అక్టోబరు - 2014 కమిటీలు - కమిషన్లు


అక్టోబరు - 17 
¤ డీమ్డ్ స్థాయి ప్రశ్నార్థకంగా మారిన ఏడు విశ్వవిద్యాలయాల్లో తనిఖీలు నిర్వహించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అయిదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది.      » పి.ఎన్.టాండన్ కమిటీ నిషేధిత జాబితాలో ఉంచిన డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన, బోధనా సిబ్బందిపై తనిఖీల కోసం సుప్రీంకోర్టు సూచనల మేరకు ఈ ఏర్పాటు జరిగింది.      » ఈ కమిటీకి యూజీసీ కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. నివేదికను నెలలోపు సమర్పించాల్సి ఉంటుంది.      » టాండన్ కమిటీ మొత్తం 41 డీమ్డ్ విశ్వవిద్యాలయాలను నిషేధిత జాబితాలో ఉంచింది.
అక్టోబరు - 28
¤ ఇప్పటికే తవ్వకాలు జరుగుతున్న, ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న బొగ్గు గనులకు చెల్లించాల్సిన నష్ట పరిహారాన్ని అంచనా వేసేందుకు మాజీ సీవీసీ అయిన ప్రత్యూష్ సిన్హా నేతృత్వంలో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. బొగ్గు, ఇంధన, ఆర్థిక, న్యాయశాఖ అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు.
      » బొగ్గు గనుల కేటాయింపుల కుంభకోణం పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గత సెప్టెంబరు 24న 1993-2009 మధ్య కాలంలో వివిధ కంపెనీలకు కేటాయించిన 204 బొగ్గు గనులను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. ఇందులో 37 ఇప్పటికే తవ్వకాలు జరుగుతున్న గనులు కాగా, మరో 5 వచ్చే ఏప్రిల్ నాటికల్లా ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయి. ఈ 42 గనులకు సంబంధించిన ఆస్తుల విలువను విడివిడిగా అంచనా వేయాల్సిందిగా కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.