సెప్టెంబరు - 2014 దినోత్సవాలు


సెప్టెంబరు - 5
¤  దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

  »  ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ప్రధాని మోడీ 
విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

  »  దేశవ్యాప్తంగా 80 లక్షల మంది ఉపాధ్యాయులకు ప్రధాని 
ఎస్ఎంఎస్‌లు పంపించారు.

¤  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవాన్ని గుంటూరు పోలీసు 
మైదానంలో ఘనంగా నిర్వహించింది.

  »  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 'ఫెలోషిప్' కార్యక్రమాన్ని 
ప్రకటించారు. ప్రతి మండలంలో 8వ తరగతి పైన చదువుతున్న విద్యార్థులకు 
ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. మండలానికి ఒకరు చొప్పున తెలివైన పిల్లలను 
ఎంపిక చేసి నెలకు రూ.2 వేల చొప్పున ఫెలోషిప్ ఇస్తారు.
సెప్టెంబరు - 27 
¤  ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.