| ¤ డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక పురస్కారం - 2013ను ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త, గ్రహాంతర జీవుల అన్వేషకుడు డాక్టర్ జయంత్ విష్ణు నార్లికర్‌కు ప్రదానం చేశారు. | |
| » గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య ఈ పురస్కారాన్ని నార్లికర్‌కు అందజేశారు. |
| ¤ స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (Scope - స్కోప్) అవార్డులను ప్రకటించారు. మొత్తం 6 ప్రభుత్వరంగ సంస్థలు ఈ పురస్కారాలకు ఎంపికయ్యాయి. » స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అవార్డులకు ఎంపికయ్యాయి. » భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సి.లహోటి అవార్డుల కమిటీ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.¤ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 'నేషనల్ టూరిజం అవార్డు 2012-13' లభించింది. ఈ విమానాశ్రయానికి ఈ అవార్డు దక్కడం వరుసగా ఇది నాలుగోసారి.¤ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని అమెరికాలోని లాస్ఏంజెలిస్‌లో వైభవంగా నిర్వహించారు. » అమెరికాలో బానిసత్వ పోకడల నాటి కథతో తెరకెక్కిన '12 ఇయర్స్ ఎ స్లేవ్' ఉత్తమ చిత్రం అవార్డును గెలుపొందింది. » ఈ చిత్రానికి సాల్మన్ నార్తప్ అదే పేరుతో రాసిన నవల ఆధారం. » ఒక నల్ల జాతీయుడు (బ్రిటిష్ దర్శకుడు స్టీవ్ మెక్ క్వీన్) దర్శకత్వం వహించిన చిత్రానికి ఉత్తమ చిత్ర పురస్కారం దక్కడం ఆస్కార్ చరిత్రలో ఇదే తొలిసారి. » వ్యోమగాముల అంతరిక్ష యానం నేపథ్యంలో దర్శకుడు అల్ఫాన్సో క్యూరోన్ అద్భుతంగా తెరకెక్కించిన 'గ్రావిటీ' అత్యధికంగా ఏడు పురస్కారాలను గెల్చుకుంది. ఛాయాగ్రహణం, దర్శకత్వం, కూర్పు, ఒరిజినల్ స్కోర్, సౌండ్ ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో పురస్కారాలు అందుకుంది. » ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా 'ది గ్రేట్ బ్యూటీ' అనే ఇటలీ చిత్రం అవార్డు సొంతం చేసుకుంది. ఇది ఇటలీ నుంచి ఈ పురస్కారం అందుకున్న 11వ చిత్రం. » పది నామినేషన్లు పొందిన 'అమెరికన్ హజిల్', అందరూ పురస్కారం అందుకుంటుందనుకున్న 'కెప్టెన్ ఫిలిప్స్' ఉత్త చేతులతో వెనుదిరిగాయి. » ఈ వేడుకలో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు దివంగత నెల్సన్ మండేలాను గుర్తు చేసుకున్నారు. 'మండేలా : లాంగ్ వాక్‌టు ఫ్రీడమ్' పేరుతో రూపొందిన సినిమాలోని 'ఆర్డినరీ లవ్' అనే పాటను వేదికపై పాడారు. |
| » ఉత్తమ చిత్రం : 12 ఇయర్స్ ఎ స్లేవ్ » ఉత్తమ నటుడు :మాథ్యూ మెక్ కొనావ్ గె (డల్లాస్ బయ్యర్స్ క్లబ్) » ఉత్తమ నటి : కేట్ బ్లాన్‌కెట్ (బ్లూ జాస్మిన్) |
|
» ఉత్తమ సహాయ నటుడు : జార్డ్ లెటో (డల్లాస్ బయ్యర్స్ క్లబ్) » ఉత్తమ సహాయనటి : ల్యుపిటా న్యోస్గ్ ఒ (12 ఇయర్స్ ఎ స్లేవ్) » ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ : ఫ్రోజెన్ (క్రిస్‌బక్, జెన్నిఫర్, పీటర్) » ఉత్తమ ఛాయాగ్రహణం : గ్రావిటీ (ఎమాన్యుల్ లుబెజ్కీ) » ఉత్తమ వస్త్రాలంకరణ : ది గ్రేట్ గాట్స్ బై (కేథరిన్ మార్టిన్) » ఉత్తమ దర్శకుడు : అల్ఫాన్సో క్యూరోన్ (గ్రావిటీ) » ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ : 20 ఫీట్ ఫ్రమ్ స్టార్‌డమ్ » ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ : ది లేడీ ఇన్ నంబర్ 6 : మ్యూజిక్ సేవ్డ్ మై లైఫ్ (మాల్కమ్ క్లార్క్, నికొలస్ రీడ్) » ఉత్తమ ఎడిటింగ్ : అల్ఫాన్సో క్యూరోన్ (గ్రావిటీ) » ఉత్తమ విదేశీ భాషా చిత్రం : ది గ్రేట్ బ్యూటీ (ఇటలీ) » ఉత్తమ మేకప్, హెయిర్ స్టయిలింగ్ : డల్లాస్ బయ్యర్స్ క్లబ్ (అద్రుయినాలీ, రాబిన్) » ఉత్తమ ఒరిజినల్ స్కోర్ : గ్రావిటీ (స్టీవెన్ ప్రైస్) » ఉత్తమ ఒరిజినల్ సాంగ్ : లెట్ ఇట్ గో (ఫ్రోజన్) » ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : ది గ్రేట్ గాట్స్ బై (కేథరిన్ మార్టిన్, బెవర్లీ డన్) » ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ : మిస్టర్ హుబ్లట్ (లారంట్ విట్జ్, అలగ్జాండ్రా) » ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ : హీలియం (యాండర్స్ వాల్టర్, కిమ్) » ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ : గ్రావిటీ (గ్లెన్ ఫ్రీ మాంటెల్) » ఉత్తమ సౌండ్ మిక్సింగ్ : గ్రావిటీ (స్కిప్ లీవ్ సే, నివ్అడ్రి, క్రిస్టోఫర్ బెన్ స్టేడ్, క్రిష్ మున్రో) » ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : గ్రావిటీ (టిమ్ వెబ్బర్, క్రిష్ లారెన్స్, డేవ్ షిర్క్, నీల్ కార్ బోల్డ్) » అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : 12 ఇయర్స్ ఎ స్లేవ్ (జాన్‌రిడ్లీ) » ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: హర్ (స్పైక్ జోన్జ్) |
మార్చి - 4
|
| ¤ యాసిడ్ దాడికి గురై, ఆ తరహా దాడులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపిన భారత్‌కు చెందిన లక్ష్మికి ప్రతిష్ఠాత్మకమైన అమెరికా ప్రభుత్వ 'అంతర్జాతీయ ధీర వనిత' అవార్డును వాషింగ్టన్‌లో అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా ప్రదానం చేశారు. » ప్రేమను నిరాకరించిందనే కోపంతో 2005లో ఢిల్లీలో లక్ష్మిపై ఓ వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. అప్పుడు ఆమె వయసు 16 ఏళ్లు. ఆమె ముఖం పూర్తిగా దెబ్బతింది. తనలా మరో వనిత యాసిడ్ దాడులకు గురికాకూడదని లక్ష్మి భారత్‌లో ఉద్యమం చేపట్టింది. » 2012లో ఢిల్లీలో బస్సులో సామూహిక అత్యాచారానికి గురై, ప్రాణాలు కోల్పోయిన 'నిర్భయ'కు గతేడాది ఈ పురస్కారం దక్కింది. |
| ¤ హైదరాబాద్‌లోని ఇక్ఫాయ్ బిజినెస్ స్కూల్‌కు ప్రతిష్ఠాత్మక కేస్ అవార్డ్ లభించింది. యూకేకి చెందిన 'ది కేస్ సెంటర్' ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందిస్తుంది. ఒక ప్రత్యేక అంశానికి సంబంధించి అత్యుత్తమ అధ్యయనం, లేఖనానికి అంతర్జాతీయ స్థాయిలో ఈ అవార్డు గుర్తింపును ఇస్తుంది. |
|
| » 'డిజిటల్ మార్కెటింగ్ ఎట్ నైక్: ఫ్రం కమ్యూనికేషన్ టు డైలాగ్' శీర్షికన జరిపిన కేస్ స్టడీకి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. 'నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ మేనేజ్‌మెంట్' విభాగంలో ఈ అవార్డు లభించింది. » పోటీ పూర్వక మార్కెట్‌లో సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్‌వేర్ దిగ్గజం 'నైక్' ఎలా విజయం సాధించగలిగిందనేది ఈ అధ్యయన సారాంశం. |
| ¤ మహిళా సాధికారికతను ప్రోత్సహించినందుకు దేశీయ ఐటీ దిగ్గజాలు విప్రో, హెచ్‌సీఎల్ సీఈవోలకు ఐక్యరాజ్యసమితి పురస్కారాలు దక్కాయి. |
| » విప్రో సీఈవో టి.కె.కురియన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈవో అనంత్‌గుప్తాలకు మహిళల సాధికారికత విధానాలకు సంబంధించి లీడర్‌షిప్ అవార్డులు దక్కాయి. |
|
| » స్త్రీ పురుష సమానత్వాన్ని పెంపొందించే దిశగా తమ సంస్థల్లో ప్రత్యేక విధానాలను అమల్లోకి తెచ్చినందుకు వీరికి ఈ పురస్కారాలు ఇస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం వెల్లడించింది. |
| ¤ ప్రతిష్ఠాత్మక స్త్రీ శక్తి పురస్కారాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. » అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏటా కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ స్త్రీ శక్తి పురస్కారాల పేరిట 6 జాతీయ అవార్డులను ప్రదానం చేస్తోంది. » ఈసారి వీటిలో రెండు అవార్డులను తెలుగువారు దక్కించుకున్నారు. |
| » హైదరాబాద్‌కు చెందిన రాధా కె ప్రశాంతి కి 'కన్నగి' పురస్కారాన్ని ప్రదానం చేశారు. సామాజికవేత్తగా, నటిగా సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. 'నాటక కళాపరిషత్' పేరిట పదివేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చిన ఆమె 208 ఉత్తమ నటి అవార్డులు గెలుచుకున్నారు. | |
| » అనాథ పిల్లలు, గిరిజనులు, వికలాంగులు, వితంతువులకు సేవ చేసేందుకు 'స్టెప్' అనే స్వచ్ఛంద సంస్థను ఆమె నడుపుతున్నారు. |
| » పురుషులనూ పరిగణనలోకి తీసుకుని ప్రదానం చేసే 'రాణి రుద్రమదేవి' పురస్కారాన్ని ఈసారి ఒంగోలు రిమ్స్‌లో సర్జరీ విభాగంలో సహాయ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శస్త్రచికిత్స నిపుణులు ఎం.వెంకయ్యకు ప్రదానం చేశారు. |
| » గ్రామీణ ప్రాంతాల్లో 30 వేల ప్రసవాలు, 90 వేలకు పైగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు, వెయ్యికి పైగా క్లిష్టమైన శస్త్ర చికిత్సలతో సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా వెంకయ్యకు ఈ పురస్కారం దక్కింది. » 'రాణీ లక్ష్మీబాయ్' పురస్కారాన్ని ఒడిశాకు చెందిన మానసి ప్రధాన్‌కు, 'మాతా జిజియాబాయి' పురస్కారాన్ని మహారాష్ట్రకు చెందిన బీనా సేథ్ లష్కరీ కి, 'మాతా దేవి అహల్యాబాయ్ హోల్కర్' పురస్కారాన్ని మహారాష్ట్రకు చెందిన సీమా సఖాడేకు, 'రాణి గైడిన్లూ జెలియాంగ్' పురస్కారాన్ని ఢిల్లీకి చెందిన వర్తికా నందాకు ప్రదానం చేశారు. » అవార్డు గ్రహీతలు ఒక్కొక్కరికి రూ.3 లక్షల నగదును కూడా రాష్ట్రపతి ప్రదానం చేశారు. |
¤ ప్రముఖ భారతీయ రచయిత పంకజ్ మిశ్రాకు ప్రతిష్ఠాత్మక యేల్ విశ్వవిద్యాలయ సాహితీ
పురస్కారం లభించింది. » కాల్పనికేతర సాహిత్యం కేటగిరీలో ఆయనను ఈ అవార్డుకు ఎంపికచేశారు. ఆయనతో పాటు
వివిధ సాహితీ ప్రక్రియల్లో స్రష్టలైన మరో ఏడుదేశాలకు చెందిన రచయితలు, రచయిత్రులకు యేల్
విశ్వవిద్యాలయంసాహితీ పురస్కారాలను ప్రకటించింది. |
|
| » ఈ ఏడాది సెప్టెంబరు 15న అమెరికాలోని యేల్‌లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.¤ హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్)కు ఫిక్కీ సీఎస్ఆర్ అవార్డు 2012-13 లభించింది. » కార్పొరేట్ సామాజిక సేవకు ప్రైవేటురంగ కంపెనీల విభాగంలో ఫిక్కీ ఆదిత్యా బిర్లా సీఎస్ఆర్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఈ అవార్డును జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రదానం చేసింది. |
| ¤ కవి, పరిశోధకుడు, బహు భాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్ కు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద సాహిత్యంలో ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రకటించింది. |
|
» ప్రఖ్యాత మలయాళ రచయిత పుణత్తిల్ కుంజబ్దుల్లా రచించిన 'స్మారక శిళగల్' నవలను డాక్టర్ నలిమెల భాస్కర్ 'స్మారక శిలలు' పేరిట తెలుగులోకి 2010 లో అనువదించారు. ఈ రచనను అనువాద సాహిత్య విభాగంలో జాతీయ పురస్కారానికి కేంద్ర సాహిత్య అకాడమీ ఎంపిక చేసింది. » పురస్కారం కింద రూ. 50 వేల నగదు, ప్రశంసాపత్రం, సత్కారాన్ని ఆయన అందుకోనున్నారు. » మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు ప్రఖ్యాత కవి విశ్వనాథ సత్యనారాయణ రచించిన 'వేయి పడగలు' నవలను 'సహస్ర ఫణ్' పేరిట హిందీలోకి అనువదించారు. దీనికి గతంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. దీంతో అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైన కరీంనగర్ జిల్లా సాహితీ వేత్తల్లో డాక్టర్ నలిమెల భాస్కర్ రెండోవ్యక్తిగా నిలిచారు. |
| ¤ రాష్ట్రానికి చెందిన తెలుగు రచయిత్రి కాత్యాయని విద్మహే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం-2013 ను అందుకున్నారు. » ఢిల్లీలో అకాడమీ అధ్యక్షుడు విశ్వనాథ్ ప్రసాద్ తివారీ ఆమెతో పాటు, వివిధ రాష్ట్రాలకు చెందిన మరో 23 మంది సాహితీవేత్తలకూ ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. |
|
| » వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కాత్యాయని రచించిన 'సాహిత్యాకాశంలో సగం' పుస్తకానికి ఈ పురస్కారం లభించింది. పురస్కారంతో పాటు ఆమెకు రూ.లక్ష నగదు బహుమతిని అందజేశారు. » ఉర్దూ విభాగంలో 'లావా' కవితా సంపుటికి సాహితీవేత్త జావేద్ అక్తర్, హిందీలో 'మిల్ జుల్‌మన్' నవలా రచయిత మృదుల్‌గార్గ్ ఈ అవార్డులను అందుకున్నారు. |
మార్చి - 12
|
| ¤ ప్రతిష్ఠాత్మక ఇంటెల్ సైన్స్ టాలెంట్ అవార్డులను ఇద్దరు భారత సంతతి విద్యార్థులు గెలుపొందారు. » ఆనంద్ శ్రీనివాసన్ (జార్జియా), షాన్ దత్తా (మేరీ ల్యాండ్) ఈ అవార్డులను సొంతం చేసుకున్నారు. » డీఎన్ఏను విశ్లేషించే ఆర్ఎన్ఎన్ స్కాన్ కంప్యూటర్ నమూనా రూపొందించినందుకు శ్రీనివాసన్‌కు, అణుపదార్థం చర్యలను అవగాహన చేసుకునే కంప్యూటర్ నమూనా రూపొందించినందుకు షాన్‌కు ఈ పురస్కారం లభించింది. |
మార్చి 13
|
¤ హైదరాబాద్‌లో జరుగుతున్న 'ఇండియా ఏవియేషన్ షో - 2014'లో భాగంగా సాప్ మీడియా, ఇంటర్నేషనల్ ఏరోస్పేస్, షోడెయిలీ సంయుక్త ఆధ్వర్యంలో తొలిసారిగా ఏవియేషన్ అవార్డులను ప్రదానం చేశారు. మొత్తం 11 విభాగాల్లో అత్యుత్తమ సేవలను అందిస్తున్నవారిని ఈ అవార్డులకు ఎంపిక చేశారు.అవార్డు గ్రహీతలు » లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ - డాక్టర్ జి.వి.కె.రెడ్డి » బిజినెస్ లీడర్ 2013 - దినేష్ ఎ.కేష్కర్, డాక్టర్ జి.ఎం.రావు » ఎక్సలెన్స్ ఇన్ ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్, మేనేజ్‌మెంట్ - రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం » ఉత్తమ విమానాశ్రయం - కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు), రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాద్). |
| ¤ పారిశ్రామిక రంగంలో రాణిస్తున్న వారిని గుర్తించి ఏటా అందించే 'బిజినెస్ ఎక్స్‌లెన్స్' అవార్డుకు మార్గదర్శి ఎండీశైలజా కిరణ్ ఎంపికయ్యారు. 2013 ఏడాదికి ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేస్తామని ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ చెప్పారు. |
| » ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో అందించే ఈ అవార్డులను 2008లో చుక్కపల్లి కుశలవ, 2009లో గోకరాజు గంగరాజు, 2010లో చుక్కపల్లి పిచ్చయ్య, 2011లో మహిళా పారిశ్రామికవేత్త ఇందిరాదత్, 2012లో డాక్టర్ గల్లా రామచంద్రనాయుడు స్వీకరించారు. |
| ¤ 17వ గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ పురస్కారానికి గుజరాతీ దర్శకుడు గ్యాన్ కొరియా ఎంపికయ్యాడు. |
| » దేశవ్యాప్తంగా తెలుగు, తమిళం, బెంగాలీ, గుజరాతీ, హిందీ, మళయాళం నుంచి వచ్చిన 20 సినిమాలను ఈ అవార్డుకు పరిశీలించారు. » దర్శకుడు వసంత్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, నటి కుష్బూ సభ్యులుగా వ్యవహరించిన జ్యూరీ 'ది గుడ్ రోడ్' అనే గుజరాతీ చిత్ర దర్శకుడిని ఎంపిక చేశారు. |
| » ఆగస్టు 12న చెన్నైలో జరిగే కార్యక్రమంలో గ్యాన్ కొరియాకు పురస్కారంతో పాటు రూ.1.5 లక్షల నగదును అందజేయనున్నారు. |
మార్చి - 21
|
| ¤ ప్రతిష్ఠాత్మక 'జీడీ బిర్లా పురస్కారం-2013'కు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త రాజేశ్ గోపకుమార్ ఎన్నికయ్యారు. 46 ఏళ్ల రాజేశ్ అలహాబాద్‌లోని హరీష్ చంద్ర పరిశోధన సంస్థలో భౌతిక శాస్త్రవేత్తగా పని చేస్తున్నారు. క్వాంటం ఫీల్డ్ సిద్ధాంతానికి సంబంధించి ఆయన చేసిన పరిశోధనలకుగాను ప్రముఖ శాస్త్రవేత్తలు అసిస్ దత్తా, అనుపమ్ వర్మ నేతృత్వంలోని ఎంపిక కమిటీ రాజేశ్‌ను ఎంపిక చేసింది. ఈ పురస్కారం కింద ఆయనకు రూ.1.5 లక్షల నగదు, ప్రశంసా పత్రం అందజేస్తారు. » రాజేశ్ 2004లో బీఎం బిర్లా సైన్స్ ప్రైజ్‌తో పాటు పలు పురస్కారాలు గెలుచుకున్నారు. దేశంలోనే ఉంటూ పనిచేసే 50 ఏళ్లలోపు శాస్త్రవేత్తల సేవలను గుర్తిస్తూ, వారిని ప్రోత్సహించే లక్ష్యంతో 1991లో కేకే బిర్లా ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని నెలకొల్పింది. |
మార్చి - 22
|
| ¤ విధి నిర్వహణలో అత్యంత ధైర్య సాహసాలను చూపిన సైన్య, నౌకాదళ, వైమానిక అధికారులకు కేంద్రం కీర్తి చక్ర, శౌర్య పతకాలను అందజేసింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ ఈ పురస్కారాలను అందజేశారు. |
| » గతేడాది ఉత్తరాఖండ్ వరదల బాధితులను కాపాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వైమానిక అధికారి కాస్టెలిన్‌తో పాటు ఏకధాటిగా 151 రోజుల్లో ప్రపంచ యాత్ర చేసిన నౌకాదళాధికారి అభిలాష్ టోమి, ముగ్గురు తీవ్రవాదులను చంపిన ఆర్మీ మేజర్ మహేష్ కుమార్‌ను 'కీర్తి చక్ర' పురస్కారాలతో గౌరవించారు. |
|
| » అసోంలో ఓ ప్రమాదంలో తన సహోద్యోగులను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్వో)కు చెందిన సివిల్ ఇంజినీర్‌తో పాటు పదిమందికి 'శౌర్య' పురస్కారాలను అందజేశారు. వీరిలో ఐదుగురికి మరణానంతరం ఈ పురస్కారాలను ప్రకటించారు. » మరణానంతరం 'శౌర్య' పురస్కారాలు పొందిన వారిలో జమ్మూలోని సాంబాలో అశ్వికదళ యూనిట్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయిన లెఫ్టినెంట్ కల్నల్ బిక్రం జిత్ సింగ్, బీఆర్వోకు చెందిన ఇంజినీర్ మనీష్, అసోంలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన మురళి కన్నన్, ఉత్తరాఖండ్ హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన సహపైలట్ కె. ప్రవీణ్, జమ్మూలోని కుప్వారాలో తీవ్రవాదులతో జరిగిన పోరాటంలో మరణించిన రణ్ బహదూర్ గురుంగ్ ఉన్నారు. |
మార్చి - 23
|
| ¤ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎమ్‌ఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (జీహెచ్‌ఐఏఎల్)కు అసోచామ్ 'కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ ఎక్స్‌లెన్స్ అవార్డు' లభించింది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వి.ఎన్.ఖరే నేతృత్వంలోని బృందం 2013-14 సంవత్సరానికి ఈ అవార్డుకు ఎంపిక చేసింది. |
| ¤ మహీంద్రా అండ్ మహీంద్రా వ్యవసాయ పనిముట్ల విభాగం ప్రకటించిన 'మహీంద్రా సమృద్ధి ఇండియా అగ్రి అవార్డ్స్ - 2014'లో నల్గొండకు చెందిన కర్రా శశికళ ఉత్తమ మహిళా రైతు అవార్డు గెలుచుకున్నారు. ఆమెను 'మహీంద్రా సమృద్ధి కృషి ప్రేరణా సమ్మాన్' అవార్డుతో సత్కరించారు. విజేతలకు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి తారిఖ్ అన్వర్ అవార్డులు అందజేశారు. |
|
| » పొలానికి అవసరమైన విద్యుత్తు కోసం శశికళ బయోగ్యాస్‌ను వినియోగించారు. తద్వారా ఆర్గానిక్ పద్ధతిలో ఎలాంటి ఎరువులు వినియోగించకుండా వరి సాగు చేపట్టారు. కేవలం సంప్రదాయ ఎరువు అయిన ఆవుపేడను మాత్రమే వినియోగించారు. » 'మహీంద్రా సమృద్ధి కృషి శిరోమణి సమ్మాన్ (జీవన సాఫల్య పురస్కారం) -2014' అవార్డు వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసిన డాక్టర్ కె.ఎల్.చద్దాకు లభించింది. » రైతుల శక్తియుక్తులను గుర్తించే లక్ష్యంతో 2011 నుంచి ఈ అవార్డులు ఇస్తున్నారు. |
మార్చి - 27
|
¤ 'బెస్ట్ ఫ్యామిలీ ట్రావెల్స్ డెస్టినేషన్ అవార్డు'ను రామోజీ ఫిల్మ్‌సిటీ సొంతం చేసుకుంది.హైదరాబాద్‌లోని హోటల్ రాడిసన్ బ్లూలో సౌత్ ఇండియా ట్రావెల్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రామోజీ ఫిల్మ్‌సిటీ సీఈవో రాజీవ్ జెల్నాపుర్కర్ రాడిసన్ బ్లూ హోటల్ జనరల్ మేనేజర్ రజనీస్ మల్హోత్రా చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. మొత్తం 34 విభాగాల్లో అవార్డులను అందించారు. » కార్యక్రమానికి పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి చందనాఖన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.¤ బ్రిటన్ విదేశీ విధానంపై ట్విట్టర్ నిర్వహించిన పోటీలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన భారత సంతతి ఎంబీఏ విద్యార్థి గోపాలరావు గెలుపొందాడు. అతడికి విదేశాంగ శాఖ మంత్రి విలియం హేగ్ అభినందనలు తెలిపారు. ''యూకే విదేశాంగ విధానం ప్రపంచానికి ఏం చేయగలదని మీరు భావిస్తున్నారు?'' అని హేగ్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. దీనికి గోపాలరావు ''బాలికలు, మహిళలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి వారు యూకేలో అన్ని రంగాల్లో ముందుకెళ్లేందుకు మద్దతు ఇచ్చే విషయంపై దృష్టి సారించాలి'' అని ఇచ్చిన సమాధానానికి బహుమతి లభించింది.
|
మార్చి - 31
|
| ¤ ప్రతిష్ఠాత్మకమైన 'పద్మ' పురస్కారాలను వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. రాష్ట్రపతి భవన్ దర్బార్‌హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన 'పద్మ విభూషణ్'ను ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆర్.ఎ.మాషేల్కర్‌కు రాష్ట్రపతి ప్రదానం చేశారు. నటుడు కమల్‌హాసన్, బ్యాడ్మింటన్ ఆటగాడు పి.గోపీచంద్ సహా 12 మందికి పద్మ భూషణ్ పురస్కారాలు అందజేశారు. నటి విద్యాబాలన్, భారత మహిళల కబడ్డీ జట్టు కోచ్ సునీల్ దబాస్, ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్, సామాజిక కార్యకర్త జవహర్ లాల్ కౌల్ సహా 53 మందికి పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్ దంపతులు, పలువురు కేంద్రమంత్రులు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంపత్ తదితరులు హాజరయ్యారు. » పద్మ విభూషణ్ అందుకున్న మాషేల్కర్ పాలిమర్ సైన్స్, ఇంజినీరింగ్‌లో చేసిన పరిశోధనలకు గాను అంతర్జాతీయంగా పేరు సంపాదించారు. ప్రీకాస్ట్ కాంక్రీట్ టెక్నాలజీలో సాధించిన విజయాలకు గాను అనుమోలు రామకృష్ణకు మరణానంతరం పద్మ భూషణ్ వరించింది. ఆయన గత ఏడాది మృతి చెందారు. అయిదేళ్ల వయసులోనే చూపు కోల్పోయిన జవహర్‌లాల్ కౌల్ అంధుల సంక్షేమానికి పనిచేస్తున్నారు. » ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాల సందర్భంగా 127 మందికి 'పద్మ' పురస్కారాలను ప్రకటించగా అందులో 66 మందికి అందజేశారు. » దివంగత మాజీ ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్.వర్మకు ప్రకటించిన పద్మ భూషణ్ అవార్డును అందుకునేందుకు ఆయన కుటుంబసభ్యులు తిరస్కరించడంతో ఆయనకు పద్మ విభూషణ్ ప్రకటించే దిశగా పురస్కారాల కమిటీ పరిశీలిస్తోంది. నిర్భయ ఉదంతం తర్వాత లైంగిక దాడులపై కఠిన చట్టాలు తేవడానికి ఏర్పరిచిన ప్రభుత్వ కమిటీకి వర్మ నేతృత్వం వహించారు. |
|
|