ఫిబ్రవరి - 2014 వారల్లో ప్రదేశాలు


ఫిబ్రవరి - 2
¤  ప్రపంచ తెలుగు సమాఖ్య 21వ వార్షికోత్సవాలను చెన్నైలో ఘనంగా నిర్వహించారు.
ఫిబ్రవరి - 5
¤  ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో 12వ ద్వైవార్షిక ఆటో ఎక్స్‌పో ప్రారంభమైంది.   »    ఈ ప్రదర్శనలో పాతిక పైగా దేశ, విదేశీ ఆటో దిగ్గజాలు కొత్త వాహనాలు, కాన్సెప్ట్ వాహనాల ఆవిష్కరణతో సందడి చేశాయి.   »    2012లో 7 లక్షల మంది ఈ ప్రదర్శనకు హాజరయ్యారు.
ఫిబ్రవరి - 15
¤   ప్రపంచ పుస్తక ప్రదర్శనను న్యూఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు.
¤   ఉత్తరప్రదేశ్‌లోని గోండా వద్ద సుమారు రూ.3,000 కోట్ల పెట్టుబడితో ఎన్ఎండీసీ నిర్మిస్తున్న 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న విద్యుత్ ప్లాంటుకు ఉక్కు శాఖమంత్రి బేణి ప్రసాద్ వర్మ శంకుస్థాపన చేశారు.
ఫిబ్రవరి - 20
¤   దేశంలోని 12 ప్రధాన నౌకాకేంద్రాల్లో ఒకటైన చెన్నైలోని ఎన్నోర్ పోర్ట్‌ను ఇకపై కామరాజర్ పోర్ట్‌గా వ్యవహరించనున్నారు.
   »    ఆధునిక తమిళనాడు నిర్మాతగా పేరొందిన కె.కామరాజ్ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు.
ఫిబ్రవరి - 27
¤   దేశంలో మొదటి పోస్టాఫీసు పొదుపు బ్యాంక్ ఏటీఎంను చెన్నైలో కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రారంభించారు.
   »    రూ.4,909 కోట్లతో పోస్టల్ శాఖ ఐటీ ఆధునికీకరణ పథకంలో భాగంగా దీన్ని ప్రారంభించారు.

   »    చెన్నైలోని త్యాగరాయనగర్ ప్రధాన పోస్టాఫీస్‌లో దీన్ని ప్రారంభించారు. ప్రస్తుతానికి పోస్టాఫీస్ ఖాతాదారులు మాత్రమే ఈ ఏటీఎం నుంచి నగదు తీసుకోవడానికి వీలవుతుంది. ఆరునెలల తర్వాత బ్యాంక్ ఏటీఎం మాదిరిగా వినియోగించుకోవచ్చు.
 ఫిబ్రవరి - 28
¤ ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోని మార్‌వెల్ పట్టణంలో ఉన్న బొగ్గుగనులు భారీ అగ్ని ప్రమాదానికి గురయ్యాయి.   » గనులకు సమీపంలో ఉన్న పొదల వద్ద చెలరేగిన మంటలు గనులకు కూడా వ్యాపించాయి. దాదాపు 400 హెక్టార్లలోని గనులు మొత్తం భారీ అగ్ని ప్రమాదానికి గురయ్యాయి.