సెప్టెంబరు - 5
|
¤ భారత్‌లో 15 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న వివాహిత బాలికల్లో 77 శాతం మంది వారి జీవిత భాగస్వాముల నుంచి లైంగిక హింసను ఎదుర్కొంటున్నారని యునిసెఫ్ నివేదిక వెల్లడించింది.
» దేశంలో 15 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న వివాహిత బాలికల్లో 34 శాతం మంది జీవిత భాగస్వాముల చేతుల్లో ఏదో ఒక రూపంలో శారీరక, లైంగిక లేదా మానసిక హింసను ఎదుర్కొంటున్నారని నివేదిక వివరించింది.
» 2012లో హత్యకు గురైన 19 ఏళ్ల లోపు వారి సంఖ్య భారత్‌లో చాలా ఎక్కువగా (దాదాపు 9,400) ఉందని నివేదిక పేర్కొంది. ఈ విషయంలో భారత్‌ది మూడో స్థానమని తెలిపింది.
» 190 దేశాల నుంచి సేకరించిన సమాచారంతో యునిసెఫ్ ఈ నివేదికను రూపొందించింది.
|
సెప్టెంబరు - 7
|
¤ దేశంలోని 1394 జైళ్లలో మహిళల కోసం ప్రత్యేకించినవి కేవలం 20 మాత్రమేనని 'జాతీయ నేరాల నమోదు బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ)' నివేదిక వెల్లడించింది.
» దేశవ్యాప్తంగా ఉన్న 16,951 మహిళా ఖైదీల్లో కేవలం 3,200 మంది మాత్రమే తమకు ప్రత్యేకించిన కారాగారాల్లో శిక్ష అనుభవిస్తున్నట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది.
» కారాగారాల్లో శిక్షను అనుభవిస్తున్న మొత్తం ఆడ ఖైదీలకు ఉన్న మహిళా సిబ్బంది కేవలం 25 శాతం మాత్రమే. 2012 డిసెంబరు 31కి మహిళా జైలు సిబ్బంది సంఖ్య 3,935 గా ఉంది.
» తమిళనాడు, కేరళ లో మహిళా కారాగారాల సంఖ్య అధికం. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ లో రెండేసి మహిళా జైళ్లు ఉన్నాయి. బీహార్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఒక్కొక్కటి చొప్పున మహిళా జైళ్లు ఉన్నాయి.
» భారత్‌లోని వివిధ జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న విదేశీ మహిళల సంఖ్య 636. దోషులుగా 138 మందికి శిక్ష నిర్ధారణ కాగా, మిగిలిన వారంతా విచారణను ఎదుర్కొంటున్నారు.
¤ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత నేరగాళ్ల సంఖ్య పెరిగినట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. గత అయిదేళ్ల ఎన్‌సీఆర్‌బీ గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తోంది.
» దేశవ్యాప్తంగా 2012తో పోలిస్తే 2013లో 0.3 శాతం మేర పాత నేరగాళ్లు పెరిగారు. 2013లో మొత్తం నేరగాళ్లలో 12.6 శాతం మంది పాతనేరగాళ్లే ఉన్నారు. అసోం, మేఘాలయ, ఒడిశా, కేరళ, పంజాబ్ తర్వాత ఆరోస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది.
» ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009లో 21,516 మంది ఒకసారి శిక్షపడిన పాతనేరగాళ్లు ఉండగా, 2013 నాటికి ఆ సంఖ్య 28,967కు చేరింది. రెండోసారి శిక్షపడిన వారు 2009లో 3463 మంది ఉండగా, 2013 నాటికి వారి సంఖ్య 4785కు చేరింది. మూడోసారి శిక్షను ఎదుర్కొన్నవారు అయిదేళ్ల కిందట 663 మంది ఉండగా, 2013కు మాత్రం 1769కు చేరారు.
గత అయిదేళ్లలో దేశంలోనూ, ఆంధ్రప్రదేశ్‌లో శిక్షలు పడిన పాత నేరగాళ్ల శాతాల గణాంకాలు సంవత్సరం 2013 2012 2011 2010 2009 దేశంలో 7.2 6.9 6.9 8.2 9.0 ఆంధ్రప్రదేశ్‌లో 12.6 14.3 6.6 8.2 10.9 |
సెప్టెంబరు - 8
|
¤ స్టాక్ ఎక్చ్సేంజీల నిర్వహణకు సంబంధించి ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఈఎఫ్) నివేదికను విడుదల చేసింది.ముఖ్యాంశాలు |
సెప్టెంబరు - 9
|
¤ ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా, నగరంలో జూన్ 27న జరిగిన గ్యాస్ పైప్‌లైన్ పేలుడు దుర్ఘటనకు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్)లో లోపాలే కారణమని చమురు మంత్రిత్వ శాఖ దర్యాప్తు నివేదిక ఆక్షేపించింది. |
సెప్టెంబరు - 11
|
¤ దేశంలోని దాదాపు 40 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని కేంద్ర మానవాభివృద్ధి శాఖ వెల్లడించింది. |
|
¤ 2013లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన అయిదేళ్లలోపు శిశువుల మరణాలపై ఐరాస నివేదిక విడుదల చేసింది.
ముఖ్యాంశాలు
» శిశు మరణాల సంఖ్య విషయంలో పరిస్థితి మెరుగుపడినప్పటికీ, ఈ విషయంలో భారత దేశమే అగ్రస్థానంలో నిలుస్తోంది.
» గతేడాది భారత్‌లో 13.4 లక్షల మంది శిశువులు అయిదేళ్ల వయసు లోపే మరణించారు. 1990లో ఇది 33.3 లక్షలు.
» 1990లో భారత్‌లో జన్మించిన ప్రతీ వెయ్యి మంది శిశువుల్లో 88 మంది అయిదేళ్లలోపు చనిపోగా, గతేడాది ఆ సంఖ్య 41కి తగ్గింది.
» నవజాత శిశుమరణాల సంఖ్య ఈ వ్యవధిలో 51 నుంచి 29కి తగ్గింది.
» నివారించడానికి వీలున్న న్యుమోనియా, మలేరియా, అతిసార లాంటి వ్యాధులతోనే భారత్‌లో చిన్నారుల ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదిక వెల్లడించింది.
¤ క్వాస్ కారెల్లీ సైమండ్స్ (క్యూఎస్) ప్రపంచంలోని అత్యుత్తమ 700 వర్సిటీల జాబితాను విడుదల చేసింది.
» పరిశోధన, బోధన, ఉద్యోగ కల్పన, అంతర్జాతీయత లాంటి నాలుగు అంశాల్లో చూపించిన ప్రతిభ ఆధారంగా వర్సిటీలకు క్యూఎస్ ప్రపంచ ర్యాంకులను కేటాయించింది.
» మొదటి స్థానంలో మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నిలిచింది. తర్వాతి స్థానాల్లో కేంబ్రిడ్జి, ఇంపీరియల్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్, లండన్ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా అయిదో స్థానంలో నిలిచాయి.
» ప్రపంచ మొదటి రెండు వందల వర్సిటీల్లో భారత్‌లోని ఏ ఒక్క విశ్వవిద్యాలయం లేదు. భారత్ నుంచి ఐఐటీ బాంబే 222, ఐఐటీ ఢిల్లీ 235, ఐఐటీ కాన్పూర్ 300, ఐఐటీ మద్రాస్ 322, ఐఐటీ ఖరగ్‌పూర్ 324వ స్థానాల్లో నిలిచాయి. మొత్తం 700 వర్సిటీలకు ర్యాంకులు ప్రకటించగా అందులో భారత్‌కు చెందిన 12 వర్సిటీలున్నాయి. గతంలో ఇవి 11 ఉండేవి.
» మొదటి రెండు వందల స్థానాల్లో 31 దేశాలకు చెందిన వర్సిటీలు ఉన్నాయి. అందులో 51 విశ్వవిద్యాలయాలతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో యూకే (29), జర్మనీ (13), నెదర్లాండ్స్ (11), కెనడా (10), జపాన్ (10), ఆస్ట్రేలియా (8) ఉన్నాయి.
¤ చట్ట విరుద్ధమైన ఔషధాల ఉత్పత్తి, రవాణా చేస్తున్న దేశాల జాబితాలో భారత్, పాకిస్థాన్ ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వెల్లడించారు.
» 22 దేశాలతో కూడిన జాబితాను ఆయన ప్రకటించారు. ఈ జాబితాలో భారత్, పాక్‌లతో పాటు వెనెజులా, అఫ్గానిస్థాన్, బహమాస్, బెలీజ్, బొలీవియా, బర్మా, కొలంబియా, కోస్టారికా, డొమినికన్ రిపబ్లిక్, ఈక్విడార్, ఎల్ సాల్విడార్, గ్యాటిమాలా, హైతి, హోండురస్, జమైకా, లావోస్, మెక్సికో, నికరాగువా, పనామా, పెరూ ఉన్నాయి. |
సెప్టెంబరు - 17
|
¤ వైల్డ్ - ఎక్స్, యూబీఎస్ బిలియనీర్ సెన్సెస్ - 2014 నివేదికను సింగపూర్‌లో విడుదల చేశారు.
» అపర కుబేరుల (బిలియనీర్) సంఖ్య పరంగా భారత్ ఆరో స్థానంలో నిలిచింది.
» భారత్‌లో ఈ ఏడాది 100 మంది బిలియనీర్లు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
» ఈ వంద మందికి కలిపి మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 10,50,000 కోట్లు (175 బిలియన్ డాలర్లు) ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. » ప్రపంచవ్యాప్తంగా అపర కుబేరుల సంఖ్య రికార్డు స్థాయిలో 2,325కు చేరింది. గత ఏడాదితో పోల్చుకుంటే 155 మంది ఎక్కువ.
» స్విట్జర్లాండ్, హాంకాంగ్, ఫ్రాన్స్ తదితర దేశాల కంటే భారత్‌లోనే బిలియనీర్ల సంఖ్య ఎక్కువ అని తేలింది.
» తొలి 40 బిలియనీర్ల నగరాలు/దేశాల జాబితాలో అమెరికాకు అగ్రస్థానం దక్కింది. ఆ దేశంలో అపరకుబేరుల సంఖ్య 571. తర్వాతి స్థానంలో చైనా (190), యూకే (130) నిలిచాయి.
» ప్రపంచవ్యాప్తంగా ఉన్న అపరకుబేరుల సంపద అంతా కలిపితే గత ఏడాదితో పోల్చుకుంటే 12 శాతం పెరిగింది. వారి మొత్తం సంపద దాదాపు రూ 4,38,00,000 కోట్ల (7.3 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది.
» భారతదేశ ఆర్థిక రాజధాని ముంబయిలో అపర కుబేరుల సంఖ్య 28. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 20 అగ్ర బిలియనీర్ల నగరాల్లో ముంబయి ఒకటి. 103 మంది అపర కుబేరులతో న్యూయార్క్‌కు అగ్రస్థానం దక్కింది. |
సెప్టెంబరు - 25
|
¤ భారత్‌లోని 100 మంది కుబేరుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. » భారత్ కుబేరుల్లో వరుసగా 8వ ఏడాదీ ముకేష్ అంబానీయే ప్రథమ స్థానంలో నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ సారథి అయిన ముకేష్ సంపద గత ఏడాది కంటే 2.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.15,600 కోట్లు) పెరిగి 23.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1,41,600 కోట్లు)గా నమోదైంది.
» ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా దిలీప్ సింఘ్వి (18 బి.డాలర్లు), అజీం ప్రేమ్‌జీ (16.4 బి.డా.), పల్లోంజీ మిస్త్రీ (15.9 బి.డా.), లక్ష్మీ మిట్టల్ (15.8 బి.డా.), హిందుజా సోదరులు (13.3 బి.డా.), శివ్ నాడార్ (12.5 బి.డా.), ఆది గోద్రెజ్ కుటుంబం (11.6 బి.డా.), కుమార మంగళం బిర్లా (9.2 బి.డా.), సునీల్ మిట్టల్ కుటుంబం (7.8 బిలియన్ డాలర్లు) ఉన్నారు.
» భారత్‌లోని 100 మంది కుబేరుల సంపద 2013లో 259 బిలియన్ డాలర్లు (సుమారు రూ.15,54,000 కోట్లు) కాగా, ఈసారి 346 బి.డా. (సుమారు రూ.20,76,000 కోట్లు)కు పెరిగింది.
» ఈ జాబితాలో చోటు సంపాదించడానికి గత ఏడాది 635 మిలియన్ డాలర్ల (సుమారు రూ.3810 కోట్లు) సంపదను కనీస అర్హతగా నిర్ణయించగా, ఈ సారి బిలియన్ డాలర్లు (సుమారు రూ.6,000 కోట్లు)గా పరిగణించారు.
» ఈ జాబితాలో నలుగురే మహిళలు ఉండగా, అందరి సంపద కలిపి 11.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఓపీ జిందాల్ గ్రూప్ ఛైర్‌పర్సన్ సావిత్రి జిందాల్ 12వ స్థానం, బెన్నెట్‌కు చెందిన ఇందు జైన్ 31వ స్థానం, బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా 81వ స్థానం, థర్మాక్స్ గ్రూప్‌నకు చెందిన అను ఆగా 94వ స్థానంలో నిలిచారు. |
సెప్టెంబరు - 28
|
¤ అంతర్జాతీయంగా ఉన్న 18 మెట్రో వ్యవస్థల్లో వివిధ విషయాల్లో వినియోగదారుల సంతృప్తికి సంబంధించి నిర్వహించిన ఆన్‌లైన్ వినియోగదారుల సర్వేలో ఢిల్లీ మెట్రో ద్వితీయ స్థానంలో నిలిచింది.
» మెట్రో వ్యవస్థల పనితీరును అంచనా వేసే సంస్థలైన 'నోవా', 'కోమెట్‌లు' ఆ 18 మెట్రో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులతో సర్వే నిర్వహించాయి.
» ఈ సర్వేలో లండన్ డీఎల్ఆర్ ప్రథమ స్థానంలో నిలవగా, బ్యాంకాక్ మెట్రో తృతీయ స్థానంలో నిలిచింది.
|
సెప్టెంబరు - 30
|
¤ ప్రపంచ నగరాల్లో బిలియనీర్లకు సంబంధించి వెల్త్-ఎక్స్, యు.బి.ఎస్. బిలియనీర్ల జనాభా-2014 నివేదిక విడుదలైంది.ముఖ్యాంశాలు: » ప్రపంచ కుబేరుల్లో ఎక్కువ మంది న్యూయార్క్‌కు చెందినవారు ఉన్నప్పటికీ మొదటి 20 మందిలో 8 మంది ఆసియా నగరాలకు చెందినవారు ఉండటం గమనార్హం.
» మొత్తం బిలియనీర్ల సంపదను చూస్తే 30% నికర పెరుగుదలతో ఆసియా దేశాలే ముందున్నాయి.
» ఆసియా నగరాల్లో హాంకాంగ్‌లో అత్యధికంగా 82 మంది బిలియనీర్లు ఉన్నారు. తర్వాతి స్థానాల్లో బీజింగ్ (37 మంది), సింగపూర్ (32), ముంబయి (28), టోక్యో (26), షెంఝెన్ (25), షాంఘై (21), తైపే (21), సియోల్ (20), బ్యాంకాక్ (17) నిలుస్తున్నాయి.
» ప్రపంచంలో ఉన్న మొత్తం బిలియనీర్లు సంఖ్య 2,325. వారిలో 34% మంది 20 అగ్రశ్రేణి నగరాల్లోనే ఉన్నారు.
» ఎక్కువ మంది బిలియనీర్లు అమెరికాలో (571) ఉన్నారు.
» 30 మిలియన్ డాలర్లు (సుమారు రూ.180 కోట్లు) నికర ఆస్తులు ఉన్నవారిని అధ్యయనానికి పరిగణనలోకి తీసుకున్నారు.
¤ అమెరికాకు చెందిన 400 మంది అత్యంత ధనికుల జాబితాను 'ది రిచెస్ట్ పీపుల్ ఇన్ అమెరికా 2014' శీర్షికన ఫోర్బ్స్ పత్రిక వెలువరించింది.
ముఖ్యాంశాలు
» వీరందరి సంపద కలిపితే 2.29 ట్రిలియన్ డాలర్లు. ఇది గతేడాది కంటే 270 బిలియన్ డాలర్లు ఎక్కువ.
» 81 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4,94,100 కోట్లు) సంపదతో మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ బిల్‌గేట్స్ వరుసగా 21వ ఏడాదీ ప్రథమ స్థానంలో నిలిచారు.
» బెర్క్‌షైర్ హాథ్‌వే చీఫ్ ఎగ్జిక్యూటివ్ వారెన్ బఫెట్ (67 బి.డా.), ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ (50 బి.డా) వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నారు.
» ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ (34 బి.డా.) 11వ స్థానంలో ఉన్నప్పటికీ ఆర్జనలో ఆయనే ముందున్నారు. ఏడాది కాలంలో జుకర్‌బర్గ్ సంపద 15 బి.డా. పెరిగింది.
» ఈ జాబితాలో అయిదుగురు భారత సంతతివారు ఉన్నారు.1. భరత్ దేశాయ్ (2.5 బి.డా.) - ఔట్‌సోర్సింగ్ సంస్థ సింటెల్ వ్యవస్థాపకుడు - 255వ స్థానం2. జాన్ కపూర్ - అకోర్న్ ఫార్మాస్యూటికల్స్ - ఇన్‌సిస్ థెరాప్యుటిక్స్ - 261వ స్థానం3. రమేష్ వాద్వానీ - సింఫనీ టెక్నాలజీ - 264వ స్థానం4. కవితార్క్ రామ్ శ్రీరామ్ - సిలికాన్ వ్యాలీ ఏంజల్ ఇన్వెస్టర్ - 350వ స్థానం5. వినోద్ ఖోస్లా - వెంచర్ కేపిటలిస్ట్ - 381వ స్థానం
|
|
|