జులై - 23
|
¤ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీవిత చరిత్ర చైనీస్ భాషలో ప్రచురితమైంది. భారతీయ జనతాపార్టీ ఎంపీ, పాత్రికేయుడు తరుణ్ విజయ్ రచించిన ఈ పుస్తకం పేరు 'మోడీ - ఇన్‌క్రెడిబుల్ ఎమర్జెన్స్ ఆఫ్ ఎ స్టార్'. » సిచువాన్ విశ్వవిద్యాలయానికి చెందిన దక్షిణాసియా అధ్యయన కేంద్రం దీన్ని ప్రచురించింది.¤ సాహిత్యంలో ప్రపంచంలోనే విశిష్ఠ పురస్కారంగా భావించే మ్యాన్ బుకర్ ప్రైజ్ రేసులో భారత సంతతి రచయిత నీల్ ముఖర్జీ నిలిచారు. » లండన్‌లో స్థిరపడ్డ ముఖర్జీ రాసిన రెండో నవల 'ది లైవ్స్ ఆఫ్ అదర్స్' బుకర్ ప్రైజ్ - 2014 పోటీలో నిలిచింది. ఈ పుస్తకం ఈ ఏడాది మేలో ప్రచురితమైంది. » కోల్‌కతాలో జన్మించిన ముఖర్జీ బుకర్ ప్రైజ్ - 2014 రేసులో నిలిచిన ఒకే ఒక్క భారత సంతతి రచయితగా నిలిచారు. » ముఖర్జీ పుట్టి పెరిగిన కోల్‌కతా దాని చుట్టూ పరిసరాలు, 1960లో జరిగిన అంశాల ఆధారంగా ఈ నవల సాగింది. » బుకర్ ప్రైజ్ - 2014 పోటీకి బ్రిటన్ నుంచి ఆరు నవలలు; అమెరికా నుంచి అయిదు; ఆస్ట్రేలియా, ఐర్లాండ్ నుంచి ఒకటి వచ్చాయి. » 46 ఏళ్ల బుకర్ ప్రైజ్ చరిత్రలో తొలిసారి అన్ని దేశాల రచయితలకు అర్హత కల్పించారు. » నీల్ ముఖర్జీ రాసిన మొదటి పుస్తకం 'ఎ లైఫ్ అపార్ట్'. ఈ పుస్తకం భారత్‌లో సంయుక్తంగా వొడాఫోన్ - క్రాస్‌వర్డ్ పురస్కారాన్ని గెలుచుకుంది. ¤ బ్రెయిలీ లిపిలో రచించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్రను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేశారు. » పటేల్ జీవిత చరిత్రను బ్రెయిలీలోకి అంధులకు ఉపయోగపడేలా సాయిబాబా గౌడ్ మార్చారు. » సాయిబాబా గౌడ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో అంధుల పాఠశాలను నిర్వహిస్తున్నారు. |
జులై - 25
|
¤ రాష్ట్రపతి అదనపు కార్యదర్శి థామస్ మాథ్యూ రచించిన 'ది వింగ్ వండర్స్ ఆఫ్ రాష్ట్రపతి భవన్' పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్‌లో ఆవిష్కరించారు. » రాష్ట్రపతి భవన్ ఎస్టేట్స్‌ను ఆశ్రయించి ఉండే 111 జాతుల పక్షుల ఫొటోలతోపాటు వాటి గురించి అనేక వివరాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. » రాష్ట్రపతి భవన్‌లో ఆగస్టు 2012 నుంచి నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల వివరాల సమాహారమైన 'ఇంద్ర ధనుష్' పుస్తకాన్ని కూడా ప్రధాని ఆవిష్కరించారు. |
జులై - 29
|
| ¤ జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి రచించిన 'నింగికెగిరిన చెట్లు' అనే కవితా సంపుటిని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు. |
|
|