ఆగస్టు - 2014 దినోత్సవాలు


ఆగస్టు - 9
¤ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విశాఖపట్నంలో అధికారికంగా నిర్వహించింది.

¤ క్విట్ ఇండియా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

        » క్విట్ ఇండియా ఉద్యమం 72వ వార్షికోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన 'ఎట్ హోం' కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పులువురు స్వాతంత్య్ర సమరయోధులకు సెల్‌ఫోన్లను బహూకరించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో దేశ శీఘ్ర ప్రగతికి గుర్తుగా వీటిని బహూకరించారు
.

        » ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు - 19
¤ ప్రపంచ ఫొటోగ్రఫీ  దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఆగస్టు - 29 
¤  జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

        » హాకీ విజార్డ్ ధ్యాన్‌చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తారు.¤  తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

        » వ్యవహారిక భాష ఉద్యమకారుడు గిడుగు రామ్మూర్తి జయంతిని
 తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తారు.

        » రాజాస్థానాలు, సంస్థానాధీశుల కొలువుల్లో తిష్టవేసిన గ్రాంథిక భాషపై 
ధ్వజమెత్తి, ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన తొలితరం భాషా శాస్త్రవేత్త గిడుగు.

        » 1863 ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో గిడుగు 
రామ్మూర్తి జన్మించారు. 1940 జనవరి 22న మరణించారు.