ఏప్రిల్ - 2014 గ్రంథాలు - రచయితలు


 ఏప్రిల్ - 22
¤ దివంగత ఉర్దూ రచయిత ప్రొఫెసర్ ఎస్.ఎం.హస్నైన్ పై సాహిత్య అకాడమీ ప్రచురించిన 'మోనోగ్రాఫ్' ఉర్దూ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ న్యూఢిల్లీలో ఆవిష్కరించారు.     » మోనోగ్రాఫ్ పుస్తక రచయిత షెహజాద్ అంజుం.¤ రెండు పర్యాయాలు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా పనిచేసిన టి.ఎస్.ఆర్.సుబ్రహ్మణియన్ 'ఇండియా ఎట్ టర్నింగ్ పాయింట్: ది రోడ్ టు గుడ్ గవర్నెన్స్' పేరిట రచించిన పుస్తకాన్ని విడుదల చేశారు.     » రచయిత తన పుస్తకంలో యూపీఏ-2 హయాంలోని చీకటి కోణాలను, చేదు నిజాలను వెల్లడించారు. పరిపాలన వ్యవస్థ దారుణంగా కుప్పకూలిపోయిందని పేర్కొన్నారు.
 ఏప్రిల్ - 23
¤  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి 'సిటీస్ అండ్ పబ్లిక్ పాలసీ, యాన్ అర్బన్ ఎజెండా ఫర్ ఇండియా' పేరిట రచించిన పుస్తకాన్ని న్యూఢిల్లీలో ప్రఖ్యాత ఆర్థికవేత్త ఈషర్ అహ్లువాలియా ఆవిష్కరించారు.¤  సచిన్ టెండూల్కర్‌పై చెన్నైకి చెందిన రుడాల్ఫ్ లాంబెర్ట్ ఫెర్నాండెజ్ 'గ్రేటర్ దేన్ బ్రాడ్‌మన్' పేరిట పుస్తకాన్ని రచించారు.     » ఆస్ట్రేలియాకు చెందిన బ్రాడ్‌మన్ కంటే సచినే గొప్పని రచయిత పుస్తకంలో పేర్కొన్నారు. బ్రాడ్‌మన్ కంటే సచిన్ బెస్ట్ అని చెప్పే లక్ష్యంతో ఈ పుస్తకాన్ని రచించినట్లు రచయిత తెలిపారు.     » సచిన్ 41వ జన్మదినం (ఏప్రిల్ 24) సందర్భంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.