మార్చి - 1
|
¤ 157 ఏళ్ల క్రితం బ్రిటిష్ సైనికదళాలు 200 మందికి పైగా భారతీయులను ముంచి వేసిన బావి 'షహీదాన్ దా ఖు' నుంచి 40కి పైగా భారత సైనికుల మృతదేహాల అవశేషాలను వెలికి తీశారు. స్థానిక స్వచ్ఛంద సంస్థకు చెందిన వాలంటీర్లు, గురుద్వారా నిర్వహణ కమిటీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. » 1857 తిరుగుబాటు సందర్భంగా లాహోర్‌లోని మియాన్‌మీర్ కంటోన్మెంట్‌లో దాదాపు 500 మంది భారత సైనికులు తిరుగుబాటు చేశారు. వీరంతా అమృతసర్‌లోని అజ్నాలాను చేరుకునేందుకు రావి నదిని ఈదుకుంటూ వచ్చారు. అందులో 218 మందిని బ్రిటిష్ సైనికులు అజ్నాలా సమీపంలోని దాడియన్ సోఫియన్ గ్రామం వద్ద హతమార్చి, కాల్చి, మృతదేహాలను ఓ బావిలోకి విసిరేశారు. తర్వాత అది 'షహీదాన్ దా ఖు' గా పేరొందింది. |
మార్చి - 2
|
¤ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దమనకాండకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన అజ్నాలా పట్టణంలోని షహీదాన్ దా ఖూ (మృతవీరుల) బావి నుంచి మొత్తం 282 మంది భారతీయ సైనికుల అస్తిపంజరాల వెలికితీత కార్యక్రమం పూర్తయింది. |
¤ సచిన్ టెండూల్కర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ముంబయిలోని సచిన్ టెండూల్కర్ ఇంటివద్ద 25 అడుగుల ఎత్తు, 2 టన్నుల బరువున్న భారీ స్టీల్ బ్యాట్‌ను 'నెట్‌వర్క్ 18' సంస్థ 'బ్యాట్ ఆఫ్ ఆనర్'గా ఏర్పాటు చేసింది. ఈ భారీ స్టీల్ బ్యాట్ కింద రిటైర్మెంట్ రోజున సచిన్ చేసిన ప్రసంగాన్ని, బ్యాట్‌పై సచిన్ టెండూల్కర్ సంతకాన్ని ముద్రించింది. |
|
| ¤ దేశంలోనే అత్యంత ఎత్త్తెన స్మారక జెండా స్తంభాన్ని ఢిల్లీలోని సెంట్రల్ పార్క్‌లో ఏర్పాటు చేశారు. » కురుక్షేత్ర ఎంపీ నవీన్ జిందాల్ దీన్ని ఆవిష్కరించారు. » దీని ఎత్తు 207 అడుగులు. ఈ స్తభంపై 90 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో
35 కేజీల బరువున్న జెండాను ఎగురవేశారు. » 100 అడుగులు, అంతకంటే ఎత్తున జాతీయజెండా రాత్రిపగలు ఎగురవేసేందుకు అనుమతినిస్తూ
2009 డిసెంబరు 23న కేంద్ర హోం మంత్రిత్వశాఖ విధాన నిర్ణయం తీసుకుంది. |
» నవీన్ జిందాల్‌కు చెందిన ఫ్లాగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి స్మారక జెండా స్తంభాలను దేశంలోని ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. |
¤ వైజాగ్ పోర్టుకు ఇండోనేషియా నుంచి బొగ్గు కార్గోతో అతిపెద్ద నౌక 'ఎన్.వి.ఎన్.జి.ఎం.సైలర్' వచ్చింది. ఔటర్ హార్బర్‌లో డ్రెడ్జింగ్ తర్వాత దేశంలోనే అత్యంత లోతైన పోర్టుల్లో ఒకటిగా నిలిచిన వైజాగ్ పోర్టుకు ఇంత భారీ కార్గోతో వచ్చిన మొదటి నౌక ఇదే. |
|
» ఈ నౌక 1.6 లక్షల టన్నుల బొగ్గుతో విశాఖ పోర్టులోని జనరల్ కార్గో బెర్తుకు వచ్చింది. » దేశంలో ఏ పోర్టులోనూ లేని విధంగా విశాఖ పోర్టులోని జనరల్ కార్గో బెర్తు లోతును 20 మీటర్లకు పెంచారు. భారీ నౌకలకు మార్గం సుగమమైన ప్రస్తుత తరుణంలో పోర్టు సామర్థ్యం కూడా గణనీయంగా పెరుగుతుంది. దేశంలో మూడో భారీ పోర్టుగా కొనసాగుతున్న విశాఖ పోర్టు వచ్చే రెండు, మూడేళ్లలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించడానికి అవకాశాలు మెరుగయ్యాయి. |
మార్చి - 11
|
¤ ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా తోంగ్‌పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జీరంఘాట్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చి, జవాన్లపై కాల్పులు జరిపిన ఘటనలో 16 మంది మరణించారు. వీరిలో 11 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు, నలుగురు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసులు, ఒక సాధారణ పౌరుడు ఉన్నారు. |
|
|