జూన్ - 1
|
| ¤ తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాజీవ్ శర్మ, ఆంధ్రప్రదేశ్ తొలి ప్రధాన కార్యదర్శిగా ఐ.వై.ఆర్.కృష్ణారావులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. » తెలంగాణ సీఎస్‌గా నియమితులైన రాజీవ్ శర్మ 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 1956 మే 6 న ఉత్తరప్రదేశ్‌లో జన్మించారు. 1984లో ఐఏఎస్‌గా బాధ్యతలు చేపట్టి కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేశారు. 2011లో కేంద్ర సర్వీసుకు వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర హోంశాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీకి నోడల్ అధికారిగా పనిచేసిన ఆయన గతేడాది కేంద్ర విభజన కమిటీలోనూ పనిచేశారు. » ఆంధ్రప్రదేశ్ సీఎస్‌గా నియమితులైన రాష్ట్రానికి చెందిన ఐ.వై.ఆర్.కృష్ణారావు 1979 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 1956 జనవరి 22 న జన్మించారు. ఖమ్మం, నల్గొండ జిల్లాల కలెక్టర్‌గా పని చేశారు. తితిదే ఈవోతో పాటు రాష్ట్రంలో అనేక కీలక పదవులు నిర్వహించారు. గతేడాది నుంచి భూపరిపాలన ప్రధాన కమిషనర్‌గా పని చేస్తున్నారు.¤ తెలంగాణ రాష్ట్ర తొలి డీజీపీగా అనురాగ్ శర్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి డీజీపీగా జాస్తి వెంకట రాముడు (జె.వి.రాముడు) నియమితులయ్యారు. యూపీఎస్‌సీ నుంచి తుది నియామకం జరిగేవరకు వీరు పోలీసు విభాగాధిపతులుగా కొనసాగుతారని ప్రభుత్వం పేర్కొంది. » రాజస్థాన్‌కు చెందిన అనురాగ్ శర్మ 1982లో ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఎస్పీగా, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని దక్షిణ మండలం డీసీపీగా, గ్రేహౌండ్స్ కమాండెంట్‌గా, వరంగల్ రేంజి డీఐజీగా, నిఘా విభాగంలో ఐజీగా పని చేశారు. » ఆంధ్రప్రదేశ్ తొలి డీజీపీగా బాధ్యతలు చేపడుతున్న జె.వి.రాముడు స్వస్థలం అనంతపురం జిల్లా తడ్డిమర్రి మండలం నర్సింపల్లి గ్రామం. 1981 బ్యాచ్ ఐపీఎస్‌గా ఎంపికైన ఆయన మొదట గుంటూరు అదనపు ఎస్పీగా పని చేశారు. తర్వాత అదనపు ఎస్పీ కరీంనగర్, ఎస్పీ వరంగల్, హైదరాబాద్‌లో రెండు జోన్లకు డీసీపీ, అనంతరం నల్గొండ ఎస్పీగా పనిచేశారు. అన్నిరంగాల్లో ముఖ్యంగా వామపక్ష తీవ్రవాదం ఎదుర్కోవడంలో విశేష అనుభవం ఉన్న రాముడు ఆంధ్రప్రదేశ్ మొదటి డీజీపీగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.¤ ఆంధ్రప్రదేశ్ తొలి అటవీ శాఖ ముఖ్య సంరక్షణాధికారి (పీసీసీఎఫ్)గా జోసెఫ్ నియమితులయ్యారు. » తెలంగాణ తొలి అటవీ శాఖ ముఖ్య సంరక్షణాధికారి (పీసీసీఎఫ్)గా ఎస్‌బీఎల్ మిశ్రా నియమితులయ్యారు. » ఏపీకి పీసీసీఎఫ్‌గా నియమితులైన జోసెఫ్ 1979 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి. » తెలంగాణకి పీసీసీఎఫ్‌గా నియమితులైన ఎస్.బి.ఎల్.మిశ్రా 1980 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి. |
జూన్ - 2
|
| ¤ పూర్తిస్థాయి ఛైర్మన్ నియామకం ఆలస్యం అవుతుండటంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఛైర్మన్‌గా ఆర్.కె.మల్హోత్రాకు అదనపు బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం ఆయన ఐఓసీలో డైరెక్టర్ (ఆర్అండ్‌డీ)గా విధులు నిర్వహిస్తున్నారు. » ఛైర్మన్‌గా ఉన్న ఆర్.ఎస్.బుటోలా పదవీ విరమణ నేపథ్యంలో మల్హోత్రా తాత్కాలికంగా నియమితులయ్యారు. |
జూన్ - 6
|
| ¤ ప్రస్తుతం తెహ్రీ హైడ్రోపవర్ కార్పొరేషన్ సీఎండీగా ఉన్న ఆర్.ఎస్.టి.సాయి జాతీయ జల విద్యుత్ సంస్థ (ఎన్‌హెచ్‌పీసీ) సీఎండీగా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన గుంటూరు జిల్లాకు చెందినవారు.¤ తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ మొదటి డైరెక్టర్ జనరల్‌గా వినయ్‌సింగ్ నియమితులయ్యారు. |
జూన్ - 10
|
| ¤ ప్రధానమంత్రి అదనపు ముఖ్య కార్యదర్శిగా గుజరాత్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి పి.కె.మిశ్రా నియమితులయ్యారు. మిశ్రా 1972 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. 2001 నుంచి 2004 మధ్య మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మిశ్రా ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. |
జూన్ - 11
|
| ¤ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఇంటలిజెన్స్ అదనపు డీజీపీగా మహిళా ఐపీఎస్ ఎ.ఆర్.అనురాధ నియమితులయ్యారు. » ప్రభుత్వంలో కీలకమైన ఈ పోస్టులో ఇప్పటివరకు మహిళా అధికారులెవ్వరూ పనిచేయలేదు. అనురాధ 1987 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. |
జూన్ - 12
|
| ¤ భారత ప్రభుత్వ 14వ అటార్నీ జనరల్ (ఏజీ)గా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ నియమితులయ్యారు. జి.ఇ.వాహనవతి స్థానంలో ఈ నియామకం జరిగింది. » రంజిత్ కుమార్ సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. |
జూన్ - 13
|
| ¤ తెలంగాణ రాష్ట్ర తొలి సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా ఆర్.వి.చంద్రవదన్ నియమితులయ్యారు. » చంద్రవదన్ కార్మిక, ఉపాధికల్పన శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తారని ప్రభుత్వం వెల్లడించింది. » చంద్రవదన్ ఉమ్మడి రాష్ట్రంలో సైతం సమాచార శాఖ కమిషనర్‌గా ఒకసారి పనిచేశారు. |
జూన్ - 15
|
| ¤ విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళం అధిపతిగా వైస్ అడ్మిరల్ సతీష్ సోనిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. » ఇప్పటివరకూ తూర్పు నౌకాదళంలో విధులు నిర్వర్తించిన వైస్ అడ్మిరల్ అనిల్ చోప్రా ముంబయి కేంద్రంగా ఉన్న పశ్చిమ తీర నౌకాదళాధిపతిగా బదిలీ అయ్యారు. » దక్షిణ నౌకాదళాధిపతిగా 2012 నుంచి అడ్మిరల్ సతీష్ సోని బాధ్యతలు నిర్వర్తించారు. » నౌకాదళ అధికారులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే నౌసేనా పతకం, అతి విశిష్ట సేవాపతకం, పరమ విశిష్ట సేవా పతకం తదితరాలను సతీష్ సోని అందుకున్నారు. |
జూన్ - 16
|
| ¤ భారత్, రష్యా దేశాల సంయుక్త ప్రాజెక్టు 'బ్రహ్మోస్ ఏరోస్పేస్ కార్పొరేషన్' ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా క్షిపణి శాస్త్రవేత్త సుధీర్ మిశ్రా ఎంపికయ్యారు. » ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న ఎ.శివథాను పిళ్లై స్థానంలో సుధీర్ మిశ్రా ఆగస్టు 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. |
జూన్ - 17
|
| ¤ ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా మండలి వైస్ ఛైర్మన్‌గా సి.కుటుంబరావు నియమితులయ్యారు. » ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు ఉంటారు. ఈ పదవిలో ఆయనకు క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. |
జూన్ - 18
|
¤ తెలంగాణ రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్‌గా శ్యామ్‌కుమార్ సిన్హాను ప్రభుత్వం నియమించింది. » సాధారణ పరిపాలనశాఖ (సర్వీసెస్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్యామ్‌కుమార్ సిన్హాకు ప్రభుత్వం కీలకమైన సీసీఎల్ఏ పదవిని అప్పగించింది.
|
జూన్ - 21
|
| ¤ తెలంగాణ రాష్ట్ర తొలి అడ్వకేట్ జనరల్ (ఏజీ)గా హైకోర్టు సీనియర్ న్యాయవాది కె.రామకృష్ణా రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్‌గా జె.రామచందర్ రావు నియమితులయ్యారు. » వీరి నియామకానికి సంబంధించి న్యాయశాఖ కార్యదర్శి ఎ.సంతోష్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. |
జూన్ - 24
|
| ¤ కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం విశ్రాంత ఆచార్యులు యల్లాప్రగడ సుదర్శన్‌రావుకు అత్యున్నత పదవి లభించింది. » కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ నిర్వహణలో నడిచే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రిసెర్చ్ (ఐసీహెచ్ఆర్, న్యూఢిల్లీ)కు ఆయన ఛైర్మన్‌గా నియమితులయ్యారు. » దేశవ్యాప్తంగా చరిత్రపై చేసే పరిశోధనలకు ఇది ఫెలోషిప్‌లను మంజూరు చేస్తుంది. » సుదర్శనరావు ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. |
జూన్ - 26
|
| ¤ న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ నమోదిత కంపెనీ అయిన గెరాడు స్టీల్ తన భారత కార్యకలాపాలకు అధిపతిగా శ్రీధర్ కృష్ణమూర్తిని నియమించింది. » ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రిలో 3 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యం ఉన్న స్పెషల్ బార్ క్వాలిటీ (ఎస్‌బీక్యూ) ఉక్కు ప్లాంటుకు సంబంధించిన మొత్తం వ్యాపార కార్యకలాపాలకు ఎండీ హోదాలో శ్రీధర్ బాధ్యత వహిస్తారు. » గెరాడుకు 113 ఏళ్ల చరిత్ర ఉంది. అమెరికా, ఐరోపా, ఆసియాల్లోని 14 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీకి 2.5 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యం ఉంది.¤ కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా, ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆదర్శ్ గోయల్, ప్రముఖ న్యాయవాది రోహిన్‌టన్ నారీమన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. » ఈ ముగ్గురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. వీరితోపాటు ఎంపికైన సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రహ్మణ్యం ప్రభుత్వంపై విమర్శలు చేసి స్వయంగా తప్పుకున్నారు. » అరుణ్ మిశ్రా మధ్యప్రదేశ్‌కు చెందినవారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కలకత్తా హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. » జస్టిస్ గోయల్ హర్యానాకు చెందినవారు. పంజాబ్-హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా, ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. » రోహిన్‌టన్ నారీమన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నేరుగా నియమితులైన న్యాయవాదుల్లో అయిదో వ్యక్తిగా గుర్తింపు పొందారు. |
జూన్ - 27
|
| ¤ హైదరాబాద్ సమీపంలోని మెదక్ జిల్లా పటాన్ చెరువులో ఉన్న అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్) కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ డేవిడ్ బెర్గ్‌విన్సన్ నియమితులయ్యారు. » బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ (సియాటెల్, అమెరికా) సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా ఉన్న బెర్గ్ విన్సన్ వచ్చే ఏడాది జనవరి నుంచి బాధ్యతలు చేపడతారు. » 1999 నుంచి డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తోన్న డాక్టర్ విలియం దార్ స్థానంలో బెర్గ్‌విన్సన్ నియమితులయ్యారు. |
|
|