| ¤ శాసన మండలి చైర్మన్ ఎ.చక్రపాణికి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ 'యూఎస్ - ఇండోపిన్' పురస్కారాన్ని హైదరాబాద్‌లో ప్రదానం చేసింది. | |
| ¤ డీఆర్‌డీవో - రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ) డైరెక్టర్ జి.సతీష్‌రెడ్డికి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రతిష్ఠాత్మక హోమీ జె.బాబా స్మారక అవార్డును ప్రధానం చేశారు. |
» శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో విశేష కృషికి, రక్షణ పరిశోధనలో క్లిష్టమైన ఏవియానిక్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో సేవలకు గుర్తింపుగా సతీష్‌రెడ్డికి ఈ పురస్కారం దక్కింది. » జమ్మూలో జరుగుతున్న 101వ భారత సైన్స్ కాంగ్రెస్‌లో 2013-14 సంవత్సరానికి సతీష్‌రెడ్డికి ఈ అవార్డును ప్రదానం చేశారు. ¤ ఏపీఎస్ఆర్టీసీకి మూడు జాతీయ అవార్డులు లభించాయి. » రోడ్డు భద్రతా ఉత్సవాల్లో భాగంగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగినకార్యక్రమంలో ఈ అవార్డులను ఆర్టీసీకి ప్రదానం చేశారు. » 2011-12 సంవత్సరానికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంధన సామర్థ్యంఅవార్డులు దక్కాయి. గ్రామీణ ప్రాంతాల్లో లీటరు ఒక్కింటికి 5.23 కిలోమీటర్లసామర్థ్యాన్ని సాధించగా, అదే ఏడాదిలో పట్టణ ప్రాంతాల్లో లీటరు ఒక్కింటికి 5.16కిలోమీటర్లు సాధించింది. » 2012-13 సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో అతితక్కువ ప్రమాదాలనమోదులో కూడా మరో అవార్డు లభించింది. లక్ష కిలోమీటర్లకు 0.1066ప్రమాదాలు నమోదయ్యాయి. |
| ¤ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మంచి పనితీరు చూపినందుకు ఏపీట్రాన్స్‌కో కు జాతీయ స్థాయిలో వెండి పతకం లభించింది. » కేంద్ర ఇంధనశాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా చేతుల మీదుగా ట్రాన్స్‌కో జేఎండీ పి.రమేష్ ఢిల్లీలో ఈ పురస్కారం స్వీకరించారు. |
| ¤ ప్రఖ్యాత క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్.రావు లు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్నారు. |
|
» న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వీరికి అవార్డులను అందజేశారు. భారతరత్న విశేషాలు
భారతరత్నను 1954లో ఏర్పాటు చేశారు. ఇది దేశ అత్యున్నత పౌరపురస్కారం.తరువాతి స్థానాల్లో వరుసగా పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలు వస్తాయి.కళలు, సాహిత్యం, శాస్త్రవిజ్ఞానం, సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష సేవలుఅందించిన వారికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. అవార్డులకు అర్హులుగా భావించిన వారి పేరును ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫార్సుచేస్తారు. రాష్ట్రపతి ఆమోదం రాగానే, వారి పేర్లను ప్రకటిస్తారు. ఒకే సంవత్సరంలో గరిష్ఠంగా ముగ్గురికి ఈ అవార్డును అందించవచ్చు. మరణానంతరం కూడాప్రకటించవచ్చు. పద్మ పురస్కారాల తరహాలోనే భారతరత్న అవార్డుల కింద కూడా ఎలాంటి నగదు బహుమతిని ఇవ్వరు. ఒక పతకాన్ని, రాష్ట్రపతి సంతకం చేసిన ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తారు. |
పతకం రావి ఆకు ఆకృతిలో ఉంటుంది. పొడవు 5.8 సెం.మీ., వెడల్పు 4.7 సెం.మీ., మందం 3.1 మిల్లీమీటర్లు ఉంటుంది. ముందు భాగంలో సూర్యుడి బొమ్మ ఉంటుంది. కిందిభాగంలో 'భారతరత్న' అనే అక్షరాలు దేవనాగరి లిపిలో రాసి ఉంటాయి. వెనుక భాగంలో దేశ అధికార చిహ్నం ఉంటుంది. పతకాలను కోల్‌కతా మింట్‌లో తయారు చేస్తారు. పతకానికి తెల్లటి రిబ్బన్ ఉంటుంది. |
|
భారతరత్న గ్రహీతలకు అందే ప్రయోజనాలు దేశంలో ఎక్కడికైనా ఉచితంగా విమానాల్లో మొదటి తరగతి ప్రయాణం. ఉచితంగా రైళ్లలో మొదటి తరగతి ప్రయాణం. భారత ప్రధానమంత్రికి అందే నెలవారీ వేతనంలో సగానికి సమానమైన మొత్తం పింఛనుగా అందుతుంది. పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావచ్చు. అవసరమైతే జడ్ కేటగిరీ భద్రత పొందవచ్చు. గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తారు. ప్రాధాన్య క్రమంలో 1. రాష్ట్రపతి 2. ఉపరాష్ట్రపతి 3. ప్రధానమంత్రి 4. రాష్ట్రాల గవర్నర్లు 5. ఉపప్రధాని, మాజీ రాష్ట్రపతులు 6. లోక్‌సభ స్పీకర్, భారత ప్రధాన న్యాయమూర్తి తర్వాత 7వ స్థానంలో భారతరత్న అవార్డు గ్రహీతలు ఉంటారు. ఇదే స్థానంలో మాజీ ప్రధానులు, ప్రస్తుత కేంద్ర కేబినేట్ మంత్రులు, పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్ష నేతలు, ముఖ్యమంత్రులు ఉంటారు.గ్రహీతల విశేషాలుఇప్పటివరకు 43 మందికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. భారతరత్న తొలుత 1954లో సర్వేపల్లి రాధాకృష్ణన్, సి.వి.రామన్, సి.రాజగోపాలాచారి అందుకున్నారు. మరణాంతరం ఈ పురస్కారాన్ని తొలుత పొందినవారు లాల్‌బహుదూర్ శాస్త్రి (1966). ఇప్పటివరకు ఇద్దరు విదేశీయులు నెల్సన్ మండేలా (1990), ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (1987) భారతరత్న అందుకున్నారు. మరణానంతరం 1992లో సుభాష్ చంద్రబోస్‌కు భారతరత్న ప్రకటించారు. అయితే ఆయన మరణానికి సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేకపోవడంతో అవార్డును ఉపసంహరించారు. ఈ అవార్డును ఉపసంహరించిన సందర్భం అదొక్కటే. |
¤ పాకిస్థాన్ యువ హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్ జాయ్‌కి ప్రతిష్ఠాత్మక బాలల నోబెల్ పురస్కారం లభించింది. » 2014 సంవత్సరానికి ఈ పురస్కారాన్ని మలాలాతో పాటు అమెరికాకు చెందిన జాన్ ఉడ్, నేపాల్ కు చెందిన మరో హక్కుల కార్యకర్త ఇందిరా రానా మగర్‌కు కూడా ప్రకటించారు. » స్వీడన్‌కు చెందిన సంస్థ ఏటా ముగ్గురికి ఈ అవార్డును అందజేస్తోంది. » విజేతల ఎంపిక కోసం తొలిదశలో 109 దేశాల్లోని 60 వేల పాఠశాలల్లో 'గ్లోబల్ ఓట్' పోలింగ్ నిర్వహించిన జ్యూరీ తుది ఎంపిక చేపట్టింది.
|
|
ఫిబ్రవరి - 10
|
| ¤ 2012-13లో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ముందు వరసలో నిలిచినందుకు ఏడు రాష్ట్రాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీలో 'కృషి కర్మాన్' పురస్కారాలను ప్రదానం చేశారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. » చిరు ధాన్య పంటల్లో అధిక దిగుబడులు సాధించినందుకు ఆంధ్రప్రదేశ్‌కు 'కృషి కర్మాన్' పురస్కారం లభించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అందజేశారు. » రాష్ట్రానికి చెందిన ఇద్దరు రైతులు సైతం పురస్కారాలను పొందారు. రాగుల పంటలో సాధారణం కంటే 280% అధిక దిగుబడులు సాధించిన ఎం.వీరమ్మ (విజయనగరం), జొన్న పంటలో సాధారణం కంటే 164% అధిక దిగుబడి సాధించిన మాటూరి శంకర్ (మెదక్)లు పురస్కారాన్ని అందుకున్నారు. వీరిద్దరికీ రూ.లక్ష చొప్పున అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.ఒక కోటి బహుమతితో పాటు ప్రశంసాపత్రం, ట్రోఫీని అందించారు.¤ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీకి 'నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్' లభించింది. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్‌మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్ (ఐఏఏపీఐ) సంస్థ 'ఈవెంట్ ఫర్ ద ఇయర్' విభాగంలో ఈ పురస్కారాన్ని ప్రకటించింది. |
» ఐఏఏపీఐ అనేది భారత్‌లో వినోద పరిశ్రమకు సంబంధించిన సర్వోన్నత సంస్థ. » రామోజీ ఫిల్మ్ సిటీలో సెలవుల సీజన్‌లో కళ్లు చెదిరే రీతిలో, అద్వితీయ స్థాయిలో నిర్వహించిన కార్నివాల్‌కు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. |
|
| ¤ క్యాన్సర్ వ్యాధిపై విశేష పరిశోధనలు చేసిన జర్మనీ ప్రొఫెసర్, వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ హెరాల్డ్ జుర్ హుస్సేన్‌కు ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును ప్రకటించారు. అదే విధంగా అగ్రశ్రేణి ఔషధ కంపెనీ జీఎస్‌కే కూడా ఈ అవార్డుకు ఎంపికైంది. |
|
| » తమ విభాగాల్లో విశేష సేవలు అందించిన ఫలితంగా హుస్సేన్, జీఎస్‌కేలను జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డులకు ఎంపిక చేసినట్లు బయోఏషియా సీఈఓ శక్తి నాగప్పన్ ప్రకటించారు. » డాక్టర్ హుస్సేన్ జర్మన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్ బోర్డుకు ఛైర్మన్‌గా ఉన్నారు. మహిళలను ప్రమాదంలోకి నెట్టివేసే గర్భాశయ క్యాన్సర్‌పై విశేష పరిశోధనలు చేశారు. దీనికి వ్యాక్సిన్ తయారు చేయడానికి ఆయన పరిశోధనలు ఉపకరించాయి. » యూకే కేంద్రంగా జీఎస్‌కే పని చేస్తోంది. దాదాపు 115 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. యూకే, స్పెయిన్, యూఎస్, బెల్జియం , చైనా దేశాల్లో దీనికి పరిశోధన కేంద్రాలున్నాయి. హెచ్ఐవీ/ ఎయిడ్స్, టీబీ, మలేరియా వ్యాధుల చికిత్సలో వినియోగించే ఔషధాలనెన్నింటినో ఈ సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థకు సరఫరా చేస్తోంది. » జీఎస్‌కే అంతర్జాతీయ అధ్యక్షుడు అబ్బాస్ హుస్సేన్ ఈ అవార్డును స్వీకరించనున్నారు. » ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకూ హైదరాబాద్‌లో జరిగే బయోటెక్నాలజీ సదస్సు 'బయో ఏషియా'లో ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. » జీనోమ్ వ్యాలీ ఎక్స్‌లెన్స్ అవార్డులను రాష్ట్రప్రభుత్వం 2004 నుంచి బయోఏషియా సదస్సులో భాగంగా బహూకరిస్తోంది.¤ పోలియోపై విజయానికి నాయకత్వం వహించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రోటరీ అత్యున్నత పురస్కారం దక్కింది. రోటరీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు రాన్ బర్టన్ రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్ ముఖర్జీకి ఈ పురస్కారాన్ని అందజేశారు. |
| ¤ స్టార్ ఆర్చరీ దీపిక కుమారికి స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఫిక్కీ ప్రదానం చేసింది. |
|
| » క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌కు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. » యువ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఉత్తమ వర్థమాన క్రీడాకారిణిగా, యువరాజ్ సింగ్ స్ఫూర్తిదాయక క్రీడాకారుడిగా అవార్డులు అందుకున్నారు. » భారత మహిళ ఆర్చరీ జట్టుకు టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. » ఛెత్రి ఉత్తమ ఫుట్‌బాలర్‌గా ఎంపికయ్యాడు. |
ఫిబ్రవరి - 14
|
| ¤ హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్, ప్రొఫెసర్ సునయనా సింగ్‌కు ప్రతిష్ఠాత్మక చాణక్య అవార్డు లభించింది. » ముంబయిలో జరిగిన 8వ గ్లోబల్ కమ్యూనికేషన్ సదస్సులో భారత ప్రజాసంబంధాల మండలి, ముంబయి ప్రెస్‌క్లబ్ సంయుక్తంగా ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేశాయి. |
| ¤ హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ లో సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ పత్తిపాటి ఉషారాణికి కటక్‌లోని అప్లైడ్ జువాలజిస్ట్ రిసెర్చ్ అసోసియేషన్ ఫెలోషిప్‌తో పాటు డాక్టర్ బి.వసంతరాజ్ డేవిడ్ పురస్కారం లభించాయి. |
ఫిబ్రవరి - 16
|
| ¤ విశాఖ ఉక్కు కర్మాగారం (రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ - ఆర్ఐఎన్ఎల్) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి.మధుసూధన్ కు అత్యుత్తమ కార్పొరేట్ లీడర్స్ ఆఫ్ ఇండియా అవార్డు లభించింది. » ముంబయిలో జరిగిన 22వ వరల్డ్ హెచ్ఆర్‌డీ కాంగ్రెస్ (ప్రపంచ మానవ వనరుల అభివృద్ధి సదస్సు)లో ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. » జూనియర్ మేనేజర్ (ఆర్థిక వ్యవహారాలు)గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన మధుసూధన్ ఛైర్మన్ స్థాయికి చేరుకోవడం గమనార్హం. » విశాఖ ఉక్కుకు సంబంధించి ఈ అవార్డు అందుకున్న తొలి సీఎండీగా మధుసూధన్ నిలిచారు. |
ఫిబ్రవరి - 18
|
¤ జాతీయ పర్యటక పురస్కారాలను (2012-13) న్యూఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో కేంద్ర సహాయ మంత్రి శశిథరూర్ ప్రదానం చేశారు. » రాష్ట్ర పర్యటక శాఖ ఆరు విభాగాల్లో పురస్కారాలు సొంతం చేసుకుంది. » మధ్యప్రదేశ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ 'ఉత్తమ పర్యటక రాష్ట్రం' పురస్కారాన్ని గెల్చుకుంది. |
| » ఉత్తమ వారసత్వ నగరంగా తిరుపతి, అత్యుత్తమ విమానాశ్రయంగా హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, వికలాంగులకు అనువుగా నడకదారి నిర్మించిన గోల్కొండ కోటకు ఉత్తమ కోట పురస్కారం, బెస్ట్ ఫిల్మ్ ప్రమోషన్, ఫ్రెండ్లీ స్టేట్ విభాగాల్లో మన రాష్ట్రం పురస్కారాలు దక్కించుకుంది. |
| » 'అతిథి దేవోభవ' విభాగంలో రాష్ట్ర పర్యటక శాఖ బస్ డ్రైవర్లు మహమ్మద్ సర్దార్, పి.శ్రీనివాసరాజు పురస్కారాన్ని అందుకున్నారు. |
|
ఫిబ్రవరి - 23
|
¤ విశాఖ స్టీల్‌ప్లాంట్ సీఎండీ పి.మధుసూధన్‌కు ప్రతిష్ఠాత్మక ఐకాన్-2013 పురస్కారం లభించింది. » భువనేశ్వర్‌లో జరిగిన 55వ వ్యయ సదస్సులో ఒడిశా రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ
శాఖలమంత్రి సూర్యనారాయణ పాత్రో ఈ అవార్డును మధుసూదన్‌కు అందజేశారు. |
| ¤ బ్రహ్మోస్ క్షిపణి రూపశిల్పి శివథాను పిళ్లైని రష్యా ప్రభుత్వం విదేశీయులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్'తో గౌరవించింది. » ఆ దేశ ఉపప్రధాని దిమిత్రి రొగొజిన్ న్యూఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని శివధానుకు ప్రదానం చేశారు. |
|
| ¤ విమానాశ్రయ సేవా నాణ్యత (ఏఎస్‌క్యూ)లో వరుసగా రెండో ఏడాదీ ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) అవార్డు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి లభించింది. |
ఫిబ్రవరి - 28
|
| ¤ ప్రముఖ గాంధేయవాది, పర్యావరణవేత్త చాందీ ప్రసాద్ భట్ కు 2013 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతిని ప్రకటించారు. » ప్రధాని మన్మోహన్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఆయనను ఎంపిక చేసింది. » చిప్కో ఉద్యమ నిర్మాతల్లో ఒకరిగా ప్రసాద్ గుర్తింపు పొందారు. 1982లో రామన్ మెగసెసే, 2005లో పద్మభూషణ్ అవార్డులను ఆయన గెలుపొందారు. |
|
|