సెప్టెంబరు - 2014 కమిటీలు - కమిషన్లు


సెప్టెంబరు - 2
¤  ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా పర్యావరణ చట్టాలను మార్చడం కోసం వాటిపై సమీక్ష చేయడానికి ప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.   »    ఈ కమిటీకి మాజీ కేబినెట్ కార్యదర్శి టి.ఎస్.ఆర్.సుబ్రమణియన్ నేతృత్వం వహిస్తున్నారు. మాజీ పర్యావరణ శాఖ కార్యదర్శి విశ్వనాథ్ ఆనంద్, జస్టిస్ (విశ్రాంత) ఎ.కె.శ్రీవాత్సవ్, సుప్రీం సీనియర్ న్యాయవాది కె.ఎన్.భట్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.   »    ఈ కమిటీ సభ్యులను ముఖ్యమైన పర్యావరణ రక్షణ, అటవీ, వన్యప్రాణుల, నీరు, గాలి తదితర చట్టాలపై సమీక్ష జరిపి నివేదికను రెండు నెలల్లో సమర్పించాలని పర్యావరణ శాఖ కోరింది.
సెప్టెంబరు - 17
¤  ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే విషయంలో తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని కోరింది.   »    'సెస్' ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.రాధాకృష్ణ ఈ కమిటీకి అధ్యక్షులుగా ఉంటారు.   »    సభ్యులుగా ప్రొఫెసర్ డి. నర్సింహా రెడ్డి, ప్రొఫెసర్ ఎస్.ఆర్. హషిం, ప్రొఫెసర్ షీలా ఛల్లా, ప్రొఫెసర్ ఎస్ గాలబ్, ప్రొఫెసర్ కె.హనుమంతరావు, డాక్టర్ ఎస్.ఎల్.షెట్టితోపాటు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి, ఎన్.ఐ.ఆర్.డి. డైరెక్టర్ జనరల్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సభ్యులుగా ఉంటారు.   »    వ్యవసాయ రంగ అభివృద్ధికి సంబంధించి ప్రస్తుత విధానాలు, కార్యక్రమాలు, సాంకేతిక పరిజ్ఞానం తదితరాలను సమీక్షించి అధిక ఉత్పాదన ద్వారా సమీకృత అభివృద్ధి సాధించడానికి కమిటీ తగిన సూచనలు చేస్తుంది. అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి దారితీసే కారణాలను విశ్లేషించడంతోపాటు రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో భాగంగా తీసుకునే చర్యలనూ సూచిస్తుంది.