మార్చి - 2014 నియామకాలు


మార్చి - 1
¤   హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) చైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా నిషీ వాసుదేవ బాధ్యతలు స్వీకరించారు.
   »    ఒక ప్రభుత్వరంగ సంస్థలో  స్థాయి పదవిని చేపట్టిన తొలి మహిళమే కావడం గమనార్హం.
   »    సుబీర్ రాయ్ చౌధురి స్థానంలో ఈ నియామకం జరిగింది.   »    ఒక ప్రభుత్వరంగ చమురు సంస్థ బోర్డులో స్థానం దక్కించుకున్న తొలి మహిళగా 2011 జులైలో నిషీ వాసుదేవ చరిత్ర సృష్టించారు. ఐఐఎం కోల్‌కతాలో ఆమె మేనేజ్‌మెంట్ పట్టా అందుకున్నారు.   »    హెచ్‌పీసీఎల్ ఎల్‌పీజీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, భాగ్యనగర్ గ్యాస్‌కు చైర్‌పర్సన్‌గా కూడా ఆమె పని చేశారు.¤   ఓఎన్‌జీసీ (ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్) నూతన సీఎండీగా దినేష్ కె.సరాఫ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. సుధీర్ వాసుదేవ స్థానంలో ఆయన నియమితులయ్యారు.
మార్చి - 2
¤   లోక్‌సభ కార్యదర్శిగా ఉన్న పి.శ్రీధరన్‌ను లోక్‌సభ సెక్రటరీజనరల్‌గా ప్రభుత్వం నియమించింది.   »    లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా ఉన్న ఎస్.బాల్‌శేఖర్ ఆ పదవి నుంచి తప్పుకోవడంతో పి.శ్రీధరన్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు.
మార్చి - 3
¤   కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కొత్త ఛైర్మన్‌గా ఆర్.కె.తివారీ బాధ్యతలు స్వీకరించారు.   »    ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేసిన సుధాశర్మ స్థానంలో తివారీ బాధ్యతలు చేపట్టారు.   »    తివారీ 1976 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారి.
మార్చి - 4

¤   ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కేరళ గవర్నర్‌గా నియమితులయ్యారు.
   »    షీలాదీక్షిత్ 1998 నుంచి 2013 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1984 నుంచి 1989 వరకు ఉత్తర ప్రదేశ్‌లోని కనౌజ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.
   »    ప్రస్తుతం కేరళ గవర్నర్‌గా ఉన్న నిఖిల్ కుమార్ రాజీనామా చేయడంతో షీలాదీక్షిత్‌ను ఈ పదవిలో నియమించారు.   »    గతేడాది డిసెంబరులో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేతిలో షీలాదీక్షిత్ ఘోర పరాజయం పాలయ్యారు.
మార్చి - 5
¤   ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా బి.ఎల్.జోషి పదవిని మరో సారి పొడిగిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ ప్రకటించింది.   »    78 ఏళ్ల జోషి 2009 జులై 28న ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
మార్చి - 6
¤   జాతీయ షెడ్యూల్డ్ కమిషన్ సభ్యురాలిగా బద్వేలు మాజీ ఎమ్మెల్యే కమలమ్మ నియమితులయ్యారు.   »    జాతీయ కమిషన్‌లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్, మరో ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరి పదవీకాలం మూడేళ్లు.
మార్చి - 10
¤   ఫెడరేషన్ ఆఫ్ ఏపీ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియషన్ (ఫ్యాప్సియా) ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాష్ట్ర అధ్యక్షుడిగా ఒంగోలుకు చెందిన కె.సుబ్బారావు నియమితుడయ్యారు.

¤   క్రిషక్ భారతీ కో ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిభ్‌కో) నూతన మేనేజింగ్ డైరెక్టర్‌గా తెలుగువాడైన ఎన్.సాంబశివరావు నియమితుడయ్యారు.
   »    ఈ సంస్థకు ఎండీగా నియమితులైన వ్యక్తుల్లో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన తొలి వ్యక్తి సాంబశివరావే.
   »    క్రిభ్‌కో సంస్థ రైతుల అభ్యున్నతి కోసం కృషి చేస్తుంది.
మార్చి - 15
¤   మ‌రో ఇండో అమెరిక‌న్‌కు అక్కడి ప్రభుత్వంలో కీల‌క ప‌ద‌వి ల‌భించింది. ఆ దేశ వాణిజ్య శాఖ అసిస్టెంట్ సెక్రట‌రీ, అంత‌ర్జాతీయ వ్యాపార సంస్థ (ఐటీఏ)లో అమెరికా, విదేశీ వాణిజ్య సేవ‌ల డైర‌క్టర్ జ‌న‌ర‌ల్‌గా అరుణ్ ఎం.కుమార్ నియామ‌కాన్ని ఎగువ‌స‌భ (సెనేట్‌) ఆమోదించిందని వాణిజ్య మంత్రి పెన్నీ ప్రిట్జ్‌క‌ర్ తెలిపారు.   »    ఈ ప‌దవి ద్వారా అంత‌ర్జాతీయ మార్కెట్లలో అమెరికా కంపెనీల‌కు తోడ్పాటు అందించే ఏజెన్సీకి అరుణ్ కుమార్ నేతృత్వం వ‌హిస్తారు.   »    కుమార్ కేర‌ళ యూనివ‌ర్సిటీ నుంచి భౌతిక‌శాస్త్రంలో డిగ్రీ ప‌ట్టా పొందారు. త‌ర్వాత అమెరికాలోని మ‌సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ నుంచి మేనేజ్‌మెంట్ లో ఎస్ఎం ప‌ట్టా పుచ్చుకున్నారు.
మార్చి - 28
¤ నాటో సెక్రటరీ జనరల్‌గా నార్వే మాజీ ప్రధాని జెన్స్‌ స్టోలెన్‌బర్గ్ ఎంపికయ్యారు. ప్రస్తుత చీఫ్‌ ఆండర్స్‌ ఫాగ్‌ రాస్‌ముస్సెన్‌ స్థానంలో ఆయన ఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచి బాధ్యతలు చేపడతారు  »     స్టోలెన్‌బర్గ్ ఆర్థికవేత్త. యువకుడిగా ఉన్నప్పుడు నాటోను ఆయన వ్యతిరేకించడం గమనార్హం.  »     క్రిమియాను చేజిక్కించుకున్నాక రష్యా సైనిక మోహరింపులు పెరగడం ఐరోపాను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో 28 దేశాల రక్షణ కూటమికి స్టోలెన్‌బర్గ్‌ నాయకత్వం వహించనున్నారు. ఆయన ప్రస్తుతం నార్వే లేబర్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.