ఫిబ్రవరి - 2
|
¤ ముఖ భావాలను విశ్లేషించి, ఆయా వ్యక్తులు మానసికంగా ఎలా ఉన్నారో చెప్పే 'ఫాసెట్' అనే
సాఫ్ట్‌వేర్‌ను అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు.¤ తుపాన్ల రాకను ముందే పసిగట్టే సామర్థ్యమున్న
నాసా విమానాన్ని కొనుగోలు చేయాలని భారత్
నిర్ణయించింది. ఈ మేరకుమసాచుసెట్స్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం చేసుకుంది.
» 'మెక్‌డోనెల్ డగ్లస్ డీసీ-8' అనే ఈ విమానం 2016 నాటికి భారత్‌కు అందుబాటులోకి రానుంది.
బాగా ఎత్తులో గాలి వీచే తీరుకు సంబంధించిన సమాచారాన్ని ఇది సేకరించి, విశ్లేషిస్తుంది. |
ఫిబ్రవరి - 6
|
¤ తొలిసారిగా సాల్వో మోడ్ (ఒకేసారి సమాంతరంగా క్షిపణులను ప్రయోగించడం) పద్ధతిలో నిర్వహించిన
బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది.
» అరేబియా సముద్రంలో నేవీ యుద్ధనౌక ఐఎన్ఎస్ త్రికండ్ పై నుంచి రెండు క్షిపణులతో
నిర్వహించిన ఈ పరీక్ష విజయవంతమైంది.
» ఘన, ద్రవ ఇంధనాలతో నడిచే బ్రహ్మోస్ క్షిపణిని సైన్యం, నేవీల్లో ఇదివరకే ప్రవేశపెట్టారు.
ఇది 290 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. |
ఫిబ్రవరి - 5
|
¤ ఇంటర్‌నెట్‌కు అనుసంధానమై ఉన్న కంప్యూటర్లలోకి చొరబడే బాట్‌నెట్, మాల్‌వేర్‌ల కదలికలను
గుర్తించి, వాటిని నిర్వీర్యం చేసే సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను భారతీయ శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేశారు. దీని పేరు
హిడెన్ సెమీ మార్కోవ్ మోడల్ (హెచ్ఎస్ఎంఎం).
» ఈ స్టాటిస్టికల్ టూల్‌ను కోయంబత్తూరులోని పీఎస్‌జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకురాలు
ఆర్.అనిత, ఆమె సహచరులు రూపొందించారు. దీనికి సంబంధించిన వివరాలను ఇంటర్నేషనల్
జర్నల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్‌లో ప్రచురించారు.
¤ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరాల్లో 2013 ఆరో స్థానంలో ఉందని వరల్డ్ మెటీరియొలాజికల్
ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎంఓ) పేర్కొంది. 1850 నుంచి ఉష్ణోగ్రత రికార్డులను నిర్వహిస్తున్నారు. 2007లో
కూడా దాదాపు ఇవే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నారు. |
ఫిబ్రవరి - 7
|
¤ మధుమేహానికి శాశ్వత చికిత్స రూపకల్పన దిశగా మరో ముందడుగు పడింది. ఎలుకల్లో
మామూలు చర్మ కణాలను ఇన్సులిన్ ఉత్పత్తి చేసే పాంక్రియాస్ కణాలుగా మార్చడంలో
అమెరికాలోని గ్లాడ్‌స్టోన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు విజయం సాధించారు. దీంతో మధుమేహ
వ్యాధిగ్రస్థులు రోజూ ఇన్సులిన్ ఇంజక్షన్లు తీసుకునే అవసరం తప్పుతుందని ఆశిస్తున్నారు.
¤ గుండెపోటు ప్రమాదం పురుషులతో పోలిస్తే మహిళలకే అధికమని అమెరికన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
హార్మోన్ల ప్రభావం, గర్భిణిగా ఉన్నప్పుడు అధిక రక్తపోటు, తదితర ఎన్నో కారణాలు మహిళల్లో
గుండెపోటు ముప్పునకు దోహదం చేస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. గర్భనిరోధక మాత్రల వాడకం,
మధుమేహం, మైగ్రేన్ తలనొప్పి, మెనోపాజ్, కుంగుబాటు, విపరీతమైన భావోద్వేగాల ఒత్తిడి తదితరాలన్నీ
కూడా మహిళల గుండెకు చేటు తెస్తాయని వారు వెల్లడించారు.
|
ఫిబ్రవరి - 13
|
¤ మన సౌర కుటుంబంలో సూర్యుడి చుట్టూ తిరుగుతున్న ఒక తోకచుక్కను యూరోపియన్ ఖగోళ
శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి 'టోటాస్' అని పేరు పెట్టారు. ఇది గురు గ్రహం, అంగారక గ్రహం
మధ్యనున్న కక్ష్యలో ఉన్నట్లు తేల్చారు. దీన్నిబట్టి ఈ తోకచుక్క భూమి సమీపంలోకి రాదని అంచనా వేశారు.
¤ జాబిల్లిపై మరమ్మతులకు లోనైన చైనా రోవర్ 'యుతు' తిరిగి పనిచేయడం మొదలుపెట్టింది. |
ఫిబ్రవరి - 14
|
¤ రక్త క్యాన్సర్ (లుకేమియా)ను నయం చేయడానికి శాస్త్రవేత్తలు కొత్త పద్ధతిని గుర్తించారు.
కణితి వృద్ధికి దోహదం చేసే కీలక జన్యువులను నిరోధించడం ఇందులో కీలకాంశం.
» 'బీఆర్‌జీఎల్' అనే జన్యువును తొలగించినపుడు లుకేమియా మూలకణాల విభజన,
మనుగడ, కొత్త కణితులు ఏర్పడటం ఆగిపోయింది. అంటే ఒకరకంగా క్యాన్సర్ వృద్ధి శాశ్వతంగా ఆగిపోయినట్లే.
» క్యాన్సర్ మూలకణాలు పని చేయడానికి చాలా జన్యువులు తోడ్పడతాయి. వాటిని లక్ష్యంగా
చేసుకోవడం చాలా కష్టం. వాటిపై పనిచేసే చికిత్సలతో ఆరోగ్యకరమైన మూలకణాలు సైతం దెబ్బ
తింటాయి. అయితే ఆశ్చర్యకరంగా సాధారణ రక్త మూలకణాలు పనిచేయడానికి 'బీఆర్‌జీఎల్' జన్యువు
అవసరం లేదని తేలిందని కెనడాలోని యూనివర్శిటీ డిమాంట్రియల్‌కు చెందిన శాస్త్రవేత్తలు ప్రకటించారు
. అందువల్ల లుకేమియాకు ఇది కచ్చితమైన చికిత్స కాగలదని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
» జులీ లెసార్డ్ పరిశోధనకు నేతృత్వం వహించారు. |
¤ అమెరికాలోని టెక్సాస్ యూనివర్సీటీ శాస్త్రవేత్తలు తొలిసారిగా మానవ ఉపిరితిత్తులను
ప్రయోగశాలలో వృద్ధి చేశారు. పునరుత్పాదక వైద్యశాస్త్రంలో దీన్ని కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
|
|
» దెబ్బతిన్న ఒక ఊపిరితిత్తిని తీసుకుని, దాని నుంచి కణాలు, పదార్థాలను తొలగించారు.
చివరికి ఎముకలు మిగిలాయి. రోగికి అమర్చడానికి పనికిరాని మరో ఉపిరితిత్తి నుంచి కణాలను
సేకరించి ఆ ఎముకలకు జోడించారు. ఆ నిర్మాణాన్ని కణాలు వృద్ధి చెందడానికి అవసరమయ్యే పోషకాల
ద్రవంలో ఉంచారు. 4 వారాల తర్వాత మానవ ఉపిరితిత్తిగా అది ఆవిర్భవించింది. గులాబీ రంగులో,
మృదువుగా, తక్కువ సాంద్రతతో అసలైన ఉపిరితిత్తిలాగే ఉందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.
¤ రైలు ప్రయాణం చేసే అంధుల కోసం ప్రత్యేక సదుపాయం కలిగిన ఏసీ బోగీని రైల్వేశాఖ
అందుబాటులోకి తెచ్చింది.
» సీట్లు, బెర్త్‌లు, వాష్‌బేసిన్లు, మరుగుదొడ్లు మొదలైనవాటి గురించి పూర్తి సమాచారాన్ని
బ్రెయిలీ లిపిలో ఈ బోగీలో ఏర్పాటు చేశారు.
» చెన్నైలో తయారు చేసిన ఈ బోగీని ఢిల్లీ నుంచి పూరీ మధ్య నడిచే
పురుషోత్తం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఏర్పాటు చేశారు. |
ఫిబ్రవరి - 18
|
¤ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల ద్వారా అందే సేవలు, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి
సామాజికాభివృద్ధి రంగాలకు సంబంధించిన సమాచారాన్ని ఇక నుంచి స్థానిక భాషల్లో తెలుసుకోవచ్చు.
» స్థానిక అధికార భాషల్లోనే ఆన్‌లైన్‌లో సమాచారాన్ని తెలుసుకోవడంతో పాటు విజ్ఞానాన్ని
సేవలను పొందడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం http://vikaspedia.in/index
అనే వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది.
» ప్రస్తుతం వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, సామాజిక సంక్షేమం, విద్యుత్, ఈ-గవర్నెన్స్ విభాగాల్లో
ప్రజాపంపిణీ వ్యవస్థ, ఈ-డిస్ట్రిక్ట్ పోగ్రాం, పెన్షన్లు తదితర అంశాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
మిగతా రంగాల సమాచారాన్ని కూడా త్వరలో చేర్చనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
|
ఫిబ్రవరి - 19
|
¤ ప్రపంచంలో అత్యంత శక్తిమంత లేజర్ చిప్‌ను బ్రిటన్‌లోని లీడ్స్ విశ్వవిద్యాలయానికి చెందిన
శాస్త్రవేత్తలు రూపొందించారు.
» శాస్త్రవేత్తలు క్వాంటం టెరాహెర్జ్ లేజర్ నుంచి ఒక వాట్ అవుట్‌పుట్ సాధించారు. టెరాహెర్జ్
సామర్థ్యమున్న ఈ లేజర్ చిప్ వైద్యరంగంలో, రసాయనిక విశ్లేషణల్లో ఎంతో ఉపయోగపడుతుందని
వారు వెల్లడించారు.
|
| ¤ వెల్లుల్లిలోని అజోయేన్ అనే రసాయనం మందులను తట్టుకునే మొండి బ్యాక్టీరియాను నిర్వీర్యం
చేయగలదని కోపెన్‌హాగెన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు.
|
» బ్యాక్టీరియా సమాచార వ్యవస్థను స్తంభింపజేయడం ద్వారా అజోయేన్ దీన్ని సాధిస్తోందని వెల్లడించారు. |
» తెల్ల రక్త కణాలను నాశనం చేసే రామ్నోలిపిడ్ అనే విషపదార్థం బ్యాక్టీరియా నుంచి విడుదల
కాకుండా అజోయేన్ నివారిస్తుంది. బ్యాక్టీరియా ఒక చోట గుమికూడినపుడు చుట్టూ ఒక కఠినమైన
పొర ఏర్పడుతుంది. దీంతో అవి మందులను తట్టుకునే సామర్థ్యాన్ని సంతరించుకుంటాయి.
యాంటీ బయోటిక్‌లతో అజోయేన్‌ను కలిపి ఇచ్చినపుడు ఆ పొర 90 శాతానికి పైగా నాశనమైనట్లు
శాస్త్రవేత్తలు వెల్లడించారు.
» టిమ్ హోమ్ జాకోబ్‌సేన్ పరిశోధనకు నేతృత్వం వహించారు.
¤ గుండెజబ్బును నయం చేయడానికి కోత అవసరంలేని కొత్త పద్ధతిని అమెరికాలోని క్లెమ్సన్
విశ్వవిద్యాలయానికి చెందిన భారత సంతతి శాస్త్రవేత్తలు రూపొందించారు.
» ఇందులో ప్రోటీన్‌తో కూడిన నానో పార్టికిల్స్ ఉంటాయి. ఇవి రక్తనాళాలు దెబ్బతిన్న చోట
అతుక్కుపోయి, అక్కడే నెమ్మదిగా మందులు విడుదలయ్యేలా చేస్తాయి. మూసుకుపోయిన,
దెబ్బతిన్న రక్తనాళాల చికిత్స కోసం ప్రస్తుతం స్టెంట్లను అమరుస్తున్నారు. ఈ నానో పార్టికిల్స్‌ను
స్టెంట్లతో కలిపి లేదా వాటికి బదులుగా ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
» ప్రొఫెసర్ నరేన్ వ్యవహారే పరిశోధనకు నేతృత్వం వహించారు. |
ఫిబ్రవరి - 23
|
¤ మలేరియాకు కారణమయ్యే ప్లాస్మోడియం సూక్ష్మక్రిమి విస్తృతంగా సంక్రమించేందుకు తోడ్పడే
ప్రోటీన్‌ను గ్లాస్గో వర్సిటీ, వెల్కమ్ట్రస్ట్ సాంగర్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు గుర్తించారు.
» ఈ ప్రోటీన్‌ను నిర్వీర్యం చేయడం ద్వారా మలేరియా క్రిమి సంక్రమణ సామర్థ్యాన్ని నాశనం
చేయవచ్చని శాస్త్రవేత్తలువెల్లడించారు.
¤ అంగారకుడిపై పరిశోధనలు జరుపుతున్న నాసా రోవర్ 'క్యూరియాసిటీ' సరికొత్త విన్యాసం
పూర్తిచేసింది. 100.3 మీటర్ల దూరంవెనక్కి నడిచింది.
» రాళ్లూరప్పలపై వెళ్లేటప్పుడు రోవర్ చక్రాలు దెబ్బ తినకుండా ఉండేందుకు రూపొందించిన
సాంకేతిక పరిజ్ఞానాన్నిపరీక్షించేందుకు నాసా శాస్త్రవేత్తలు దీన్ని నిర్వహించారు.
» అంగారకుడిపై జీవం ఆనవాళ్ల అన్వేషణ కోసం క్యూరియాసిటీని ప్రస్తుతం మౌంట్‌షార్ప్ దిశగా
శాస్త్రవేత్తలు నడిపిస్తున్నారు.
|
¤ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల 'ఆకాష్' క్షిపణిని రక్షణశాఖ విజయవంతంగా
పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ సమీకృత పరీక్ష కేంద్రంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు
ఒక పైలట్ రహిత విమానం నుంచి వేలాడుతున్న లక్ష్యాన్ని ఆకాష్ ఛేదించింది.
» ఆకాష్‌ను 'రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ' (డీఆర్‌డీవో) పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో
రూపొందించింది.
» ఈ క్షిపణి 60 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలుగుతుంది. 25 కి.మీ.ల పరిధిలోని లక్ష్యాలను
ఏకకాలంలో ఛేదించగలుగుతుంది.
¤ అమెరికా శాస్త్రవేత్తలు మధుమేహ బాధితుల కోసం బయోనిక్ క్లోమాన్ని రూపొందించారు.
ఇది రక్తంలో చక్కెర స్థాయులను పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు సర్దుబాటు చేస్తూ ఉంటుంది.
» రోగులపై పరీక్షించేందుకు దీనికి అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం కూడా లభించింది. |
ఫిబ్రవరి - 25
|
¤ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ అమెరికా విపణిలో కొత్త ఔషధాన్ని ప్రవేశపెట్టింది.
» తీవ్రమైన తలనొప్పి (మైగ్రేన్) నివారణకు వాడే సుమట్రిప్టాన్ ఇంజక్షన్ 6 ఎంజీ/ 0.5 ఎంఎల్ (ఆటో ఇంజక్టర్ సిస్టమ్)ను యూఎస్ఎఫ్‌డీఏ అనుమతి తీసుకుని విడుదల చేసింది. |
|
¤ అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ మీడియా డెవలప్‌మెంట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఎండీఐఎఫ్)
అవుటర్ నెట్ పేరిట సరికొత్త నెట్‌వర్క్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.
» అవుటర్ నెట్ అంటే వెలుపలి నుంచి సమాచారం పొందడం. అంటే ఉపగ్రహాల నుంచి డాటా
నేరుగా మొబైల్, కంప్యూటర్, ఇతర పరికరాలకు చేరుతుంది. ఇందుకోసం చిన్న తరహా ఉపగ్రహాలను
కొన్ని వందల సంఖ్యలో ప్రయోగించాల్సి ఉంటుంది. వీటన్నింటిని కలిపి ఒక నెట్‌వర్క్‌గా ఏర్పాటు
చేస్తారు. ఈ నెట్‌వర్క్ నుంచి మనకు అంతర్జాలం వస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు
ఎఫ్ఎం వస్తున్నట్లు ఉపగ్రహాల నుంచి నేరుగా ఇంటర్నెట్ వస్తుంది. ఏదో ఒక ప్రాంతానికి కాకుండా
భూమిపై ఉన్న అందరికీ ఈ సేవలు లభిస్తాయి.
» ప్రస్తుతమున్న ఇంటర్నెట్ ఖరీదైన వ్యవహారం కావడం, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సేవలు సరిగ్గా
లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా 40% ప్రజలు దీనికి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే
ఎండీఐఎఫ్ అవుటర్ నెట్‌కు శ్రీకారం చుట్టింది. |
¤ దేశీయంగా రూపొందించిన ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల
ఆకాష్ క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ ప్రయోగకేంద్రం నుంచి
విజయవంతంగా పరీక్షించారు. |
|
» ఆకాష్ క్షిపణిని అయిదేళ్ల వ్యవధిలో మూడోసారి విజయవంతంగా పరీక్షించారు. » భారత్‌లోనే అభివృద్ధి చేసి, రూపొందించిన తొలి గగనతల రక్షణ వ్యవస్థ 'ఆకాష్' సుమారు 25 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
» ఆకాష్ ప్రాజెక్టు డైరెక్టర్ జి.చంద్రమౌళి. |
¤ గుండెజబ్బు చికిత్సకు, గుండెపోటు వచ్చే అవకాశాన్ని గుర్తించడానికి తోడ్పడే కొత్త త్రీడీ
కృత్రిమ పరికరాన్ని అమెరికాలోని సెయింట్ లూయిస్ విశ్వవిద్యాలయ పరిశోధకులు రూపొందించారు.
గుండె గోడ బయటి పొరను పోలి ఉండే దీన్ని చవకైన త్రీడీ ప్రింటర్ సాయంతో మృదువైన,
వంగే వీలున్న, సిలికాన్ పదార్థంతో తయారు చేశారు. సాగే గుణమున్న ఈ పొర మీద సూక్ష్మమైన
గ్రాహకాలనూ చొప్పించవచ్చు. దీన్ని లోపల ప్రవేశపెడితే ఉష్ణోగ్రత, పీహెచ్, ఇతర సూచికలను కచ్చితంగా
గుర్తిస్తుంది. అలాగే గుండె వేగం అస్తవ్యస్థమైతే సరిచేయడానికి అవసరమైన విద్యుత్ ప్రచోదనాలనూ
ఇది వెలువరిస్తుంది. ఇది గుండె కింది గదుల్లో తలెత్తే జబ్బులకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది.
|
¤ భారత నావికాదళానికి చెందిన జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధురత్న ముంబయి తీరానికి
50 కి.మీ. దూరంలో అరేబియా సముద్రంలో ప్రమాదానికి గురైంది.
|
|
» జలాంతర్గామిలోని బ్యాటరీల గదిలో ఆకస్మికంగా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో సింధురత్న సముద్రపు నీటి అడుగు భాగంలో ఉంది. » గత ఏడు నెలల కాలంలో భారత నావికాదళానికి చెందిన యుద్ధ నౌకల్లో 10
దుర్ఘటనలు సంభవించాయి.జలాంతర్గాముల్లో ప్రమాదం జరగడం ఇది మూడోసారి.
గత ఆగస్టులో ఐఎన్ఎస్ సింధు రక్షక్ ప్రమాదానికిగురికాగా 18 మంది సిబ్బంది మృతి చెందారు. |
| ¤ గాలితో నడిచే కార్లను వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకొస్తున్నామని ఫ్రాన్స్‌కు చెందిన 'ఫ్యుజో'
సంస్థ ప్రకటించింది. ఒత్తిడికి లోనైన గాలి (కంప్రెస్డ్ ఎయిర్)తో ఈ కారు నడుస్తుంది.
|
ఈ కారుకు పెట్రోల్ అవసరం కూడా ఉంటుంది. కాకపోతే చాలా తక్కువగా పెట్రోల్‌ను వినియోగించుకుంటూ, అధికంగా గాలినే ఇంధనంగా మార్చుకుని నడుస్తుంది. కారులో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, గాలి ఇంజిన్ కూడా ఉంటుంది. ఇవి రెండూ అనుసంధానమై ఉంటాయి. |
¤ ముంబయి తీరంలో జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధురత్న ప్రమాదానికి గురైన ఘటనలో
ఇద్దరు అధికారులు మరణించినట్లు నావికాదళం ప్రకటించింది.
|
¤ బెంగళూరులో ఆధునిక ఎలక్ట్రిక్ బస్సును ప్రారంభించారు. జపాన్ కంపెనీ తయారు చేసిన
ఈ కాలుష్య రహిత బస్సు దేశంలోనే మొదటిది.
» విద్యుత్ లేదా సౌరశక్తితో బ్యాటరీలు ఛార్జ్ చేసి ఈ బస్సును నడిపిస్తారు.
|
|
¤ విన్న శబ్దాలకంటే చూసిన దృశ్యాలు లేదా తాకిన వస్తువులే ఎక్కువగా గుర్తుంటున్నట్లు
అమెరికాలోని అయోవా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. శబ్ద సమాచారాన్ని దృశ్య,
స్పర్శ సమాచారాలనూ మెదడు విభిన్నంగా విశ్లేషిస్తున్నట్లు వీరు వెల్లడించారు. |
ఫిబ్రవరి - 28
|
¤ వివిధ కణజాలాల్లో జీవక్రియల నియంత్రణలో పాలు పంచుకునే సర్‌ట్యూన్ 1 అనే ప్రోటీన్‌ను
ప్రేరేపిస్తే, జీవన కాలం పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) పరిశోధకులు ఎలుకలపై చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడయింది. |
|
|