జులై - 2014 కమిటీలు - కమిషన్లు


జులై - 14
¤  ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌యూ బ్యాంకులు)ల్లో ప్రభుత్వ వాటాను 50 శాతం కంటే తక్కువకు తగ్గించుకోవాలని పి.జె.నాయక్ కమిటీ చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈ బ్యాంకులకు మరింత స్వయం ప్రతిపత్తిని సమకూర్చే మరొక సలహాను మాత్రం పరిశీలిస్తామని ప్రకటించింది.

   »     బ్యాంకుల్లో బోర్డుల పాలనను సమీక్షించడానికి యాక్సిస్ బ్యాంకు పూర్వ ఛైర్మన్ పి.జె.నాయక్ అధ్యక్షతన ఒక కమిటీని ఆర్‌బీఐ నియమించగా ఆ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.