నవంబరు - 3
|
¤ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ జపాన్ అత్యున్నత జాతీయ అవార్డు 'ద గ్రాండ్ కార్డాన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద పాలోనియా ఫ్లవర్స్' కు ఎంపికయ్యారు. » ఈ పురస్కారానికి ఎంపికైన మొదటి భారతీయుడు ఈయనే. » భారత్ - జపాన్ సంబంధాల బలోపేతానికి దాదాపు 35 ఏళ్ల పాటు కృషి చేసినందుకు ఈ అవార్డుకు మన్మోహన్‌ను ఎంపిక చేశారు. |
నవంబరు - 4
|
¤ చేతికి గడియారంలా చుట్టుకుని అవసరమైనప్పుడు గాల్లోకి ఎగిరి మనల్ని అనుసరిస్తూ మన స్వీయ చిత్రాలు (సెల్ఫీలు) తీసే వినూత్న డ్రోన్ 'నిక్సీ' కి ఇంటెల్ నిర్వహించిన 'మేక్ ఇట్ వియరబుల్' పోటీలో ప్రథమ బహుమతి లభించింది. రూ.3 కోట్ల నగదు బహుమతిని గెలుచుకుంది. » ప్రజల రోజువారీ జీవితాన్ని గణనీయంగా ప్రభావితం చేసే వియరబుల్ టెక్నాలజీ పరికరాల ఆవిష్కరణకు ఇంటెల్ కంపెనీ ఈ పోటీలను నిర్వహించింది. » అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ 'నిక్సీ'ని రూపొందించారు. » రోబోటిక్ చేయి 'ఓపెన్ బయోనిక్స్'కు ద్వితీయ బహుమతి కింద రూ. 1.22 కోట్లు, ఉత్పత్తి రంగంలో కార్మికులకు రోజువారీ పనిలో ఉపయోగపడే 'ప్రొగ్లోవ్' కు తృతీయ బహుమతి కింద రూ.61 లక్షలు నగదు బహుమతులు దక్కాయి.¤ భారత్ కల్చరల్ అకాడమీ, కొమరం భీమ్ స్మారక పరిషత్, ఆదివాసి సంస్కృతి పరిరక్షణ సమితి, ఓం సాయితేజ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'కొమరం భీమ్ జాతీయ అవార్డు'ను హైదరాబాద్‌లో ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజకు ప్రదానం చేశారు.
|
నవంబరు - 5
|
| ¤ భారత పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు ప్రతిష్ఠాత్మక ఐసీసీ అవార్డు దక్కింది. ఏటా ఇచ్చే ఎల్జీ 'పీపుల్స్ ఛాయిస్' అవార్డుకు ఈ ఏడాది భువనేశ్వర్ ఎన్నికయ్యాడు. » భువనేశ్వర్‌తో పాటు స్టెయిన్ (దక్షిణాఫ్రికా), మాథ్యూస్ (శ్రీలంక), చార్లోటి ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్ మహిళా ప్లేయర్) ఈ అవార్డుకు షార్ట్ లిస్ట్ కాగా భువనేశ్వర్ విజేతగా నిలిచాడు. » గతంలో భారత్ నుంచి 2010లో సచిన్, 2013లో ధోని ఈ అవార్డును గెలుచుకున్నారు. » శ్రీలంక దిగ్గజం సంగక్కర 2011, 2012 లో వరుసగా రెండు సార్లు ఈ అవార్డును గెలిచాడు. |
నవంబరు - 6
|
¤ నాగాలాండ్‌లోని వోఖా జిల్లాలోని పంగ్తి గ్రామ కౌన్సిల్‌కు రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ (ఆర్బీఎస్) అవార్డు దక్కింది. » 'జీవ జాతుల పరిరక్షణ' కేటగిరీలో ఎర్త్ హీరోస్ అవార్డు పంగ్తి గ్రామ కౌన్సిల్‌కు లభించింది.
|
నవంబరు - 10
|
¤ ప్రముఖ హిందీ కవి కేదార్‌నాథ్ సింగ్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దిల్లీలో 49వ జ్ఞాన్‌పీఠ్ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
|
నవంబరు - 11
|
¤ వ్యవసాయం, జంతు, మత్స్య సంబంధ రంగాల్లో అవిరళ కృషి చేసిన వ్యక్తులకు ఇచ్చే ప్రసిద్ధ ఎం.ఎస్.స్వామినాథన్ పురస్కారానికి ఈ ఏడాది ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సుందర్‌లాల్ గోస్వామి ఎంపికయ్యారు. » రెండేళ్లకోసారి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. » జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ మేనేజ్‌మెంట్)కు సుందర్‌లాల్ గోస్వామి మాజీ అధ్యక్షుడు.
|
నవంబరు - 12
|
¤ కేరళలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) కి ప్రతిష్ఠాత్మక ఇందిరాగాంధీ అవార్డు లభించింది. » జాతీయ స్థాయిలో నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్)లో ఉత్తమ సేవలు అందించినందుకు, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తగా వ్యవహరించినందుకు ఈ అవార్డును కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ యూనివర్సిటీకి ఈ అవార్డు దక్కడం ఇది రెండోసారి.
|
నవంబరు - 13
|
¤ పాత్రికేయ రంగంలో విశేష ప్రతిభను చూపేవారికి అందజేసే ఐపీఐ ఇండియా పురస్కారానికి ఈ ఏడాది ప్రముఖ దినపత్రిక 'హిందుస్థాన్ టైమ్స్', వారపత్రిక 'ది వీక్' ఎంపికయ్యాయి. » మహిళలపై యాసిడ్ దాడులు ఆపాలంటూ గతేడాది ప్రచురించిన కథనాల ఆధారంగా 'హిందుస్థాన్ టైమ్స్'ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. » కాశ్మీర్‌లోని దర్ద్ పోరా ప్రాంతంలోని వితుంతువుల దురవస్థపై ప్రచురించిన వ్యాసానికి 'ది వీక్' ను పురస్కారం వరించింది. ¤ చెన్నైలోని సెంట్రల్ లెదర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన కార్యక్రమంలో ఐక్యరాజ్య సమితి అండర్ సెక్రటరీ జనరల్ ఖండే యుంకెల్లాకు ప్రతిష్ఠాత్మక నాయుడమ్మ పురస్కారాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అందజేశారు. ¤ ఇందిరాగాంధీ జాతీయ సేవ పథకం పురస్కారాలను ప్రకటించారు. వీటిలో ఆరు అవార్డులు ఆంధ్రప్రదేశ్‌కు లభించాయి. » జాతీయ స్థాయిలో విశ్వవిద్యాలయాలకు రెండు పురస్కారాలు ప్రకటించగా, అందులో ఒకటి ఆంధ్ర విశ్వవిద్యాలయ కార్యక్రమ సమన్వయ కర్త డాక్టర్ ఎన్ఏడీ పాల్‌కు లభించింది. ఈ పురస్కారం కింద రూ.లక్ష నగదు, పతకం ప్రదానం చేస్తారు. » కళాశాలల స్థాయిలో విశాఖపట్నం ప్రెసిడెన్సీ డిగ్రీ కళాశాల, గుంటూరు జిల్లా ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సమన్వయ అధికారులు ఆదినారాయణ, సుధాకర్ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. వీరు రూ.90 వేల చొప్పున నగదు, పతకం అందుకోనున్నారు. » వాలంటీర్ల విభాగంలో దేశ వ్యాప్తంగా 32 మందిని ఎంపిక చేశారు. వీరిలో ఆంధ్ర, శ్రీకృష్ణదేవరాయ, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాలకు చెందిన ఎన్.రాహుల్ పాల్, కె. కృష్ణ కుమారి, కె.వెంకట రోహిణి ఉన్నారు. వీరికి రూ.10 వేల చొప్పున నగదు బహుమతి అందజేస్తారు. » ఈ నెల 19న రాష్ట్రపతి భవన్‌లో పురస్కారాలను ప్రదానం చేస్తారు.
|
నవంబరు - 14
|
¤ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రతిభాశీలురు, సాహసవంతులైన 20 మంది పిల్లలకు, చిన్నారుల సంక్షేమానికి పాటుపడిన ఆరుగురు వ్యక్తులకు, నాలుగు సంస్థలకు జాతీయ అవార్డులను దిల్లీలో ప్రదానం చేశారు. » అత్యంత ప్రతిభా సాహసాలను ప్రదర్శించి 'జాతీయ బాల అవార్డు' లను అందుకున్న మొత్తం చిన్నారులు 20 మంది. వీరిలో చేతులు లేకపోయినా పట్టుదలతో కాళ్లతో చిత్రాలు గీసే ప్రతిభను సొంతం చేసుకున్న 12 ఏళ్ల బాలుడు అంజినయ్య (బెంగళూరు), సామాజిక సందేశంతో అద్భుతమైన మ్యాజిక్ చేసే అయిదేళ్ల ఇంద్రజాలికుడు సాత్విక్ నాయక్. సి, చేతులు లేని లోపాన్ని అధిగమించి నృత్యం, గానం, చిత్రలేఖనంలో అద్భుతాలు సృష్టించిన నిషితా జైన్ (దిల్లీ) ఉన్నారు. సాంకేతిక నైపుణ్యంతో ఎంఐటీ నిర్వహించిన పోటీల్లో వరుసగా రెండేళ్లపాటు విజేతగా నిలిచిన బాల ప్రజ్ఞాశాలి అర్జున్, వరి నుంచి తేమను హరించే వినూత్న పరికరాన్ని కనుక్కున్న సంజయ్ వీర్‌మణి, ద్విచక్ర వాహనాలకు ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థను కనిపెట్టిన మసీరాబీ హనీఫ్ పటేల్, కొబ్బరి రైతుల సమస్యల పరిష్కారం కోసం పాటుపడిన పార్వతి కృష్ణన్ తదితరులున్నారు. » జాతీయ బాలల సంక్షేమ అవార్డు అందుకున్నవారిలో సుంకర వెంకట ఆదినారాయణ (ఆంధ్రప్రదేశ్), మహేష్ కుమార్ (కర్ణాటక), కె. ప్రమోద్ (కేరళ) ఉన్నారు. » పిల్లల సంరక్షణకు విశిష్ట సేవలు అందించే వారికి ఇచ్చే 'రాజీవ్ గాంధీ మానవ సేవా అవార్డు' ను పొందిన వారిలో గంగ చంగప్ప (కర్ణాటక), విజేందర్ సింగ్ (పంజాబ్), ప్రియోలాల్ (ఉత్తరా ఖండ్) ఉన్నారు. » చిన్నారుల సంక్షేమానికి పాటుపడి జాతీయ అవార్డు పొందిన సంస్థల్లో గ్రామ్ వికాస్ పరిషద్ (అసోం), ఏ డబ్ల్యూ థామస్ గళ్స్ హోం (షిల్లాంగ్), భారత వికలాంగ సంక్షేమ ట్రస్ట్ (గుజరాత్), సమర్థనం ట్రస్ట్ (బెంగళూరు) ఉన్నాయి.
|
నవంబరు - 15
|
¤ రాజభాష హిందీని పటిష్టంగా అమలు చేస్తున్నందుకు విశాఖ ఉక్కు కర్మాగారానికి (ఆర్ఐఎన్ఎల్) ఇందిరాగాంధీ రాజభాష పురస్కారంలభించింది. » దిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈ పురస్కారాన్ని ఆర్ఐఎన్ఎల్ సీఎండీ పి.మధుసూదన్‌కు ప్రదానం చేశారు.¤ అధికారిక భాష అమలు చేయడంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిష్ఠాత్మకమైన రిజర్వ్ బ్యాంక్ రాజభాష పురస్కారాన్ని గెలుచుకుంది.¤ దేశానికి సేవలు అందించినందుకు ప్రఖ్యాత న్యాయశాస్త్ర కోవిదుడు జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్‌ను 2014 సంవత్సరానికి కె.ఆర్.నారాయణన్ పురస్కారానికిఎంపిక చేశారు. » మాజీ రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ స్మారకంగా ఏర్పాటు చేసిన కె.ఆర్.నారాయణన్ ఫౌండేషన్ వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభను చూపినవారికి వ్యక్తిగతంగా ఈ పురస్కారాన్ని అందజేస్తోంది.¤ హైదరాబాద్‌లోని భారత రసాయన పరిశోధన సంస్థ (ఐఐసీటీ) ప్రధాన శాస్త్రవేత్త, ప్రకృతి ఉత్పత్తుల విభాగాధిపతి శ్రీహరి చంద్రశేఖర్ 2014 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక ఇన్ఫోసిస్ పురస్కారానికి ఎంపికయ్యారు. » శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశిష్ట కృషి చేసిన వారికి ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని అందజేస్తోంది. » చంద్రశేఖర్ గత రెండు దశాబ్దాలుగా ప్రకృతి వనరుల నుంచి సంక్లిష్ట అణువులను తయారు చేయడంపై విస్తృత పరిశోధన చేస్తున్నారు. » కడుపులో మంట చికిత్సకు వినియోగించే ఔషధంలో వాడే మిసొప్రోస్టల్ తయారీకి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఆయన అభివృద్ధి చేశారు.
|
నవంబరు - 16
|
¤ లోహ పరిశ్రమల్లో కంపెనీ నిర్వహణలో మంచి నైపుణ్యం, పనితీరు ప్రదర్శించినందుకు సెయిల్ ఛైర్మన్ సి.ఎస్.వర్మకు 2014 ఏడాదికి ఐఐఎం - జేఆర్‌డీ టాటా అవార్డు లభించింది. » ఈ అవార్డును 2007లో టాటా స్టీల్ నెలకొల్పింది. ఇప్పటి వరకూ రతన్ టాటా, ఇ.శ్రీధరన్ ఈ అవార్డును అందుకున్న వారిలో ఉన్నారు. » ఈ అవార్డు కింద రూ.5 లక్షల నగదును అందజేస్తారు. » రాజీవ్‌గాంధీ సాంకేతిక, విజ్ఞాన విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) కి ప్రతిష్ఠాత్మక 'ఉన్నత విద్యలో ఐటీ' విభాగంలో 'ఈ - ఇండియా' అవార్డు లభించింది. » కేరళలో జరిగిన ఉన్నత విద్య సమ్మేళనంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. » ఉన్నత విద్యలో ఆరేళ్ల సమగ్ర బీటెక్ కోర్సులను ప్రవేశపెట్టి, మొదటి బ్యాచ్‌లో 5800 మంది విద్యార్థులకు 5420 మంది ఉత్తీర్ణులైనందుకు ఈ అవార్డు లభించింది.
|
నవంబరు - 17
|
¤ ప్రఖ్యాత హిందుస్థానీ గాయకుడు పండిట్ జస్‌రాజ్‌కు 'సుమిత్రా చరత్ రామ్' జీవిత సాఫల్య పురస్కారాన్ని దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రదానం చేశారు. » 1952లో 'శ్రీరామ్ భారతీయ కళా కేంద్ర' సంస్థను స్థాపించి, కథక్ పునర్ వైభవానికి కృషి చేసిన కళాపోషకురాలు దివంగత సుమిత్రా చరత్ రామ్ పేరు మీద ఈ అవార్డును ఏర్పాటు చేశారు.
|
నవంబరు - 18
|
¤ ప్రముఖ సినీ గేయ రచయిత, కవి, డా. సుద్దాల అశోక్ తేజకు గురజాడ విశిష్ట పురస్కారం (2014)ను ప్రదానం చేయనున్నట్లు గురజాడ సాంస్కృతిక సమాఖ్య (విజయనగరం) ఓ ప్రకటనలో తెలిపింది.
|
నవంబరు - 19
|
¤ '2014 - ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి అవార్డు'ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు ప్రకటించారు. » మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగంతో అద్భుతమైన విజయాన్ని సాధించడం, అంతరిక్షాన్ని శాంతియుత అవసరాలకు వినియోగించుకోవడం, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడం లాంటి వాటికి గుర్తింపుగా ఇస్రోకు ఈ అవార్డును ఇస్తున్నట్లు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అధ్యక్షతన ఏర్పడిన న్యాయనిర్ణేతల బృందం ప్రకటించింది. విస్తృతమైన, సుస్థిరమైన సామాజిక, ఆర్థిక అభివృద్ధిలోనూ, ముఖ్యంగా గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు అధునాతన పరిజ్ఞానాలను వినియోగించడంలోనూ ఇస్రో పోషించిన పాత్రను కూడా న్యాయ నిర్ణేతలబృందం ప్రత్యేకంగా పేర్కొంది.
|
నవంబరు - 21
|
¤ ప్రతిష్ఠాత్మక బీసీసీఐ అవార్డులను ముంబయిలో ప్రదానం చేశారు. » భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్‌కు ప్రదానం చేశారు. » పాలీ ఉమ్రిగర్ అవార్డును భువనేశ్వర్ కుమార్‌కు ప్రదానం చేశారు. » రంజీల్లో ఉత్తమ ఆల్‌రౌండ్ పదర్శనకు ఇచ్చే లాలా అమర్‌నాథ్ అవార్డు నుపర్వేజ్ రసూల్‌కు ప్రదానం చేశారు. » రంజీల్లో అత్యధిక పరుగులు సాధించినందుకు ఇచ్చే మాధవ రావ్ సింధియా అవార్డు ను కేదార్ జాదవ్‌కు అందించారు. » హైదరాబాద్‌కు చెందిన అండర్-19 క్రికెటర్ బి.అనిరుధ్‌కు ఎంఏ చిదంబరం ట్రోఫీను అందించారు. |
నవంబరు - 24
|
¤ లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం - 2015కు ప్రముఖ సాహితీ వేత్త, సినీనటుడు గొల్లపూడి మారుతీ రావు ఎంపికయ్యారు. » ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జనవరి 18న విశాఖపట్నంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. » ఈ పురస్కారం కింద రూ.1.25 లక్షల నగదును అందజేస్తారు. 2005 నుంచి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. |
నవంబరు - 26
|
¤ వ్యయాలను అదుపు చేయడంలో ఉన్నత ప్రమాణాలను సాధించినందుకు అమరరాజ బ్యాటరీస్‌కు 'ఎక్స్ లెన్స్ ఇన్ కాస్ట్ మేనేజ్‌మెంట్'జాతీయ అవార్డు లభించింది. » 2003 నుంచి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ అవార్డులు ఇస్తోంది.
|
నవంబరు - 29
|
¤ ప్రతిష్ఠాత్మక జమ్నాలాల్ బజాజ్ పురస్కారాన్ని 2014కి ముంబయిలో చెన్నుపాటి విద్యకు ప్రదానం చేశారు. » విద్య, మహిళా శిశు సంక్షేమం, అభివృద్ధికి పాటుపడినందుకు ఆమెకు ఈ పురస్కారం లభించింది. ¤ వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే సంస్థలకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక ఎనర్షియా అవార్డును ఎంఈఐఎల్ (MEIL -Megha Engineering and Infrastructure Ltd.)కు ప్రదానం చేశారు. » అనంతపురం జిల్లాలో ఈ సంస్థ నిర్మించిన 50 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్ట్ ఈ అవార్డుకు ఎంపికైంది.
|
|
|