ఏప్రిల్ - 12
|
¤ వెనెజులాలో కనుక్కున్న బంగారపు తునకను ప్రపంచంలోనే అతిపెద్ద పసిడి స్ఫటికం (గోల్డ్ క్రిస్టల్)గా శాస్త్రవేత్తలు గుర్తించారు. » 217.78 గ్రాముల బరువున్న దీని విలువ 15 లక్షల డాలర్లు (సుమారు రూ. 9 కోట్లు). |
ఏప్రిల్ - 16
|
¤ కాగితం తయారీలో వినియోగించే సరుగుడు మొక్కలను ఉత్పత్తి చేసే అతిపెద్ద కేంద్రాన్ని ఇంటర్నేషనల్ పేపర్ (ఏపీపీఎం - ఆంధ్ర పేపర్స్) విశాఖ జిల్లాలో ఏర్పాటు చేసింది. » ఈ క్లోనల్ ప్రోపగేషన్ సెంటర్ (సీపీసీ) నుంచి వినియోగించే మొక్కల వల్ల ఉత్పత్తి రెట్టింపు అవుతుంది. సంప్రదాయ విధానంలో నాలుగేళ్లకు ఒక ఎకరాకు 30-35 టన్నుల పల్ప్ ఉడ్ (కాగితం తయారీకి అనువైన కలప) దిగుమతి అయితే సీపీసీ నుంచి నాటిన విత్తనంతో దిగుబడి 65-70 టన్నులకు పెరుగుతుంది. » దేశంలో ఆంధ్రాపేపర్స్ నెలకొల్పిన కేంద్రాల్లో ఇది ఐదవది కాగా, భారత్‌లోనే అతిపెద్ద కేంద్రంగా గుర్తింపు పొందింది. |
ఏప్రిల్ - 18
|
¤ దేశంలోనే మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఫ్త్లెఓవర్ ముంబయిలో ప్రారంభమైంది. శాంతాక్రజ్-చెంబూర్ లింక్ రోడ్డు (ఎస్‌సీఎల్ఆర్)గా పిలిచే ఈ మార్గాన్ని రూ.450 కోట్ల వ్యయంతో ఆరున్నర కిలోమీటర్ల మేర నిర్మించారు. » ఈ వంతెన మీదుగా నాసిక్, పుణే, గోవా నగరాలకు త్వరగా చేరుకోవచ్చు.¤ రాజస్థాన్ నుంచి వీచిన పశ్చిమ గాలుల ప్రభావంతో ఉత్తరప్రదేశ్‌పై ఇసుక తుపాను విరుచుకుపడింది. పెను గాలులతో ప్రతాపం చూపుతూ భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 27 మంది మృత్యువాత పడ్డారు. ఫరూకాబాద్‌లో అత్యధికంగా 10 మంది మరణించారు.¤ ప్రపంచంలోనే అత్యంత పెద్ద పర్వతం ఎవరెస్ట్‌ను అధిరోహిస్తున్న పర్వతారోహకులపై మంచు చరియలు విరుచుకుపడిన ఘటనలో 12 మంది నేపాలీ షెర్పా గైడ్లు దుర్మరణం పాలయ్యారు. ఎవరెస్టుపై జరిగిన ప్రమాదాల్లో ఇదే అతిపెద్దది. » 5,800 మీటర్ల ఎత్తులో ఉన్న పాప్‌కార్న్ ఫీల్ట్ అనే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అత్యంత ప్రమాదకరమైన ఖుంబు ఐస్‌ఫాల్‌కు వెళ్లే మార్గంలో ఇది ఉంది. » 1953లో టెంజింగ్ నార్కేషెర్పా, ఎడ్మండ్ హిల్లరీలు తొలిసారిగా ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరుకున్నారు. అప్పటి నుంచి దాదాపు 4 వేల మంది ఈ పర్వతాన్ని అధిరోహించారు. ఇప్పటి వరకూ ఎవరెస్టుపై అతిపెద్ద ప్రమాదం 1996 మే 11న జరిగింది. అప్పుడు వచ్చిన మంచు తుపానులో 8 మంది పర్వతారోహకులు మరణించారు. |
ఏప్రిల్ - 27
|
¤ అంతర్జాతీయ హిందీ సమ్మేళనాన్ని న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. » న్యూయార్క్‌లో భారత కాన్సుల్ జనరల్ జ్ఞానేశ్వర్ మూలే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. » ఢిల్లీ కేంద్రీయ హిందీ సంస్థాన్ ఉపాధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఈ కార్యక్రమంలో 'ప్రపంచ భాషగా హిందీ - అవకాశాలు, అవరోధాలు' అనే అంశంపై ప్రసంగించారు. |
ఏప్రిల్ - 29
|
¤ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సముద్ర జీవుల ఆవాసంగా చైనాలోని జుహాయ్ నగరంలో ఉన్న 'చమిలాంగ్ ఓషన్ కింగ్‌డమ్' గిన్నిస్ రికార్డు సృష్టించింది. » రూ.20,000 కోట్ల వ్యయంతో 354 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. » ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వేరియం కూడా 'చమిలాంగ్ ఓషన్ కింగ్‌డమ్'లోనే ఉంది. |
|
|