మే - 2014 నియామకాలు


మే - 1
¤   ఫోర్డ్ మోటార్ కంపెనీ తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా మార్క్ ఫీల్డ్స్‌ను ప్రకటించింది.   »    ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలన్ ములాలీ జులై 1న వైదొలగుతారు. ఆయన స్థానంలో మార్క్ ఫీల్డ్స్ పదవి చేపట్టనున్నారు..¤   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు (ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్)గా హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అశుతోష్ మొహంతా నియమితులయ్యారు.   »    ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి పదోన్నతితో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లడంతో హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ మొహంతాను ఈ పదవిలో నియమించారు.
 మే - 3
¤   భారత సంతతికి చెందిన జవహర్ కలియానీ అమెరికా ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవిలో నియమితులయ్యారు.   »    అమెరికా ఆర్థిక వ్యవహారాల శాఖలో కీలక బాధ్యతలు ఆయనకు అప్పగించారు. కంప్ట్రోలర్ ఆఫ్ కరెన్సీ కార్యాలయం (ఓసీసీ)లో డిప్యూటీ చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు.   »    జవహర్ కలియానీ ముంబయిలోని వీర్‌మాతా జిజియాబాయి టెక్నలాజికల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
 మే - 13
¤    డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీలో ఉన్నత స్థానాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.   »    ఇప్పటివరకూ వైస్‌ఛైర్మన్, సీఈఓగా ఉన్న సతీష్‌రెడ్డి కంపెనీఛైర్మన్‌గా నియమితులయ్యారు.   »    కంపెనీ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ అయిన డాక్టర్ కె.అంజిరెడ్డి ఏడాది క్రితం మరణించారు. ఆయన స్థానంలో జి.వి.ప్రసాద్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. తాజాగా ప్రసాద్ ఆ పదవి నుంచి తప్పుకోగా, సతీష్‌రెడ్డి కొత్త ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఇక వైస్‌ఛైర్మన్, ఎండీ, సీఈఓ బాధ్యతలను జి.వి.ప్రసాద్ చేపట్టారు.   »    సతీష్‌రెడ్డి నిర్వహించిన సీఓఓ (ముఖ్య కార్యకలాపాల అధికారి) బాధ్యతలను అభిజిత్ ముఖర్జీకి అప్పగించారు.
 మే - 15
¤    కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఛైర్మన్‌గా, కేంద్ర ప్రభుత్వ ఎక్స్ అఫిషియో కార్యదర్శిగా బి.పాండ్యా నియమితులయ్యారు.   »    1977లో సీడబ్ల్యూసీలో సహాయ సంచాలకుడిగా చేరిన పాండ్యా ఈ విభాగంలో, జలవనరుల మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాల్లో పలు బాధ్యతలు నిర్వర్తించారు.
 మే - 21
¤    జమ్మూకాశ్మీర్ రాష్ట్ర డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్)గా తెలుగు తేజం కె.రాజేంద్రకుమార్ నియమితులయ్యారు.   »    ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆయన నియామకానికి ఆమోదం తెలిపారు.   »    ప్రస్తుత డీజీపీ అశోక్‌ప్రసాద్ (ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందినవారే) కేంద్ర నిఘా విభాగం ప్రత్యేక సంచాలకులుగా బదిలీ కావడంతో, ఆయన స్థానంలో రాజేంద్రకుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.¤    తెలంగాణ జెన్‌కో ఛైర్మన్‌గా సుశీల్‌కుమార్ జోషీ నియమితులయ్యారు.
   »    రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేకంగా జెన్‌కోను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏర్పడిన మొదటి కంపెనీ ఇదే కావడం గమనార్హం.
 మే - 22
¤    కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) మాజీ అధిపతి రాజీవ్ మాధుర్ కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్ (సీఐసీ)గా బాధ్యతలు చేపట్టారు.   »    న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాజీవ్ మాధుర్‌చేత ప్రమాణ స్వీకారం చేయించారు.   »    మాధుర్ ఈ ఏడాది ఆగస్టు 23 వరకు సీఐసీగా ఉంటారు.   »    65 ఏళ్ల వయసు వచ్చే వరకు లేదా అయిదేళ్ల పదవీ కాలం పూర్తయ్యే వరకు సీఐసీ ఆ పదవిలో ఉండవచ్చు.   »    యూపీ క్యాడర్‌కు చెందిన విశ్రాంత ఐపీఎస్ అధికారి మాధుర్ గతంలో తాను అందించిన సేవలకు ఇండియన్ పోలీస్ మెడల్, రాష్ట్రపతి పోలీస్ మెడల్ వంటి విశిష్ట పురస్కారాలను పొందారు. 2012లో సీఐసీలో సమాచార కమిషనర్‌గా చేరారు.
 మే - 23
¤    నాగాలాండ్ కొత్త ముఖ్యమంత్రిగా నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) నేత టి.ఆర్.జెలియాంగ్ నియమితులయ్యారు.   »    ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో నాగాలాండ్ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన ప్రస్తుత ముఖ్యమంత్రి నిప్యూ రియో సీఎం పదవికి, శాసనసభా స్థానానికి రాజీనామా చేయడంతో జెలియాంగ్‌ను గవర్నర్ అశ్వినీ కుమార్ కొత్త సీఎంగా నియమించారు.
 మే - 30
¤    మాజీ ఐపీఎస్ అధికారి అజిత్‌కుమార్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు.   »    ప్రధానిగా నరేంద్ర మోడీ పదవిలో ఉన్నంత కాలం లేదా తదుపరి ఉత్తర్వు ఇచ్చే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.   »    అజిత్ కుమార్ దోవల్ భారత్-చైనా సరిహద్దు అంశంపై ప్రధాని ప్రత్యేక ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తారు.   »    1968 బ్యాచ్, కేరళ క్యాడర్‌కు చెందిన దోవల్ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా 2005లో పదవీ విరమణ చేశారు. సర్వీసులో చేరిన ఆరేళ్లలోనే రాష్ట్రపతి పోలీసు పతకం పొందిన తొలి ఐపీఎస్ అధికారి ఆయనే. సైనిక పురస్కారం 'కీర్తిచక్ర' అందుకున్న మొట్టమొదటి ఐపీఎస్ గా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 1999లో భారత విమానాన్ని హైజాక్ చేసి కాందహార్‌కు మళ్లించినప్పుడు, హైజాకర్లతో చర్చలు జరిపిన ప్రధాన దూత ఆయనే.   »    అమృతసర్ స్వర్ణ దేవాలయంలో నక్కిన ఉగ్రవాదుల ఏరివేతకు పంజాబ్ పోలీసులు, జాతీయ భద్రతా దళం చేపట్టిన ఆపరేషన్‌లో పాల్గొన్న ఐబీ అధికారుల బృందానికి దోవల్ నేతృత్వం వహించారు.   »    ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా 'వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను దోవల్ నడుపుతున్నారు.
 మే - 31
¤    నౌకాదళ వైస్ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ సునీల్ లాంబా నియమితులయ్యారు. ఆయన ఇప్పుడు 'జాతీయ రక్షణ కళాశాల' కమాండెంట్‌గా ఉన్నారు.   »    ప్రస్తుతం నౌకాదళ అధిపతిగా ఉన్న అడ్మిరల్ రాబిన్ థోవన్ 2016 మే లో పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన స్థానంలో సునీల్ లాంబా బాధ్యతలు చేపడతారు.   »    విశాఖపట్నం కేంద్రంగా పని చేసే నౌకాదళ తూర్పు కమాండ్ అధిపతిగా ఉన్న వైస్ అడ్మిరల్ అనిల్ చోప్రాను ప్రభుత్వం ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు సాగించే పశ్చిమ కమాండ్‌కు బదిలీ చేసింది. దక్షిణ కమాండ్ (కోచి) అధిపతి వైస్ అడ్మిరల్ సతీష్ సోనీని తూర్పు కమాండ్ కు పంపింది. వ్యూహాత్మక దళాల కమాండర్‌గా ఉన్న ఎస్.పి.ఎస్.చీమా ను దక్షిణ కమాండ్‌కు బదిలీ చేసింది.