ఫిబ్రవరి - 2014 నియామకాలు


ఫిబ్రవరి - 4
¤  ప్రపంచ అగ్రగామి సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈఓగా తెలుగు తేజం సత్య నాదెళ్ల నియమితులయ్యారు.   »    38 ఏళ్ల మైక్రోసాఫ్ట్ చరిత్రలో ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయుడు ఆయనే కావడం గమనార్హం.   »    స్టీవ్ బామర్ స్థానంలో ఆయన నియమితులయ్యారు.
   »    ఒక అమెరికా కంపెనీలో, అందునా మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలో బిల్‌గేట్స్, స్టీవ్ బామర్ తర్వాత సీఈఓ పదవి చేపట్టిన వ్యక్తిగా నాదెళ్ల నిలిచారు. ఇది ఒక భారతీయుడికి లభించిన అరుదైన గౌరవం.   »    ప్రస్తుతం స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న జాన్ థాంప్సన్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ స్థానంలో ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక బిల్‌గేట్స్ సాంకేతిక సలహాదారుగా వ్యవహరించనున్నారు. బోర్డు సభ్యుడిగా కూడా కొనసాగనున్నారు.   »    సత్య నాదెళ్ల అలియాస్ నాదెళ్ల సత్యనారాయణ చౌదరి స్వస్థలం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం. గతంలో ప్రధానమంత్రి వ్యక్తిగత కార్యదర్శిగా, ప్రణాళికా సంఘం సభ్యుడిగా, ఇతర హోదాల్లో పనిచేసి, ప్రజాసంక్షేమం, పరిపాలనలో తనదైన ముద్ర వేసి జాతీయస్థాయిలో పేరుగాంచిన మాజీ ఐఏఎస్ అధికారి బి.ఎన్.యుగంధర్ కుమారుడే సత్య.
ఫిబ్రవరి - 5
¤  అమెరికాలోని ప్రఖ్యాత ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ డీన్‌గా భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ సంజీవ్ కులకర్ణి నియమితులయ్యారు.   »    మార్చి 31న కులకర్ణి పదవి చేపట్టనున్నారు. విలియం రస్సెల్ స్థానంలో కులకర్ణి నియమితులయ్యారు.
ఫిబ్రవరి - 7
¤  కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అదనపు సంచాలకులుగా తమిళనాడు కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అర్చన రామ సుందరం నియమితులయ్యారు.   »    ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డులకెక్కారు.
 ఫిబ్రవరి - 8
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితుడయ్యారు.ఆయన నియామకానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు
ఫిబ్రవరి - 11
¤  రాష్ట్ర ఉపలోకాయుక్తగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్జి టి.గంగిరెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకానికి గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు.
ఫిబ్రవరి - 12
¤  ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్‌కుమార్ అగర్వాల్‌లు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు.
   »    వీరిద్దరి పదోన్నతితో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 31కి పెరిగింది.

ఫిబ్రవరి - 16

¤   సీబీఐ జేడీగా ప్రముఖుడైన మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారిలక్ష్మీనారాయణను థానే జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా నియమించారు.
   »    తెలుగు వారైన లక్షీనారాయణ ఐపీఎస్‌గా ఎంపికై, కేంద్ర సర్వీసులకు డెప్యుటేషన్‌పై వెళ్లారు. ఆ తర్వాత హైదరాబాద్ సీబీఐ డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. దేశంలోనే సంచలనం రేకెత్తించిన ఓబులాపురం మైనింగ్ కుంభకోణం, జగన్ అక్రమాస్తుల కేసు, ఎమ్మార్ ప్రాపర్టీస్ వంటివి ఆయన హయాంలోనే ప్రముఖంగా వెలుగు చూశాయి. గత ఏడాది జూన్ 13న సీబీఐ జేడీ బాధ్యతల నుంచి తప్పుకుని, ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా మహారాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. తాజాగా ఆయనను థానే జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా నియమించింది.
ఫిబ్రవరి - 18
¤    ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా అదపాక సత్యారావు బాధ్యతలు స్వీకరించారు.
¤    ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉప కులపతిగా డాక్టర్ రవిరాజు నియమితులయ్యారు.
ఫిబ్రవరి - 19
  ¤    ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (బెంగళూరు) గవర్నర్ల బోర్డుకు ఛైర్‌పర్సన్‌గా బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా నియమితులయ్యారు.
   »    ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.
  »    ఎనిమిదేళ్లుగా ఈ బోర్డుకు ఛైర్మన్‌గా ఉన్న రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ వైదొలగడంతో ఆ స్థానంలో కిరణ్ మజుందార్ షా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఫిబ్రవరి - 26

¤    ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా దినేష్ కె.సరాఫ్ నియమితులయ్యారు.  »    ప్రస్తుతం సరాఫ్ ఓఎన్‌జీసీ విదేశ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.  »    సుధీర్ వాసుదేవ్ స్థానంలో ఈ నియామకం జరిగింది.
¤    కెనడాలో భారత సాంస్కృతిక రాయబారిగా వ్యవహరిస్తున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను ఆగ్రాలోని కేంద్రీయ హిందీ సంస్థాన్ ఉపాధ్యక్షుడిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది.  »    తెలుగువాడైన మోటూరు సత్యనారాయణ 1960లో ప్రారంభించిన ఈ ప్రతిష్ఠాత్మక సంస్థకు ఉపాధ్యక్షుడిగా ఎంపికైన తొలి తెలుగు వ్యక్తిగా ఆయనకు ఈ గుర్తింపు లభించింది.
ఫిబ్రవరి - 27
¤    కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్ఎఫ్) మాజీ డైరెక్టర్ రాజీవ్ కేంద్ర నిఘా సంఘం (సీవీసీ)లో విజిలెన్స్ కమిషనర్‌గా నియమితులయ్యారు.  »    ప్రధాని మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాజీవ్‌ను ఈ పదవిలో నియమించారు. ఆయన పదవిలో నాలుగేళ్లపాటు కొనసాగుతారు.
 ఫిబ్రవరి - 28
¤ జనరల్ మోటార్స్ (జీఎం) భారత విభాగానికి అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్‌గా అరవింద్ సక్సేనా నియమితులయ్యారు. లోవెల్ పాడక్ స్థానంలో ఆయన నియమితులయ్యారు.