ఆగస్టు - 2014 కమిటీలు - కమిషన్లు


ఆగస్టు - 4
¤  వివిధ రాష్ట్రాల్లో జరిగిన గనుల అక్రమ తవ్వకాల నిగ్గు తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షా కమిషన్ తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికను ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. తవ్వకాల కోసం నిబంధనలను ఇష్టానుసారంగా ఉల్లంఘించారని ఈ నివేదిక తెలిపింది. అక్రమాలకు పాల్పడినవాటిల్లో ప్రభుత్వ కంపెనీ సెయిల్, టాటా స్టీల్, ఎస్సెల్ మైనింగ్ లాంటి భారీ సంస్థలతో పాటు ఉషామార్టిన్, రుంగ్తా మైన్స్ లాంటి మధ్య, చిన్నస్థాయి సంస్థలు కూడా ఉన్నాయని పేర్కొంది.   »    జార్ఖండ్‌లో రూ.22 వేల కోట్ల విలువైన ఇనుము, మాంగనీస్ ముడి ఖనిజాన్ని అక్రమంగా తవ్వి పలు కంపెనీలు సొమ్ము చేసుకున్నాయని జస్టిస్ ఎం.బి.షా కమిషన్ వెల్లడించింది.   »    గోవాలో రూ.2,747 కోట్ల విలువైన అక్రమ ఎగుమతులు జరిగాయని తెలిపింది. ఒడిశాలోని లీజు పరిధిని అతిక్రమించి తవ్వకాలు చేపట్టారని, దాదాపు రూ.60 వేల కోట్ల మేర ఈ అవినీతి జరిగిందని పేర్కొంది.   »    ఉక్కు తయారీకి ఉపయోగించే ముడి ఖనిజాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేయడం గోవాలో భారీ ఎత్తున జరుగుతోంది.
ఆగస్టు - 13
¤  సబ్సిడీల భారాన్ని తగ్గించి, ద్రవ్యలోటును కట్టడి చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్యలు ప్రారంభించారు.   »    ఆహారం, ఎరువులు, చమురుపై సబ్సిడీలు తగ్గించి, ద్రవ్యలోటును అదుపు చేసేందుకు అవసరమైన సూచనలను ఇవ్వడానికి వ్యయ నిర్వహణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.   »    భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వం వహించే ఈ కమిషన్‌లో ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుమిత్ బోస్, ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ సుబీర్ గోకర్ణ సభ్యులుగా ఉంటారు.   »    ఈ కమిషన్ తన మధ్యంతర నివేదికను 2015 - 16 బడ్జెట్‌కు ముందు, పూర్తి స్థాయి నివేదికను 2016 - 17 బడ్జెట్‌కు ముందు అందించనుంది.
ఆగస్టు - 29 
¤  గ్యాస్ విషయంలో మార్కెట్ ఆధారిత ధరల విధానాన్ని అమల్లోకి తేవాలని కేల్కర్ కమిటీ సిఫార్సు చేసింది. ధరలకు సాధ్యమైనంత గరిష్ఠ స్థాయి ఉండటం వల్ల దేశీయంగా అన్వేషణ, వెలికితీత కార్యకలాపాలకు ఊతం లభించగలదని కమిటీ పేర్కొంది.   »    2030 నాటికి హైడ్రోకార్బన్ రంగం దిగుమతులపై ఆధారపడటాన్ని ఎలా తగ్గించుకోవచ్చన్న అంశంపై కేల్కర్ కమిటీ ఈ సిఫార్సులు చేసింది.