ఆగస్టు - 4
|
¤ నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో సంభవించిన తీవ్ర భూకంపంలో మృతుల సంఖ్య సుమారు 400కు చేరింది.¤ మహారాష్ట్రలోని పుణె జిల్లా మాళిన్ గ్రామంపై పెద్దఎత్తున కొండ చరియలు విరిగిపడిన దుర్ఘటనలో మరణించినవారి సంఖ్య 130 కి చేరింది. |
ఆగస్టు - 6
|
¤ మహారాష్ట్రలోని పుణె జిల్లా మాళిన్ గ్రామంలో కొండ చరియలు విరిగిపడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 153కు చేరింది.¤ నేపాల్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మొత్తం 156 మంది మరణించినట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. |
ఆగస్టు - 17
|
¤ మెక్సికన్ అడవిలో దట్టమైన వృక్ష సమూహాల మధ్య మరుగునపడిన రెండు పురాతన మాయన్ పట్టణాలు వెలుగుచూశాయి. » మెక్సికోలోని ఆగ్నేయ రాష్ట్రం కాంపెచేలో ఉన్న అడవిలో మాయన్ సంస్కృతిని ప్రతిబింబిస్తున్న ఈ రెండు పట్టణాల శిథిలాలను 'స్లొవేనియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ ఆర్ట్స్'కు చెందిన పురావస్తు శాస్త్రవేత్త ఇవాన్ స్పార్క్ బృందం కనుక్కుంది. » గతేడాది ఛాక్టమ్ అనే మాయన్ నగరాన్ని కనుక్కున్న ఇవాన్ బృందం ఆ పరిసర ప్రాంతాల్లో అన్వేషణ సాగిస్తూ ఈ కొత్త పట్టణాల అవశేషాలను గుర్తించింది. » కొత్తవాటిలో 'లాగనిటా' అనే పట్టణంలో భారీ భూతం నోరు తెరచి ఉన్నట్లుగా ముఖద్వారం, మాయన్ల సంస్కృతిని కళ్లకు కట్టే కట్టడాల అవశేషాలు వెలుగుచూశాయి. రాజభవనాల్లాంటి అనేక నిర్మాణాలు, నాలుగు పెద్ద ప్లాజాల ఆనవాళ్లు కూడా ఉన్నాయి. లాగనిటాలోని 65 అడుగుల ఎత్తయిన పిరమిడ్ దేవాలయం, రాతి కట్టడాలు, శిలాశాసనాలు మాయన్ల విశ్వాసాలను తెలియజేస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. » లోతైన బావి అనే అర్థం వచ్చేలా 'టామ్ చెన్' అనే పేరు గల రెండో పట్టణంలో వాన నీటి నిల్వ కోసం భూగర్భ గదులతో నిర్మించిన 30 బావులు, దర్బారు లాంటివి కూడా బయటపడ్డాయి. |
ఆగస్టు - 18
|
¤ బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలో కాపలాదారు ఉండే ఒక రైల్వే క్రాసింగ్ వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. » డెహ్రాడూన్ నుంచి గోరఖ్‌పూర్ వెళ్తున్న రాప్తీ - గంగా ఎక్స్‌ప్రెస్ రైలు కిక్కిరిసిన ఓ ఆటోను ఢీకొట్టడంతో ఆటోలోని 20 మంది ప్రాణాలు కోల్పోయారు. » సెమ్రా - సుగౌలి రైల్వేస్టేషన్ల మధ్య చినౌటా గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది.¤ 70 అంతస్తులతో నిర్మించతలపెట్టిన సుమారు 213 మీటర్ల ఎత్తయిన
చంద్రోదయ మందిర్ నిర్మాణ పనులు ఆగ్రాలో ప్రారంభమయ్యాయి. » అచ్చంగా అలనాటి శ్రీకృష్ణుడి బృందావనం తరహా పరిసరాల్లో తీర్చిదిద్దనున్న ఈ సువిశాల ఆలయ ప్రాంగణ నిర్మాణానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ శంకుస్థాపన చేశారు. » ఈ గుడి నిర్మాణాన్ని అయిదేళ్లలో పూర్తిచేయాలని 'ఇస్కాన్' (ISKCON - ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్) సంకల్పించింది. » ఆలయ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గుడిగా 'చంద్రదోయ మందిరం' ప్రత్యేకతను సాధిస్తుంది. ఈ గుడి నిర్మాణానికి రూ.300 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా.
|
ఆగస్టు - 20
|
¤ ప్రపంచంలోనే తొలి పర్యావరణ హిత హిందూ ఆలయాన్ని లండన్‌లో ప్రారంభించారు. భారత సంస్కృతిని ప్రతిబింబించేలా 20 మిలియన్ పౌండ్లు (రూ.202 కోట్లు)తో నిర్మించిన శ్రీ స్వామినారాయణ్ మందిరం కోసం సౌర విద్యుత్ సదుపాయం, వర్షపునీటి సద్వినియోగానికి ఇంకుడు గుంతల వ్యవస్థ ఏర్పాటు చేశారు. » ఈ ఆలయాన్ని ఆలయ ఆధ్యాత్మిక కర్త ఆచార్య స్వామి శ్రీ మహరాజ్ ప్రారంభించారు.
|
ఆగస్టు - 23
|
¤ 1200 ఏళ్ల కిందటి పురాతన సమాధిని చైనా పురాతత్వ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. క్రీ.శ.618 నుంచి 907 వరకూ కొనసాగిన టాంగ్ సామ్రాజ్యంలో పనిచేసిన ఒక ఉన్నతాధికారి, ఆయన భార్యకు సంబంధించిన సమాధిగా దీన్ని గుర్తించారు. » ఇది షాంక్సీ రాష్ట్రంలోని ఛాంగాన్ జిల్లాలో గ్సియాన్ అనే నగరంలో 11 మీటర్ల లోతులో 40 మీటర్ల పొడవున ఉంది. సమాధిలో ఉన్న చిత్రాలు, కళాఖండాలు ఇన్ని వందల ఏళ్లు గడిచినప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. |
ఆగస్టు - 25
|
¤ మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లా ప్రధాన కేంద్రానికి సమీపంలోని కాంతానాథ్ పహాడ్ ఆలయంలో 'సోంవతి అమావాస్య' సందర్భంగా భక్తులు పోటెత్తిన నేపథ్యంలో తొక్కిసలాట జరిగి 10 మంది మృతి చెందారు. ¤ నేల మీద, నీటి పై కూడా ప్రయాణించగల ఉభయతారక 'సీప్లేన్' సర్వీసు దేశంలోనే తొలిసారిగా ముంబయి నుంచి ప్రారంభమైంది. ఈ సర్వీసును లోనావాలా వరకు నడిపారు. » ముంబయిలోని 'మారిటైమ్ ఎనర్జీ హెలీ ఎయిర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (మెహ్ ఎయిర్)' వీటిని నిర్వహిస్తోంది. |
ఆగస్టు - 27
|
¤ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జార్జండ్‌లోని జాసిదిలో నిర్మించిన భారీ పెట్రోలియం నిల్వ సమదాయాన్ని (టెర్మినల్) ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతికి అంకితం చేశారు. » హల్దియా - బారౌనీ పైపులైను ద్వారా శుద్ధిచేసిన చమురు ఉత్పత్తులు ఈ టెర్మినల్‌కు చేరతాయి. ఈ కేంద్రంలో 31,600 కిలోలీటర్ల పెట్రోల్, డీజిల్, కిరోసిన్‌ను నిల్వ చేయవచ్చు. |
|
|