నవంబరు - 2014 కమిటీలు - కమిషన్లు


నవంబరు - 18 
¤ 2002 గుజరాత్ అల్లర్లపై జస్టిస్ నానావతి కమిషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్‌కు తుది నివేదికను సమర్పించింది.

       » కమిషన్ ఛైర్మన్ అయిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నానావతి, సభ్యుడైన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అక్షయ్ మెహతా సీఎంకు ఈ నివేదికను అందజేశారు.

       » గుజరాత్ అల్లర్లపై కమిషన్ 12 ఏళ్లకు పైగా విచారణ జరిపింది. 2002 మార్చి 3న రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. 24 సార్లు గడువును పొడిగించారు. చివరి పొడిగింపు గడువు అక్టోబరు 31న ముగిసింది. 2008లో కమిషన్ తన తొలి నివేదికను సమర్పించింది. ఇప్పుడు మళ్లీ రెండో నివేదికను అందజేసింది. ఇదే చివరిది కూడా.

       »
 2002 ఫిబ్రవరి 27న గోద్రా రైల్వేస్టేషన్ సమీపాన సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్ - 6 బోగీ మంటల్లో చిక్కుకోవడం వెనుక కుట్ర ఉందని, అది ప్రమాదం కాదని కమిషన్ తన మొదటి నివేదికలో పేర్కొంది. రెండో నివేదిక ఇంకా వెల్లడి కాలేదు.