ఏప్రిల్ - 2014 కమిటీలు - కమిషన్లు


ఏప్రిల్ - 15
¤  అఖిల భారత సర్వీస్ అధికారులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించేందుకు సలహాలు, సూచనలు ఇచ్చే కమిటీ ఛైర్మన్‌గా శామ్యూల్ పదవీ కలాన్ని మరో రెండునెలలు పొడిగించారు.   »    ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ శామ్యూల్ గత నెలాఖరున పదవీ విరమణ చేశారు. కానీ, కమిటీకి నిర్దేశించిన పని పూర్తి కాకపోవడంతో ఆయనను 'నిపుణులైన కన్సల్టెంట్ హోదాలో మే 31 వరకు కొనసాగించాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.