లు, క్రిమినల్ అప్పీళ్లు, ఇతర క్రిమినల్ కేసుల్లో ప్రభుత్వం తరఫున ఆయన వాదనలు వినిపిస్తారు. » వెంకటేశ్వర్లు గుంటూరు జిల్లా నకిరేకల్ మండలం కండ్లగుంట గ్రామంలో 1959లో జన్మించారు. » పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)తో పాటు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఆర్.చంద్రారెడ్డిని కూడా ప్రభుత్వం నియమించింది. |
ఆగస్టు - 22
|
¤ ముఖ్యమైన మూడు పార్లమెంట్ కమిటీలకు నియామకాలు జరిగాయి.
|
ఆగస్టు - 24
|
| ¤ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ ఢిల్లీలోని జిందాల్ గ్లోబల్ లా స్కూల్ గౌరవ ఎమిరైటస్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. » దల్వీర్ భండారీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ న్యాయమూర్తిగా కూడా వ్యవహరిస్తున్నారు. |
|
|