ఫిబ్రవరి - 2014 గ్రంథాలు - రచయితలు


ఫిబ్రవరి - 16
¤  'మీటింగ్స్ విత్ రిమార్క్‌బుల్ ఉమెన్' పేరిట కాంగ్రెస్ సీనియర్ నేత కరణ్‌సింగ్ ఒక పుస్తకాన్ని రచించారు.   »    భారత్‌లో చీకటి రోజులుగా పేర్కొనే ఎమర్జెన్సీ (1975) ముగిసిన అనంతరం రాజీనామా చేయాల్సిందిగా తాను ఇందిరాగాంధీని కోరినట్లు కరణ్‌సింగ్ ఈ పుస్తకంలో వెల్లడించారు. కానీ, ఆమె స్పందించలేదని కరణ్‌సింగ్ పేర్కొన్నారు.
¤  కేంద్ర ఆహారమంత్రి కె.వి.థామస్ 'సోనియా - ద బిలౌడ్ ఆఫ్ ద మాసెస్' పేరిట పుస్తకాన్ని రచించారు.   »    పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఆయనకు, సోనియాకు మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవని ఈ పుస్తకంలో థామస్ వివరించారు.