జనవరి - 2014 అవార్డులు


జనవరి - 7
¤    ఏపీఎస్ఆర్టీసీ మూడు జాతీయ పురస్కారాలను గెలుచుకుంది. అత్యధిక ఇంధన పొదుపు (కేఎంపీఎల్), అర్బన్ సర్వీసుల్లో అత్యధిక ఇంధన పొదుపు, భద్రత (అతి తక్కువ ప్రమాదాలను నమోదు చేయడం) అంశాల్లో ఈ పురస్కారాలు లభించాయి.  
అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఏఎస్ఆర్‌టీయూ-న్యూఢిల్లీ) ఈ పురస్కారాలను ప్రకటించింది.
    
»
  ఇంధన పొదుపులో ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటికి 39వ సారి ఈ అవార్డును గెలుచుకుంది.
    
»
   జనవరి 27న జోధ్‌పూర్‌లో జరగనున్న 58వ వార్షిక సదస్సులో ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
జనవరి - 8
¤     బహ్రెయిన్‌కి చెందిన ప్రవాస భారతీయుడు జాన్ ఐపే ప్రతిష్ఠాత్మక 'భారత్ గౌరవ్' పురస్కారానికి ఎంపికయ్యారు.
     

»    దాదాపు 40 ఏళ్లకు పైగా బహ్రెయిన్‌లో నివసిస్తున్న ఐపే, 14 ఏళ్లుగా ప్రవాస భారతీయుల అభివృద్ధికి చేస్తున్న కృషికి గుర్తింపుగా ఇండియా ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ సొసైటీ ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది.
    

 »    గతంలో ఈ అవార్డును మదర్ థెరిసా, సునీల్ గవాస్కర్, బాలీవుడ్ నటులు షమ్మీకపూర్, రాజేష్‌ఖన్నా, దేవానంద్‌లు అందుకున్నారు.
¤   పారిశ్రామిక దిగ్గజం రతన్‌టాటా, చమురు శాఖ మంత్రి ఎం.వీరప్ప మొయిలీలకు 'ఆసియన్ సెంటర్ ఫర్ కార్పొరేట్ అండ్ సస్టెయినబిలిటీ' అనే సంస్థ లైఫ్‌టైమ్ అచివ్‌మెంట్ అవార్డులను ముంబయిలో ప్రదానం చేసింది.
    
»
    రతన్‌టాటాకు కార్పొరేట్ గవర్నెన్స్, వీరప్ప మొయిలీకి పబ్లిక్ గవర్నెన్స్ విభాగాల్లో లైఫ్‌టైం అచివ్‌మెంట్ పురస్కారాలను ప్రదానం చేశారు.
జనవరి - 9
¤   వివిధ రంగాల్లో చేసిన సేవలకు 13 మంది ప్రవాస భారతీయులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీలో 'ప్రవాసీ భారతీయ సమ్మాన్' పురస్కారాలను ప్రదానం చేశారు.
    

»    దక్షిణాఫ్రికాలో 1994 నుంచి 2004 వరకు పార్లమెంట్ సభ్యురాలిగా పనిచేసిన మహాత్మాగాంధీ మునిమనవరాలు ఇలాగాంధీ దక్షిణాఫ్రికాలో చేసిన ప్రజాసేవకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు.
    
»   భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా సెనేటర్ లీసా మారియా సింగ్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఆస్ట్రేలియాలో తొలి దక్షిణాసియా సెనెటర్‌గా, మంత్రిగా ఆమె ఘనత సాధించారు. ప్రజాసేవతోపాటు, భారత్, ఆస్ట్రేలియాల మధ్య స్నేహసంబంధాల వృద్ధికి కృషి చేసినందుకు ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు.
    

»   1937 నుంచి ఫిజీ లో సామాజిక సేవలందిస్తున్నందుకు ఫిజీ లోని రామకృష్ణ మిషన్‌కు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
ఇతర గ్రహీతలు: వర్ఘీస్ కురియన్, వాసుదేవన్ చంచ్లానీ, వికాస్ చంద్ర సన్యాల్, సత్నారాయన్ సింగ్ రాబిన్ బల్దేవ్‌సింగ్, శశింద్రన్ ముత్తువేల్, శిబుద్దీన్ వావకుంజు, షంషేర్ వాయలీల్ పరంబత్, శైలేష్ లక్ష్మణ్ వర, పార్థసారధి చిరామెల్ పిళ్లై, రేణు ఖతోర్.
    

»   న్యూఢిల్లీలో జరిగిన 12వ ప్రవాస భారతీయ దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పురస్కారాలను ప్రదానం చేశారు.
జనవరి - 11
¤ శోభన్‌బాబు 78వ జయంతిని పురస్కరించుకుని ప్రముఖ నటి గీతాంజలికి 'శోభన్‌బాబు, వంశీ, గరుడవేగ పురస్కారాల కమిటీ' జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. 

¤ బెంగాలీ కవులు నరేంద్రనాథ్ చక్రవర్తి, శంఖ ఘోష్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోల్‌కతాలో సునీల్ గంగోపాధ్యాయ స్మారక పురస్కారాన్ని అందజేశారు. 
    
» నరేంద్రనాథ్ చక్రవర్తి (2012), శంఖఘోష్ (2013) పురస్కారాన్ని స్వీకరించారు.    
» బెంగాలీ సాహిత్యంలో ప్రముఖుడైన సునీల్ గంగోపాధ్యాయ పేరిట ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. 
జనవరి - 12
¤  పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా రాష్ట్రంలో తన ప్రాణాలొడ్డి మానవ బాంబును అడ్డుకుని, పాఠశాలలోని రెండు వేల మంది విద్యార్థులను కాపాడిన 14 ఏళ్ల బాలుడు ఐత్‌బాజ్ హసన్‌కు పాకిస్థాన్ ప్రభుత్వం అత్యున్నత సాహస అవార్డుల్లో ఒకటైన 'సితారా ఎ సుజాత్‌'ను ఇవ్వాలని నిర్ణయించింది. 
    
» జనవరి 6న పాఠశాలలోకి వస్తున్న ఉగ్రవాదిని విద్యార్థి హసన్ గట్టిగా అడ్డుకున్నాడు. అప్పుడు సంభవించిన పేలుడులో ఇద్దరూ చనిపోయారు.    
» అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఐత్‌బాజ్ హసన్ ధైర్యాన్ని, త్యాగాన్ని గుర్తించి.. అంతర్జాతీయ సాహస అవార్డును ప్రకటించింది.

¤  చమురు, గ్యాస్ వినియోగంలో పొదుపు పాటించినందుకు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ప్రకటించారు.    
» కేంద్ర పెట్రోలియం, గ్యాస్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పెట్రోలియం పరిరక్షణ పరిశోధన సంఘం నిర్వహించిన అధ్యయనంలో 2013 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది.    
» ఈ నెల 16న పెట్రోలియం శాఖ మంత్రి చేతుల మీదుగా ఈ అవార్డును కేంద్రప్రభుత్వం ప్రదానం చేయనుంది.
జనవరి - 13
¤    71వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులను లాస్ఏంజిల్స్‌లో ప్రదానం చేశారు.
    

»   హాస్య ప్రధానంగా రూపొందించిన 'అమెరికన్ హజిల్' చిత్రం 3 గోల్డెన్ గ్లోబ్ అవార్డులను గెల్చుకుంది.
   
 »    'అమెరికన్ హజిల్' చిత్రంలో నటనకు ఉత్తమ హాస్య నటుడిగా లియోనార్డో డికాప్రియో అవార్డును గెల్చుకున్నాడు.
    

»    ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన అమీ ఆడమ్స్, జెన్నీఫర్ లారెన్స్‌లు కూడా మరో రెండు గోల్డెన్ గ్లోబ్‌లు సాధించారు.
ఈ చిత్రానికి రస్సెల్ దర్శకత్వం వహించాడు.
   
»  
  'బ్లూ జాస్మిన్' చిత్రంలో నటనకు కేట్ బ్లాంకెట్ ఉత్తమ కథానాయిక అవార్డును గెల్చుకుంది.
జనవరి - 17

¤    ప్రముఖ వ్యవసాయ పరిశోధన సంస్థ 'ఇక్రిశాట్‌'కు చెందిన జీన్‌బ్యాంక్ అధిపతి హరి ఉపాధ్యాయ్ సేవలకు క్రాప్ సొసైటీ ఆఫ్ అమెరికా పురస్కారాన్ని ప్రదానం చేసింది.
   

»    ఫ్లోరిడాలో జరిగిన వార్షిక సమావేశంలో '2013 ఫ్రాంక్ ఎన్ మేయర్ మెడల్ ఫర్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్స్' అవార్డును బహూకరించింది.

¤    తక్కువ ప్రమాదాలను నమోదు చేసిన ఎపీఎస్ఆర్టీసీ కి కేంద్ర రవాణా శాఖ మంత్రి ట్రోఫీ లభించింది.    
»    జాతీయ రహదార్లు, రవాణా శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ ఈ ట్రోఫీని ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావుకు న్యూఢిల్లీలో ప్రదానం చేశారు.

¤    రాష్ట్రంలో రాగులు, సజ్జలు, జొన్న, మొక్కజొన్న, కొర్ర తదితర చిరుధాన్యాల పంటల దిగుబడిని పెంచినందుకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ జాతీయ స్థాయిలో 'కృషి కర్మాన్' పురస్కారానికి ఎంపికయింది.    
»    ఫిబ్రవరి 10న న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పురస్కారాన్ని, రూ.కోటి నగదును, ప్రశంసాపత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్రదానం చేయనున్నారు.
జనవరి - 18
¤    ప్రవాస భారతీయ ప్రొఫెసర్ డా.మీరా చంద్రశేఖర్ అమెరికా అత్యున్నత బోధనా పురస్కారం 'రాబర్ట్ ఫాస్టర్ చెర్రీ అవార్డు - 2014'కు ఎంపికయ్యారని అమెరికాలోని బేలర్ విశ్వవిద్యాలయం ప్రకటించింది.
    

»   మిసౌరి యూనివర్సిటీలో భౌతిక, ఖగోళశాస్త్ర అధ్యాపకురాలిగా ఉన్న మీరా చంద్రశేఖర్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.
    
»   ఈ పురస్కారం కింద ఆమెకు రూ.1.5 కోట్లు, ఆమె పనిచేస్తున్న భౌతికశాస్త్ర విభాగానికి రూ.15 లక్షలను ఇవ్వనున్నారు.
    

»   ఐఐటీ మద్రాస్‌లో చదువుకున్న ఆమె మైసూర్‌లోని యం.జి.యం. కళాశాల నుంచి బ్యాచిలర్ డిగ్రీ, పీజీ పట్టాలను అందుకున్నారు.
    

»   ఆమె 1985లో ప్రతిష్ఠాత్మక 'ఆల్‌ఫ్రెడ్ స్లోన్ ఫెలోషిప్‌'కు, 1992లో అమెరికన్ ఫిజికల్ సొసైటీకి ఎంపికయ్యారు.
జనవరి - 21
¤    కేంద్ర పట్టణ దారిద్య్ర నిర్మూలన శాఖ చేపట్టిన వివిధ పథకాల అమల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు, నగరాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2012-13 సంవత్సరానికి న్యూఢిల్లీలో అవార్డులు అందజేశారు.
      

»   స్వర్ణ జయంతి షహరీ రోజ్‌గార్ యోజన కింద మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్‌కు ఒక పురస్కారం లభించింది. పట్టణ పేదలకు అవసరమైన ప్రాథమిక సేవలు అందించినందుకు, పేదలకు అనుగుణంగా మూడు సంస్కరణలను సమర్థంగా అమలు చేసినందుకు విశాఖపట్నం నగరానికి రెండు పురస్కారాలు దక్కాయి.
జనవరి - 25
¤    ఏటా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకటించే 'పద్మ' అవార్డుల వివరాలను కేంద్ర హోంశాఖ వెల్లడించింది.      
»   మొత్తం 127 మందికి దేశ అత్యున్నత పౌరసేవ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో మొత్తం 27 మంది మహిళలు ఉన్నారు.      
»   మొత్తం అవార్డుల్లో ఇద్దరికి పద్మవిభూషణ్, 24 మందికి పద్మభూషణ్, 101 మందికి పద్మశ్రీ ప్రకటించారు.      
»   ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి పద్మభూషణ్, ఏడుగురికి పద్మశ్రీ దక్కాయి.

¤    రాష్ట్రం నుంచి పద్మశ్రీకి ఎంపికైనవారు:
ప్రముఖ కళాకారుడు మహ్మద్ అలీ బేగ్; సామాజిక సేవారంగంలో రామారావు అనుమోలు; శాస్త్ర సాంకేతిక రంగంలో షార్ డైరెక్టర్ మలపాక యజ్ఞేశ్వర సత్య ప్రసాద్, గోవింద సౌందర రాజన్; పారిశ్రామిక రంగం నుంచి రవికుమార్ నర్రా; వైద్యరంగం నుంచి సర్బేశ్వర్ సహారియా; సాహిత్యం, విద్యారంగం నుంచి కొలకలూరి ఇనాక్ ఉన్నారు.
2014 'పద్మ' పురస్కారాలకు ఎంపికైనవారు
పద్మ విభూషణ్ (ఇద్దరు)
1. డాక్టర్ రఘునాథ్ ఎ.మషేల్కర్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (మహారాష్ట్ర)2. బి.కె.ఎస్.అయ్యంగార్, యోగా (మహారాష్ట్ర).
పద్మభూషణ్ (24 మంది)      1. గులాం మహ్మద్ షేక్, పెయింటింగ్ (గుజరాత్)      2. బేగం పర్వీన్ సుల్తానా, శాస్త్రీయ సంగీతం (మహారాష్ట్ర)      3. టి.హెచ్. వినాయక్ రామ్, ఘటం కళాకారుడు (తమిళనాడు)
4. కమల్ హాసన్, సినిమా (తమిళనాడు)
5. పుల్లెల గోపీచంద్, క్రీడలు - బ్యాడ్మింటన్ (ఆంధ్రప్రదేశ్)
      6. ప్రొఫెసర్ పద్మనాభన్ బలరామ్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (కర్ణాటక)      7. ప్రొఫెసర్ జ్యేష్ఠరాజ్ జోషి, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (మహారాష్ట్ర)      8. డాక్టర్ మాదప్ప మహదేవప్ప, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (కర్ణాటక)      9. డాక్టర్ తిరుమలాచారి రామసామి, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఢిల్లీ)      10. డాక్టర్ వినోద్ ప్రకాష్ శర్మ, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఢిల్లీ)      11. డాక్టర్ రాధాకృష్ణన్ కొప్పిళ్లైల్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (కర్ణాటక)      12. డాక్టర్ మృత్యుంజయ్ ఆత్రేయ; సాహిత్యం, విద్య (ఢిల్లీ)      13. అనితా దేశాయ్; సాహిత్యం, విద్య (ఢిల్లీ)      14. డాక్టర్ ధీరూభాయ్ థక్కర్; సాహిత్యం, విద్య (గుజరాత్)      15. వైరముత్తు రామసామి దేవర్; సాహిత్యం, విద్య (తమిళనాడు)      16. రస్కిన్ బాండ్; సాహిత్యం, విద్య (ఉత్తరాఖండ్)      17. జస్టిస్ దల్వీర్ భండారి, ప్రజా వ్యవహారాలు (ఢిల్లీ)      18. లియాండర్ పేస్, క్రీడలు - టెన్నిస్ (మహారాష్ట్ర)      19. విజయేంద్రనాథ్ కౌల్, సివిల్ సర్వీస్ (ఢిల్లీ)      20. దివంగత జస్టిస్ జగదీష్ శరణ్ వర్మ (జె.ఎస్.వర్మ), ప్రజా వ్యవహారాలు (ఉత్తరప్రదేశ్)      21. దివంగత డాక్టర్ అనుమోలు రామకృష్ణ, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఆంధ్రప్రదేశ్)      22. ప్రొఫెసర్ అనిసుజ్జామన్; సాహిత్యం, విద్య (బంగ్లాదేశ్)      23. ప్రొఫెసర్ లాయిడ్ ఐ.రుడాల్ఫ్, ప్రొఫెసర్ సుశాన్నే హెచ్.రుడాల్ఫ్‌సాహిత్యం - విద్య (అమెరికా - వీరిద్దరికీ సంయుక్తంగా)      24. శ్రీమతి నీలమ్ క్లేర్, వైద్యం - నియోనాటాలజీ (ఢిల్లీ)పద్మశ్రీ పురస్కారాలు (101 మంది)      1. మహ్మద్ అలీ బేగ్, నాటకరంగం (ఆంధ్రప్రదేశ్)      2. నయన ఆప్టే జోషి, కళారంగం (మహారాష్ట్ర)      3. ముసాఫిర్ రామ్ భరద్వాజ్, వాద్య సంగీతం - పౌనా మంజా (హిమాచల్‌ప్రదేశ్)      4. సావిత్రి ఛటర్జీ, సినిమారంగం (పశ్చిమ బెంగాల్)      5. ప్రొఫెసర్ బిమన్ బిహారీ దాస్, శిల్ప కళారంగం (ఢిల్లీ)      6. సునీల్ దాస్, పెయింటింగ్ (పశ్చిమ బెంగాల్)      7. ఎలం ఎందిరా దేవి, మణిపురి నృత్యం (మణిపూర్)      8. విజయ్ ఘాటె, వాద్య సంగీతం - తబలా (మహారాష్ట్ర)      9. రాణి కర్ణా, కథక్ నృత్యం (పశ్చిమ బెంగాల్)      10. బన్సికౌల్, నాటకరంగం (జమ్ముకాశ్మీర్)      11. ఉస్తాద్ మొయినుద్దీన్ ఖాన్, వాద్య సంగీతం - సారంగి (రాజస్థాన్)      12. గీతా మహలిక్, ఒడిస్సీ నృత్యం (ఢిల్లీ)      13. పరేష్ మైతీ, పెయింటింగ్ (ఢిల్లీ)      14. రామ్ మోహన్, ఫిల్మ్ యానిమేషన్ (మహారాష్ట్ర)      15. సుదర్శన్ పట్నాయక్, సైకత శిల్పి (ఒడిశా)      16. పరేష్ రావల్, సినిమారంగం, నాటక రంగం (మహారాష్ట్ర)      17. వెండెల్ ఆగస్టిన్ రోడ్రిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్ (గోవా)      18. ప్రొఫెసర్ కళామండలం సత్యభామ, మోహినీఆట్టం (కేరళ)      19. శ్రీ అనూజ్ శర్మ, పెర్‌ఫార్మింగ్ ఆర్ట్ (చత్తీస్‌గఢ్)      20. సంతోష్ శివన్, సినిమారంగం (తమిళనాడు)      21. సుప్రియా దేవ్, బెంగాలీ సినిమా (పశ్చిమ బెంగాల్)      22. సోని తారాపోరేవాలా, స్క్రిప్ట్ రైటింగ్ (మహారాష్ట్ర)      23. విద్యాబాలన్, సినిమారంగం (మహారాష్ట్ర)      24. దుర్గా జైన్, సోషల్‌వర్క్ (మహారాష్ట్ర)      25. డాక్టర్ అనుమోలు రామారావు, సోషల్‌వర్క్ (ఆంధ్రప్రదేశ్)      26. డాక్టర్ బ్రహ్మదత్, సోషల్‌వర్క్ (హర్యానా)      27. ముకుల్ చంద్ర గోస్వామి, సోషల్‌వర్క్ (అసోం)      28. జె.ఎల్. కౌల్, సోషల్‌వర్క్ (ఢిల్లీ)      29. మాథుర్‌భాయ్ మాధాభాయి సవాని, సోషల్‌వర్క్ (గుజరాత్)      30. తాషి తొండుప్, ప్రజా వ్యవహారాలు (జమ్ము కాశ్మీర్)      31. డాక్టర్ హస్ముఖ్ చమన్‌లాల్ షా, ప్రజా వ్యవహారాలు (గుజరాత్)      32. శేఖర్ బసు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (మహారాష్ట్ర)      33. మాధవన్ చంద్రదతన్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (కేరళ)      34. సుశాంత్ కుమార్ దత్తగుప్త, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (పశ్చిమ బెంగాల్)      35. డాక్టర్ రవి భూషణ్ గ్రోవర్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (మహారాష్ట్ర)      36. ప్రొఫెసర్ ఎలువత్తింగల్ దేవస్సి జెమ్మిస్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (కర్ణాటక)      37. రామకృష్ణ వి.హూసుర్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (మహారాష్ట్ర)      38. డాక్టర్ అజయ్ కుమార్ పరిడా, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (తమిళనాడు)      39. డాక్టర్ మలపాక యజ్ఞేశ్వర సత్యనారాయణ ప్రసాద్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఆంధ్రప్రదేశ్)      40. కిరణ్ కుమార్ ఆలూర్ సీలిన్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (గుజరాత్)      41. డాక్టర్ బ్రహ్మ సింగ్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఢిల్లీ)      42. ప్రొఫెసర్ వినోద్ కుమార్ సింగ్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (మధ్యప్రదేశ్)      43. డాక్టర్ గోవిందన్ సౌందరరాజన్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఆంధ్రప్రదేశ్)      44. రామస్వామి ఆర్.అయ్యర్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఢిల్లీ)      45. డాక్టర్ జయంత్ కుమార్ ఘోష్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (పశ్చిమ బెంగాల్)      46. రవికుమార్ నర్రా, వాణిజ్యం - పరిశ్రమలు (ఆంధ్రప్రదేశ్)      47. రాజేష్ సరాయా, వాణిజ్యం - పరిశ్రమలు (మహారాష్ట్ర)      48. మల్లికా శ్రీనివాసన్, వాణిజ్యం - పరిశ్రమలు (తమిళనాడు)      49. ప్రతాప్ గోవిందరావు పవార్, వాణిజ్యం - పరిశ్రమలు (మహారాష్ట్ర)      50. డాక్టర్ కిరీట్ కుమార్ మన్సుఖ్‌లాల్ ఆచార్య, వైద్యరంగం - డెర్మటాలజీ (గుజరాత్)      51. డాక్టర్ బలరామ్ భార్గవ, వైద్యరంగం - కార్డియాలజీ (ఉత్తరప్రదేశ్)      52. డాక్టర్ ఇంద్ర చక్రవర్తి, వైద్యరంగం - హెల్త్ అండ్ హైజీన్ (పశ్చిమ బెంగాల్)      53. డాక్టర్ రమాకాంత్ కృష్ణాజీ దేశపాండే, వైద్య రంగం - ఆంకాలజీ (మహారాష్ట్ర)      54. డాక్టర్ పవన్‌రాజ్ గోయల్, వైద్యరంగం - చెస్ట్ డిసీజ్ (హర్యానా)      55. ప్రొఫెసర్ ఆమోద్ గుప్తా, వైద్యరంగం - ఆఫ్తమాలజీ      56. ప్రొఫెసర్ (డాక్టర్) దయా కిషోర్ హజ్రా, వైద్యరంగం (ఉత్తరప్రదేశ్)      57. ప్రొఫెసర్ (డాక్టర్) తెనుంగల్ పౌలోజ్ జాకబ్, వైద్యరంగం - వాస్కులర్ సర్జరీ (తమిళనాడు)      58. ప్రొఫెసర్ శశాంక్ ఆర్.జోషి, వైద్యరంగం - ఎండోక్రైనాలజీ (మహారాష్ట్ర)      59. ప్రొఫెసర్ హకీం సయ్యద్ ఖలీఫతుల్లా, వైద్యరంగం - యునాని (తమిళనాడు)      60. డాక్టర్ మిలింద్ వసంత్ కీర్తనే, వైద్యరంగం - ఈఎన్‌టీ సర్జరీ (మహారాష్ట్ర)      61. డాక్టర్ లలితకుమార్, వైద్యరంగం - ఆంకాలజీ (ఢిల్లీ)      62. డాక్టర్ మోహన్ మిశ్రా, వైద్యరంగం (బీహర్)      63. డాక్టర్ ఎం.సుభద్రా నాయర్, వైద్యరంగం - గైనకాలజీ (కేరళ)      64. డాక్టర్ అశోక్ పంగారియా, వైద్యరంగం - న్యూరాలజీ (రాజస్థాన్)      65. డాక్టర్ నరేంద్రకుమార్ పాండే, వైద్యరంగం - సర్జరీ (హర్యానా)      66. డాక్టర్ సునీల్ ప్రధాన్, వైద్యరంగం - న్యూరాలజీ (ఉత్తరప్రదేశ్)      67, డాక్టర్ అశోక్ రాజగోపాల్, వైద్యరంగం - ఆర్థోపెడిక్స్ (ఢిల్లీ)      68. డాక్టర్ కామిని ఎ.రావు, వైద్యరంగం - రిప్రొడక్టివ్ మెడిసిన్ (కర్ణాటక)      69. డాక్టర్ సర్బేశ్వర్ సహారియా, వైద్యరంగం - సర్జరీ (ఆంధ్రప్రదేశ్)      70. ప్రొఫెసర్ ఓం ప్రకాష్ ఉపాధ్యాయ, వైద్యరంగం (పంజాబ్)      71. ప్రొఫెసర్ మహేష్ వర్మ, వైద్యరంగం - డెంటల్ సైన్స్ (ఢిల్లీ)      72. డాక్టర్ జె.ఎస్.టిటియాల్, వైద్యరంగం - ఆఫ్తమాలజీ (ఢిల్లీ)      73. డాక్టర్ నితీష్ నాయక్, వైద్యరంగం - కార్డియాలజీ (ఢిల్లీ)      74. డాక్టర్ సుబ్రత్ కుమార్ ఆచార్య, వైద్యరంగం - గ్యాస్ట్రోఎంటరాలజీ (ఢిల్లీ)      75. డాక్టర్ రాజేష్ కుమార్ గ్రోవర్, వైద్యరంగం - ఆంకాలజీ (ఢిల్లీ)      76. డాక్టర్ నహీద్ అబిడి; సాహత్యం, విద్య (ఉత్తరప్రదేశ్)      77. ప్రొఫెసర్ అశోక్ చక్రధర్; సాహిత్యం, విద్య (ఢిల్లీ)      78. చక్‌ఛూక్ చౌన్‌వవ్రా; సాహిత్యం, విద్య (మిజోరాం)      79. కేకి ఎన్.దారువాలా; సాహిత్యం, విద్య (ఢిల్లీ)      80. ప్రొఫెసర్ గణేష్ నారాయణ దాస్ దేవి; సాహిత్యం, విద్య (గుజరాత్)      81. ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్; సాహిత్యం, విద్య (ఆంధ్రప్రదేశ్)      82. ప్రొఫెసర్ వేద్‌కుమారి ఘాయ్; సాహిత్యం, విద్య (జమ్ముకాశ్మీర్)      83. శ్రీమతి మనోరమా జఫా; సాహిత్యం, విద్య (ఢిల్లీ)      84. ప్రొఫెసర్ రెహనా ఖతూన్; సాహిత్యం, విద్య (ఢిల్లీ)      85. డాక్టర్ వైఖోమ్ గోజెన్ మీతెయ్; సాహిత్యం, విద్య (మణిపూర్)      86. విష్ణు నారాయణ్ నంబూద్రి; సాహిత్యం, విద్య (కేరళ)      87. ప్రొఫెసర్ దినేష్ సింగ్; సాహిత్యం, విద్య (ఢిల్లీ)      88. డాక్టర్ శ్రీమతి పి.కిలేమ్ సుంగ్లా; సాహిత్యం, విద్య (నాగాలాండ్)       89. అంజుమ్ చోప్రా, క్రీడలు - క్రికెట్ (ఢిల్లీ)      90. సునీల్ దాబస్, క్రీడలు - కబడ్డీ (హర్యానా)      91. లవ్‌రాజ్ సింగ్ ధర్మశక్తు, క్రీడలు - పర్వతారోహణ (ఢిల్లీ)      92. దీపికా రెబెక్కా పల్లికల్, క్రీడలు - స్వ్కాష్ (తమిళనాడు)      93. హెచ్.బొనిఫేస్ ప్రభు, క్రీడలు - వీల్ ఛెయిర్ టెన్నిస్ (కర్ణాటక)      94. యువరాజ్ సింగ్, క్రీడలు - క్రికెట్ (హర్యానా)      95. మమతా శోధ, క్రీడలు - పర్వతారోహణ (హర్యానా)      96. పర్వీన్ తల్హా, సివిల్ సర్వీస్ (ఉత్తరప్రదేశ్)      97. దివంగత డాక్టర్ నరేంద్ర అచ్యుత్ దబోల్కర్, సోషల్‌వర్క్ (మహారాష్ట్ర)      98. అశోక్ కుమార్ మాగో, వ్యాపారం - పరిశ్రమలు (అమెరికా)      99. సిద్దార్థ్ ముఖర్జీ, వైద్యరంగం - ఆంకాలజీ (అమెరికా)      100. డాక్టర్ వంశీ మూథా, వైద్యరంగం - బయోమెడికల్ రిసెర్చ్(అమెరికా)      101. డాక్టర్ సెంగాకు మయెడా; సాహిత్యం, విద్య (జపాన్)
¤    ప్రాణాలొడ్డి ఆరుగురు కమాండోలను కాపాడిన వీర జవాను నందన్ చౌధురికి భారత ప్రభుత్వం 'కీర్తిచక్ర' ప్రకటించింది. పరమ వీరచక్ర తర్వాత రెండో అత్యంత విశిష్ట సేవా పతకం కీర్తిచక్ర.      »   2012లో బీహార్‌లోని అటవీ ప్రాంతంలో మవోయిస్టులను నందన్ వీరోచితంగా ఎదుర్కొన్నారు. నందన్ బృందం లక్ష్యంగా మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడినప్పటికీ ధైర్యంగా మావోలను ఎదిరించి నిలిచాడు.      »   విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన భారత వైమానికదళ పైలెట్ డి. కాస్టెలినో, చౌధురిలకు సంయుక్తంగా కీర్తిచక్ర ప్రకటించారు. కేదారనాథ్ ఆలయం వద్ద వరదలు సంభవించినప్పుడు సహాయక చర్యలు చేపడుతూ విధి నిర్వహణలో హెలికాప్టర్ కూలి కాస్టెలినో వీర మరణం పొందాడు.      »   గణతంత్ర వేడుకల్లో పోలీసులకు ఇచ్చే విశిష్ట పురస్కారాలకు దేశవ్యాప్తంగా 766 మంది ఎంపికైనట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. పురస్కార గ్రహీతల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 33 మంది ఉన్నారు.      »   ఢిల్లీలో 1984 అల్లర్ల తర్వాత శాంతి స్థాపనకు కృషి చేసినందుకు మొహిందర్ సింగ్, విద్యావేత్త ఎన్.రాధాకృష్ణన్ మత సామరస్య పురస్కారానికి ఎంపికయ్యారు.
 
రాష్ట్రం నుంచి రాష్ట్రపతి విశిష్ట పోలీసు పతకానికి ఎంపికైనవారు: ఏపీఎస్ఆర్‌టీసీ ఎండీ, అదనపు డీజీపీ జె.పూర్ణచంద్రరావు; విశాఖపట్నం డీఐజీ పి.ఉమాపతి, ఏపీఎస్పీ డీఐజీ టి.యోగానంద్, కర్నూలు డీఐజీ టి.మురళీకృష్ణ.
జనవరి - 26
¤    65వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రేహౌండ్స్ ఆర్ఐ కరణం లీలా వెంకట శ్రీనివాస్ శ్రీహరి నాగవరప్రసాద్ (కె.ప్రసాద్‌బాబు)కు మరణాంతరం అశోకచక్ర పురస్కారాన్ని ప్రకటించారు.
      
అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి అమరుడైన ప్రసాద్‌కు దక్కిన అశోకచక్ర పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా న్యూఢిల్లీలో ఆయన తండ్రి కరణం వెంకట రమణ అందుకున్నారు.
     
»  
 రాష్ట్ర పోలీసుకు అశోకచక్ర పురస్కారం రావడం ఇదే తొలిసారి.
¤    దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర పోరాటంలో అందించిన జీవితకాల సేవకు గుర్తింపుగా
మహాత్మాగాంధీ మనవరాలు ఇలా గాంధీకి దక్షిణాఫ్రికా సైన్యం జోహాన్నెస్‌బర్గ్‌లో
'అమదెలాకుఫా' (త్యాగంఅనే అవార్డును ప్రదానం చేసింది.      »   ఇలాతో పాటు మరో ఇద్దరు భారత సంతతి దక్షిణాఫ్రికన్లు సన్నీసింగ్మాక్మహరాజ్‌లకు కూడా  అవార్డులను ప్రదానం చేశారు.
జనవరి - 27
¤    ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డులను లాస్ ఏంజెల్స్‌లో ప్రదానం చేశారు. 
»   వీరు రూపొందించిన 'రాండమ్ యాక్సెస్ మెమొరీస్' ఈ ఏటి మేటి ఆల్బమ్‌గా, 'గెట్ లక్కీ' ఈ ఏటి రికార్డుగా అవార్డులు సాధించాయి.     
 »   బెస్ట్ ఆల్బమ్, రికార్డ్ ఆఫ్ ద ఇయర్‌తో పాటు, అత్యుత్తమ పాప్ జోడీ, అత్యుత్తమ డాన్స్/ ఎలక్ట్రానిక్ ఆల్బమ్, బెస్ట్ ఇంజినీర్డ్ ఆల్బమ్ కేటగిరీల్లోనూ వీరు అవార్డు అందుకున్నారు.

జనవరి - 31
¤    అసోచామ్ మహిళా విభాగం హైదరాబాద్ ఛాప్టర్ 'ఈ దశాబ్దపు మహిళా సాధక 
అవార్డు'ల ప్రదాన కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 
సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, విజేతలకు అవార్డులు అందజేశారు.
     
 »   అసోచామ్ మహిళా విభాగం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయా రంగాల్లో
 రాణించిన మహిళలకు ఈ దశాబ్దపు మహిళా సాధకురాలు (ఉమెన్ ఆఫ్ ద డికేడ్ అచీవర్స్) 
పురస్కారాన్ని ప్రదానం చేశారు. ముఖ్యమంత్రి నుంచి 11 మంది మహిళలు ఈ అవార్డులు
 అందుకున్నారు.
అవార్డు గ్రహీతలు
   సానియామీర్జా - 
క్రీడలు   జె.గీతారెడ్డి (రాష్ట్ర మంత్రి) - ప్రజాపరిపాలన   శైలజాకిరణ్ (మార్గదర్శి ఎం.డి.) - బిజినెస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్   సంగీతారెడ్డి (అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) - వ్యాపారంవైద్యం.
   
జగి మంగపాండ (అర్టెల్ కమ్యూనికేషన్స్ ఎం.డి.) - వ్యాపారంవ్యవస్థాపకత.
   
డాక్టర్ శాంతాసిన్హా - సామాజిక సేవ   బేగం రజియాబేగ్ (ఖదీర్ అలీబేగ్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్) - నాటకరంగం   శారద (సినీనటి) - నటన   స్వప్నారెడ్డి (-2 స్పా వ్యవస్థాపకురాలు) - సామాజిక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్   డాక్టర్ సోమరాజు సుశీల - శాస్త్రీయ పరిశోధనవ్యవస్థాపకత.
   
కందుకూరి మహాలక్ష్మి (ప్రముఖ రచయిత్రి) - సాహిత్యం   అవార్డుకు ఎంపికైనవారిలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్సిస్కో సిస్టమ్స్ 

సీటీవో పద్మశ్రీవారియర్ (సాంకేతికత), తాజ్ జీవీకే హోటల్స్ రిసార్ట్స్ ఎండీ ఇందిరా కృష్ణారెడ్డి
 (వ్యాపారం,వ్యవస్థాపకతకూడా ఉన్నారు.