¤ బ్రిటన్‌లోని హైబ్రిడ్ ఎయిర్ వెహికల్స్ అనే సంస్థ రూపొందించిన 'ఎయిర్ లాండర్' అనే విమానం ప్రపంచంలో అతిపెద్ద విమానంగా గుర్తింపు పొందింది. దీని పొడవు 300 అడుగులు (సుమారు 91 మీటర్లు). |
|
» ఇప్పటివరకు అతిపెద్ద విమానం రికార్డు రష్యాకు చెందిన అంటొనోవ్ (ఏఎన్ - 225) పేరిట ఉండేది. దీని పొడవు 84 మీటర్లు.
» హిండెన్‌బర్గ్ పేరిట 244 మీటర్ల పొడవైన విమానాన్ని జర్మనీ రూపొందించగా, అది 1937లో కూలిపోయింది. ఇప్పటివరకు రూపొందించిన వాటిలో అతిపెద్ద విమానం ఇదే. |
మార్చి - 3
|
¤ వేపలోని నాలుగు మూలకాలు క్యాన్సర్ నివారణలో పనిచేస్తాయని గుర్తించినట్లు హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) వెల్లడించింది. » దీనిపై లోతైన అధ్యయనానికి అమెరికాలోని ప్రఖ్యాత 'మేయో క్లినిక్'తో కలిసి పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.
» 'రసాయన శాస్త్రంలో ప్రకృతి ప్రేరేపిత ఔషధాలు' అనే అంశంపై హైదరాబాద్‌లో ప్రారంభమైన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సులో ఐఐసీటీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు.
¤ చైనాకు చెందిన ఒక పురాతన వృక్షం బెరడు క్లోమ క్యాన్సర్ చికిత్సకు పనికొస్తుందని అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయం తేల్చింది.
» అమూర్ కార్క్ అనే ఆ చెట్టు బెరడు నుంచి సేకరించిన ఒక పదార్థానికి ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నయం చేసే గుణం ఉందని ఇప్పటికే తేలింది. క్యాన్సర్ వృద్ధి మార్గాలను కార్క్ బెరడులోని పదార్థం అడ్డుకుంటుందని, క్యాన్సర్ చికిత్స ఔషధాలను దరిచేరనివ్వని స్కారింగ్ ప్రక్రియను కూడా ఆపేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
» పరిశోధనకు భారత సంతతి శాస్త్రవేత్త ఎ.ప్రతాప్‌కుమార్ నాయకత్వం వహించారు. |
మార్చి - 4
|
¤ సైబీరియాలో సుప్తావస్థలో ఉన్న 30,000 ఏళ్ల కిందటి ఓ రకం వైరస్‌ను ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో తిరిగి చైతన్యవంతం చేశారు.
» బాగా గడ్డకట్టుకుపోయిన మట్టిలో 30 మీటర్ల లోతున దీన్ని కనుక్కున్నారు. 30,000 ఏళ్ల తర్వాత కూడా సంక్రమించే శక్తితో ఉన్న వైరస్‌ను కనుక్కోవడం ఇదే ప్రథమం.
¤ హృద్రోగాల బారిన పడకుండా ఉండాలంటే చేపలను ఆహారంగా తీసుకోవడం మంచిదని తూర్పు ఫిన్లాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
» వారానికి మూడు నుంచి నాలుగు సార్లు చేపలు తింటే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ అభివృద్ధి చెంది, గుండెను రక్షిస్తుందని అధ్యయనంలో తేలినట్లు వారు వెల్లడించారు. |
మార్చి - 7
|
¤ సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు గూగుల్ ఒక మిలియన్ డాలర్ల (రూ.6 కోట్లకుపైగా) వ్యయంతో '#40 ఫార్వర్డ్' అనే కార్యక్రమాన్ని చేపట్టింది.
» మహిళాలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ నిధులను మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న 40 సంస్థలకు గూగుల్ పంపిణీ చేయనుంది.
» ఈ 40 సంస్థల్లో భారత్‌కు చెందిన నాస్‌కామ్ 10,000 స్టార్టప్స్, జాగృతియాత్ర అనే సంస్థలున్నాయి. అమెరికాకు చెందిన 1871, అండర్‌గ్రౌండ్ అండ్ గాల్వనైజ్, క్యాంపస్ ఫర్ మామ్స్ (ఇజ్రాయెల్), కిడ్రెప్రెన్యూర్ (ఆస్ట్రేలియా), అవుట్‌బాక్స్ (ఉగాండా) తదితర సంస్థలు కూడా ఈ జాబితాలో చోటు సంపాదించాయి. |
మార్చి - 14
|
¤ భూమి ఏర్పడిన తొలినాళ్లలో విషతుల్యమైన, అత్యంత ప్రతికూల వాతావరణంలోనూ జీవం ఎలా పుట్టింది అనే ప్రశ్నకు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) శాస్త్రవేత్తలు సమాధానం చెబుతున్నారు. 'ఫ్యూయల్ సెల్స్' దీనికి కారణమై ఉంటాయని వారు భావిస్తున్నారు. భూమిపై జీవం ఆవిర్భావానికి దారితీసినట్లుగా భావిస్తున్న రసాయన చర్యలపై వీరు పరీక్షలు చేపట్టారు.
|
|
» 'ఫ్యూయల్ సెల్స్' అనేవి జీవకణాల తరహాలోనే ఉంటాయి. వాటిలోని అణువుల నుంచి ఎలక్ట్రాన్లు అటూ ఇటూ కదులుతుంటాయి. ఫలితంగా విద్యుత్, శక్తి ఉత్పత్తి అవుతుంది. హైడ్రోజన్ లాంటి ఎలక్ట్రాన్ దాత నుంచి ఎలక్ట్రాన్లు... ఆక్సిజన్ లాంటి గ్రహీతకు బదిలీ అవుతాయి.
|
» ఫలితంగా శక్తి ఉద్భవిస్తుంది. ఈ శక్తి జీవానికి ఊపిరి పోసి ఉంటుందని పరిశోధనకు నాయకత్వం వహించిన లారీ బార్జే పేర్కొన్నారు.
» ఇదే తరహా పరిస్థితులు అంగారకుడిపైన, సౌరకుటుంబంలోని ఇతర గ్రహాలపైన జీవం ఆవిర్భావానికి దారి తీసి ఉండొచ్చని బార్జే వివరించారు.
|
మార్చి - 15
|
¤ నెల్లూరులోని షార్ నుంచి ఏప్రిల్ 4న 'పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ - సీ24 (పీఎస్ఎల్‌వీ)' వాహక నౌకను ప్రయోగించనున్నారు. పీఎస్ఎల్‌వీ ద్వారా నావిగేషన్‌కు సంబంధించిన 'ఐఆర్ఎన్ఎస్ఎస్-1బి' ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెడతారు. |
మార్చి - 18
|
¤ దేశీయంగా రూపొందిస్తున్న శతఘ్ని 'ధనుష్' 2014 చివరి నాటికి సైన్యానికి అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన శీతాకాల పరీక్షలు సిక్కింలో విజయవంతంగా పూర్తయ్యాయని, వేసవి పరీక్షలు రాజస్థాన్‌లోని ఎడారిలో జరుగుతాయని ఆర్డనెన్స్ ఫ్యాక్టరీ బోర్డు (ఓఎఫ్‌బీ) ఛైర్మన్ ఎం.సి.బన్సల్ చెప్పారు.
» విస్తృత పరీక్షల తర్వాత ధనుష్‌ను జబల్‌పూర్‌లోని గన్ క్యారేజీ ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయనున్నారు. మొత్తం 114 శతఘ్నల కోసం సైన్యం ఇప్పటికే ప్రాథమిక ఆర్డర్లు ఇచ్చింది.
» స్వీడన్ నుంచి దిగుమతి చేసుకున్న శతఘ్నులకు ఇవి మరింత మెరుగైన వెర్షన్. బోఫోర్స్ శతఘ్నులకు 27 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉండగా, ధనుష్ గుండ్లు మైదాన ప్రాంతంలో 38 కిలోమీటర్ల దూరాన్ని చేరగలవు. |
¤ తీరప్రాంత భద్రత, ఆస్తుల పరిరక్షణ తదితర లక్ష్యాలతో భారత నౌకాదళం సమకూర్చుకుంటున్న నూతన తరం తీర గస్తీ నౌక 'ఐ.ఎన్.ఎస్. సుమేధ' విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ ప్లీట్ లో చేరింది.
|
|
» అత్యాధునిక ఆయుధ, నావిగేషనల్, రాడార్, ఇంటిగ్రేటెడ్ ఇ.ఎస్.ఎం. తదితర వ్యవస్థలు 'సుమేధ'లో ఉన్నాయి. ఈ నౌక హెలికాప్టర్లనూ మోయగలదు. |
మార్చి - 25
|
¤ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఏప్రిల్ 4న నింగిలోకి పంపనున్న 'పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) -సి 24' పనులు మొదటి ప్రయోగ వేదికపై తుది దశకు చేరుకున్నాయి. 'ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ -1 బి' ఉపగ్రహాన్ని రాకెట్‌లో అనుసంధానించడం, హీట్‌షీల్డ్ నింపడం లాంటి పనులు పూర్తయ్యాక మార్చి 29న రాకెట్‌కు రిహార్సల్ నిర్వహిస్తారు.
» ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ శ్రేణిలో మొత్తం 7 ఉపగ్రహాలు ఉంటాయి. అందులో మొదటిదైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ -1 ఎ ఉపగ్రహాన్ని ఇస్రో 2013 జులైలో పీఎస్‌ఎల్‌వీ -సి 22 ద్వారా కక్ష్యలో ప్రవేశ పెట్టింది.
» ప్రస్తుతం ప్రయోగానికి సిద్ధమవుతున్న 'ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ -1 బి' రెండో ఉపగ్రహం. దీని బరువు 1430 కిలోలు. దీనిలో 800 కిలోగ్రాముల ద్రవ ఇంధనం ఉంటుంది. ఈ వ్యవస్థ ద్వారా దేశం, దాని చుట్టూ 1,500 కిలోమీటర్ల వరకు స్థితి, దిశలను నిర్దిష్టంగా తెలుసుకోవచ్చు.
|
¤ అణ్వస్త్ర ప్రయోగానికి సంబంధించి మూడో అంచెను పూర్తి చేసే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. సముద్రాంతర్భాగం నుంచి అణ్వస్త్ర సామర్థ్యమున్న జలాంతర్గామి ప్రయోగిత బాలిస్టిక్ క్షిపణి (ఎస్‌ఎల్‌బీఎం)ని దిగ్విజయంగా పరీక్షించింది. బంగాళాఖాతంలో ఒక వేదిక నుంచి రక్షణ శాఖ దీన్ని ప్రయోగించింది.
|
|
» 2వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తాకే సామర్థ్యం ఉన్న ఈ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని నీటి కింద నుంచి ప్రయోగించవచ్చు. ఇలాంటి సామర్థ్యమున్న క్షిపణుల్లో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే అస్త్రం ఇదే. » భారత సైన్యంలోని వ్యూహాత్మక దళాల కమాండ్ కోసం రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రూపొందిస్తున్న జలాంతర క్షిపణుల కుటుంబంలో ఎస్‌ఎల్‌బీఎం కూడా ఒకటి. ఇప్పటికే 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల 'బీవో 5' అనే క్షిపణిని డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది.
» తాజా ప్రయోగం విజయవంతం కావడంతో అణ్వస్త్ర సామర్థ్యమున్న దీర్ఘశ్రేణి క్షిపణులను నేల మీద నుంచి, గగనతలంలో నుంచి, నీటి కింద నుంచి ప్రయోగించే సామర్థ్యాన్ని దేశం సముపార్జించుకున్నట్లయింది. ఇలా మూడంచెలపై పట్టు అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా లాంటి అతికొద్ది దేశాలకే ఉంది.
» తాజా క్షిపణిని దేశీయంగా రూపొందిస్తున్న అణు జలాంతర్గామి 'ఐఎన్‌ఎస్ అరిహంత్'లో ప్రవేశపెట్టాలని రక్షణశాఖ భావిస్తోంది.
» అణ్వస్త్రాలను మొదటగా ఎవరిపైనా ప్రయోగించకూడదన్న విధానం భారత్‌కు ఉంది. ఈ నేపథ్యంలో శత్రు దేశం జరిపిన అణు దాడిని తట్టుకొని, ప్రతీకార దాడిని చేపట్టడానికి జలాంతర్గామి ప్రయోగిత బాలిస్టిక్ క్షిపణులు చాలా ఉపయోగపడతాయి.
» జలాంతర్గాములు దేశ భూభాగానికి దూరంగా సాగరంలో ఎక్కడో దాగుంటాయి. వాటిని గుర్తించి దాడి చేయడం అంత సులువు కాదు. అందువల్ల వాటిలో భద్రపరచిన అణ్వస్త్రాలతో ప్రతీకార దాడిని చేపట్టవచ్చు. |
¤ అణ్వస్త్ర సామర్థ్యమున్న 'పృథ్వి-2' క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ అస్త్రాన్ని ఉపరితలం నుంచి ఉపరితలంపై ఉండే లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగించవచ్చు. 350 కిలోమీటర్ల దూరం వరకూ ఇది వెళ్లగలదు. 500 నుంచి వెయ్యి కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో సంచార లాంచర్ నుంచి ఈ అస్త్రాన్ని ప్రయోగించినట్లు ఐటీఆర్ డైరెక్టర్ ఎంవీకేవీ ప్రసాద్ చెప్పారు.
| |
» క్షిపణి గమనాన్ని ఒడిశా తీరంలో ఏర్పాటు చేసిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రాడార్లు, ఎలక్ట్రో-ఆప్టికల్ ట్రాకింగ్ వ్యవస్థలు, టెలిమెట్రి స్టేషన్లు నిశితంగా పరిశీలించాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. నిర్దేశించిన విధంగా క్షిపణి బంగాళాఖాతంలో ఒక ప్రాంతంలో పడిపోయిందని వివరించాయి. అక్కడికి సమీపంలో మోహరించిన నౌకలోని బృందాలు ఈ దశను పరిశీలించాయి.
» పృథ్వి-2ను సమీకృత నిర్దేశిత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం (ఐజీఎండీపీ) కింద డీఆర్‌డీవో రూపొందించింది. ఈ అస్త్రంలో ద్రవ ఇంధనంతో పనిచేసే రెండు ఇంజిన్లు ఉంటాయి. అత్యాధునిక ఇనర్షియల్ గైడెన్స్ వ్యవస్థ కూడా దీని సొంతం.
» ఈ క్షిపణిని 2003లో సైన్యంలోని వ్యూహాత్మక దళాల కమాండ్ (ఎస్‌ఎఫ్‌సీ)లో ప్రవేశపెట్టారు. శిక్షణలో భాగంగానే సైన్యం తాజా పరీక్షను నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు. చివరిసారిగా ఈ ఏడాది జనవరి 7న ఈ క్షిపణిని పరీక్షించారు. |
|
|