మార్చి - 5
|
| ¤ అమెరికా రచయిత్రి వెన్‌డీ డానిగర్ రచించిన 'ఆన్ హిందూయిజం' పుస్తకాన్ని తాము భారత మార్కెట్ నుంచి ఉపసంహరించలేదని ప్రచురణ సంస్థ అలెఫ్ బుక్ కంపెనీ ప్రకటించింది. » హిందుత్వ గ్రూపుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో డానిగర్ రాసిన 'ద హిందూస్; యాన్ ఆల్టర్నేటివ్ హిస్టరీ' పుస్తకాన్ని ప్రచురణ సంస్థ పెంగ్విన్ ఇటీవలే భారత మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది. ఆ పుస్తకం మాదిరే వివాదాస్పద 'ఆన్ హిందూయిజం' పుస్తకం కూడా ఉపసంహరణను ఎదుర్కోక తప్పదనే ప్రచారం సాగుతున్న తరుణంలో ప్రచురణ సంస్థ అలెఫ్ తాజా ప్రకటన చేసింది. |
మార్చి - 14
|
¤ బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్ రచించిన 'క్రుసేడర్ ఆర్ కాన్స్‌పిరేటర్? కోల్‌గేట్ అండ్ అదర్ ట్రూత్స' పుస్తకాన్ని న్యూఢిల్లీలో విడుదల చేశారు. |
|
|